
విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలనే వాడండి
వేల్పూర్: పుట్టగొడుగుల్లా పెరుగుతున్న ప్రైవేటు సంస్థ విత్తనాలను వాడకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలనే వాడాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేశ్ రెడ్డి రైతులకు సూచించారు. వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ, మోతె గ్రామాలలో శుక్రవారం ఆ యన 50 శాతం రాయితీపై రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాలను వాడి యూరి యా వాడకాన్ని తగ్గించాలని కోరారు. విత్తనాభివృద్ధి సంస్థ అందించే నాణ్యమైన విత్తనాలు వాడి అధి క దిగుబడి సాధించాలని పేర్కొన్నారు. జిల్లాకు ప దివేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించగా, మండలాలకు ఇప్పటికే 7,500 క్వింటాళ్లు సరఫరా చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వే ల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సా రెడ్డి, పచ్చలనడ్కుడ, మోతె, సొసైటీల చైర్మన్లు లింబారెడ్డి, రాజేశ్వర్, ఏడీఏలు సాయికృష్ణ, విజయలక్ష్మి, ఏవో శృతి, కాంగ్రెస్ నాయకులు భగవాన్‌దాస్, సుదర్శన్, రాజేశ్వర్, ఇంద్రాగౌడ్, నర్సారెడ్డి, గంగారెడ్డి, గుడాల మోహన్, టక్కర్ గంగాధర్, జేమ్స్ గంగారెడ్డి, చరణ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ
చైర్మన్ అన్వేశ్ రెడ్డి