
హెచ్‌యూఐడీ నంబరు అనే మాటే లేదు..
బంగారు, వెండి ఆభరణాల వ్యాపారంలో లీగల్ మెట్రాలజీ శాఖ కేవలం ఎలక్ట్రానిక్ కాంటాలు, తూకంల తనిఖీకే పరిమితమవుతోంది. వినియోగదారులు బంగారు, వెండి ఆభరణాల నాణ్యత విషయంలో మోసపోతున్నారు. లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 రూల్ 9 (4) ప్రకారం వ్యాపారులు బంగారు, వెండి ఆభరణాల నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా రసీదులపై రాయాలి. అలాగే రూల్ 9 (5) ప్రకారం బంగారు, వెండి ఆభరణాల నాణ్యతా ప్రమాణాల పరీక్షలు నిర్వహించే అధికారం లీ గల్ మెట్రాలజీ అధికారులకు ఉంది. అయితే ఉమ్మ డి జిల్లాలో అధికారులు నా ణ్యతా పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో బంగారం విక్రయించే చిన్న, పెద్ద వ్యాపారులెవరూ బిల్లులపై హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్) నంబరును వేయకుండానే విక్ర యాలు సాగిస్తుండడం గమనార్హం.