
బుద్ధుడి బోధనలు అనుసరణీయం
బోధన్: విశ్వశాంతిని ఆకాంక్షించిన గౌతమ బుద్ధుడి బోధనలు అనుసరణీయమని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నేటితరం యువత బుద్ధుడు చూపిన సన్మార్గంలో నడవాలన్నారు. సాలూర మండలంలోని హున్సా గ్రామంలో దళిత, అంబేడ్కర్ సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పంచశీల బుద్ధ విహార్ (గౌతమ బుద్ధుడి మందిరం)ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మందిరంలో ఏర్పాటు చేసిన బుద్ధుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ,ఆయన సతీమణి రమాబాయి విగ్రహాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శంకర్, టీపీసీసీ డెలిగేట్ బీ గంగాశంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, సొసైటీ చైర్మన్లు అల్లె జనార్దన్, మందర్నా రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, బీజేపీ రా ష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, మండల అధ్యక్షుడు గోపీకిషన్, బుద్ధ విహార్ కమిటీ ప్రతినిధులు శ్రీకాంత్, గౌతం, బాలాజీ, అలోక్, విశ్వనాథ్ పాల్గొన్నారు.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

బుద్ధుడి బోధనలు అనుసరణీయం