పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
రెంజల్ : పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్త మ ఫలితాలు సాధించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులకు సూ చించారు. రెంజల్ మండల కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్, ప్రా థమిక పాఠశాలలను సబ్ కలెక్టర్ గురువారం సందర్శించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులను ప లు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు మరింత కృషి చేస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూ చించారు. ఎంఈవో ఆంజనేయులు, సర్పంచ్ తిరు పతి లలిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


