
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని డీఈవో అశోక్ సూచించారు. నగరశివారులోని బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదురోజులుగా జరుగుతున్న మొదటి బ్యాచ్ ఉపాధ్యాయుల శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని, స్పష్టమైన అవగాహనతో విద్యాబోధన చేయాలని సూచించారు. సెంటర్ ఇన్‌చార్జి శంకర్ మాట్లాడుతూ.. సబ్జెక్టు వారీగా లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై అవగాహన ఉండాలని, ఈ శిక్షణ ఔట్ కమ్స్ వివరాలు అందించినట్లు తెలిపారు. అలాగే వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం రిసోర్స్‌పర్సన్లను డీఈవో సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.