
అమ్మో.. ముప్కాల్ తహసీల్!
బాల్కొండ : ముప్కాల్ తహసీల్దార్‌గా విధులు ని ర్వర్తించేందుకు అధికారులు జంకుతున్నారు. నూ తన మండలాల ఏర్పాటులో భాగంగా 2018లో ముప్కాల్ మండలం ఏర్పడింది. కాగా, సుమారు ఏడేళ్లలోనే 10 మంది తహసీల్దార్లు వచ్చారు.. బదిలీపై వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం మూడు నెలలుగా తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న గజానన్ బదిలీపై నిర్మల్ వెళ్లారు. దీంతో ప్రస్తుతం ముప్కాల్ తహసీల్దార్ పోస్టు ఖాళీ అయింది.
దీర్ఘకాలిక సెలవు..లేదంటే బదిలీ
ముప్కాల్ మండల పరిధిలో ఉండేది ఏడు గ్రామా లే అయినా, నిత్యం భూ వివాదాలు, ప్రభుత్వ భూ ముల కబ్జాలపై ఫిర్యాదులు వస్తుంటాయి. రాజకీయ ఒత్తిళ్లు సైతం ఈ మండలంలో ఎక్కువే. దీంతో ఇక్కడ విధులు నిర్వర్తించే తహసీల్దార్లు దీర్ఘకాలిక సెలవుపై వెళ్తుంటారు. లేదంటే మరో ప్రాంతానికి బదిలీ చేయించుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి భూ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఏడేళ్లలో 10 మంది తహసీల్దార్ల బదిలీ
భూ వివాదాల నేపథ్యంలో
హడలెత్తిపోతున్న అధికారులు
ఏడాది తిరగక ముందే
బదిలీపై వెళ్తున్న వైనం