విధులకు డమ్మా.. | - | Sakshi
Sakshi News home page

విధులకు డమ్మా..

May 15 2025 1:27 AM | Updated on May 15 2025 1:27 AM

విధుల

విధులకు డమ్మా..

నిజామాబాద్‌

రోడ్డు ప్రమాదంలో..

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన చేపూర్‌ శివారులోని ఎన్‌హెచ్‌ 63పై చోటు చేసుకుంది.

గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2025

– 8లో u

ఏప్రిల్‌ నెలలో ఒకేసారి సంతకాలు చేసిన సీహెచ్‌వో

నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోజులతరబడి విధులకు డుమ్మా కొడుతూ నెలనెలా మెడికల్‌ ఆఫీసర్‌లకు కమీషన్‌లు ఇస్తూ రిజిస్టర్‌లలో ఒకేసారి సంతకాలు చేస్తున్నారు. పీహెచ్‌సీ పరిధిలో మెడికల్‌ ఆఫీసరే బాస్‌ కావడంతో కమీషన్‌లు ఇచ్చే ఉద్యోగులు, సిబ్బంది హవా నడుస్తోంది. ప్రభుత్వం నుంచి ఠంచన్‌గా జీతాలు తీసుకుంటున్న వారు విధులకు న్యాయం చేయడం లేదు. కమీషన్‌ల ఆశలో మునిగిన మెడికల్‌ ఆఫీసర్లు పట్టించుకోకపోవడం, పైస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పీహెచ్‌సీల్లో పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది.

రోగులను పట్టించుకునే వారు కరువు

స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందక గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని చోట్ల వైద్యులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మాకొడుతుండడంతో దిక్కులేక ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు మాట పక్కనపెడితే అసలు విధులకే హాజరుకాని వారు వైద్య సేవలు ఎలా అందిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఉన్నతాధికారులతో మాకేం సంబంధం

మండలాల పరిధిలో ఉన్న పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలకు మెడికల్‌ ఆఫీసర్‌లే బాస్‌లు. ఇంకేముంది ఆపైన ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో, జిల్లా వైద్యాధికారులతో మాకేం సంబంధం అన్నట్లు ఉద్యోగులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఒక్కో పీహెచ్‌సీ పరిధిలో మెడికల్‌ ఆఫీసర్‌, సీహెచ్‌వో, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌టెక్నిషియన్‌, ఎంఎన్‌వో, డీఈవో, ఫార్మసి, స్టాఫ్‌ నర్సులు, ఎంఎల్‌హెచ్‌పీ, అటెండర్లు తదితర పోస్టులు ఉన్నాయి. కమీషన్‌లు ఇచ్చే ఉద్యోగులు ఒకటిరెండు రోజులు కాదు ఏకంగా నెలల తరబడి విధులకు హాజరుకాకున్నా మెడికల్‌ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో ఫోర్జరీ సంతకాలు చేస్తున్నట్లు తోటి ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.

రోగులను పట్టించుకునే వారు కరువు

స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందక గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని చోట్ల వైద్యులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మాకొడుతుండడంతో దిక్కులేక ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు మాట పక్కనపెడితే అసలు విధులకే హాజరుకాని వారు వైద్య సేవలు ఎలా అందిస్తారని ప్రశ్నిస్తున్నారు.

నా దృష్టికి వస్తే కఠిన చర్యలు

నేను ప్రతిరోజూ మానిటరింగ్‌ చేస్తున్నాను. ఉదయం 10గంటలలోపు మెడికల్‌ ఆఫీసర్‌లు కిందిస్థాయి ఉద్యోగుల వెళ్లి లైవ్‌ ఫోటోస్‌ పెట్టాలని ఆదేశించాను. కోటగిరిలో ఓ ఉద్యోగికి డ్యూటీకి రాకున్నా జీతం వేయడంతో షోకాజ్‌ నోటీసు సైతం ఇచ్చాను. తనిఖీలకు వెళ్తున్నాను. ఎవరైనా మెడికల్‌ ఆఫీసర్‌లు కమీషన్‌లు తీసుకుని డుమ్మా కొట్టిన ఉద్యోగులకు అటెండెన్స్‌ వేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్‌ రాజశ్రీ, డీఎంహెచ్‌వో

న్యూస్‌రీల్‌

జిల్లాలో ఆస్పత్రులు

సిరికొండ పీహెచ్‌సీలో విధులు నిర్వర్తించే ఉద్యోగి ఒకరు తన జీతంలో నుంచి ప్రతి నెలా మెడికల్‌ ఆఫీసర్‌కు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఇస్తూ డ్యూటీకి హాజరుకావడం లేదు. సదరు ఉద్యోగి నెలలో ఒకటి, రెండుసార్లు దర్జాగా పీహెచ్‌సీకి వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తున్నాడు. ఇదే పీహెచ్‌సీలో మరో ఉద్యోగినితోపాటు ఓ అటెండర్‌ విధులకు హాజరుకాకుండా రిజిస్టర్‌లో ఒకేసారి సంతకాలు చేస్తున్నా మెడికల్‌ ఆఫీసర్‌ పట్టించుకోకపోడానికి కారణం నెలవారి చెల్లింపులే అని స్థానిక సిబ్బంది అంటున్నారు.

పీహెచ్‌సీలలో ఇష్టారాజ్యం

జీతంలో నుంచి కమీషన్‌ ఇస్తూ విధులకు

డుమ్మా కొడుతున్న సిబ్బంది

దర్జాగా హాజరు వేసుకుంటున్న వైనం

పైస్థాయి అధికారుల పర్యవేక్షణ

ఉన్నట్టా? లేనట్టా?

రోగుల ఇబ్బందులు దేవుడెరుగు..

విధులకు డమ్మా..1
1/4

విధులకు డమ్మా..

విధులకు డమ్మా..2
2/4

విధులకు డమ్మా..

విధులకు డమ్మా..3
3/4

విధులకు డమ్మా..

విధులకు డమ్మా..4
4/4

విధులకు డమ్మా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement