పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
నిజామాబాద్ రూరల్: ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మండల వైద్యాధికారి స్నేహ సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ డెంగీ, మలేరియా నివారణ దినోత్సవాలను పురస్కరించుకొని తిర్మన్‌పల్లిలో ఉపాధి హామీ కూలీలకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ఉన్న నీటి నిల్వలను పారబోసి, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు అఖిల్ అలీ, మధుకర్, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి


