
రసవత్తరంగా కుస్తీ పోటీలు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలోని బైరాపూర్ పోచమ్మ తల్లి జాతర పురస్కరించుకొని సోమవారం నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా ముగిశాయి. మహారాష్ట్రలోని నాందేడ్, నార్సితోపాటు ఆదిలాబాద్, నిర్మల్, గాంధారి, మోపాల్, రూరల్, వర్ని మండలాల నుంచి సుమారు వందమందికిపైగా మల్లయోధులు తరలివచ్చారు. వర్ని మండలం సిద్ధాపూర్‌కు చెందిన గోపాల్ తుది పోరులో విజయం సాధించి 5తులాల వెండి కడియాన్ని గెలుపొందారు.
తండా పెద్దలు గోపాల్‌కు కడియం బహూకరించారు. కుస్తీ పోటీలను తిలకించేందుకు మోపాల్‌తోపాటు చుట్టు పక్కల మండలాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
హాజరైన వివిధ రాష్ట్రాల మల్లయోధులు