బాధ్యతలు స్వీకరించిన జైలు సూపరింటెండెంట్
ఖలీల్‌వాడి: నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా దశరథం గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జైలర్ నుంచి సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందిన ఆయన సంగారెడ్డి సబ్ జైలుతోపాటు సిద్దిపేట్ జైలులో పనిచేశారు. బదిలీలో భాగంగా నిజామాబాద్‌లోని సారంగపూర్ జైలుకు వచ్చారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఖలీల్‌వాడి: నిజామాబాద్, బోధన్‌లోని రెండు బార్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫారం–1ఏలో దరఖాస్తు పత్రం, మూడు కలర్ ఫొటోలు, రూ.లక్ష డీడీ లేదా చలాన్(తిరిగి ఇవ్వబడదు), ఆధార్‌కార్డు, పాన్‌కార్డులను జిరాక్స్‌లతో జూన్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లోగల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులు గురువారం నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ఒకరు ఎన్నిసార్లయినా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. జూన్ 13న కలెక్టర్ సమక్షంలో బార్‌లకు లక్కీ డ్రా తీయబడుతుందని తెలిపారు.
రసాయనిక ఎరువులు విరివిగా వాడొద్దు
మాక్లూర్: పంట పొలాలకు పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు మాత్రమే రసాయనిక ఎరువులు వాడుకోవాలని రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త ఎం సాయిచరణ్ సూచించారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా గురువారం మాక్లూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సాయిచరణ్ మాట్లాడుతూ పంట పొలాలను చీడపీడల నుంచి రక్షించుకునేందుకు రైతులు రసాయనిక ఎరువులపైనే ఆధారపడుతుండడం శోచనీయమన్నారు. లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే అత్యధిక పురుగులు అందులో చిక్కుకొని మృతి చెందుతాయన్నారు. పుష్కలంగా సాగునీరుందని చెప్పి అస్తమానం పొలాలకు నీరందించడం కూడా సరైన పద్ధతి కాదని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం ప్రశాంతి సూచించారు. తప్పనిసరిగా వేసవి దుక్కులు దున్నుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ విజయలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి పద్మ, పశువైద్యాధికారి ఉమాసహేర్, విత్తనాధికారి ఏ అశోక్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్‌రావు, మాక్లూర్ విండో చైర్మన్ బూరోల్ల అశోక్, రవి ప్రకాశ్, మహేందర్, అమూల్య, ఉమాదేవి, దివ్య, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.


