
సాఫీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా సాగుతోందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణపై సీఎస్ రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమి షనర్ డీఎస్ చౌహాన్‌లతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ శుక్రవారం కలెక్టర్లు, అదనపు కలె క్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా లో ధాన్యం కొనుగోళ్ల స్థితిగతులపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మంత్రులకు వివరించారు. యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 4.91 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా, సుమారు 12 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని వెల్ల డించారు. ఈ సీజన్‌లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకొని, 700 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 7.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. మే చివరి వారం నాటికి లక్ష్యానికి మించి మరో 35 వేల నుంచి 40 వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. 460 కేంద్రాలలో ధాన్యం సేకర ణ నూరు శాతం పూర్తయ్యిందని, ప్రస్తుతం 260 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయన్నా రు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం విలువ రూ. 1,8 39 కోట్లు కాగా, రూ. 1,548 కోట్ల బిల్లు మొత్తాల ను రైతుల ఖాతాలలో జమ చేశామని తెలిపారు. 7.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన ట్యాబ్ ఎంట్రీలు పూర్తయ్యాయని తెలిపారు.
రికార్డు స్థాయిలో వరి సాగు : మంత్రి ఉత్తమ్
ఈసారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం సాగైందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సన్నరకం వరికి బోనస్ చెల్లించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 129.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాల ద్వారా 70.13 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఇప్పటికే 49.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను సేకరించినట్లు వెల్లడించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తున్నందున కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అకాల వర్షాలతో ధాన్యం నిల్వలు తడిసిపోకుండా వాతావరణ పరిస్థితులపై క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ముందస్తుగానే రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తెలి యజేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. సన్నబియ్యం పంపిణీలో అవాంతరాలు లేకుండా పర్యవేక్షణ జరపాలన్నారు. కొత్త రేషన్‌కార్డులు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ మంజూరు చేయాలన్నారు. బోగస్ కార్డులు జారీ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి, డీఎస్‌వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగూబాయి తదితరులు పాల్గొన్నారు.