బైక్ అదుపుతప్పి ఒకరు మృతి
మాక్లూర్: బైకు అదుపుతప్పి తీవ్రగాయాలైన నందిపేట మండలం కౌలుపూర్‌కు చెందిన చల్లా వాసు(21) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. చల్లా వెంకటేశ్, చల్లా వాసు ఇద్దరు అన్నదమ్ములు పల్సర్ బైక్‌పై నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు బుధవారం రాత్రి బోధన్ వెళుతుండగా మాక్లూర్ మండలం గొట్టిముక్కుల శివారులో బైకు అదుపుతప్పి పడింది. చల్లా వాసు తలకు బలమైన గాయాలు తగలడంతో అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున చల్ల వాసు మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
అనుమానాస్పదస్థితిలో రైతు ..
ఇందల్వాయి: మండలంలోని గండి తండాకు చెందిన బానో త్ రాజు (34) అనే రైతు తన పొలంలో గురువారం సాయంత్రం పురుగుల మందు పిచికా రీ చేస్తుండగా మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. మృతికి గల కారణాలు తెలియ రాలేదని పేర్కొన్నారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు ..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కృష్ణాజివాడి గ్రామ శివారులోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మండలంలోని దేవాయిపల్లి గ్రామానికి చెందిన వీఆర్‌ఏ పులి రాజయ్య(48) కామారెడ్డి నుంచి తన టీవీఎస్ ఎక్సెల్‌పై సొంతూరికి వస్తున్నాడు. తాడ్వాయి నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో రాజయ్య తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రాజమణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బైక్ అదుపుతప్పి ఒకరు మృతి


