చోరీ కేసుల్లో పురోగతేదీ? | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసుల్లో పురోగతేదీ?

Aug 4 2025 5:32 AM | Updated on Aug 4 2025 5:32 AM

చోరీ

చోరీ కేసుల్లో పురోగతేదీ?

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కులాస్‌పూర్‌లో ఒకేరోజు

11 ఇళ్లల్లో దొంగతనాలు

పదిరోజులైనా లభ్యం కాని

నిందితుడి ఆచూకీ

రెండు బృందాలు గాలిస్తున్నా

ఫలితం శూన్యం

దేమికలాన్‌లో ఒకరి ఆత్మహత్య

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని దేమికలాన్‌ గ్రామంలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మురళి తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కొనింటి గంగయ్య(71)కు భార్య సంగవ్వ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సంగవ్వ కొన్నేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించిన్నప్పటికీ వ్యాధి నయం కాలేదు. తనకున్న అర ఎకరం భూమిని అమ్మి, వచ్చిన డబ్బుతో భార్యకు వైద్యచికిత్స అందించాడు. అలాగే తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేయించడం అప్పులపాలయ్యారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన గంగయ్య శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

ధర్మోరాలో ఒకరి ఆత్మహత్యాయత్నం

మాక్లూర్‌: మండలంలోని ధర్మోరా గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన అరుణ్‌ ఆదివారం కుటుంబంలో గొడవల కారణంగా ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు, కుటుంబసభ్యులు గమనించి వెంటనే నీళ్లు పోసి, మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే అరుణ్‌ శరీరం చాలావరకు కాలిపోయింది. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అరుణ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారని గ్రామస్తులు తెలిపారు.

మహిళ అదృశ్యం

మోపాల్‌: మండలంలోని చిన్నాపూర్‌ గ్రామానికి చెందిన కోతోళ్ల భారతి అదృశ్యమైనట్లు ఎస్‌ఐ జాడె సుస్మిత ఆదివారం తెలిపారు. భారతికి, ఆమె భర్త నర్సయ్యకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కూడా గొడవ జరగడంతో తాను చనిపోతానని ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భారతి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మండలంలోని కులాస్‌పూర్‌ గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనపై పురోగతి కన్పించడం లేదు. దుండగులు ఒకే రోజు ఏకంగా 11 ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడి భారీగా సొత్తు దోచుకెళ్లినా.. పోలీసులు కేసును ఇప్పటివరకు ఛేదించలేకపోయారు. పోలీసులు మాత్రం రెండు బృందాల ద్వారా గాలిస్తున్నామని చెబుతున్నా.. నిందితులను పట్టుకోవడంలో సఫలీకృతం కావడంలేదు.

గత నెలలో జరిగిన ఘటనలు..

మోపాల్‌ ఎస్‌ఐగా జాడే సుస్మిత బాధ్యతలు స్వీకరించిన రోజే (జూలై 6న) నర్సింగ్‌పల్లిలో ఓ చోరీ ఘటన జరిగింది. దుండగులు 11 తులాల బంగారం, రూ.35వేల నగదును దోచుకెళ్లారు. అదే నెలలో 23న అర్ధరాత్రి కులాస్‌పూర్‌లో తాళం వేసిఉన్న 11ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. పక్కనున్న ఇళ్లకు బయటి నుంచి గొళ్లాలు బిగించి తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. మొత్తం 7.3 తులాల బంగారం, 54 తులాల వెండి, రూ.3.85లక్షల నగదు చోరీకి గురైంది. అంతేగాకుండా ముదక్‌పల్లి చిలుకల చిన్నమ్మ ఆలయం, మంచిప్పలోని గండి మైసమ్మ ఆలయాల్లో కూడా దొంగతనాలు జరిగాయి.

సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..

చోరీ కేసులను జిల్లా పోలీస్‌ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సీపీ సాయి చైతన్య స్వయంగా కులాస్‌పూర్‌ గ్రామాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీస్‌వర్గాల భోగట్టా. కానీ నిందితుడు బోధన్‌కు చెందిన పాత నేరస్తుడిగా అనుమానిస్తున్నారు. మండలంలో వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చోరీల నివారణకు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి రాత్రివేళల్లో పోలీస్‌ పెట్రోలింగ్‌ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

ఇద్దరికి గాయాలు

త్వరలోనే పట్టుకుంటాం..

కులాస్‌పూర్‌ చోరీ కేసులో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశాం. దీని కోసం ప్రత్యేకంగా రెండు బృందాలు గాలిస్తున్నాయి. కొన్ని ఆధారాలు లభించాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్లకు తాళం వేసి వెళ్తే పక్కంటి వారికి సమాచారమివ్వాలి.

– సురేష్‌కుమార్‌, నిజామాబాద్‌ నార్త్‌ సీఐ

చోరీ కేసుల్లో పురోగతేదీ?1
1/2

చోరీ కేసుల్లో పురోగతేదీ?

చోరీ కేసుల్లో పురోగతేదీ?2
2/2

చోరీ కేసుల్లో పురోగతేదీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement