
ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు కరువు
నిజామాబాద్ రూరల్: రూరల్ మండలంలోని చాలా గ్రామాల్లో ఆరోగ ఉపకేంద్రాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 19 గ్రామాలు ఉండగా కేవలం మల్లారం, తిర్మన్‌పల్లి గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనా లు ఉన్నాయి. మిగిలిన గ్రామాల్లో ఏఎంఎంలు, సెకండ్ ఏఎన్‌ఎంలు గ్రామాల్లోని పంచాయతీ భవనాల్లో ప్రజలకు చికిత్సలు, మందులు అందిస్తున్నారు. దీంతో ఆరోగ్యఉపకేంద్రాలు లేని గ్రామాల్లో ప్రజలు వైద్యం, మందుల కోసం నిత్యం అవస్థలు పడుతున్నారు.
గుండారంలో నిలిచిన పనులు..
మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన గుండారం గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రానికి స్థలం కేటాయించి నాలుగేళ్లు అవుతుంది. అప్పట్లోనే భవ న నిర్మాణం కోసం పనులు ప్రారంభించగా, కాంట్రాక్టర్ పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. అ సంపూర్తి పనుల కారణంగా ప్రస్తుతం జీపీ భవనంలోని ప్రత్యేక గదిలో వైద్య సిబ్బంది ప్రజలకు సేవ లు అందిస్తున్నారు. మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా గ్రామాలకు ఆరోగ్య ఉపకేంద్రాలు లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు నిర్మించి, వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
రూరల్ మండలంలో 19 గ్రామాలుండగా కేవలం రెండు గ్రామాల్లోనే ఏర్పాటు
మిగిలిన గ్రామాల్లో జీపీ కార్యాలయాల్లో వైద్యసేవలు నిర్వహిస్తున్న సిబ్బంది
ఇబ్బందులు పడుతున్నాం..
మా గ్రామంలో ఇప్పడి వరకు ఎలాంటి ఆరోగ్య ఉప కేంద్రం లేదు. గ్రామంలో ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులు వైద్య సేవల కోసం గుండారం గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రానికి వెళుతుంటారు. గ్రామంలో ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో ప్రజలు సమీప గ్రామాలకు ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వస్తోంది.
–అంజలి, మల్కాపూర్ (ఏ)
అధికారులు స్పందించాలి..
గ్రామంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రానికి దాదాపు మల్కాపూర్(ఏ), అనంతగిరి, సమీప గ్రామాలకు చెందిన గర్భిణులు, బాలింతలతోపాటు రోగులు వస్తూంటారు. గతంలో ఆరోగ్య ఉప కేంద్రం పంచాయతీ కార్యాలయంపై ఉండేది. రోగులకు ఇబ్బందికరంగా ఉండటంతో కింది గదికి మార్చాం. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
–ఒంటెల శంకర్‌రెడ్డి, మాజీ ఉపర్పంచ్, గుండారం

ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు కరువు