Stock Market
-
మార్కెట్ గ్రీన్.. సన్ టీవీ రెడ్!
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 355.90 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 77,269.40 వద్ద, నిఫ్టీ 121.75 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 24,119.30 వద్ద నిలిచాయి.కాలిఫోర్నియా సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్, ఐఎఫ్బి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాలర్ ఎస్టేట్ లిమిటెడ్, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ లిమిటెడ్, ఒమాక్స్ ఆటోస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రేతాన్ టిఎమ్‌టి లిమిటెడ్, మనోమయ్ టెక్స్ ఇండియా లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్, జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్, కేఎస్‌బి లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిసినప్పటికీ.. తమిళనాట ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో.. కలానిధి మారన్ స్థాపించిన 'సన్ టీవీ నెట్వర్క్' షేర్స్ మాత్రం భారీ పతనం చవిచూడాల్సి వచ్చింది. సంస్థ షేర్స్ ట్రేడింగ్ క్లోసీ అయ్యే సమయానికి 5.38 శాతం పడిపోయాయి. ఉదయం 10:40 గంటలకు, సన్ టీవీ షేర్లు 8% తగ్గి ఒక్కో షేరుకు రూ. 557.65 వద్ద ట్రేడవుతున్నాయి. ఆగస్టు 2024 తర్వాత ఈ స్టాక్ ఒకే రోజులో అత్యంత భారీ పతనాన్ని నమోదు చేసింది.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మార్కెట్లో జూదం ఆడుతున్నారు!
ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారు, ‘ఓరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలువబడే వారెన్ బఫెట్ మదుపరులకు హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత పెట్టుబడిదారులు సంప్రదాయ పద్ధతులను పక్కనపెట్టి ప్రమాదకరమైన జూదంలో మునిగి తేలుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెర్క్‌షైర్ హాత్వే వార్షిక వాటాదారుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆర్థిక ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.స్టాక్ మార్కెట్లు ‘అతి తక్కువ సమయంలో ఊహించని ధనవంతులు కావాలనే జూదగాళ్ల అడ్డాగా’ మారిందని బఫెట్ అన్నారు. నేటి మార్కెట్లలో పెట్టుబడి, ఊహాజనిత (స్పెక్యులేటివ్) కార్యకలాపాల మధ్య తేడా కనుమరుగవుతోందని ఆయన విశ్లేషించారు. ‘ఎవరైనా వన్-డే ఆప్షన్లతో ట్రేడింగ్ చేస్తుంటే అది పెట్టుబడి కాదు, కనీసం ఊహాజనితం కూడా కాదు.. అది పూర్తిగా జూదం లాంటిది. చరిత్రలో ఇంతటి తీవ్రమైన మానసిక స్థితి మదుపరుల్లో ఎప్పుడూ చూడలేదు’ అని బఫెట్ స్పష్టం చేశారు.సైనిక చర్యల సమాచారంతో..మార్కెట్లలో జరుగుతున్న ఈ అనాలోచిత ధోరణికి బఫెట్ ఒక సంచలన ఉదాహరణను ప్రస్తావించారు. వెనిజులాలో సైనిక చర్యకు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించి మార్కెట్లలో ఒక అమెరికన్ సైనికుడు సుమారు 4,00,000 డాలర్లు (రూ.3.3 కోట్లు పైగా) గడించాడనే ఆరోపణలతో జరుగుతున్న విచారణను ఆయన గుర్తుచేశారు. ఇటువంటి ఘటనలు మార్కెట్ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయన్నారు. స్వల్ప కాలపు లాభాల కోసం అక్రమ మార్గాలను ఎంచుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.నాయకత్వ మార్పుఈ సమావేశం బెర్క్‌షైర్ హాత్వేలో కొత్త శకాన్ని ఆవిష్కరించింది. గ్రెగ్ అబెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా తన మొదటి వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించారు. కృత్రిమ మేధ(ఏఐ) గురించి మాట్లాడుతూ, స్పష్టమైన ప్రయోజనం లేని ఏ సాంకేతికతను సంస్థ గుడ్డిగా అనుసరించదన్నారు. కేవలం వ్యాపార విలువను పెంచే అప్లికేషన్లపైనే దృష్టి సారిస్తామని అబెల్ స్పష్టం చేశారు. రైల్వే, బీమా రంగాల్లో సంస్థ పట్టును మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు ఆయన వివరించారు.ఇదీ చదవండి: భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన -
816 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 235 పాయింట్లు పెరిగి 24,244 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 816 పాయింట్లు పుంజుకొని 77,724 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.2బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 108.33 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.29 శాతం పెరిగింది.నాస్డాక్ 0.89 శాతం పుంజుకుంది.Today Nifty position 04-05-2026(time: 09:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎగ్జిట్ పోల్స్ వెనుక కుట్ర
కోల్‌కతా: ఎగ్జిట్ పోల్స్ పేరుతో స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేసే కుట్ర సాగిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 200కు పైగా సీట్లు గెల్చుకోవడం తథ్యమని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఆమె శనివారం పార్టీ నేతలు, కార్యకర్తలు, కౌంటింగ్ ఏజెంట్లతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో అవిశ్రాంతంగా పని చేశారంటూ వారిని ప్రశంసించారు. టీఎంసీ గెలుపును ఎవరూ ఆపలేరని ఉద్ఘాటించారు. కచ్చితంగా 200 సీట్లకుపైగా సొంతం చేసుకోబోతున్నామని వెల్లడించారు. స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేయడానికి ఎగ్జిట్ పోల్స్‌ను ఒక సాధనంగా వాడుకుంటున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. 2021, 2024లోనూ ఇలాంటి కుతంత్రమే సాగించారని దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. బెంగాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించడాన్ని, బలగాల దుందుడుకు వైఖరిని తప్పుపట్టారు. ఇది తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న క్రూరత్వంగా అభివర్ణించారు. ఓటర్లను, ముఖ్యంగా మహిళలను భయపెట్టడానికి బీజేపీ కేంద్ర బలగాలను వాడుకుంటోందని టీఎంసీ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. జవాన్లు ప్రతి గ్రామంలోకి, వీధిలోకి వెళ్లి మహిళలపై దాడి చేశారని, పిల్లలను కూడా వదల్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీడియాలోని ఒక వర్గం కూడా వారికి సహకరిస్తోందని విమర్శించారు. ఇదిలా ఉండగా, వర్చువల్ భేటీ ముగిసిన తర్వాత మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 582.86 పాయింట్లు లేదా 0.75 శాతం నష్టంతో 76,913.50 వద్ద, నిఫ్టీ 180.10 పాయింట్లు లేదా 0.74 శాతం నష్టంతో 23,997.55 వద్ద నిలిచాయి.సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కాలిఫోర్నియా సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్, బీసీపీఎల్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, వేదాంత లిమిటెడ్, వారీ ఎనర్జీస్ లిమిటెడ్, హెచ్ఈజీ లిమిటెడ్, ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
940 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:31 సమయానికి నిఫ్టీ(Nifty) 305 పాయింట్లు తగ్గి 23,879 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 945 పాయింట్లు నష్టపోయి 76,544 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.97బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 113.05 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.04 శాతం తగ్గింది.నాస్డాక్ 0.04 శాతం పెరిగింది.Today Nifty position 30-04-2026(time: 09:31 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దూసుకెళ్తున్న బంధన్ బ్యాంక్ షేర్లు
స్టాక్ మార్కెట్లో బంధన్ బ్యాంక్ షేర్లు దూసుకెళ్తున్నాయి. మంగళవారం మార్కెట్ సెషన్ తర్వాత ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాలకు ప్రతిస్పందనగా బ్యాంకు షేర్లు బుధవారం సుమారు 14 శాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బంధన్ బ్యాంక్ షేర్లు (Bandhan Bank Stock Price) బుధవారం మధ్యాహ్నం 12.50 గంటలకు 13.8% పెరిగి రూ.203.36 వద్ద ఉన్నాయి. గత నెలలో స్టాక్ 43.9% లాభపడింది. బంధన్ బ్యాంక్ షేర్లు ఏప్రిల్‌లో ఇప్పటివరకు 27% పెరిగాయి. జూన్ 2020 (47%) నుండి బంధన్ బ్యాంక్ స్టాక్ ఉత్తమ నెలవారీ పనితీరు ఇదే.క్యూ4 ఫలితాలుబంధన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 68 శాతం జంప్‌చేసి రూ. 534 కోట్లను తాకింది. రుణ నాణ్యత మెరుగుపడటంతోపాటు.. రిటైల్ బ్యాంకింగ్, ట్రెజరీ విభాగాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. రిటైల్ బ్యాంకింగ్ నష్టాల నుంచి బయటపడటమేకాకుండా రూ. 434 కోట్ల లాభం ఆర్జించింది. ఇక ట్రెజరీ కార్యకలాపాల నుంచి రూ. 206 కోట్ల లాభం సమకూరింది. దీంతో హోల్‌సేల్ బ్యాంకింగ్ రూ. 80 కోట్ల నష్టం నమోదు చేసినప్పటికీ పనితీరు మెరుగుపడింది.స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.7 శాతం నుంచి 3.3 శాతానికి, నికర ఎన్పీఏలు 1.3 శాతం నుంచి 1 శాతానికి దిగివచ్చాయి. అయితే ఈ కాలంలో రూ. 677 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. నికర వడ్డీ ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 2,796 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 3 శాతం పుంజుకుని రూ. 3,567 కోట్లకు చేరింది. కాగా.. పూర్తి ఏడాదికి బ్యాంక్ నికర లాభం సగానికిపైగా క్షీణించి రూ. 1,224 కోట్లకు పరిమితమైంది. 2024–25లో రూ. 2,745 కోట్లు ఆర్జించింది. అధిక ప్రొవిజన్లు లాభాలను దెబ్బతీశాయి. -
లాభాల్లోకి స్టాక్‌మార్కెట్.. ఎగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య ఆటో, రియాల్టీ స్టాక్స్ పురోగమించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలకు ప్రారంభం వద్ద నష్టాలు తప్పాయి. ఉదయం 9:49 గంటల సమయానికి నిఫ్టీ 0.68 శాతం లేదా 163.30 పాయింట్ల లాభంతో 24,159.00 వద్ద, సెన్సెక్స్ 535.81 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 77,422.72 వద్ద ట్రేడవుతున్నాయి. మారుతి సుజుకి ఇండియా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, ఐషర్ మోటార్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. సెన్సెక్స్ లో మారుతి సుజుకి, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.57 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.68 శాతం పెరిగాయి.రంగాల వారీగా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాల్టీ టాప్ గెయినర్లుగా ఉండగా, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 416.73 పాయింట్లు లేదా 0.54 శాతం నష్టంతో 76,886.91 వద్ద, నిఫ్టీ 97.00 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 23,995.70 వద్ద నిలిచాయి.అబాన్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లిమిటెడ్, వెరాండా లెర్నింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఊర్జా గ్లోబల్ లిమిటెడ్, బి&ఎ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎమామి రియల్టీ లిమిటెడ్, యూనికామర్స్ ఇ-సొల్యూషన్స్ లిమిటెడ్, లక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విసాగర్ పాలిటెక్స్ లిమిటెడ్, ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 42.80 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 24,049.90 వద్ద ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం ట్రేడింగ్ సెషన్ ను 208.84 పాయింట్లు లేదా 0.27 శాతం తగ్గి 77,094.79 వద్ద ప్రారంభించింది.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.24 శాతం, 0.64 శాతం పెరిగాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 639.42 పాయింట్లు లేదా 0.83 శాతం లాభంతో 77,303.63 వద్ద, నిఫ్టీ 194.75 పాయింట్లు లేదా 0.81 శాతం లాభంతో 24,092.70 వద్ద నిలిచాయి.ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, కోహాన్స్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్‌కాన్ లిమిటెడ్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్, తాన్లా ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏబీ కాట్స్పిన్ ఇండియా లిమిటెడ్, బి&ఎ లిమిటెడ్, వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్, కంచి కర్పూరం లిమిటెడ్ వంటివి నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్లోకి దూసుకొస్తున్న ‘జెన్-జీ’
గతంలో స్థిరమైన ఉద్యోగం, చేతినిండా సంపాదన వచ్చాక మాత్రమే భారతీయులు పెట్టుబడుల గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి జెన్-జీ యువత (Gen Z) తమ ఇరవయ్యో ఏట అడుగుపెట్టకముందే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, సిప్ (SIP)ల గురించి చర్చిస్తున్నారు.భారతీయ యువతలో ఆర్థిక అవగాహన మునుపటి కంటే గణనీయంగా పెరిగింది. సోషల్ మీడియా ప్రభావం, ఆన్లైన్ ఆర్థిక సమాచారం సులభంగా అందుబాటులోకి రావడం వల్ల పెట్టుబడి అనేది కేవలం నిపుణులకు పరిమితమైన అంశం కాకుండా, సామాన్యుల రోజువారీ సంభాషణల్లో భాగమైపోయింది. నేడు యువతకు పెట్టుబడి పెట్టడం అనేది కేవలం డబ్బు సంపాదించడమే కాదు, భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటానికి ఒక చిహ్నంగా మారుతోంది.భారీగా పెరుగుతున్న డీమాట్ ఖాతాలుపెట్టుబడి ధోరణిలో వచ్చిన ఈ భారీ మార్పునకు కోవిడ్-19 మహమ్మారి ఒక ప్రధాన చోదక శక్తిగా నిలిచింది. లాక్డౌన్ సమయంలో యువత ఆన్లైన్లో గడిపే సమయం పెరగడంతో యూట్యూబ్, పాడ్‌కాస్ట్‌లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సంక్లిష్టమైన మార్కెట్ అంశాలను సులభంగా అర్థం చేసుకున్నారు. గణాంకాల ప్రకారం, జనవరి 2023 నుండి ఆగస్టు 2024 మధ్య కాలంలోనే దేశంలో 6 కోట్లకు పైగా కొత్త డీమాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా, నేటి యువత కేవలం సాంప్రదాయ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ఫ్రీలాన్సింగ్, గిగ్ వర్క్ వంటి మార్గాల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ మిగులు ఆదాయాన్ని వారు దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ఈక్విటీలు, సిప్ (SIP)లలో మదుపు చేస్తున్నారు.మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే యువత జోరు స్పష్టంగా కనిపిస్తోంది. 2025 మధ్య నాటికి భారతదేశంలో డీమాట్ ఖాతాల సంఖ్య 20 కోట్లు దాటగా, అందులో ప్రతి నలుగురిలో ముగ్గురు 30 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. సెబీ (SEBI) 2025 సర్వే ప్రకారం, పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్న వారిలో 56 శాతం మంది జెన్-జీ యువతే ఉన్నారు. అయితే, ఈ ఉత్సాహంతో పాటు కొన్ని సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ప్రస్తుతం యువతకు సమాచారం తక్కువగా లేదు, కానీ అతిగా ఉంది. వేల సంఖ్యలో లభించే ఆన్లైన్ టిప్స్, మార్కెట్ అంచనాలలో ఏది నిజమో, ఏది ఊహాగానమో గుర్తించడం వారికి కష్టతరంగా మారుతోంది. కేవలం 30 శాతం మంది యువకులకు మాత్రమే కాంపౌండింగ్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి ప్రాథమిక సూత్రాలపై సరైన అవగాహన ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.అవగాహన అవసరం ఈ నేపథ్యంలో, యువత కేవలం ఉత్సాహంతో కాకుండా సరైన అవగాహనతో పెట్టుబడులు పెట్టడం అత్యవసరం. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారానికి లోనుకాకుండా ఉండటానికి క్రమబద్ధమైన ఆర్థిక విద్యా కార్యక్రమాలు (Structured Learning) అవసరం. ప్రస్తుతం మార్కెట్ సిమ్యులేషన్స్, మెంటార్షిప్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ల ద్వారా యువతకు వాస్తవ మార్కెట్ పరిస్థితులపై శిక్షణ ఇచ్చే ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కేవలం త్వరితగతిన లాభాలు ఆర్జించడం కాకుండా, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాట్లను పెంపొందించుకున్నప్పుడే భారత పెట్టుబడి రంగం సుస్థిరమైన భవిష్యత్తును కలిగి ఉంటుంది. యువత ఎంత మంది మార్కెట్లోకి వస్తున్నారనే దానికంటే, వారు ఎంత అవగాహనతో వస్తున్నారనేదే ముఖ్యం.- అజయ్ లఖోటియా, స్టాక్‌గ్రో ఫౌండర్ & సీఈవో -
లాభాల్లో స్టాక్ మార్కెట్.. 24,000 దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 118 పాయింట్లు పెరిగి 24,016 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 378 పాయింట్ల లాభంతో 77,042 వద్ద ట్రేడవుతోంది.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.16 శాతం, 1.05 శాతం పెరిగాయి.రంగాల వారీగా, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫార్మా బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. ఇదిలా ఉండగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రణభారం
యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరెవరి మధ్య జరిగినా, యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. జరిగే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇరాన్‌కు, అమెరికా, ఇజ్రాయెల్‌లకు జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఉభయ పక్షాల సైనికులు సహా దాదాపు పదివేల మంది ఇప్పటికే మరణించారచమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు సహా భారీ ఆస్తినష్టం కూడా జరిగింది. అయినా, ఇది ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధంలో వినియోగిస్తున్న అధునాతన విధ్వంసక ఆయుధాలు విపరీతమైన ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా అంతులేని చేటు తెచ్చిపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల తలెత్తే విపరిణామాల గురించి ఒక విహంగ వీక్షణం...భారత్‌కు భారీ ఆర్థిక నష్టంప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అమెరికా–ఇరాన్ యుద్ధంతో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా, ఈ యుద్ధం భారత్‌లో ఆర్థిక భూకంపాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్లో మదుపరుల సొమ్ము ఏకంగా రూ. 41 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.89 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 93.30 మేరకు పడిపోయింది. రూపాయి విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిల్వల నుంచి దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇక ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు పైబడటంతో భారత్ ప్రతినెలా దిగుమతి బిల్లు వేలాది కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ‘ఇంధన’ సెగ భారత్‌నూ తాకుతోంది. దీనివల్ల వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి పర్యవసానంగా నిత్యావసరాల ధరలూ పెరిగి, సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.భారత్‌పై యుద్ధ ప్రభావం⇒ డాలర్‌తో రూపాయి విలువ పతనం రూ. 93.30⇒ రిజర్వ్ బ్యాంకు నిల్వల నుంచి ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లు⇒ స్టాక్ మార్కెట్ నష్టాలు రూ. 41.00 లక్షల కోట్లుఅమెరికా, ఇజ్రాయెల్‌ల సైనిక ఖర్చుయుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా ఏకంగా రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు చేసింది. యుద్ధం ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు పడిన భారం దాదాపు రూ.17.4 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాన్‌పై దాడుల కోసం ఇజ్రాయెల్ వారానికి సగటున రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున రూ. 7,500 కోట్లు, ఇజ్రాయెల్ రోజువారీగా సగటున రూ. 2,700 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచానికి ఆర్థిక విఘాతంప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఆర్థిక విఘాతం తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా ఈ ఏడాది పలు దేశాల స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) గణనీయమైన నష్టం వాటిల్లనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా అంచనాల ప్రకారం యుద్ధం వల్ల ఇరాన్ జీడీపీకి అత్య«ధికంగా సుమారు 20%–25% మేరకు నష్టం వాటిల్లనుంది. ఇజ్రాయెల్ జీడీపీకి సుమారు 5%, అమెరికా జీడీపీకి 1.2% నష్టం కలగనుంది. యుద్ధంతో సంబంధం లేకున్నా, దీని ప్రభావం భారత్ జీడీపీని 1.1% మేరకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.‘నాటో’ దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్నా, చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా ‘నాటో’ దేశాల జీడీపీ 0.5% నుంచి 2% మేరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల యూరోపియన్ యూనియన్ సహా ‘నాటో’ దేశాలు రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి. రష్యాతో తెగతెంపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇంధన ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగేటట్లయితే, యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేని దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. యుద్ధం ఫలితంగా పలు దేశాలలో వృద్ధి గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ధరల పెరుగుదల ఎక్కువై ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితుల్లో ఉత్పాదకత, ఉపాధి కుంటుపడతాయి. ఫలితంగా చాలా దేశాల్లో సామాన్యులపై పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయి.విధ్వంసకరమైన ఆయుధాలుఅమెరికా–ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఈ యుద్ధంలో విధ్వంసకరమైన ఆయుధాలతో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు వినియోగించిన ఆయుధాలు అత్యంత ఖరీదైనవి, అధునాతనమైనవి. ఈ ఆయుధాలు ఎంత ఖరీదైనవో, ఇవి సృష్టించే విధ్వంసం వల్ల సంభవించే నష్టం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉభయ పక్షాలూ ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్న ప్రధానమైన ఆయుధాల వివరాలుఎఫ్ 35 లైటెనింగ్–2 విమానంరాడార్లకు చిక్కకుండా లక్ష్యాలపై బాంబులను జారవిడవగల యుద్ధవిమానం ఇది. ఈ విమానాలను అమెరికా పదుల సంఖ్యలోనే ఇరాన్‌పై దాడుల కోసం రంగంలోకి దించింది. ఇరాన్ క్షిపణుల దెబ్బకు ఇప్పటి వరకు ఎఫ్35 లైటెనింగ్ విమానాలు రెండు నేలకూలాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.960 కోట్లు.లూకాస్ డ్రోన్లుశత్రు స్థావరాల మీద దాడుల కోసం రూపొందించిన డ్రోన్ ఇది. తక్కువ ఖరీదు చేసే ఈ డ్రోన్లను అమెరికా బలగాలు ఇరాన్‌పై దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.32 లక్షలు.టొమాహాక్ క్రూజ్ మిసైల్స్దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగిన క్షిపణి ఇది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అమెరికా బలగాలు దాదాపు 850 టొమాహాక్ క్షిపణులను ఉపయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.23 కోట్లు.ఎస్ఎం3 ఇంటర్‌సెప్టర్ క్షిపణులుశత్రువుల క్షిపణులను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయడానికి రూపొందించిన శక్తిమంతమైన ఆయుధం ఇది. ఇరాన్‌పై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు అమెరికా బలగాలు దాదాపు వంద వరకు ఈ క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ. 116 కోట్లు.యారో–3ఇది శక్తిమంతమైన ఇంటర్‌సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 100 కిలోమీటర్ల ఎత్తులోనే నాశనం చేయగల సామర్థ్యం గల అధునాతన ఆయుధం ఇది. ఇరాన్‌పై జరుగుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు 35 వరకు యారో–3 క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.33 కోట్లు.ఐరన్ డోమ్ఇది కూడా ఇంటర్‌సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 70 కిలోమీటర్ల దూరంలోనే పడగొట్టగల సామర్థ్యం గల ఆయుధం ఇది. ఇరాన్‌పై దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఐరన్ డోమ్ క్షిపణులను ఇప్పటి వరకు వందల సంఖ్యలోనే ప్రయోగించినట్లు సమాచారం. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.42 లక్షలు.ఫతా–2ధ్వని వేగాన్ని మించిన వేగంతో దూసుకుపోయి, సుమారు 1500 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. దీని ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.93 లక్షలు.ఖైబర్ షెకాన్ఇది దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. అమెరికా బలగాలు ‘ఆపరేషన్ ఫ్యూరీ’ మొదలుపెట్టిన తర్వాత ఇరాన్ బలగాలు దాదాపు 180 వరకు ఖైబర్ షెకాన్ క్షిపణులను ప్రయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.35 కోట్లు.షాహెద్–136 డ్రోన్లుశత్రు స్థావరాలపై దాడుల కోసం తక్కువ ఖరీదుతో రూపొందించిన డ్రోన్లు ఇవి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు రెండువేల వరకు ఈ డ్రోన్లను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.27 లక్షలు.ప్రపంచ దేశాలకు ఇక్కట్లుఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాలకు అనేక ప్రతికూల ఫలితాలు తప్పవని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి దొరికితే చాలా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ముడి చమురు ధరలు మరో ముప్పయి శాతం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంతర్జాతీయ నిపుణుల అంచనా. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు గడ్డు పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పలు దేశాల జీడీపీ వృద్ధి తిరోగమనం చెందవచ్చని కూడా చెబుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్‌తో పాటు పశ్చిమాసియా దేశాలకు తీవ్ర నష్టం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పర దాడుల్లో ఇరాన్ సరిహద్దుల్లోని సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలలో భారీ నిర్మాణాలకు ముప్పుతో పాటు, తీవ్ర జననష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయి.చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడి పశ్చిమాసియా దేశాలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పశ్చిమాసియాలో ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. పశ్చిమాసియాకు వెలుపల చమురు ఉత్పాదనలో కీలకమైన రష్యా తనతో సానుకూల సంబంధాలు కలిగిన దేశాల చమురు లోటు తీర్చడానికి ముందుకు వచ్చి, బలమైన కూటమిని ఏర్పాటు చేసుకునే సూచనలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే! -
భారీ నష్టాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్
-
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 982.71 పాయింట్లు లేదా 1.27 శాతం నష్టంతో 76,681.29 వద్ద.. నిఫ్టీ 275.10 పాయింట్లు లేదా 1.14 శాతం నష్టంతో 23,897.95 వద్ద నిలిచాయి.ఇమామి రియల్టీ లిమిటెడ్, ఖైతాన్ (ఇండియా) లిమిటెడ్, కంచి కర్పూరం లిమిటెడ్, శేఖావతి ఇండస్ట్రీస్ లిమిటెడ్ , మాస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్, ఏబీ కాట్స్పిన్ ఇండియా లిమిటెడ్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లిమిటెడ్, ఖైతాన్ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:05 సమయానికి నిఫ్టీ(Nifty) 176 పాయింట్లు తగ్గి 23,994 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 671 పాయింట్లు నష్టపోయి 76,984 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.88బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 105.94 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.33 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.41 శాతం తగ్గింది.నాస్డాక్ 0.89 శాతం దిగజారింది.Today Nifty position 24-04-2026(time: 10:05 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. డీలా పడ్డ బ్యాంక్ షేర్లు!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 852.49 పాయింట్లు లేదా 1.09 శాతం నష్టంతో 77,664.00 వద్ద, నిఫ్టీ 219.60 పాయింట్లు లేదా 0.90 శాతం నష్టంతో 24,158.50 వద్ద నిలిచాయి.డెల్టా కార్ప్ లిమిటెడ్, డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జోడియాక్ ఎనర్జీ లిమిటెడ్, మాస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్, డంగీ డమ్స్ లిమిటెడ్, సర్లా పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 137 పాయింట్లు తగ్గి 24,241 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 546 పాయింట్లు నష్టపోయి 77,974 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.69బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 103.44 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.05 శాతం పెరిగింది.నాస్డాక్ 1.64 శాతం పుంజుకుంది.Today Nifty position 23-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భగ్గుమన్న పశ్చిమాసియా
