
నేటి నుంచి రెండో విడత టీచర్లకు శిక్షణ
మోపాల్: నగర శివారులోని బోర్గాం(పీ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నుంచి ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతుందని డీఈవో అశోక్ తెలిపారు. సోమవారం రెండో విడత టీచర్ల శిక్షణకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని బోర్గాం(పీ) జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రెండో విడత టీచర్ల సమావేశం ఐదురోజులపాటు కొనసాగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు సెంటర్ ఇన్‌చార్జీలు చేసుకోవాలని సూచించారు. రీసోర్స్ పర్సన్లు సెషన్ వారీగా అంశాలపై తగిన టీఎల్‌ఎం తయారు చేసుకొని ప్రిపేర్‌కావాలన్నారు. డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రైనింగ్‌కు ముందు, కొనసాగే సమయం, ట్రైనింగ్ తర్వాత విషయాలను వివరించారు. ఆర్‌పీలు శిక్షణను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ శంకర్, ఏఎంవో, సెంటర్ ఇన్‌చార్జీలు, డీఆర్‌పీలు పాల్గొన్నారు.