
‘మోడల్’లో ఇంటర్ ప్రవేశాలు
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ఇంటర్మీడియెట్ ఆంగ్లమాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు (మోడల్ స్కూల్) ఓ వరం. 2025–26 విద్యా సంవత్సరానికి ఇంటర్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 20 వరకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 26న మెరిట్ లిస్టు, 27 నుంచి 31 వరకు ఎంపికై న విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. మోడల్ స్కూల్‌లో ఇంటర్‌తోపాటు ఎంసెట్, నీట్ కోచింగ్‌కు అవకాశం కల్పించారు.
ప్రతి గ్రూప్‌లో 40 సీట్లు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 16 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి స్కూల్‌లో ఎంపీసీ, బై పీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులున్నాయి. ప్రతి గ్రూ పులో 40 సీట్ల చొప్పున ఒక్కో పాఠశాలలో 160 సీట్లు కేటాయించారు. ఆదర్శ పాఠశాలల్లో బాలికలకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది. అందుకు కనీసం 3 కిలోమీటర్లు, ఆపై దూరంగా ఉండేవారు మాత్రమే అర్హులుగా అధికారులు పేర్కొన్నారు.
అడ్మిషన్స్ కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ అడ్రస్.. http://183.82.97.97/mstg
దరఖాస్తు చేసుకోవాలి
మోడల్ స్కూల్స్‌లో ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 20 వర కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన విద్యాబోధన, లైబ్రరీ, గేమ్స్, వొకేషన ల్ ట్రైనింగ్, కంప్యూటర్ విద్య అందుబాటులో ఉంటుంది.పదో తరగతి ఫలితాల్లో వచ్చిన మార్కులు, మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలుంటాయి.
– దశరథ్, ప్రిన్సిపాల్, డిచ్‌పల్లి మోడల్ స్కూల్

‘మోడల్’లో ఇంటర్ ప్రవేశాలు