
అల్ప్రాజోలం పట్టివేత
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో 264 గ్రాముల అల్ప్రాజోలం పట్టుకున్నట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ స్వప్న శనివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బె ల్లాల్ గ్రామంలోని ము స్తాబాద్ వీరగౌడ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా అల్ప్రాజోలం లభించిందని, వెంటనే వీరగౌడ్‌ను అదుపులోకి తీసుకొని, సరుకును స్వాధీనం చేసుకున్నామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం బోధన్ ఎకై ్సజ్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ భాస్కర్‌రావ్ తెలిపారు. ఈ సోదాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ నరసింహ చారీ, రామ్‌కుమార్, సిబ్బంది రామ్ బచ్చన్, గంగారాం, సాయికుమార్‌లు ఉన్నారు.
ఒకరిపై కేసు నమోదు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పర్మళ్ల గ్రామానికి చెందిన లెగ్గల రాజు అనే యువకుడిపై శుక్రవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. సదరు యువకుడు ముస్తాపూర్ గ్రామానికి చెందిన ఓ వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేసినట్లు తెలిపారు. దీంతో వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయగా, పలు సెక్షన్ల కింత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.