
మొబైల్ వీడి.. ఆటలు ఆడాలి
డిచ్‌పల్లి: యువత మొబైల్ ఫోన్లకు అలవాటు పడి విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నారని, ఇకనైనా వాటిని వీటి ఆటలపై దృష్టి సారించాలని డిచ్‌పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ సూచించారు. మండలంలోని ఘన్‌పూర్‌లో గత నెల 20న ప్రారంభమైన ఘన్‌పూర్ ప్రీమియం లీగ్(జీపీఎల్) టీ–20 క్రికెట్ పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన టోర్నీ విజేత వాసరి సాయినాథ్ జట్టుకు కప్పుతో పాటు బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసగా ఉండాలని సూచించారు. ఘన్‌పూర్ యూత్ సభ్యులు మంచి ఆలోచనతో వేసవి సెలవుల్లో యువత మత్తుకు, మొబైల్ గేమ్స్‌కు అలవాటు పడకుండా గత 14 ఏళ్లుగా అందరిని ఏకం చేసి టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. పదోతరగతిలో మంచి మార్కులు సాధించిన ఘన్‌పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని స్వాతిని ఎస్సై ఘనంగా సత్కిరంచారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు కర్ని గంగాధర్, రామకృష్ణ, హరీశ్, నరేశ్, శ్రీకాంత్, గంగామోహన్, పృథ్వీ, రమణ, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.