
పీవోకే సాధించుకోవడమే లక్ష్యం
సుభాష్‌నగర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను సాధించుకోవడమే ఏకై క లక్ష్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించే వరకూ కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ లో భారత సైనికుల ఘన విజయం, త్రివిధ దళాల ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ జీవీ కృపాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సా యంత్రం నగరంలోని ఆర్‌ఆర్ చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీచౌక్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపరేషన్ సిందూరు ద్వారా భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఇందూరులోనూ దేశద్రోహులు ఉన్నా రని, పాకిస్తాన్ వెళ్లిపోవాలని ప్రధాని మోదీ చెప్పినా కొందరు దాక్కున్నారని తెలిపారు. భారతీయులందరం భారత సైన్యం వెంట ఉన్నామనడానికి ఈ ర్యాలీ నిదర్శనమని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ప్రధాని మోదీతోనే దేశం సురక్షితంగా ఉంటుందని, ఆయనే దేశానికి రక్షకు డని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి పేర్కొన్నారు. మనమంతా ఒక్కటేనని, ఇలాంటి విపత్కర సమయంలో ఏకతాటిపై నిలబడాలని, ఐక్యత చాటేలా ఇందూరులో తిరంగా ర్యాలీ విజయవంతంగా కొనసాగిందని సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ జీవీ కృపాకర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ప్రముఖులు డాక్టర్ వెంకటరమణ, పంచరెడ్డి ఎర్రన్న, రామర్తి గంగాధర్, రవిరాజ్, కొండా దశరథం, పవన్ ఖేడియా, సుబ్బారావు, కమల్ కిశోర్ ఇనాని, బీజేపీ నాయకులు న్యాలం రాజు, స్రవంతిరెడ్డి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి నెహ్రూపార్క్ వద్ద ర్యాలీని పర్యవేక్షించారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
ఇందూరులో భారీ తిరంగా ర్యాలీ