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న సానుకూల ధోరణికి బ్రేక్ వేస్తూ బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. నేటి ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 756 పాయింట్లు పతనమై 78,516 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 24,378 వద్ద ముగిసింది.విశ్లేషకుల అంచనా ప్రకారం పతనానికి కారణాలుముదురుతున్న అనిశ్చితిపశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ ప్రతిచర్యల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూతపడటం చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మార్గం గుండానే ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతుంది. తాజా దాడుల వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన నింపడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు.చమురు ధరల సెగ - ద్రవ్యోల్బణ ముప్పుయుద్ధం కారణంగా ఇటీవల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును దాటడం భారత్ వంటి దిగుమతి దేశాలకు పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తాజా గణాంకాల ప్రకారం, మార్చి నెలలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా 3.3% కి పెరగడం, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉండటం మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.వడ్డీ రేట్ల తగ్గింపుపై సందేహాలుద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్న ఆశలు ఆవిరయ్యాయి. ‘వడ్డీ రేట్లు తగ్గకపోగా, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బ్యాంకులు మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది’ అనే వార్తలు టెక్నాలజీ, బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలకు దారితీశాయి.ఇప్పుడేం చేయాలి?ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ తీవ్రమైన ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ పరిణామాలు, ముడిచమురు ధరల కదలికలను బట్టి రానున్న రోజుల్లో మార్కెట్ దిశ నిర్దేశించబడుతుంది. చిన్న ఇన్వెస్టర్లు తొందరపడి అమ్మకాలు జరపకుండా నాణ్యమైన షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించడం ఉత్తమం.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఐటీ షేర్లు విలవిల
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. మంగళవారం అమెరికా, ఇరాన్ మధ్య కుదురుతుందనుకున్న ఒప్పందం విఫలం కావడంతో భౌగోళిక రాజకీయ పరిస్థితులపై మదుపర్లలో ఆందోళన చెలరేగింది. దీంతో భారతీయ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ పడిపోయాయి.ఈరోజు ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 150 పాయింట్లు పడిపోయి 24,426 వద్ద, సెన్సెక్స్(Sensex) 591 పాయింట్లు క్షీణించి 78,681 వద్ద ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ లో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ట్రెంట్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ఉన్నాయి.విస్తృత మార్కెట్లు మిశ్రమ గమనికతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.20 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.30 శాతం నష్టపోయాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ అత్యంత క్షీణించింది. నిఫ్టీ హెల్త్‌కేర్, నిఫ్టీ ఫార్మా కూడా తక్కువ పనితీరు కనబరిచాయి. ఇదిలా ఉండగా, నిఫ్టీ కన్స్ట్రక్షన్ డ్యూరబుల్, నిఫ్టీ మెటల్ మెరుగైన పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
మంగళవారం ఉదయం శుభారంభం పలికిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 753.03 పాయింట్లు లేదా 0.96 శాతం లాభంతో 79,273.33 వద్ద, నిఫ్టీ 211.75 పాయింట్లు లేదా 0.87 శాతం లాభంతో 24,576.60 వద్ద నిలిచాయి.శ్యామ్ టెలికాం లిమిటెడ్, ఏస్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, మనాక్సియా స్టీల్స్ లిమిటెడ్, వైశాలి ఫార్మా లిమిటెడ్, రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పశుపతి కాట్స్పిన్ లిమిటెడ్, సైబర్ మీడియా (ఇండియా) లిమిటెడ్, తంబోలి ఇండస్ట్రీస్ లిమిటెడ్, అక్షిత కాటన్ లిమిటెడ్, సోలార్‌వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 94 పాయింట్లు పెరిగి 24,462 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 351 పాయింట్లు ఎగబాకి 78,872 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.13బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 95.06 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.24 శాతం తగ్గింది.నాస్డాక్ 0.26 శాతం నష్టపోయింది.Today Nifty position 21-04-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!
పెట్టుబడి ప్రపంచంలో 'లెజెండ్'గా పేరొందిన వారెన్ బఫెట్.. కేవలం 11 ఏళ్ల వయస్సులో మూడు షేర్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నేడు రూ. 11 లక్షల కోట్లకు పైగా సంపదతో ప్రపంచ కుబేరులలో ఒకరిగా నిలిచారు. మరి అతి తక్కువ డబ్బుతో పెట్టుబడి మొదలుపెట్టేవారికి ఆయన ఇచ్చే సలహాలేంటి? సామాన్యులు కూడా బఫెట్ రూట్ లో సంపదను ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం.చిన్న మొత్తంతోనే శ్రీకారం చుట్టండిచాలామంది తమ దగ్గర లక్షలాది రూపాయలు ఉంటేనే షేర్ మార్కెట్లోకి రావాలని అనుకుంటారు. కానీ బఫెట్ దృష్టిలో ఇది తప్పు. మీ దగ్గర రూ. 500 లేదా రూ. 1000 ఉన్నా సరే, పెట్టుబడిని తక్షణమే ప్రారంభించాలి. "సమయం మీ వైపు ఉంటే, చిన్న మొత్తమే భవిష్యత్తులో కొండంత సంపదగా మారుతుంది" అని ఆయన పదే పదే చెబుతుంటారు.ఇండెక్స్ ఫండ్స్: సామాన్యుల ఆయుధంఏ షేర్ కొనాలి? ఏ కంపెనీ బాగుంటుంది? అన్న అవగాహన లేని వారికి బఫెట్ సూచించే ఉత్తమ మార్గం 'లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్'. కంపెనీలను విశ్లేషించే సమయం, నైపుణ్యం లేని వారికి ఇవి అత్యంత సురక్షితమైనవని ఆయన నమ్ముతారు. అమెరికాలో S&P 500 లాగా, భారత్‌లో నిఫ్టీ 50 (Nifty 50) వంటి ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములు కావచ్చు.తెలివితేటలే అసలైన పెట్టుబడితెలివితేటలే అసలైన పెట్టుబడి అని వారెన్ బఫెట్ నమ్ముతారు. అందుకే జ్ఞానం కోసం అనే పుస్తకాలు ఆయన తిరగేస్తుంటారు. ఇప్పటికీ రోజుకు కనీసం 500 పేజీలు చదువుతారు. "అన్నింటికంటే ఉత్తమమైన పెట్టుబడి మీ జ్ఞానం మీద పెట్టేదే" అని ఆయన అంటారు. పెట్టుబడులు పెట్టేవారు కంపెనీల వార్షిక నివేదికలు చదవడం అలవాటు చేసుకోవాలి. వ్యాపార నమూనాలను అర్థం చేసుకోవాలి. బెంజమిన్ గ్రాహం రాసిన 'ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' వంటి పుస్తకాలు చదవాలని ఆయన సూచిస్తుంటారు.కాంపౌండింగ్ మాయాజాలంబఫెట్ సంపదలో 90 శాతం ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాతే వచ్చింది. దీనికి కారణం 'చక్రవడ్డీ' (Compounding). మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెట్టి, దాన్ని ఎంత కాలం కొనసాగిస్తారో, మీ డబ్బు అంత వేగంగా రెట్టింపు అవుతుంది. అందుకే "పెట్టుబడి పెట్టడానికి నిన్నటి కంటే ఈరోజే సరైన సమయం" అని ఆయన చెబుతారు.కేవలం ఎఫ్డీ(FD)లు, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు దాచుకుంటే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. ధనవంతులు కావాలంటే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనివార్యమని బఫెట్ సిద్ధాంతం చెబుతోంది. తప్పులు చేయడం సహజం, కానీ వాటి నుండి నేర్చుకుని క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే ఎవరైనా ‘కోటీశ్వరులు’ కావచ్చని బఫెట్ సూత్రం నిరూపిస్తోంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 58.42 పాయింట్లు లేదా 0.074 శాతం నష్టంలో 78,435.12 వద్ద, నిఫ్టీ 26.90 పాయింట్లు లేదా 0.11 శాతం వద్ద 24,326.65 వద్ద నిలిచింది.అరిహంత్ ఫౌండేషన్స్ & హౌసింగ్ లిమిటెడ్, బట్లిబోయ్ లిమిటెడ్, రాజపాలయం మిల్స్ లిమిటెడ్, సికాజెన్ ఇండియా లిమిటెడ్, కోవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్రావెయిల్ అండ్ వెయిల్ (ఇండియా) లిమిటెడ్, గుడ్ఇయర్ ఇండియా లిమిటెడ్, ఇషాన్ డైస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్, శ్రీ రామ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఇన్వెస్టర్లకు కాసుల పంట.. లక్షకు 13 లక్షలు సంపాదించిపెట్టిన స్టాక్..
-
ఫ్లాట్‌గా కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు తగ్గి 24,352 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 79 పాయింట్లు ఎగబాకి 78,569 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.28బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 95.38 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.26 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.2 శాతం పెరిగింది.నాస్డాక్ 1.52 శాతం పుంజుకుంది.Today Nifty position 20-04-2026(time: 9:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆల్కా అదిరిపోయే ఆఫర్ 100 షేర్లు కొంటే 600షేర్లు ఫ్రీ
-
ఆ ఆశలతోనే.. ఎగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మంచి లాభాల్లో ముగిశాయి. వారాంతాల్లో జరగనున్న యూఎస్-ఇరాన్ చర్చల కోసం ట్రేడర్లు సిద్ధమవడంతో భారత బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 504.86 పాయింట్లు లేదా 0.65 శాతం పెరిగి 78,493.54 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 156.8 పాయింట్లు లేదా 0.65 శాతం పెరిగి 24,353.55 వద్ద ముగిసింది.హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.27 శాతం, 1.48 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ మీడియా మెరుగైన పనితీరు కనబరిచాయి.ఇరాన్ తో యుద్ధం త్వరలో ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. లెబనాన్, ఇజ్రాయెల్ 10 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన గురువారం ప్రకటించారు. లెబనాన్ పై దాడిని ఆపడం ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడానికి ఇరాన్ నుండి వచ్చిన ముఖ్య షరతులలో ఒకటి అని నివేదికలు తెలిపాయి. అమెరికా, ఇరాన్ ఈ వారాంతంలో చర్చల కోసం సమావేశమవుతున్నాయి. -
ఊగిసలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 14 పాయింట్లు పెరిగి 24,211 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 101 పాయింట్లు ఎగబాకి 78,085 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.25బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 98.15 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరిగింది.నాస్డాక్ 0.36 శాతం పుంజుకుంది.Today Nifty position 17-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. పడిపోయిన బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బ్యాంక్, ఆటో షేర్లకు అమ్మకాల ఒత్తిడితో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు తమ గరిష్టాలను కోల్పోయాయి.బీఎస్ ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 122.56 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టపోయి 77,988.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 34.55 పాయింట్లు లేదా 0.14 శాతం క్షీణించి 24,196.75 వద్ద ముగిసింది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో హెచ్డీఎఫ్ సీ బ్యాంక్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్ సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.63 శాతం, 0.83 శాతం పెరిగాయి.రంగాల వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ మెరుగైన పనితీరు కనబరిచగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్ లూజర్స్ గా ఉద్భవించాయి. -
ప్రపంచ యుద్ధ భయం.. కానీ స్టాక్ మార్కెట్లు ధ రికార్డులే కొడుతున్నాయి
-
లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు పెరిగి 24,303 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 242 పాయింట్లు ఎగబాకి 78,356 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.93బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 94.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.8 శాతం పెరిగింది.నాస్డాక్ 1.59 శాతం పుంజుకుంది.Today Nifty position 16-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్ తో యుద్ధం ముగియబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తరువాత నిఫ్టీ 50, సెన్సెక్స్ భారీగా ఎగిశాయి.నిఫ్టీ 1.63 శాతం లేదా 388.65 పాయింట్ల లాభంతో 24,231.30 వద్ద, సెన్సెక్స్ 1.64 శాతం లేదా 1,264 పాయింట్లు పెరిగి 78,111.24 వద్ద ముగిశాయి.ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.20 శాతం, 2.35 శాతం పెరిగాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ కన్స్ట్రక్షన్ డ్యూరబుల్ టాప్ గెయినర్‌గా నిలిచింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ తక్కువ పనితీరు కనబరిచింది. -
నేడు అంబేద్కర్ జయంతి: ఏవి ఓపెన్? ఏవి క్లోజ్?
