
గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా
ధర్పల్లి/డిచ్‌పల్లి: జిల్లాలో గంజాయి నిర్మూ లనకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య అన్నారు. ధర్పల్లి, డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లను సీపీ బు ధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్లు, రికార్డులను పరిశీలించి కంప్యూటర్ సిబ్బంది పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫైవ్ ఎస్ అమలు విధానా న్ని పరిశీలించారు. సైబర్‌నేరాలు, ఆన్‌లైన్ గేమ్‌లపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సిబ్బందితో మాట్లాడి వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు. సీపీ వెంట సీఐలు భిక్షపతి, మల్లేశ్, ఎస్సైలు రామకృష్ణ , ఎండీ షరీఫ్, సిబ్బంది ఉన్నారు.
నిజామాబాద్ రూరల్
ఏడీఏ సస్పెన్షన్
డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ శాఖ నిజామాబాద్ రూరల్ ఏడీఏ ప్రదీప్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సొంత శాఖకు చెందిన ధర్పల్లి ఏవో ప్రవీణ్ గతేడాది గుండెపోటుతో మరణించాడు. ఆయన కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా రూరల్ ఏడీఏ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర శాఖ నుంచి ఇద్దరు అధికారులు జిల్లాకు వచ్చి విచారణ చేసి కమిషనర్‌కు నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా ఏడీఏను సస్పెండ్ చేశారు.
వర్షాకాలంలో
అప్రమత్తంగా ఉండాలి
● డీపీవో శ్రీనివాస్
ఇందల్వాయి: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ సూచించారు. ఇందల్వా యి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడు తూ సకాలంలో పంచాయతీకి హాజరై పారిశుధ్య పనులను నిత్యం పరిశీలించాలన్నా రు. ప్రతి గ్రామాన్ని గరిష్టంగా నాలుగు జోన్‌లుగా విభజించి, రోజుకో జోన్ చొప్పున పారిశుధ్య పనులను చూడాలని, స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని భాగస్వాములను చేయాలన్నారు. సకాలంలో ఇంటి పన్నులు వసూలు చేయాలని, 15 రోజుల్లో ఇంటి నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వాలని, లేదంటే సహేతుకమైన కారణాలు చెప్పి తిరస్కరించాలని సూచించారు. పౌర సేవల్లో జాప్యం వహించొద్దని అన్నారు. సమావేశంలో ఎంపీడీవో అనంత్‌రావు, ఎంపీవో రాజ్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రం పరిశీలన
ఇందల్వాయి: ఇందల్వాయి ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని మాతా శిశు సంక్షేమ శాఖ జి ల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సుప్రియ బుధ వారం పరిశీలించారు. అమ్మఒడి సేవలు, అ మలవుతున్న తీరును సిబ్బందిని అడిగి తె లుసుకున్నారు. గర్భిణలందరికీ సకాలంలో వైద్య సేవలు అందేలా సిబ్బంది కృషి చేయా లని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని, ప్రజలకు ప్రభుత్వ వైద్యసేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. హెచ్‌ఈవో శంకర్, స్థానిక వైద్యాధికారి క్రిస్టినా, సిబ్బంది ఉన్నారు.

గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా