ముంపు గ్రామాలు ఉపాధికి దూరం | - | Sakshi
Sakshi News home page

ముంపు గ్రామాలు ఉపాధికి దూరం

May 15 2025 1:27 AM | Updated on May 15 2025 1:27 AM

ముంపు

ముంపు గ్రామాలు ఉపాధికి దూరం

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఎస్సారెస్పీ ముంపు గ్రామా లు ఉపాధిహామీ పనులకు దూరమయ్యాయి. డొంకేశ్వర్‌ మండలంలో కొన్ని గ్రామాలకు చెరువులు లేకపోవడంతో అధికారులు పనులు కల్పించలేకపోతున్నారు. ముంపు నుంచి తేలిన భూముల్లో పను లు చేయడానికి ఇరిగేషన్‌ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉపాఽధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. చిన్నయానం, గంగాసముందర్‌, జీజీ న డ్కుడ, గాదేపల్లి, అన్నారం, సిర్పూర్‌ గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉపాధిహామీ పనులు లేకపోవడంతో ఉపాధిని కోల్పోతున్నామని ఈ గ్రామాల ప్రజలు, నిరుద్యోగ యువత తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. నూత్‌పల్లి, డొంకేశ్వర్‌, నికాల్‌పూర్‌ గ్రా మాలు కూడా ముంపు గ్రామాలే అయినప్పటికీ ఊ రు శివార్లలో చెరువులు ఉండడంతో అక్కడ ఫిష్‌ పాండ్‌లు తవ్వించి ఉపాధిని కల్పిస్తున్నారు. ఇప్పు డు సమస్య వచ్చిందల్లా చెరువులు లేని ఆరు గ్రామాలకే.

ఈ ఏడాది నుంచే అనుమతి నిరాకరణ...

చిన్నయానం, గంగాసముందర్‌, జీజీ నడ్కుడ, గాదేపల్లి, అన్నారం, సిర్పూర్‌ గ్రామాలకు సంబంధించిన చెరువులు ఎస్సారెస్పీలో ముంపునకు గురవుతాయి. ప్రతీ ఏడాది వేసవిలో ముంపు నుంచి తేలడంతో గత కొన్నేళ్లుగా ఉపాధిహామీ పనులు బ్యాక్‌ వాటర్‌లోనే జరిగాయి. ఎస్సారెస్పీ భూముల్లో ఫిష్‌ పాండ్‌లు తవ్వడానికి ఇరిగేషన్‌ అధికారులు ఈ ఏడాది అనుమతి ఇవ్వలేదు. పనులు చేపట్టేందుకు వీలు లేదని ఈజీఎస్‌ అధికారులకు తేల్చి చెప్పారు. వేరే పనులు గుర్తించి చేయించడానికి ఈ గ్రామాల్లో అవకాశం లేకుండా పోయింది. అవకాశం ఉన్న చోట కొద్ది మందికి మాత్రమే కెనాల్‌ పనులు కల్పిస్తున్నారు. అయితే ఎస్సారెస్పీ ఇరిగేషన్‌ భూముల్లో ఉపాధి పనులు చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఏపీవో సరిత, ఎంపీడీవో తెలిపారు. అప్పటి వరకు వేరే పనులు గుర్తించి ముంపు గ్రామాల ప్రజలకు పనులు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

చెరువుల్లేక పనులు కల్పించని

అధికారులు

ముంపు భూముల్లో పనులకు

అనుమతివ్వని ఇరిగేషన్‌ శాఖ

ఉపాధిని కోల్పోతున్న

ఆరు గ్రామాల ప్రజలు

ఇప్పటికే చాలా కోల్పోయాం

ఎస్సారెస్పీకి మా ఊరి భూములిచ్చి చాలా కో ల్పోయాం. సరైన ధర ప్రభుత్వం ఇవ్వలేదు. మా పాత భూముల్లో ఉపాధి పనులు చేసుకోవడానికి ఇరిగేషన్‌ అధికారులు ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారో అర్థం కావడం లేదు. ఉపాధిహామీ పనులు నిలిచిపోవడంతో ఉపాధిని కోల్పోతున్నాం. అన్ని విధాలుగా మాకు నష్టమే జరుగుతోంది. – పెద్దగొండ మోహన్‌, చిన్నయానం

పేదలకు ఉపాధి లేకుండా పోయింది

ముంపు భూముల్లో ఉపాధిహామీ పనులు బంద్‌ కావడంతో పేదలకు ఉపాధి లేకుండా పోయింది. గత ఏడాది వరకు పనులు కల్పించిన అధికారులు ఇక నుంచి లేదంటున్నారు. చాలా మంది నిరుద్యోగ యువతకు ఉపాధిహామీ పనులే ఆర్థిక ఆధారంగా ఉండేవి. అధికారులు స్పందించి ఉపాధిహామీ పనులు మళ్లీ ప్రారంభమయ్యేలా చూడాలి.

– ఎర్రం సుష్మిత, మాజీ సర్పంచ్‌, చిన్నయానం

ముంపు గ్రామాలు ఉపాధికి దూరం 1
1/2

ముంపు గ్రామాలు ఉపాధికి దూరం

ముంపు గ్రామాలు ఉపాధికి దూరం 2
2/2

ముంపు గ్రామాలు ఉపాధికి దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement