
జీవితంలో విలువైన బంధం ‘స్నేహం’
సుభాష్‌నగర్: స్నేహమనేది మానవ జీవితంలో అత్యంత విలువైన బంధమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరుకాపు సంఘంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కలం స్నేహం అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య కవుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ధన్‌పాల్ మాట్లాడుతూ.. కలం ద్వారా స్నేహం పెంచుకుంటూ, భావాల పరస్పర మార్పిడికి వేదికలను కల్పిస్తున్న కలం స్నేహం అసోసియేషన్ వంటి సంస్థల సేవలు ప్రశంసనీయమన్నారు. సమాజాన్ని చైతన్యపర్చడంలో కవులు, కళాకారులు కీలకపాత్ర పోషిస్తారని, కళలు మానవ వికాసానికి తోడ్పడుతాయని తెలిపారు. మహిళా సాధికారతలో భాగంగా ఎందరో కవులను తీర్చిదిద్దుతున్న అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ ఆచార్య, ఉపాధ్యక్షుడు హరిప్రియను ప్రత్యేకంగా అభినందించారు. సమ్మేళనంలో కవిత్వాలు, సంగీత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో సాహితీ, సంగీత కవులు, మహిళలు పాల్గొన్నారు.
జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యవర్గం ఎన్నిక
ఆర్మూర్‌టౌన్: హ్యాండ్‌బాల్ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని నటరాజ ఫంక్షన్ హాల్‌లో జిల్లా హ్యాండ్‌బాల్ సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం చైర్మన్‌గా అల్జాపూర్ దేవేందర్, ప్యాట్రన్‌గా టీ విద్యాసాగర్‌రెడ్డి, అధ్యక్షుడిగా కోల గంగామోహన్ చక్రు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, ఓ.సునీత, సౌడ సురేశ్, బీ శ్యామ్, బాపూరావు, ప్రధాన కార్యదరిగా పింజ సురేందర్, సంయుక్త కార్యదర్శులుగా అనుపల రజిత, రమణమూర్తి, మాధురి, సతీశ్ రెడ్డి, లింగం, కోశాధికారి గట్టడి రాజేశ్, నిర్వహణ కార్యదర్శిగా రాహుల్, ఎం.సాయికుమార్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి, హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికై న శ్యామల పవన్‌కుమార్ సంఘం సభ్యులు సన్మానించారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
నగరంలో ఘనంగా సంగీత, సాహిత్య కవుల ఆత్మీయ సమ్మేళనం

జీవితంలో విలువైన బంధం ‘స్నేహం’