ఆర్మూర్: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఆర్మూర్ నియోజకవర్గంలో ఆదివారం ముగిసింది. ఆలూర్‌లో శ్రమదానం అనంతరం అంకాపూర్‌లో పాదయాత్ర చేపట్టారు. అనంతరం జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ శివారులోని యమునా గార్డెన్స్‌లో ఉమ్మడి జిల్లాస్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందుకున్న గల్ఫ్ మృతుల కు టుంబాలు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపాయి. అనంతరం వారితో సహపంక్తి భోజనాలు చేశారు.
బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తూ తెలంగాణలో మాత్రం రిజర్వేషన్లు ఇవ్వొద్దని చెప్పడం ఆ పార్టీ నేతలకు సరైంది కాదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు డబ్బులు సంపాదించుకునే పార్టీలే కాని, పేదలకు చేసింది శూన్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉండాలన్నారు.
కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో వెనకబడినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
పదేళ్లలో విద్యారంగం అధ్వానం
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యారంగం అధ్వానంగా మారిందని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ తన కుటుంబం కోసం వేల కోట్ల రూపాయలు సంపాదించి రేపటి రోజు జైలుకు వెళ్లే పరిస్థితికి వచ్చాడన్నారు. ఈ విషయాలన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.
కార్యకర్తలను గెలిపించుకుంటాం
స్థానిక సంస్థల ఎన్నిక ల్లో కార్యకర్తలను గెలిపించుకోవడం పార్టీ బాధ్యత అని ప్రభుత్వ సలహాదారు షబ్బీ ర్ అలీ అన్నారు. బీసీ బిల్లు పై అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ వస్తుందంటూ అభ్యంతరం తెలపడం సరికాదన్నారు.
కాంగ్రెస్‌దే విజయం
స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు భవిష్యత్‌లో వ చ్చే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీదే విజయమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఎర్రజొన్న, పసుపు రైతులు చేపట్టిన ఉద్యమాల్లో కాంగ్రెస్ నాయకులపైనే ఎక్కువ కేసులు ఉన్నాయని, కేసులను ఎత్తివేయాలని కోరారు.
కార్యకర్తల పాత్ర కీలకం..
జుక్కల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్ని కల్లో 50కి పైగా పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర కీలకమైందని తెలిపారు.
సామాజిక న్యాయంతోనే..
బీసీ రిజర్వేషన్లు అమలైతే రాహుల్ గాంధీ నాయకత్వం బలోపేతం అవుతుందనే భయంతో ఎన్‌డీఏ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.
ముగిసిన ‘జనహిత’ పాదయాత్ర
ముగిసిన ‘జనహిత’ పాదయాత్ర
ముగిసిన ‘జనహిత’ పాదయాత్ర
ముగిసిన ‘జనహిత’ పాదయాత్ర
ముగిసిన ‘జనహిత’ పాదయాత్ర
ముగిసిన ‘జనహిత’ పాదయాత్ర
ముగిసిన ‘జనహిత’ పాదయాత్ర