
అమృతం తల్లిపాలు
నిజామాబాద్ నాగారం: బిడ్డకు అమృతంతో సమానమైన తల్లి పాల ప్రాముఖ్యాన్ని మహిళలకు వివరించేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారంలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తోంది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గర్భిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను వివరిస్తున్నారు. అపోహలను పోగొట్టేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారులు తల్లిపాల వారోత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు.
బిడ్డ పుట్టిన గంటలో 41 శాతం మంది పిల్లలకు మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. బిడ్డ సంపూ ర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు అవసరమైన అన్ని రకాల పోషక విలువలు తల్లి పాలలో ఉంటాయి. బిడ్డకు జ న్మనిచ్చిన తర్వాత గంటలోపే బిడ్డకు తల్లి పాలు ఇ వ్వాలి. దీంతో బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణంగా పిల్లలకు ఐదేళ్లలోపు వచ్చే డయేరియా, వైరల్ జ్వరాలు, కామెర్లు వంటి రకరకాల వ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయి. పిల్లలకు శ్వాసకోశ వ్యా ధులు, ఆస్తమా, అలర్జీ, డయాబెటిస్ క్యాన్సర్, ఊబకాయం, చెవిలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
వారోత్సవాల్లో..
తల్లిపాల ప్రాధాన్యాన్ని వివరిస్తారు. పిల్లల ఎదుగుదలపై అవగాహన కల్పిస్తారు.
7 నుంచి 9 నెలల గర్భిణుల ఇంటికి వెళ్లి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతారు.
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూడాలని కుటుంబసభ్యులకు వివరిస్తారు.
పిల్లల మానసిక ఎదుగుదలకు తల్లి పాలు ఎంతో దోహదం చేస్తాయని, పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు బిడ్డకు తల్లి పాలను తప్పక ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు.
7 నుంచి 24 నెలల పిల్లలకు తల్లిపాలతో అదనంగా ఆహారం ఇవ్వాలని సూచిస్తారు.
ఇంట్లోనే సమతుల ఆహారం తయారీపై అవగాహన కల్పిస్తారు.
బాలింతలు, గర్భిణుల ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు పూర్తి వివరాలు నమోదు చేస్తారు.
ఆరు నెలల్లోపు వయసున్న చిన్నారుల ఇళ్లను సందర్శిస్తూ వారికి తల్లి పాలు అందుతున్నాయా? లేదా? అని ఆరా తీస్తారు.
డబ్బాపాలతో అనారోగ్య సమస్యలు
ఇంటింటికీ అంగన్‌వాడీ పేరుతో అవగాహన
కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలు
శిశువుకు అమృతం
అమ్మపాలు శిశువుకు అమృతం వంటివి. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే ముర్రు పాలు పట్టించాలి. కృత్రి మ పాలు తాగిస్తే కలిగే నష్టాలపై గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ టీచర్లు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ లక్ష్యాలు, అందిస్తున్న పథకాలను వివరించా ల్సి ఉంది.
– రసూల్‌బీ, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి
ఐసీడీఎస్ ప్రాజెక్టులు: నిజామాబాద్ అర్బన్, బోధన్, నిజామాబాద్ రూరల్, భీమ్‌గల్, ఆర్మూర్
అంగన్‌వాడీ కేంద్రాలు : 1501
బాలింతలు : 6099
గర్భిణులు : 9771