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు (ఏప్రిల్ 14, 2026) దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిటెడ్ హాలిడే ప్రకటించింది. దీనితో దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, కీలకమైన ఆర్థిక సంస్థల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అయితే ఈ రోజు ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లే ముందు, ఏ సేవలు అందుబాటులో ఉంటాయి? ఏవి మూతపడతాయో తెలుసుకోవడం అత్యంత అవసరం..విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవుదేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఈ రోజు మూతపడతాయి. అలాగే దాదాపు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సైతం సాధారణ సెలవు వర్తిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ పరిపాలనా సేవలకు నేడు అంతరాయం కలగనుంది. ప్రైవేట్ ఆఫీసులు, ఐటీ కంపెనీలు మాత్రం వారి అంతర్గత నిబంధనల మేరకు పనిచేస్తాయి. అలాగే రిటైల్ దుకాణాలు, చిన్న వ్యాపారాలు యధావిధిగా కొనసాగుతాయి.బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు బంద్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం నేడు బ్యాంకులకు సెలవు. బ్రాంచ్‌లలో నగదు డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్ వంటి సేవలు ఉండవు. కానీ మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ , ఏటీఎంలు వంటి డిజిటల్ సేవలు యధావిధిగా పనిచేస్తాయి. మరోవైపు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లలో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోనున్నది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ఉదయం పూట మూసివేసి, కేవలం సాయంత్రం సెషన్‌కు మాత్రమే తెరుచుకుంటుంది.వీటికి ఎలాంటి ఆటంకం లేదుప్రభుత్వ సేవలు, బ్యాంకులు మూతపడినప్పటికీ, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా అత్యవసర సేవలైన ఆసుపత్రులు, మందుల దుకాణాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పటిలాగే తెరచివుంటాయి. మరోవైపు ఏప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరాది, బోహాగ్ బిహు వంటి పలు ప్రాంతీయ పండుగలు కూడా జరుపుకుంటుండటంతో చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అన్నీ పనిచేస్తుండటంతో, అత్యవసర ఆర్థిక లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.ఇది కూడా చదవండి: ‘బాలెన్’ మార్క్: ప్రధాని మోదీతో దోస్తీ.. నేపాల్ వ్యవస్థకు సర్జరీ! -
స్టాక్‌మార్కెట్ అలర్ట్: నాలుగు రోజులే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు, ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక. ఈ వారం సెలవుల కారణంగా ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 19 మధ్య ట్రేడింగ్ కేవలం నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి, వారాంతపు సెలవుల సందర్భంగా మూడు రోజులు మార్కెట్లకు సెలవు ఉంటుంది.మార్కెట్ సెలవుల వివరాలుఏప్రిల్ 14 (మంగళవారం) అంబేడ్కర్ జయంతి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) పూర్తిగా మూసిఉంటాయి. అలాగే వారాంతపు సెలవులైన ఏప్రిల్ 18 (శనివారం), ఏప్రిల్ 19 (ఆదివారం) మార్కెట్లు యధావిధిగా పనిచేయవు. మంగళవారం విరామం తర్వాత, ఏప్రిల్ 15 (బుధవారం) ఉదయం నుండి ట్రేడింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.ఈ విభాగాల మూసివేతఅంబేడ్కర్ జయంతి నాడు కేవలం ఈక్విటీ మార్కెట్ మాత్రమే కాకుండా.. డెరివేటివ్స్, కరెన్సీ, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O), ఫారెక్స్ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్లలో కూడా క్రయవిక్రయాలు నిలిచిపోతాయి. అలాగే సీడీఎస్ఎల్, ఎన్‌ఎస్‌డీఎల్‌లకు కూడా సెటిల్మెంట్ హాలిడే కావడంతో లావాదేవీల క్లియరెన్స్‌లో జాప్యం ఉండవచ్చు.కమోడిటీ మార్కెట్మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ట్రేడింగ్ చేసే వారికి కొంత ఊరట లభించనుంది. ఇక్కడ మార్కెట్ పూర్తిగా మూసిఉండదు. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:45 వరకు ట్రేడింగ్ ఉండదు. ఈ సమయంలో బంగారం, వెండి, ముడిచమురు వంటి లోహాల వ్యాపారం నిలిచిపోతుంది. సాయంత్రం 5:30 గంటల నుండి ట్రేడింగ్ యధావిధిగా కొనసాగుతుంది. -
మార్కెట్‌కు మళ్లీ ‘పశ్చిమాసియా’ సెగ?
ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశి్చమాసియా మళ్లీ భగ్గుమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి డీల్ కుదరకుండానే ఇరు పక్షాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో మార్కెట్ సెంటిమెంట్‌పై దీని ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దాడులు మొదలై హార్మూజ్ జలసంధిలో తిరిగి ఇరాన్ అడ్డంకులు సృష్టిస్తే.. క్రూడ్ ధరలు దూసుకెళ్లడంతో పాటు దీని సెగ మార్కెట్‌కు గట్టిగానే తగలవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం (14న) మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్పశ్చిమాసియాలో చోటుచేసుకునే కీలక పరిణామాలకు తోడు క్రూడ్ ధరల కదలికలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. ఇరాన్–అమెరికా మధ్య సీజ్ఫైర్... శాంతి ఒప్పందంపై ఆశలతో గతవారం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు రివ్వుమన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రూడ్ 100 డాలర్ల కిందికి జారడంతో సూచీలకు బూస్ట్ లభించింది. అణు కార్యకలాపాలకు స్వస్తి చెప్పేందుకు ఇరాన్ ససేమిరా అనడంతో చర్చలు విఫలయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపించగా.. యూఎస్ అలవికాని డిమాండ్లే డీల్ కుదరకపోవడానికి కారణమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, దౌత్య ప్రయత్నాలు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ పేర్కొనడం విశేషం.చర్చలు విఫలమైన నేపథ్యంలో సమీపకాలానికి మార్కెట్ ముఖచిత్రం మళ్లీ మారిపోయే అవకాశం ఉందని లివ్‌లాంగ్ వెల్త్ రీసెర్చ్ ఎనలిస్ట్ హరిప్రసాద్ కె అభిప్రాయపడ్డారు. ’నిఫ్టీ శరవేగంగా తిరిగి 24,000 స్థాయిని అధిగమించిన నేపథ్యంలో సూచీకి ఈ వారం చాలా కీలకంగా మారనుంది. అయితే, ఇరాన్–అమెరికా శాంతి చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో మళ్లీ మార్కెట్లలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. సోమవారం సూచీలు భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తాజా సీజ్ఫైర్ ర్యాలీలో ఆర్జించిన లాభాలు చాలా వరకు ఆవిరయ్యే ప్రమాదం నెలకొంది’ అని ఆయన పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం డేటా.. ఈ వారంలో విడుదలయ్యే ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.. మార్చి నెల రిటైల్ ద్రవ్యోల్బణం డేటా ఏప్రిల్ 13న, టోకు ధరల ద్రవ్యోల్బణం 14న వస్తుంది. ఆహార ధరల మంటతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.21 శాతానికి ఎగబాకగా.. టోకు ద్రవ్యోల్బణం 11 నెలల గరిష్ట స్థాయి అయిన 2.13 శాతానికి చేరింది. రానున్న కాలంలో ఆర్బీఐ పాలసీ నిర్ణయంలో ద్రవ్యోల్బణం గణాంకాలు కీలక పాత్ర పోషించనున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఈ డేటాపై మరింత ఫోకస్ చేయనున్నారు.ఫలితాలపై దృష్టి... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025–26, క్యూ4) ఫలితాల సీజన్‌ను గతవారంలో టీసీఎస్ బోణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వారం విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీల ఫలితాలు వెలువడనున్నాయి. క్యూ4తో పాటు విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా మార్కెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయని మిశ్రా పేర్కొన్నారు.సాంకేతికంగా చూస్తే... ఇరాన్–అమెరికా చర్చలు విఫలం కావడంతో మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 23,700 వద్ద తొలి మద్దతు లభించచ్చని.. ఆ స్థాయిని కోల్పోతే 23,500 మద్దతు కీలకమని మార్కెట్నిపుణులు చెబుతున్నారు. ఇక సూచీ గనుక పెరిగితే 24,100 వద్ద తొలి నిరోధం, ఆపై 24,300 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉందనేది వారి విశ్లేషణ.గత వారమిలా...ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పుంజుకోవడం, రూపాయి బలోపేతం, క్రూడ్ ధరలు శాంతించడం వంటి పరిణామాలతో దేశీ మార్కెట్లు కూడా భారీగా కోలుకున్నాయి. గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 4,231 పాయింట్లు (5.77%) దూసుకెళ్లగా.. ఎస్ఎస్ఈ నిఫ్టీ 1,338 పాయింట్లు (5.88%) ఎగబాకింది.విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల బాట... దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) తిరోగమనం కొనసాగుతోంది. ఈ నెల తొలి 10 రోజుల్లో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.48,213 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం దీనికి నిదర్శనం. ఫిబ్రవరిలో రూ.22,615 కోట్ల నికర పెట్టుబడుల అనంతరం, మార్చిలో రికార్డు స్థాయిలో రూ. 1.17 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌పీఐలు అమ్మేసిన సంగతి తెలిసిందే. దీంతో 2026లో ఇప్పటిదాకా మొత్తం రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను వారు ఉపసంహరించుకున్నారు.పశ్చిమాసియా సంక్షోభం తర్వాత మార్కెట్ భారీ పతనానికి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలే కీలకంగా నిలిచాయి. ‘పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్ ధరలు భగ్గుమనడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం రిస్కులు తీవ్రమయ్యాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు స్థూల ఆర్థిక ప్రతికూలతలు ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలకు పురిగొల్పుతున్నాయి’ అని మార్నింగ్ స్టార్ రీసెర్చ్ ఇండియాకు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 918.60 పాయింట్లు లేదా 1.20 శాతం లాభంతో 77,550.25 వద్ద, నిఫ్టీ 275.50 పాయింట్లు లేదా 1.16 శాతం లాభంతో 24,050.60 వద్ద నిలిచాయి.డీపీ వైర్స్ లిమిటెడ్, గ్లోటిస్ లిమిటెడ్, ఆర్ట్ నిర్మాణ్ లిమిటెడ్, హింద్ రెక్టిఫయర్స్ లిమిటెడ్, అట్లాస్ సైకిల్స్ (హర్యానా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇన్వెంచర్ గ్రోత్ & సెక్యూరిటీస్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, శేషాసాయి టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
450 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 151 పాయింట్లు పెరిగి 23,926 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 458 పాయింట్లు ఎగబాకి 77,122 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.89బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 96.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.62 శాతం పెరిగింది.నాస్డాక్ 0.83 శాతం పుంజుకుంది.Today Nifty position 10-04-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 931.25 పాయింట్లు లేదా 1.20 శాతం నష్టంతో 76,631.65 వద్ద, నిఫ్టీ 222.25 పాయింట్లు లేదా 0.93 శాతం నష్టంతో 23,775.10 వద్ద నిలిచాయి.ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, ప్రీతి ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అక్షర్ స్పిన్టెక్స్ లిమిటెడ్, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, వర్వీ గ్లోబల్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, రుషిల్ డెకార్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్వల్ప నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 25 పాయింట్లు తగ్గి 23,970 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 172 పాయింట్లు నష్టపోయి 77,393 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 96.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 2.51 శాతం పెరిగింది.నాస్డాక్ 2.8 శాతం పుంజుకుంది.Today Nifty position 09-04-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
-
కాసుల వర్షం: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథ స్థితిని కొనసాగించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఐదు రోజుల లాభాల పరంపరను నమోదు చేశాయి.నిఫ్టీ 3.78 శాతం లేదా 873.70 పాయింట్ల లాభంతో 23,997.35 వద్ద, సెన్సెక్స్ 3.95 శాతం లేదా 2,946.32 పెరిగి 77,562.90 వద్ద ముగిశాయి.ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (Market Capitalization) రూ. 16.59 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 446 లక్షల కోట్ల మార్కును చేరుకుంది.శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ గెయినర్లుగా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 4.03 శాతం, 4.39 శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా.. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో సహచర రంగాలను అధిగమించాయి. అదే సమయంలో నిఫ్టీ ఐటీ తక్కువ లాభాలతో తక్కువ పనితీరు కనబరిచింది.ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఏప్రిల్ సమీక్షలో బెంచ్‌మార్క్ పాలసీ రెపో రేటును 5.25 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. పర్యవసానంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డిఎఫ్) రేటు కూడా వరుసగా 5 శాతం, 5.5 శాతం వద్ద మారలేదు. -
లక్షను 26 లక్షలు చేసింది.. ఐదేళ్లలో కాసుల పంట పండించిన స్టాక్..!
-
బుల్‌రన్.. 2600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 761 పాయింట్లు పెరిగి 23,890 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 2602 పాయింట్లు ఎగబాకి 77,198 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.9బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 94 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.08 శాతం పెరిగింది.నాస్డాక్ 0.1 శాతం పుంజుకుంది.Today Nifty position 08-04-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 509.73 పాయింట్ల లాభంతో 74,616.58 వద్ద, నిఫ్టీ 155.40 పాయింట్ల లాభంతో 23,123.65 వద్ద నిలిచింది.ఆల్కలీ మెటల్స్ లిమిటెడ్, ఆల్ఫాజియో (ఇండియా) లిమిటెడ్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఉమా ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ల్యాండ్‌మార్క్ ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రాజ్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్, అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్‌పోర్ట్స్) లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ట్రంప్ డెడ్ లైన్ ఎఫెక్ట్.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
-
ఐదేళ్లలో లక్షకు 12 లక్షలొచ్చాయ్.. ఇప్పుడు 100 కొంటే 1000 షేర్లు FREE
-
500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 149 పాయింట్లు నష్టపోయి 22,819 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 505 పాయింట్లు దిగజారి 73,694 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.11బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 111 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.44 శాతం పెరిగింది.నాస్డాక్ 0.54 శాతం పుంజుకుంది.Today Nifty position 07-04-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
-
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 787.30 పాయింట్లు లేదా 1.07 శాతం లాభంతో 74,106.85 వద్ద, నిఫ్టీ 255.15 పాయింట్లు లేదా 1.12 శాతం లాభంతో 22,968.25 వద్ద నిలిచింది.అల్పా లాబొరేటరీస్ లిమిటెడ్, STL గ్లోబల్ లిమిటెడ్, బ్రూక్స్ లాబొరేటరీస్ లిమిటెడ్, క్రెబ్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆర్కేఈసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏషియన్ హోటల్స్ (వెస్ట్) లిమిటెడ్, రాజ్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్, అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్పోర్ట్) లిమిటెడ్, హరియోమ్ పైప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గీకే వైర్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 22,707 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 89 పాయింట్లు దిగజారి 73,226 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.15బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 109.84 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.11 శాతం పెరిగింది.నాస్డాక్ 0.18 శాతం పుంజుకుంది.Today Nifty position 06-04-2026(time: 9:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
త్వరలో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవాహం!
ముంబై: నకిలీ అప్లికేషన్లు(యాప్స్)తో స్టాక్ మార్కెట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. దీంతో మదుపరుల రక్షణార్థం గూగుల్, మెటా తదితర టెక్నాలజీ దిగ్గజాలు ఆర్థిక నియంత్రణ సంస్థలతో కలసి పనిచేయాలని సూచించారు.త్వరలోనే మరోసారి స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవాహానికి వీలున్నట్లు అంచనా వేశారు. వెరసి మార్కెట్లో వాటాదారులందరికీ రక్షణ కల్పింపంచవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా యూనిక్ ఇన్వెస్టర్ల సంఖ్య 14 కోట్లను తాకినట్లు వెల్లడించారు. మరోపక్క మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 423 లక్షల కోట్లకు చేరినట్లు తెలియజేశారు. వెరిఫైడ్ యాప్ లేబుల్‌ను గూగుల్ ప్రవేశపెట్టిన సందర్భంగా పాండే ఈ అంశాలను ప్రస్తావించారు. -
SBI డీల్ ఎఫెక్ట్.. టాప్ గేర్ లో సాట్రిక్స్ షేర్..
-
నష్టాల నుంచి లాభాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 182.26 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 73,316.58 వద్ద, నిఫ్టీ 33.70 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 22,713.10 వద్ద నిలిచాయి.రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, ఓరియంటల్ ట్రైమెక్స్ లిమిటెడ్, బ్రూక్స్ లాబొరేటరీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్పోర్ట్) లిమిటెడ్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏవీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్, హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు
-
మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 431 పాయింట్లు నష్టపోయి 22,247 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1411 పాయింట్లు దిగజారి 71,741 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.96బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 106.41 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.72 శాతం పెరిగింది.నాస్డాక్ 1.16 శాతం పుంజుకుంది.Today Nifty position 02-04-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లు ముగిశాయిలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. యూఎస్-ఇరాన్ యుద్ధం ముగింపు వార్తల నేపథ్యంలో ఉదయం అత్యంత భారీ లాభాలలో పయనించాయి. అయితే ప్రారంభ ఉత్సాహం మసకబారడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెషన్ ద్వితీయార్ధంలో రోజు గరిష్ట స్థాయి నుండి లాభాలు క్షీణించాయయి.ముగింపు సమయానికి నిఫ్టీ 1.56 శాతం లేదా 348 పాయింట్ల లాభంతో 22,679.40 వద్ద, సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు లేదా 1.65 శాతం పెరిగి 73,134.34 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ట్రెంట్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.24 శాతం, 3.24 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ టాప్ గెయినర్‌గా ఉంది. నిఫ్టీ కెమికల్, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ ఫార్మా నష్టాల్లో నిలిచాయి. -
లక్ష పెడితే 69లక్షలొచ్చాయ్.. కాసుల వర్షం కురిపించిన స్టాక్..!
-
1850 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 567 పాయింట్లు పెరిగి 22,901 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1874 పాయింట్లు ఎగబాకి 73,833 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.83బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 105.19 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 2.91 శాతం పెరిగింది.నాస్డాక్ 3.83 శాతం పుంజుకుంది.Today Nifty position 01-04-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!
-
'వెంటపడొద్దు.. ఎక్కువ సంపాదిస్తావు': బఫెట్ ఫార్ములా
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ లాభాలు గడిస్తారని లేదా అందరూ నష్టపోతారని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే ఇన్వెస్టర్ ఎలా ఉండాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలి? అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. దీనికి ప్రపంచ దిగ్గజ మదుపరిగా ఎంతోమందికి సుపరిచితమైన 'బఫెట్' ఫార్ములా తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతున్నప్పుడు.. కొంతమంది మిస్ అవుతామేమో అనే ఆందోళనతో కొనుగోలు చేస్తుంటారు. నష్టం వస్తే అయ్యో అని బాధపడతారు. ఇలాంటి సమయంలో బఫెట్ చెప్పే మాట ఏమిటంటే.. 'ఎప్పుడూ వెంటపడొద్దు' ప్రతి అవకాశాన్ని వెంటాడాల్సిన అవసరం లేదు.ఒక కంపెనీ ఎంత గొప్పదైనా సరే, దాని షేర్ ధర చాలా ఎక్కువగా ఉంటే వెంటనే కొనకూడదు. సరైన విలువ వచ్చినప్పుడు మాత్రమే కొనాలి. ఇది పెట్టుబడిదారులకు ఓపికను, నియంత్రణను నేర్పిస్తుంది. పెట్టుబడిదారుడు ఎప్పుడూ కూడా.. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి.బఫెట్ తన తత్వాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ. బేస్‌బాల్ క్రీడాకారుడు.. బేస్‌బాల్‌లో మంచి ఫలితం పొందాలంటే సరైన బంతి కోసం ఎదురు చూడాలి. ప్రతి బంతిని కొట్టాల్సిన అవసరం లేదు. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ప్రతి స్టాక్‌ను కొనాల్సిన అవసరం లేదు.Warren Buffett’s greatest lesson: NEVER CHASE. In the market, you have time. If an exceptional company trades at insane prices, don’t buy it.Wait for an exceptional company at a reasonable price. When you find it, invest heavily. If you don’t, wait. pic.twitter.com/s2Aax4wCj6— R (@AlphaWizarDD) March 29, 2026బఫెట్ చెప్పినట్లుగా.. మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉంటాయి. కానీ మనకు అర్థమయ్యే, మంచి కంపెనీలు మాత్రమే ఎంచుకోవాలి. అవి సరైన ధరలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదైనా ఒక అవకాశం వదిలేస్తే.. మిమ్మల్ని ఎవరూ శిక్షించరు. కాబట్టి ఆలోచించాలి.ప్రతి స్టాక్ లేదా ప్రతి ట్రెండ్ గురించి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి విషయాలను బాగా అర్థం చేసుకోవడం చాలు. అదే నిజమైన విజయం తీసుకువస్తుంది. మీకు జీవితంలో కేవలం 20 సార్లు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తే.. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. తప్పులు తక్కువ చేస్తారు, మంచి అవకాశాలను మాత్రమే ఎంచుకుంటారు, దీర్ఘకాలంలో ఎక్కువ సంపాదిస్తారు అని పేర్కొన్నారు. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ కనిష్టానికి రూపాయి విలువ
-
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు లేదా 2.22 శాతం నష్టంతో 71,947.55 వద్ద, నిఫ్టీ 488.20 పాయింట్లు లేదా 2.14 శాతం నష్టంతో 22,331.40 వద్ద నిలిచాయి.హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, యారో గ్రీన్‌టెక్ లిమిటెడ్, దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నిన్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్, సెక్‌మార్క్ కన్సల్టెన్సీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వండర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఖండ్వాలా సెక్యూరిటీస్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, సూరత్వాలా బిజినెస్ గ్రూప్ లిమిటెడ్, ఓస్వాల్ ఆగ్రో మిల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.గమనిక: రేపు (మార్చి 31) మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
భారీ పతనంలో స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనంతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50, సెన్సెక్స్ గణనీయంగా క్షీణించాయి.ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 0.86 శాతం లేదా 195 పాయింట్లు తగ్గి 22,624 వద్ద, సెన్సెక్స్ 0.97 శాతం లేదా 720 పాయింట్లు తగ్గి 72,862 వద్ద ట్రేడ్ అవుతోంది.సెన్సెక్స్‌లో బీఈఎల్, ఆర్ఐఎల్, ఎన్టీపీసీ మాత్రమే లాభాల్లో పయనిస్తున్నాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.95 శాతం, 2.31 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ అతిపెద్ద డ్రాగర్లు. నిఫ్టీ మెటల్ మెరుగైన పనితీరు కనబరిచింది.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
యుద్ధ పరిస్థితులే దిక్సూచి
