
పార్టీ ఐక్యత కోసం కలిసి పనిచేయాలి
రాజంపేట : మండల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉండరాదని అందరూ పార్టీ కోసం ఐక్యతతో పని చేయాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజంపేట గ్రామంలో నెలకొన్న ఇందిరమ్మ ఇళ్ల గందరగోళ విషయంపై ఆయన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరు డబ్బులు వసూలు చేసినట్లు నిరూపణ జరిగినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నాయకత్వంలో పార్టీ కోసం కష్టపడి పని చేయాలని, రాబోయే స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యాదవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.