
ఘనంగా ఛత్రపతి శంభాజీ మహరాజ్ జయంతి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: హైందవ స్వరాజ రక్షకుడిగా, ధర్మవీరుడిగా పిలుచుకునే ఛత్రపతి శంభాజీ మహరాజ్ జయంతి కార్యక్రమాన్ని శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ సేవాసమితి ఇందూరు ఆధ్వర్యంలో నగరంలోని బోర్గాంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఎం లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ మహనీయుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ భారతదేశంలో పుట్టడం అందరికీ గర్వకారణమన్నారు. ప్రతి హిందువు శంభాజీ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకొని దేశరక్షణ, ధర్మరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ శంభాజీ మహరాజ్‌లా తయారుకావాలన్నారు. కార్యక్రమంలో గంగనర్సయ్య, గజానన్, దుర్గాప్రసాద్, బండారి నరేందర్, దిగంబర్, శ్రీనివాస్‌రెడ్డి, పోల్ అర్జున్, ప్రణయ్, శ్రావణ్ కుమార్, రాజు, జ్ఞానేందర్, రాజేశ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.