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణమే దిక్సూచిగా నిలవనుంది. యుద్ధ భయాలు తగ్గితే ఇన్వెస్టర్లకు రిలీఫ్.. పెరిగితే మరింత ఆందోళన అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. దేశీయంగా ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానున్నప్పటికీ భారీ స్థాయిలో ఆటుపోట్లు తప్పకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం(31న) దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం(ఏప్రిల్ 3న) సైతం పనిచేయవు. వెరసి ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. అయినప్పటికీ పలు కీలక అంశాలు మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం గత వారాంతాన మరింత విస్తరించింది. కాల్పుల విరమణ లేదా దాడులకు పాజ్ అంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. వారాంతన పరిస్థితులు క్షీణించడంతో నేడు(30న) మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గణాంకాల ఎఫెక్ట్ ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. జనవరిలో ఐఐపీ 4.8 శాతం ఎగసింది. మార్చి నెలకు గురువారం(ఏప్రిల్ 2న) హెచ్ఎస్బీసీ తయారీ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో ఈ వారం చైనా తయారీ పీఎంఐ, ద్రవ్యోల్బణ డేటా విడుదలకానుంది. మరోపక్క యూఎస్ తయారీ పీఎంఐ, రిటైల్ అమ్మకాలు, ఉపాధి, నిరుద్యోగిత తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. గత వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ధరలపై ఆందోళన వెలిబుచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు అంచనాలు ఏర్పడ్డాయి. వెరసి దేశ, విదేశీ గణాంకాలకూ ప్రాధాన్యమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చమురు, రూపాయి ఇటీవల బ్రెంట్ ముడిచమురు పీపా ధర లండన్ మార్కెట్లో 102–110 డాలర్ల మధ్య కదులుతోంది. దీంతో దేశీ క్రూడ్ బాస్కెట్ 140–150 డాలర్లస్థాయికి చేరుతోంది. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు కారణంకానుంది. దేశీ చమురు అవసరాలకు దిగుమతులపైనే అధికంగా ఆధారపడటంతో ఈ ప్రభావం రూపాయినీ దెబ్బతీస్తోంది. గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఏకంగా 95 స్థాయికి దిగజారిన విషయం విదితమే. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. తెలియజేశారు. అయితే మార్కెట్లు కుదురుకుంటే షార్ట్కవరింగ్కూ వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలకుతోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు సైతం కీలకంగా నిలవనున్నట్లు ప్రస్తావించారు.భారీ అమ్మకాలు.. ఈ నెలలో మరోసారి అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీస్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెల 2–27 మధ్యకాలంలో రూ. 1.14 కోట్ల విలువైన(12.3 బిలియన్ డాలర్లు) దేశీ స్టాక్స్ విక్రయించా రు. వెరసి మా ర్చిలో మార్కెట్ల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. ఇంతక్రితం 2024 అక్టోబర్‌లో అత్యధికంగా రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. ఇందుకు పశ్చిమాసియా యుద్ధం, రూపాయి బలహీనత, చమురు ధరలు, వడ్డీ రేట్ల ఆందోళనలు ప్రభా వం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో గత 17 నెలల్లోలేని విధంగా రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతిగత 4 రోజుల్లో..నాలుగు రోజులకే పరిమితమైన ట్రేడింగ్‌లో గత వారం సైతం(వరుసగా ఐదో వారం) దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా నష్టాలతోనే నిలిచాయి. సెన్సెక్స్ 950 పాయింట్లు(1.3 శాతం) పతనమైంది. 73,583 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 295 పాయింట్లు(1.3 శాతం) కోల్పోయి 22,820 వద్ద స్థిరపడింది. మార్కెట్లను మించుతూ బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.2 శాతం, స్మాల్ క్యాప్ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. సాంకేతికంగా చూస్తే.. ఈ వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. 22,300–22,200 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఈ స్థాయి నుంచి జోరందుకుంటే 23,500–23,700 పాయింట్లకు చేరే అవకాశముంది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ నీరసిస్తే 72,800కు చేరవచ్చు. అమ్మకాలు కొనసాగితే ఆపై 72,250వరకూ క్షీణించే వీలుంది. ఈ స్థాయి నుంచి బలపడితే 76,000 పాయింట్లస్థాయివైపు ప్రయాణించవచ్చు.స్టాక్స్ వ్యూఇండిగో పెయింట్స్బ్రోకరేజ్: మిరాయ్ అసెట్ షేర్‌ఖాన్ , కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 731, టార్గెట్: రూ. 1,350ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఇండిగో పెయింట్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం 5 శాతం మెరుగుపడి రూ. 359 కోట్లకు చేరింది. ఇందుకు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ బిజినెస్ వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 339 కోట్లను తాకడం సహకరించింది. ప్రధానంగా అనుబంధ సంస్థ యాపిల్ కెమీ(రూ. 20 కోట్లు) వృద్ధి సైతం దన్నునిచ్చింది. రుతుపవనాలు కొనసాగడం, ముందుగానే దీపావళి పండుగ అయిపోవడం కారణంగా అక్టోబర్‌లో అమ్మకాలు మందగించాయి. ఎమల్షన్స్ అమ్మకాల పరిమాణం 3.4 శాతం, విలువ 0.2 శాతం చొప్పున క్షీణించాయి.అయితే ఎనామిల్స్, ఉడ్ కోటింగ్స్ అమ్మకాలు 20 శాతం, విలువ 19 శాతం చొప్పున జంప్‌చేశాయి. పుట్టీ, సిమెంట్ పెయింట్స్ అమ్మకాల పరిమాణం 2 శాతం, విలువ 5.5 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ఇక ప్రైమర్స్, డిస్టెంపర్స్ తదితరాల అమ్మకాలు 7.4 శాతం, విలువ 12.5 శాతం చొప్పున ఎగశాయి. ఉత్తమ మిక్స్, తగ్గిన ముడివ్యయాల కారణంగా స్థూల మార్జిన్లు 46.8 శాతం వద్ద నిలకడను చూపాయి. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు(ఓపీఎం) 2.36 శాతం మెరుగుపడి 19 శాతంగా నమోదయ్యాయి.ఇందుకు ప్రకటనలు, ప్రమోషనల్(ఏఅండ్‌పీ) వ్యయాలు తగ్గడం తోడ్పాటునిచ్చింది. వార్షికంగా ఇవి 2.6 శాతం తగ్గి 5.6 శాతానికి పరిమితమయ్యాయి. పెయింట్ల పరిశ్రమలో క్రమానుగత రికవరీకితోడు.. వివిధ మార్కెట్లలో విస్తరించడం, సామర్థ్య పెంపు ఆదాయంలో వృద్ధికి దన్నుగా నిలవనున్నాయి. ముడివ్యయాలలో తగ్గుదల, నిలకడ కారణంగా సమీప కాలంలో లాభదాయకతకు మద్దతు లభించనుంది. రానున్న రెండేళ్ల కాలం(2026–27, 2028)లో వార్షికంగా ఆదాయం 9 శాతం, నికర లాభం 11 శాతం చొప్పున పురోగమించగలవని భావిస్తున్నాం.ఎంఎం ఫోర్జింగ్స్బ్రోకరేజ్: ఆనంద్ రాఠీ రీసెర్చ్ ,కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 400 , టార్గెట్: రూ. 600ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఎంఎం ఫోర్జింగ్స్ అంచనాలకు అనుగుణంగా రూ. 72 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. వార్షికంగా ఇది 2 శాతం క్షీణతకాగా.. రానున్న రెండేళ్లలో కంపెనీ పనితీరు మెరుగుపడే అవకాశముంది. వార్షిక ప్రాతిపదికన 2026–28 కాలంలో ఆదాయం 13 శాతం, ఇబిటా 18 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా. ఈ కాలంలో దేశీయంగా భారీ, మధ్యతరహా వాణిజ్య వాహన(ఎంఅండ్‌హెచ్‌సీవీ) అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకోనున్నట్లు భావిస్తున్నాం.ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోగతి, జీఎస్టీ రేట్ల సంస్కరణలతో పటిష్టమవుతున్న రీప్లేస్మెంట్ డిమాండ్ సహకరించే వీలుంది. వీటికితోడు లోబేస్ కారణంగా విదేశాలలో వాణిజ్య వాహన(సీవీ) రంగ అమ్మకాలు ఊపందుకోనున్నాయి. పర్యావరణ నిబంధనల అమలుకంటే ముందుగానే చేపట్టనున్న కొనుగోళ్లు ఇందుకు మద్దతివ్వనున్నాయి. అయితే సమీప కాలంలో అంతంతమాత్ర పనితీరు ప్రదర్శించనున్నప్పటికీ.. తాజా ఆర్డర్ల ప్రభావంతో ఆదాయంలో పరిశ్రమను మించిన వృద్ధిని సాధించనుంది. విభిన్న ప్రొడక్టులు, అధిక మెషీనింగ్కుతోడు భారీ ఫోర్జింగ్స్ మిక్స్ ఇందుకు తోడ్పాటునివ్వనున్నాయి.అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో అధిక ఎగుమతుల కారణంగా స్టాండెలోన్ ఆదాయం 11 శాతం ఎగసి రూ. 405 కోట్లను తాకింది. దేశీ ఆదాయం 14 శాతం బలపడి రూ. 256 కోట్లకు చేరింది. ఎగుమతులు 7 శాతం పుంజుకుని రూ. 148 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మార్జిన్లు 4.4 శాతం క్షీణించి 53 శాతానికి పరిమితంకాగా.. నికర లాభం 19 శాతం నీరసించి రూ. 26 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాదిలో ఈపీఎస్ 8 శాతంమేర నీరసించవచ్చు. అయితే 2026–27, 2028లలో 12–16 శాతంమేర మెరుగుపడవచ్చని అంచనా.గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే -
ట్రేడింగ్ బ్రేక్.. స్టాక్ మార్కెట్ సెలవులు
స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు వచ్చే వారం తమ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం, వచ్చే వారంలో ఒక ప్రభుత్వ సెలవు దినం, వారాంతపు సెలవులు కలుపుకుని మొత్తం మూడు రోజుల పాటు మార్కెట్లు పనిచేయవు.వచ్చే వారం సెలవుల వివరాలువచ్చే వారం మార్చి 31, మంగళవారం నాడు మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీనికి తోడు సాధారణ వారాంతపు సెలవులైన ఏప్రిల్ 4 (శనివారం), ఏప్రిల్ 5 (ఆదివారం) తేదీల్లో కూడా మార్కెట్ మూసి ఉంటుంది.ఈ సెలవు దినాల్లో ఈక్విటీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB), కరెన్సీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు (EGR) వంటి అన్ని విభాగాల్లో ట్రేడింగ్ అందుబాటులో ఉండదు.2026లో రానున్న సెలవులు ఎన్ఎస్ఈ అధికారిక క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది శని, ఆదివారాలు కాకుండా మొత్తం 16 ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి. రాబోయే ముఖ్యమైన సెలవులు ఇవే..మార్చి 31 - శ్రీ మహావీర్ జయంతిఏప్రిల్ 3 - గుడ్ ఫ్రైడేఏప్రిల్ 14 - డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిమే 1 - మహారాష్ట్ర దినోత్సవంమే 28 - బక్రీద్ సెప్టెంబర్ 14 - గణేష్ చవితిఅక్టోబర్ 2 - మహాత్మా గాంధీ జయంతిఅక్టోబర్ 20 - దసరాడిసెంబర్ 25- క్రిస్మస్ముహూర్త ట్రేడింగ్నవంబర్ 8 (ఆదివారం) సెలవు దినమైనప్పటికీ, దీపావళి లక్ష్మీ పూజ సందర్భంగా ప్రత్యేక 'ముహూర్త ట్రేడింగ్' కోసం కొద్దిసేపు మార్కెట్ తెరుస్తారు. దీని సమయాలను ఎక్స్ఛేంజీలు విడిగా ప్రకటిస్తాయి.మార్కెట్ రెగ్యులర్ టైమింగ్స్సాధారణ రోజుల్లో స్టాక్ మార్కెట్ పనివేళలు కింది విధంగా ఉంటాయి..ప్రీ-ఓపెన్ సెషన్: ఉదయం 9:00 నుండి 9:08 వరకు (ఆర్డర్ ఎంట్రీ).రెగ్యులర్ ట్రేడింగ్: ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 వరకు.ముగింపు సెషన్: మధ్యాహ్నం 3:40 నుండి సాయంత్రం 4:00 వరకు.బ్లాక్ డీల్ విండో: ఉదయం: 8:45 – 9:00 మధ్యాహ్నం: 2:05 – 2:20మార్కెట్ పరిస్థితులను బట్టి లేదా అత్యవసర సమయాల్లో పైన పేర్కొన్న పనివేళలను మార్చే లేదా సెలవులను సవరించే అధికారం ఎక్స్ఛేంజీలకు ఉంటుంది. -
మళ్లీ బేర్ ఎటాక్!
ముంబై: పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా మారడంతో దలాల్ స్ట్రీట్ మళ్లీ బేర్ గుప్పిట్లోకి వచ్చింది. అమెరికా–ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే కొనసాగుతున్నాయి. చమురు సరఫరా ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 107 డాలర్లకు ఎగసింది. రూపాయి విలువ రికార్డు కనిష్టానికి దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు గత 19 రోజులుగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తూనే ఉన్నారు. అమెరికాలో ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలతో శుక్రవారం సెన్సెక్స్ 1,690 పాయింట్లు కోల్పోయి 73,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 487 పాయింట్లు పతనమై 22,820 వద్ద నిలిచింది. సూచీల 2% పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.8.86 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.422.15 లక్షల కోట్లకు దిగిచ్చింది. ఆసియాలో జపాన్, ఇండోనేషియా, తైవాన్, థాయిలాండ్ మార్కెట్లు 1–50% నష్టపోయాయి. చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్ సూచీలు 0.50% మేర లాభడ్డాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్ ఇండెక్సు 1.37%, ఫ్రాన్స్ సీఏసీ సూచీ 0.72%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ ఇండెక్సు 0.30 శాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు 1.50 శాతం పతనంతో ట్రేడవుతున్నాయి. రోజంతా అమ్మకాలు...బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ఉదయమే సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలు ఒత్తిడితో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,739 పాయింట్లు క్షీణించి 73,534 వద్ద, నిఫ్టీ 501 పాయింట్లు పతనమై 22,805 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీగా ప్రభుత్వరంగ బ్యాంక్ సూచీ 4%, రియల్టీ 3.10% పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.12%, 1.77 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, ప్రభుత్వం డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై మళ్ళీ ‘విండ్‌ఫాల్ టాక్స్’ విధించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4.55% క్షీణించి రూ.1,348 వద్ద స్థిరపడింది. -
అంబానీ సంస్థకు రూ.80 వేల కోట్ల లాస్!
