
పాము కాటుకు బాలుడు మృతి
నస్రుల్లాబాద్ (బాన్సువాడ) : పాము కాటుతో నా లుగేళ్ల బాలుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో అ శోక్, సూజాత దంపతుల కుమారుడు రిషి కుమార్ బుధవారం ఇంట్లో ఆడుకుంటున్నాడు. బాలుడి కాలు నుంచి రక్తం కారుతుండటం గమనించిన తల్లి గాయం అయి ఉంటుందని భావించి పసుపు రాసింది. కొద్దిసేపటి తర్వాత బాబు కళ్లు తేలేయడంతో తల్లి భయానికి గురయ్యింది. అంతలోనే పాము కనబడటంతో పాము కరిచి ఉండవచ్చని బాలుడిని బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా సిబ్బంది నిజా మాబాద్‌కు వెళ్లమన్నారు. అప్పటికే శరీరం అంతా విషం వ్యాపించడంతో బాలు డు మృతి చెందాడు. ముగ్గు రు కుమార్తెల తర్వాత ఎంతో కాలానికి కొడుకు పుట్టాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీ రయ్యారు. గ్రామంలో కురిసిన భారీ వర్షానికి పాము ఇంట్లోకి వచ్చి ఉంటుందని, అంతలోనే ఘోరం జ రిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.