
శ్రామికుల కష్టాలను గుర్తించడమే నాయకుల లక్షణం
పెర్కిట్(ఆర్మూర్): శ్రామికుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన రాజకీయ నాయకుని లక్షణమని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో బడుగు బలహీన వర్గాల కష్టాలను గుర్తించడానికే పాదయాత్ర, శ్రమదానం చేపట్టామన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి ఎందులోనూ లభించదన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు పొద్దుటూరి వినయ్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, కాంగ్రెస్ పార్టీ ఆలూర్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఖాందేశ్ శ్రీనివాస్, కోల వెంకటేశ్, సుర్భిర్యాల్ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్