
సిరికొండ పీహెచ్‌సీలో విచారణ
నిజామాబాద్ నాగారం/ సిరికొండ: ‘విధులకు డు మ్మా.. రిజిస్టర్‌లో హాజరు’ అనే శీర్షికన సాక్షిలో గు రువారం ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఉద్యోగుల అక్రమ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్)..విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని డీఎంహెచ్‌వో రాజశ్రీని ఆదేశించింది. దీంతో గురువారం డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకా రాం రాథోడ్‌తో విచారణ చేయించి, డీహెచ్‌కు నివే దిక అందజేశారు. కాగా, ఆ నివేదికతో సంతృప్తి చెందని డీహెచ్ ప్రత్యేక విచారణకు ఆదేశించారు. దీంతో వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ట్రేటివ్ అడిషనల్ డైరెక్టర్ శశిశ్రీ శుక్రవారం సిరికొండ పీహెచ్‌సీకి వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. పీహెచ్‌సీలో విధులు నిర్వ హిస్తున్న ఉద్యోగుల స్టేట్‌మెంట్ తీసుకోవడంతోపాటు పీహెచ్‌సీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా ఏం చేస్తున్నారని మండిపడ్డట్లు తెలిసింది. మంచి జీతాలు ఉన్నా పేదలకు మెరుగైన సేవలు అందించకుండా డుమ్మా లు కొడుతూ దొంగతనంగా రిజిస్టర్‌లో సంతకాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పర్యవేక్షణించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని, పీహెచ్‌సీలో ఇలాంటి ఘటనలు జరగడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగి విధులకు రాకున్నా సంతకాలు చేయించి, జీతాలు ఇవ్వడంపై మండిపడ్డారు. ఇదే పరిస్థితి జిల్లాలోని చాలా పీహెచ్‌సీలో జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి నివేదికను ఆమె డీహెచ్‌కు అందజేయనున్నారు. అడిషనల్ డైరెక్టర్ వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్, ఇతర అధికారులు ఉన్నారు.
వివరాలు సేకరించిన వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ట్రేటివ్ అడిషనల్ డైరెక్టర్ శశిశ్రీ