
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
ఆర్మూర్‌టౌన్: రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సీపీ సాయిచైతన్య సూచించారు. ఆర్మూర్ మండలం చేపూర్‌లోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఆర్మూర్‌లోని జెండాగల్లీకి చెందిన అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మరణించగా, కారణాలను ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో పరిిస్థితిని పరిశీలించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్, సిబ్బంది ఉన్నారు.
రైల్వే సిబ్బంది గ్రీవెన్స్‌పై ‘నేస్తం’
ఖలీల్‌వాడి: రైల్వే సిబ్బంది గ్రీవెన్స్‌పై ‘నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఆనంద్ కట్టా అన్నారు. హైదరాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్‌లో గురువారం నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో మొదటి నేస్తం ఫిర్యాదుల క్యాంపును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచేందుకు, రైల్వే ఉద్యోగులు పర్సనల్ బ్రాంచ్ అధికారులతో నేరుగా మాట్లాడేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. సీనియర్ డివిజనల్ పర్సనల్ అధికారి బృందం రైల్వే సిబ్బంది సమస్యలను గ్రీవెన్స్‌లో అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలు పరిపాలన పరంగా పరిష్కరిస్తామని చెప్పారు.
వ్యవసాయశాఖలో
ఘటనపై విచారణకు ఆదేశం
డొంకేశ్వర్(ఆర్మూర్): మరణించిన ఉద్యోగికి సంబంధించిన ఫ్యామిలీ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలపై నిజామాబాద్ రూరల్ వ్యవసాయశాఖ అధికారిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ విచారణకు ఆదేశించింది. విచారణ అధికారులుగా సింగారెడ్డి, శివాజీ పాటిల్‌లను హైదరాబాద్ నుంచి నియమించింది. వీరు శుక్రవారం జిల్లాకు వ చ్చి బాధిత కుటుంబాన్ని, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని విచారించనున్నా రు. ఇటు టీజీవో ఆధ్వర్యంలో కలెక్టర్, డీఏవో కు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
17వరకు రేషన్ బియ్యం పంపిణీ
కామారెడ్డి రూరల్: రేషన్ షాపుల ద్వారా మే నెలకు సంబంధించిన ఉచిత బియ్యం పంపిణీ ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు రేషన్ బియ్యం తీసుకోని లబ్ధిదారులు ఎవరైనా ఉంటే సంబంధిత రేషన్ షాపుల్లో బియ్యం తీసుకోవాలని అధికారులు సూచించారు.
సెల్‌ఫోన్ అప్పగింత
రెంజల్(బోధన్): పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి పట్టుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని కందకుర్తి గ్రామానికి చెందిన సోహైల్ అనే వ్యక్తి సెల్‌ఫోన్ పోగొట్టుకోగా ఆయన ఫిర్యాదు మేరకు ట్రేస్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. గురువారం బాధితునికి ఫోన్ అప్పగించినట్లు చెప్పారు. కంప్యూటర్ ఆపరేటర్ గణేశ్ ఉన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి