నిజామాబాద్ రూరల్: ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఆవోపా) ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్సెస్సీ, ఇంటర్, ఇంజినీరింగ్‌లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 2024–2025వ సంవత్సరానికి ఎస్సెస్సీలో 550 ఆపైన మార్కులు, ఇంటర్‌లో 970 ఆపైన మార్కులు, ఎంసెట్‌లో 1000 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ సాయంత్రంలోగా మార్కుల జాబితా, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, సెల్ నంబర్, పేరు తదితర వివరాలను గోత్రం నారాయణ 9440090511 నంబర్‌కు పంపాలన్నారు. అవార్డుల ప్రదానోత్సవం వివరాలు తెలియజేస్తామన్నారు.
రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపిక
రెంజల్(బోధన్): నేటి నుంచి మూడు రోజుల పాటు జనగామ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ పోటీలకు మండలంలోని తాడ్‌బిలోలి పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్‌ఎం రేఖ, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు సోమలింగంగౌడ్, పీఈటీ కుమార్ తెలిపారు. తాడ్‌బిలోలి పాఠశాల నుంచి నయనశ్రీ, అక్షయ, శృతి, అమర్, మహే్‌శ ఎంపికై నట్లు వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను పాఠశాల సిబ్బంది అభినందించారు.


