
‘మీ సేవా’ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రె సిడెంట్‌గా జిల్లాకు చెందిన కే లక్ష్మీనారాయణ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మహమ్మద్ నాసిర్ అహ్మద్ నియమితులయ్యరు. వీరిని రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల జీవన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కిరణ్, కోశాధికారి జీ శ్రీకాంత్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రలో మీ సేవా ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చింత రాజు, ముజాహిదుద్దీన్ అన్సారీ, గోపాల్, సంతోష్ పాల్గొన్నారు.