ఎన్‌హెచ్ 63పై రైతుల రాస్తారోకో
● వర్షానికి ధాన్యం తడిసిందని ఆవేదన
● గంటపాటు ట్రాఫిక్‌జామ్
ఆర్మూర్‌టౌన్: ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చే స్తూ రైతులు ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డు జాతీయ రహదారి 63పై బుధవారం ధర్నా చేశారు. 20 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగో లు చేయడం లేదని, తక్షణమే ధాన్యం కాంటా చేసి రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మంగళవారం సాయంత్రం అధికారులను ఆదేశించినా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించా రు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆర్డీవో, డీఎస్‌వో శ్రీనివాస్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. త్వరలోనే ధాన్యం కొనుగో లు చేసి, రైస్ మిల్లులకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. రైతులకు బీఆర్‌ఎస్ నియెజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ నాయకులు నూతుల శ్రీనివాస్ మద్దు తెలిపారు. ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా సుమారు 5కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.


