రేసులో ఆశావహులు | - | Sakshi
Sakshi News home page

రేసులో ఆశావహులు

May 13 2025 12:43 AM | Updated on May 13 2025 12:43 AM

రేసుల

రేసులో ఆశావహులు

డీసీసీ పీఠం

డిగ్రీ పరీక్షలు

16 నుంచి ప్రారంభం

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెగ్యులర్‌ 2, 4, 6వ సెమిస్టర్‌, బ్యాక్‌లాగ్‌ (2020 నుంచి 2024 బ్యాచ్‌లకు) 1, 3, 5వ సెమిస్టర్‌ పరీ క్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతా యని పరీక్షల నియంత్రణాధికారి (కంట్రోలర్‌) ప్రొఫెసర్‌ కే సంపత్‌కుమార్‌ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రకటించిన విధంగా ఈ నెల 14న ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలను అనివార్య కారణాలతో 16వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. తెయూ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్‌ జి ల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 32 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 24,500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని కంట్రోలర్‌ తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www. telanganauniversity.ac. inను సంప్రదించాలని కంట్రోలర్‌ సూచించారు.

‘ఏకలవ్య’లో

ఖాళీ సీట్ల భర్తీ

ఇందల్‌వాయి: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా లోని ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ గాంధారి (బాయ్స్‌), ఇందల్‌వాయి (గర్ల్స్‌)లలో 11వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకోసం ఈనెల 14 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (ఇందల్‌వాయి) ప్రిన్సిపల్‌ రమేశ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గాంధారిలో బైపీసీలో 23, సీఈసీ లో 14 ఖాళీలు, ఇందల్‌వాయిలో బైపీసీలో 15, సీఈసీలో 18 సీట్లు ఖాళీ ఉన్నట్లు వివరించారు. పదో తరగతి మెరిట్‌, నెస్ట్‌ అడ్మిషన్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

న్యాయవాదులకు

అండగా ‘ఇల్ప’

ఖలీల్‌వాడి: న్యాయవాద వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కా ర్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఇండియన్‌ లీగల్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (ఇల్ప) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం దేవరాజ్‌గౌడ్‌ తెలిపారు. నిజామాబాద్‌ బార్‌ అసో సియేషన్‌ హాల్‌లో సోమవారం ఆయన న్యా యవాదులను ఉద్దేశించి మాట్లాడారు. జూనియర్‌ న్యాయవాదులు వృత్తిలో ఎదిగేందుకు అవసరమైన అన్ని రకాల శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సామాజిక నిర్మాతలుగా ఉండి ప్రజోపయోగ కార్యక్రమాలలో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు. క ష్ట కాలంలో ఉన్న న్యాయవాదులకు, వారి కుటుంబాలకు ఇల్ప అండగా ఉంటుందని చెప్పారు. బార్‌ ఉపాధ్యక్షుడు దిలీప్‌, ఏ ఆంజనేయులు, ఎన్‌ జే శ్యాంసన్‌, కె. వెంకటేశ్వర్‌ప్రసాద్‌, ఏ సురేశ్‌, న్యాయవాదులు బాస రాజేశ్వర్‌, శ్రీహరి ఆచార్య, ఆశ నారా యణ, రంజిత్‌ సుతారి, బైర గణేశ్‌, ఆరేటి నారాయణ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: అధికార పార్టీ కాంగ్రెస్‌లో జిల్లా అధ్యక్ష పదవి కోసం రే సు పెరిగింది. ఎవరికివారు సైలెంట్‌గా తమ ప్రయత్నాలను ము మ్మరం చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో డీసీసీ పీఠం కోసం డిమాండ్‌ పెరిగింది. దీంతో ఈ పీఠం దక్కించుకునేందుకు నాయకులు రేసుగుర్రాల మాదిరిగా పోటీ పడుతున్నారు. ఇ దిలా ఉండగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పార్టీ సంస్థాగత పటిష్టతపై కచ్చితత్వంతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండగా, ప్రజాప్రతినిధుల కంటే పార్టీ సారథులకే జిల్లాలో ప్రాధాన్యం ఉంటుందని మీనాక్షి నటరాజన్‌ ప్రకటించడంతో ఈ పీఠంపై అందరి దృష్టి పడింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పైగా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సొంత జి ల్లా కావడంతో డీసీసీ పీఠం ఎవరికి కేటాయిస్తా రనే విషయమై అన్నివర్గాల్లో ఆ సక్తి నెలకొంది. అదేవిధంగా పీసీసీ కార్యవర్గంలోకి ఎవరిని తీసుకుంటారనే విషయమై సైతం చర్చ నడుస్తోంది. అయితే జి ల్లాకు చెందిన సీనియర్లలో పలువురికి రాష్ట్ర కార్పొరేషన్‌ పదవులు దక్కాయి. ఇంకా మరికొంద రు సీనియర్‌ నాయకులు రాష్ట్ర కార్పొరేషన్‌ పదవుల కో సం పట్టుబడుతున్నారు. కాగా మిగిలిన నామినేటెడ్‌ పదవుల కేటాయింపులో ఆలస్యం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా జెడ్పీ పీఠం ఆశిస్తున్న నాయకులు సైతం డీసీసీ పీఠం రేసులోకి రావడం గమనార్హం.

● డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మానాల మోహన్‌రెడ్డి రాష్ట్ర కోఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా నామినేటెడ్‌ పదవి దక్కించుకున్నా రు. దీంతో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి రేసులో ఉన్న బాడ్సి శేఖర్‌గౌడ్‌ డీసీసీ రేసు లో ముందంజలో ఉన్నా రు. సీనియర్‌ నా యకుడు మార చంద్రమోహన్‌ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లోకి వచ్చిన బాస వేణుగోపాల్‌యాదవ్‌, పీసీసీ ప్ర ధాన కార్యదర్శిగా పనిచేసిన కాటిపల్లి నగే ష్‌రెడ్డి రేసులో పరు గెత్తుతున్నారు. డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ మునిపల్లి సా యిరెడ్డి సైతం రేసులో ఉన్నారు. నరాల రత్నాకర్‌ కూడా ఆశిస్తున్నారు. డీసీసీ పీఠా న్ని బీసీలకు కేటాయిస్తారా.. ఓ సీల కు కేటాయిస్తారా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. మ రోవైపు డీసీసీ పీఠాన్ని మాజీ ఎ మ్మెల్సీ అరికెల నర్సారెడ్డి సైతం ఆశిస్తున్నప్పటికీ 2018 తరువాత వచ్చినవారికి ఈ పదవి ఇవ్వకూడదనేది పార్టీ నిర్ణయించినట్లు టాక్‌ నడుస్తోంది. ఇదిలా ఉండగా పార్టీ పటిష్టత లక్ష్యంగా ముందుకెళుతున్న మీనాక్షి నటరాజన్‌ ఆలోచన ప్రకారం చూస్తే నిజామాబాద్‌ రూ రల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కూడా ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక పీసీసీ కార్యవర్గం పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి ఢిల్లీ వెళ్లి పార్టీ నాయకత్వానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ప్రతిపాదనలు అందించారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఏమేరకు పనిచేశారనే విషయమై పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

కాటిపల్లి నగేష్‌రెడ్డి

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

ఈ నెల 20 వరకు గడువు

ఒక్కో పాఠశాలలో 160 సీట్లు

ఉమ్మడి జిల్లాలో 16 మోడల్‌ స్కూళ్లు

మార చంద్రమోహన్‌

బాడ్సి శేఖర్‌గౌడ్‌

బాస వేణుగోపాల్‌

యాదవ్‌

మునిపల్లి సాయిరెడ్డి

నేడు పాలిసెట్‌

నిజామాబాద్‌ అర్బన్‌: పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష (పాలిసెట్‌) నేడు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 16 సెంటర్లలో 6542 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారు. నిర్ణీత సమయానికి గంటముందుగానే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని ఎగ్జామినేషన్‌ కన్వీనర్‌ శ్రీనివాస్‌ సూచించారు.

సీట్ల కేటాయింపులు ఇలా

పోటీలో శేఖర్‌గౌడ్‌, వేణుగోపాల్‌యాదవ్‌,

కాటిపల్లి నగేష్‌రెడ్డి

2018 తరువాత పార్టీలోకి

వచ్చినవారికి అవకాశాల్లేవని చర్చ

పీసీసీ కార్యవర్గంలోకి వెళ్లేదెవరు..?

స్థానిక ఎన్నికలు, నామినేటెడ్‌ పదవుల

కేటాయింపులో ఆలస్యం నేపథ్యంలో

నాయకుల్లో డైలమా

పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా

కావడంతో పదవుల

పంపకాలపై ఆసక్తి

రేసులో ఆశావహులు1
1/7

రేసులో ఆశావహులు

రేసులో ఆశావహులు2
2/7

రేసులో ఆశావహులు

రేసులో ఆశావహులు3
3/7

రేసులో ఆశావహులు

రేసులో ఆశావహులు4
4/7

రేసులో ఆశావహులు

రేసులో ఆశావహులు5
5/7

రేసులో ఆశావహులు

రేసులో ఆశావహులు6
6/7

రేసులో ఆశావహులు

రేసులో ఆశావహులు7
7/7

రేసులో ఆశావహులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement