
ఇబ్బందులు కలిగించకుండా నల్లమట్టి తరలించాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎవరికీ ఇబ్బందులు, నష్టం కలిగించకుండా నల్ల మట్టి తరలించుకోవాలని, మ ట్టి రోడ్లపై పడితే ప్రమాదాలు జరుగుతాయని మా జీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన డొంకేశ్వర్ మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని నికాల్‌పూర్‌కు వెళ్లే రోడ్డులో ఉన్న ఇరిగేషన్ కెనాల్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇరుకుగా ఉన్న వంతెన స్థానంలో కొత్తది నిర్మించాలని, అలాగే మట్టి పూడికను తీయించాల ని రైతులు సుదర్శన్‌రెడ్డిని కోరగా, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నా రు. అన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఆయన బస్తాల రవాణాకు ఇబ్బందులు లే కుండా చూస్తామన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన అన్నారం మాజీ సర్పంచ్ పోశన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, ఎన్‌డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గొడిసె రం భూమేశ్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ భరత్‌రెడ్డి, లిఫ్టు కమిటీ చైర్మన్ భోజారెడ్డి, నాయకులు ఉన్నారు.