
నిండుకుండలా.. రైతులకు అండగా..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫ రా చేసే కాకతీయ కాలువ వేసవిలో సైతం నిండుకుండలా ఉంది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ కాలువలో నీరు నిలు వ ఉండటంతో ఇరువైపులా ఉన్న రైతుల భూము ల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటున్నాయి. కొందరు రైతులు కాలువలో పంపుసెట్‌లను బిగించుకొని పంటల సాగుకు ఉపయోగిస్తున్నారు.
50 క్యూసెక్కులకు జీవో
కాకతీయ కాలువ నిర్మాణ సమయంలో ఆయా గ్రా మాల రైతులు ఊర చెరువులను కోల్పోయారు. దీంతో నీటిని నిలువ చేసేందుకు అవకాశం లేకపోవ డంతో కాలువలోనే నీటిని నిలువ చేసేలా ప్రత్యేక జీవోను ఆయకట్టు రైతులు సాధించుకున్నారు. 2017లో లీకేజీ నీటి కోసం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం నీటి నిలువ కోసం అవకాశం కల్పించింది. జిల్లా స రిహద్దులోని కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామం వద్ద కాకతీయ కాలువ క్రాస్ రెగ్యులేటర్‌ను దించి కాలువలో నీటి నిలువ చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల లేని సమయంలో కాలువలో నీటి నిలువ కోసం ప్రతి రోజు 50 క్యూసెక్కుల నీటిని నిరంతరం విడుదల చేపట్టాలని ప్రత్యేక జీవోను గత ప్రభుత్వం ఇచ్చింది. అప్పటి నుంచి కాలువలో నీరు నిలువ ఉంటోంది.
కాలువ నుంచి పైప్‌లైన్లు..
కాకతీయ కాలువ నుంచి కొందరు రైతులు ఏకంగా 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా పైపులైన్ వేశారు. కాలువలో నీరు నిలువ ఉండటంతో ప్రస్తుతం ముందస్తుగా పంటలు సాగు చేసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం కాలువలో నీటిని నిలువ ఉంచేందుకు చర్యలు తీసుకోవడంపై రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
కాలువలో వ్యవసాయ పంపుసెట్లు
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ముందస్తు పంటల సాగుకు
అనుకూలం
ఎల్లప్పుడూ నీరు..
కాకతీయ కాలువలో ఎండకాలంలో సైతం నీరు నిలువ ఉంటుండడంతో పంటల సాగుకు ఇబ్బంది లేదు. కాలువ నీటి ఆధారంగా పంపుసెట్ బిగించి పైపులైన్ వేశాను. ఖరీఫ్ పంటలను ముందుగా సాగు చేసేందుకు రెడీ అవుతున్నా. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– ఆకుల రాజన్న, రైతు