భారతదేశపు అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన సమయానికి కుప్పకూలాయి. ఎగుమతి పన్ను విధించాలన్న ప్రభుత్వ ఆదేశం.. అధిక చమురు ధరలు, భారత మార్కెట్‌పై ప్రభావం చూపుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో.. సంస్థ షేర్లు మార్చి 27, శుక్రవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో 4% పైగా పడిపోయాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్)లో సుమారు రూ.80,000 కోట్ల నష్టం వాటిల్లింది.ఎన్ఎస్ఈ వెబ్సైట్ డేటా ప్రకారం.. బుధవారం మార్కెట్ ముగింపులో సుమారు రూ.19.12 లక్షల కోట్లుగా ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాప్, శుక్రవారం మార్కెట్ సెషన్లో సుమారు రూ.80,000 కోట్లు తగ్గి రూ.18.32 లక్షల కోట్లకు పడిపోయింది.శుక్రవారం మార్కెట్ సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 4.23% పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి అయిన రూ.1,353.20కి చేరాయి. అంతకుముందు మార్కెట్ ముగింపులో ఈ షేర్ల ధర రూ.1,413.10గా ఉంది. మధ్యాహ్నం 12:45 గంటల సమయానికి, స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఆర్ఐఎల్ షేర్లు 4.13% నష్టంతో రూ.1,354.80 వద్ద ట్రేడ్ అయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎగుమతి పన్ను విధించినట్లు.. మార్చి 27న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. విదేశాలకు ఎగుమతి చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి ఈ ఎగుమతి పన్నును ఇప్పుడు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.నేటి స్టాక్ మార్కెట్శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.ఇదీ చదవండి: ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా? -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, హెచ్ఈజీ లిమిటెడ్, కృతి ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్, సుప్రీం పెట్రోకెమ్ లిమిటెడ్, RPSG వెంచర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నాగ ధున్సేరి గ్రూప్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, MBL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, షెమరూ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, ఆర్చీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 243 పాయింట్లు నష్టపోయి 23,063 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 841 పాయింట్లు పడిపోయి 74,445 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.84బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 107.06 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.74 శాతం నష్టపోయింది.నాస్డాక్ 2.38 శాతం పడిపోయింది.Today Nifty position 27-03-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్లకు జాక్‌పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ
-
ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ
-
HDFC చైర్మన్ రాజీనామా.. భారీగా పడిపోయిన షేర్లు అసలేం జరిగిందంటే..!
-
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లు మాత్రం డీలా
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన తరువాత చమురు ధరలు తగ్గడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రెండవ సెషన్ లో ఎగిశాయి.నిఫ్టీ 1.72 శాతం లేదా 392.70 పాయింట్ల లాభంతో 23,306.45 వద్ద, సెన్సెక్స్ 1.63 శాతం లేదా 1,205 పాయింట్లు పెరిగి 75,273.45 వద్ద ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్‌లో ప్రధానంగా శ్రీరామ్ ఫైనాన్స్ (Shriram Finance), అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises), ట్రెంట్ (Trent), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank) వంటి షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచాయి. మరోవైపు, ఐటీ రంగ షేర్లు ఒత్తిడికి లోనవ్వడంతో టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రధానంగా నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీనితో పాటు పవర్ గ్రిడ్ (Power Grid), టీసీఎస్ (TCS) వంటి షేర్లు కూడా స్వల్పంగా నష్టపోయాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.30 శాతం, 2.59 శాతం పెరిగాయిరంగాల వారీగా, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ టాప్ గెయినర్ గా నిలిచాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ కూడా తమ సహచరులను అధిగమించాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది. -
గ్రీన్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 295 పాయింట్లు పెరిగి 23,207 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 888 పాయింట్లు పుంజుకొని 74,962 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.28బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 99.76 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.37 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.84 శాతం పడిపోయింది.Today Nifty position 25-03-2026(time: 9:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వార్‌కు బ్రేక్.. బుల్‌కు జోష్!
ముంబై: ఇరాన్ ఇంధన వనరులు, విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో దలాల్ స్ట్రీట్‌లో రిలీఫ్ ర్యాలీ నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా చర్చల పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు రావడం... క్రూడ్ ధర దిగిరావడం తదితర అంశాలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,372 పాయింట్లు పెరిగి 74,068 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 400 పాయింట్లు బలపడి 22,912 వద్ద నిలిచింది. సూచీల 2% ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.7.56 లక్షల కోట్లు పెరిగి రూ.422.78 లక్షల కోట్లకు చేరింది. అదిరిపోయే ఆరంభం: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,793 పాయింట్లు ఎగసి 74,489 వద్ద, నిఫ్టీ 544 పాయింట్లు బలపడి 23 వేల స్థాయిపైన 23,057 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. ట్రేడింగ్ అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్లు లభించడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో పవర్‌గ్రిడ్ (–0.81%), సన్‌ఫార్మా (–0.20%), ఎస్బీఐ(–0.09%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లూ లాభడ్డాయి. రంగాల వారీ ఇండెక్సుల్లో సర్వీసెస్ 3.46%, ఇండ్రస్టియల్స్ 3%, ప్రైవేటు బ్యాంక్స్ 2.63%, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.46%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.39%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.34%, ఆటో 2.30%, కమోడిటీస్ 2.19 శాతం పెరిగాయి. ‘ఇరాన్ ఇంధన సదుపాయాలపై అమెరికా దాడులు తాత్కాలికంగా నిలివేయడం పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత తగ్గే అవకాశానికి సంకేతంగా భావించవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. అయినప్పట్టకీ.., హర్మూజ్ జలసంధి చుట్టూ జరిగే రాజకీయ, భౌగోళిక పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీస్తున్నాయి. దౌత్య సంబంధాలు ఏ మాత్రం బెడిసికొట్టినా మార్కెట్లపై మళ్లీ బేర్స్ పట్టుబిగించే వీలుంది. భారీ పతనం తర్వాత షార్ట్ కవరింగ్, వేల్యూ బయింగ్ కారణంగా ర్యాలీ సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితిని ఇన్వెస్టర్లు తక్కువ ధరల్లో నాణ్యమైన షేర్లను కొనుగోళ్లకు అవకాశంగా వినియోగించుకోవాలి’ అని లైవ్ లాంగ్ వెల్త్ రీసెర్చ్ విశ్లేషకుడు హరిప్రసాద్ తెలిపారు.ప్రపంచ మార్కెట్లు..నష్టాల్లోంచి లాభాల్లోకియుద్ధంపై చర్చలకు సంబంధించి అమెరికా నుంచి సంకేతాలు అందాయంటూ ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పష్టం చేయడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోంచి పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్లలో హాంగ్‌కాంగ్ 3%, దక్షిణ కొరియా 2.67%, చైనా 1.75%, జపాన్ 1.41%, థాయిలాండ్ 1%, సింగపూర్ అరశాతం పెరిగాయి. ఇంట్రాడేలో 2% పతనమైన యూరప్ మార్కెట్లు నష్టాలను దాదాపు భర్తీ చేసుకున్నాయి. జర్మనీ డాక్స్ 0.25% స్వల్ప నష్టంతో ముగిసింది. ఫ్రాన్స్ సీఏసీ సూచీ 0.1% లాభపడగా, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ ఇండెక్సు 0.5% పెరిగింది. యూఎస్ ప్రధాన సూచీల్లో నాస్డాక్ 0.45% నష్టాల్లో ట్రేడవుతోంది. డోజోన్స్ 0.25%, ఎస్అండ్పీ–500 సూచీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి.సరికొత్త కనిష్టానికి రూపాయి... 23 పైసలు బలహీనపడి 93.76 వద్దకు.. డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్టం 93.76 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం, క్రూడాయిల్ ధరల రికవరీ, పశి్చమాసియా సంక్షోభంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తదితర అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి 93.66 వద్ద మొదలైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. చివరికి ఇంట్రాడే కనిష్టం(93.76) వద్ద స్థిరపడింది. రానున్న రోజుల్లో 93.65 – 94.25 శ్రేణిలో ట్రేడవొచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఈ మార్చిలో రూపాయి 4.5 శాతం కరిగిపోయింది. జీఎస్పీ క్రాప్ సైన్స్ లిస్టింగ్ సక్సెస్ ఆగ్రోకెమికల్ కంపెనీ జీఎస్పీ క్రాప్ సైన్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర రూ.320తో పోలిస్తే బీఎస్ఈలో 4% ప్రీమియంతో రూ.332 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఒకదశలో 14% ఎగిసి రూ.364 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.356 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,656.53 కోట్లుగా నమోదైంది. -
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో సూచీలు!
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,372.06 పాయింట్లు లేదా 1.89 శాతం లాభంతో 74,068.45 వద్ద, నిఫ్టీ 412.25 పాయింట్లు లేదా 1.83 శాతం లాభంతో 22,924.90 వద్ద నిలిచాయి.హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, DCX సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్‌పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్‌గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
950 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 305 పాయింట్లు పెరిగి 22,818 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 956 పాయింట్లు పుంజుకొని 73,651 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.36బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 104.21 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.38 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.15 శాతం పెరిగింది.నాస్డాక్ 1.38 శాతం పుంజుకుంది.Today Nifty position 24-03-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.14 లక్షల కోట్లు ఆవిరి!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల మదుపర్ల సంపద ఏకంగా రూ.14 లక్షల కోట్లు ఆవిరైపోయింది. నిరంతరాయంగా విదేశీ నిధులు తరలిపోవడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.సోమవారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సరికి.. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి. దీంతో ఈరోజును నిపుణులు బ్లాక్ మండేగా అభివర్ణించారు.స్టాక్‌ల విషయానికొస్తే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ 'అటాను చక్రవర్తి' (Atanu Chakraborty) రాజీనామా నేపథ్యంలో, గత రెండు సెషన్లలో 7.4 శాతం క్షీణించిన తర్వాత ఆ బ్యాంక్ షేరు సుమారు 2.5 శాతం పడిపోయింది. 2024 అసెస్మెంట్ సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను శాఖ నుండి రూ. 6,337 కోట్ల పన్ను డిమాండ్ అందిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 3.6 శాతం పడిపోయింది. 16 ప్రధాన రంగాల సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. విస్తృత సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి, నిఫ్టీ స్మాల్‌క్యాప్100, నిఫ్టీ మిడ్‌క్యాప్100 వరుసగా 3.82 శాతం, 3.45 శాతం మేర పడిపోయాయి. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు!
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి.హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్‌పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్‌గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మార్కెట్లపై బేర్ పంజా.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 411 పాయింట్లు తగ్గి 22,711 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1269 పాయింట్లు నష్టపోయి 73,268 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.67బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 112.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.4 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.51 శాతం పడిపోయింది.నాస్డాక్ 2.01 శాతం నష్టపోయింది.Today Nifty position 23-03-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా?
ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుతూ.. ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ విలువైన లోహాల ధరలు పడిపోతూనే ఉంటాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనే సందేహం చాలామందిలో కలిగింది. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ రోజు (మార్చి 20) బంగారం ధర 0.6% పెరగగా, వెండి ధర 1.7% ఎందుకు తగ్గింది. ఇటీవలి తగ్గుదలల తర్వాత, సాంకేతిక కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతు ఇవ్వడంతో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బలమైన అమెరికన్ డాలర్ ఒత్తిడి, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వస్తున్న సంకేతాల కారణంగా, గోల్డ్ వరుసగా మూడవ వారం కూడా పతనం దిశగా పయనించింది. అదే సమయంలో, మార్కెట్లో బలహీనమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వెండి ధరలు తగ్గాయి.భౌగోళిక రాజకీయ పరిణామాలు, చమురు ధరల కదలికలు, భారతదేశం.. చైనాలలో భౌతిక డిమాండ్‌లో మార్పులతో సహా ప్రపంచ కారకాలు బంగారం, వెండి ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి తగ్గుదలల తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు జరపడం, ధరలు సాంకేతిక మద్దతు జోన్లను నిలబెట్టుకోవడంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే, భౌతిక డిమాండ్ తగ్గడం మరియు కొనసాగుతున్న అమ్మకాల కార్యకలాపాల కారణంగా వెండి ధరలు పడిపోయాయి.ఆసియా ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ 0.6% పెరిగి ఔన్సుకు 4,675.23 డాలర్లకు చేరుకుంది. గత సెషన్లో దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన ఈ లోహం కోలుకుంది. వెండి 1.7% తగ్గి ఔన్సుకు 71.66 డాలర్లకు చేరింది. ఇతర లోహాలు మిశ్రమ కదలికలను కనబరిచాయి. ప్లాటినం 0.2% పెరిగి 1,974.45 డాలర్లకు చేరగా, పల్లాడియం 1% పెరిగి 1,461.36 డాలర్లకు చేరింది.బంగారం ధరల పెరుగుదల ఎప్పుడుబంగారం వంటి విలువైన లోహాల విలువ ఎలాంటి సమయంలో అయినా భారీగా క్షిణించే అవకాశం ఉండదు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవచ్చు, ఆర్ధిక మాంద్యం రావచ్చు. అలంటి సమయంలో కూడా మీకు బంగారం, వెండి వంటివి చాలా ఉపయోగపడతాయని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 325.72 పాయింట్లు లేదా 0.44 శాతం లాభంతో 74,532.96 వద్ద, నిఫ్టీ 112.35 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో.. 23,114.50 వద్ద నిలిచింది.వెబ్‌సోల్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్, కెఐఓసిఎల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ఫిన్‌కర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్, రేవతి ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మార్కెట్లు పడిపోతున్నా ఈ 5 స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి..?
-
గ్రీన్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ(Nifty) 260 పాయింట్లు పెరిగి 23,259 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 811 పాయింట్లు పుంజుకొని 75,019 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.44బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 106.59 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.27 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.28 శాతం నష్టపోయింది.Today Nifty position 20-03-2026(time: 9:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రక్తపాతాన్ని చవిచూశాయి! అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు, ముడిచమురు సెగలు దలాల్ స్ట్రీట్‌ను అతలాకుతలం చేశాయి. అత్యంత ఘోరమైన పతనాన్ని నమోదు చేస్తూ.. ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో ఏకంగా రూ.12 లక్షల కోట్లు ఆవిరైపోయింది.బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు 2,196.89 పాయింట్లు (3.26%) పతనమై 74,207.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 775.65 పాయింట్లు (3.26%) క్షీణించి 23,002.15 వద్ద స్థిరపడింది.మార్కెట్‌ను ముంచేసిన 5 ప్రధాన కారణాలుపతాక స్థాయికి చేరిన మధ్యప్రాచ్య సంక్షోభంఅమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయబ్రాంతులకు గురిచేసింది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్‌లోని రాస్ లఫ్ఫాన్ LNG ప్లాంట్లతో పాటు సౌదీ, కువైట్ రిఫైనరీలపై దాడులు జరగడం గ్లోబల్ ఎనర్జీ సరఫరా వ్యవస్థను దెబ్బతీసింది.భగ్గుమన్న ముడిచమురుయుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కరోజే 5-11% పెరిగి బ్యారెల్‌కు 119 డాలర్లకి చేరుకుంది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బ. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, కంపెనీల నిర్వహణ వ్యయం భారమై లాభాలు తగ్గుతాయన్న ఆందోళన పెరిగింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో కుదుపుదేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) పార్ట్-టైమ్ చైర్మన్ అటాను చక్రవర్తి అనూహ్య రాజీనామా మార్కెట్‌ను షాక్‌కు గురిచేసింది. "విలువలు, నైతికత" విషయంలో విభేదాల కారణంగా ఆయన తప్పుకోవడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 7-8% కుప్పకూలింది. ఇది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌ను భారీగా కిందకు లాగింది.అమెరికా ఫెడ్ 'హాకిష్' వైఖరిఅమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమే కాకుండా, కఠిన వైఖరిని ప్రదర్శించింది. యుద్ధం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉన్నందున, 2026లో కేవలం ఒకే ఒక్క వడ్డీ రేటు కోత (25 bps) ఉండొచ్చని సూచించడం గ్లోబల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.రూపాయి పతనం- ఎఫ్ఐఐల అమ్మకాలుఅంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.92.63కి పడిపోయింది. దీనికి తోడు విదేశీ సంస్థాగత మదుపరులు (FII) భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, అటు ఆసియా, యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉండటంతో భారత మార్కెట్లు కోలుకోలేకపోయాయి. -
స్టాక్ మార్కెట్ క్రాష్.. ముంచేసిన చమురు!
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సంఘర్షణ చమురు మౌలిక సదుపాయాలకు మరింత నష్టం కలిగించడంతో ఇంధన ధరలు పెరగడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ క్షీణించాయి.ఎన్ఎస్ఈ నిఫ్టీ 775.65 పాయింట్లు లేదా 3.26 శాతం క్షీణించి 23,002.15 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2496.89 పాయింట్లు లేదా 3.26 శాతం తగ్గి 74,207.24 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని అన్ని స్టాక్స్ నష్టాలలో ముగిశాయి. పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ ఈ జాబితాలో ఉన్నాయి.విస్తృత మార్కెట్ సూచీలు నెత్తురు కక్కాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 3.19 శాతం, స్మాల్ క్యాప్ 100 2.94 శాతం నష్టపోయాయి. కౌంటర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి.మార్కెట్ సమయంలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 11 శాతం పెరిగి 119.5 డాలర్లకు చేరుకుంది. కీలకమైన రిఫైనర్లు దెబ్బతిన్న తరువాత సౌదీ అరేబియా యాన్బు నౌకాశ్రయంలో చమురు లోడ్ చేయడాన్ని నిలిపివేసిందని నివేదికలు వచ్చిన తరువాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 11 శాతం పెరిగింది. -
ఫెడ్ నిర్ణయం... భారత్ మార్కెట్ కు గ్రీన్ సిగ్నల్
-
మళ్లీ నేలకరిచిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గడిచిన మూడు సెషన్లలో లాభాల్లోకి చేరిన మార్కెట్లు ఈరోజు నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 459 పాయింట్లు తగ్గి 23,312 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1526 పాయింట్లు దిగజారి 75,201 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.09బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 111.37 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.36 శాతం పడిపోయింది.నాస్డాక్ 1.46 శాతం నష్టపోయింది.Today Nifty position 19-03-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ, రియల్టీ స్టాక్స్ అండతో భారీ లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, రియల్టీ స్టాక్స్ మద్దతు ఇవ్వడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రోజు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 196.65 పాయింట్ల లాభంతో 23,777.80 వద్ద, సెన్సెక్స్ 0.83 శాతం లేదా 633.29 పాయింట్లు పెరిగి 76,704.13 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.94 శాతం, 1.70 శాతం పెరిగాయి.రంగాల వారీగా నిఫ్టీ ఐటీ టాప్ గెయినర్ గా నిలిచింది. నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. రంగాల సూచీలలో నిఫ్టీ మెటల్, ఎఫ్ఎంసిజి అత్యధికంగా క్షీణించాయి. -
క్రమంగా పుంజుకుంటున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 142 పాయింట్లు పెరిగి 23,723 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 423 పాయింట్లు ఎగబాకి 76,485 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.59బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 100.97 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.18 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.25 శాతం పెరిగింది.నాస్డాక్ 0.47 శాతం పుంజుకుంది.Today Nifty position 18-03-2026(time: 9:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 514.24 పాయింట్ల లాభంతో 76,017.09 వద్ద, నిఫ్టీ 150.00 పాయింట్ల లాభంతో 23,558.80 వద్ద నిలిచాయి.డిసిఎం శ్రీరామ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్, MOIL లిమిటెడ్, ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. LMW లిమిటెడ్, ప్రుడెన్షియల్ షుగర్ కార్పొరేషన్ లిమిటెడ్, జెల్ప్మాక్ డిజైన్ అండ్ టెక్ లిమిటెడ్, శ్యామ్ టెలికాం లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ(Nifty) 68 పాయింట్లు పెరిగి 23,476 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 212 పాయింట్లు ఎగబాకి 75,713 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.89బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 102.87 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.01 శాతం పెరిగింది.నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.Today Nifty position 17-03-2026(time: 9:49 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ అదుర్స్.. అదరగొట్టిన ఆటో షేర్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, బ్యాంక్ స్టాక్స్ మద్దతుతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు ట్రేడ్ చివరి దశలో పదునైన లాభాలతో మూడు రోజుల నష్టాల పరంపరను బ్రేక్ చేశాయి.నిఫ్టీ 1.11 శాతం లేదా 257.70 పాయింట్ల లాభంతో 23,408.80 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 939 పాయింట్లు లేదా 1.26 శాతం పెరిగి 75,502.85 వద్ద ముగిశాయి.అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్ సెన్సెక్స్‌లో టాప్ గెయినర్లలో ఉన్నాయి. బీఈఎల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టైటాన్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.65 శాతం నష్టపోయాయి.సెక్టార్ వారీగా చూస్తే ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్‌లలో నిఫ్టీ ఆటో అత్యధికంగా పెరిగింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. ఇక నిఫ్టీ రియల్టీ ఇతర సూచీల కంటే తక్కువ పనితీరు కనబరిచింది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 81 పాయింట్లు పెరిగి 23,227 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 244 పాయింట్లు ఎగబాకి 74,823 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.26బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 104.12 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.61 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.93 శాతం నష్టపోయింది.Today Nifty position 16-03-2026(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎఫ్డీ కన్నా బెటర్ గురూ..
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నింటిదీ ఒడిదుడుకుల దారే. మన మార్కెట్లదీ అదే తీరు. నిన్న మొన్నటి వరకూ ట్రంప్ టారిఫ్‌లు రోజుకో టర్న్ తీసుకుంటూ ఇన్వెస్టర్లను స్థిమితంగా ఉండనివ్వలేదు. ఇపుడేమో పశ్చిమాసియా సంక్షోభం దావానలంలా చుట్టేస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఆరంభించిన యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో ఇంకా స్పష్టత లేదు. దీంతో రోజురోజుకూ చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా తీవ్రంగానే ఉంటోంది. గరిష్ఠ స్థాయిల నుంచి చూస్తే మన మార్కెట్లు ఇప్పటికే దాదాపు 10 శాతం పతనమయ్యాయి. ఇది ఎక్కడ ఆగుతుందో తెలియదు. మరి ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్న మదుపరులు ఇపుడేం చేయాలి? సాధారణంగా అయితే ఇలాంటి సందర్భాల్లో మార్కెట్లు కాస్త కిందికి వచ్చాక కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లటమే మంచిదని నిపుణులు చెబుతారు. మరి అలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎక్కడుంచాలి? సేవింగ్స్ ఖాతాల్లో అయితే వడ్డీ ఏమీ రాదు. ఎఫ్‌డీల్లో అయితే బ్రేక్ చేస్తే వచ్చేది తక్కువ. ఇక మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో అయితే స్వల్ప కాలానికి పెద్దగా రాబడులేమీ రావు. దీనికి నిపుణులు చెబుతున్న సమాధానమే ఓవర్‌నైట్, లిక్విడ్ మ్యూచ్‌వల్ ఫండ్లు. వార్షికంగా 6–7 శాతం రాబడినిస్తూ... తక్కువ ఛార్జీలతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు వెనక్కి తీసుకోగలిగే అవకాశం ఉండటమే వీటి ప్రత్యేకత. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటానికి వేచి చూసే వారే కాదు... స్వల్ప కాలానికి తమ డబ్బుల్ని ఎక్కడైనా ఉంచాలనుకునే వారందరికీ ఇవి అత్యుత్తమ పెట్టుబడి సాధనాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనక వీటిలో రిస్కూ తక్కువే.ఓవర్‌నైట్.. లిక్విడ్ ఫండ్స్.. ఈ రెండూ భిన్నమైన ఫండ్స్. ఓవర్‌నైట్ ఫండ్స్ కేవలం ఒక్క రోజు మెచ్యూరిటీ ఉండే డెట్ సాధనాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఆ విధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో అత్యంత సురక్షితమైన కేటగిరీల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. ప్రధాన ప్రత్యేకతలేమిటంటే... వడ్డీ రేట్ల మార్పులపరంగా చాలా తక్కువ రిసు్క. అత్యధిక లిక్విడిటీ ఉంటుంది. కొద్ది రోజుల నుంచి కొన్ని వారాల వ్యవధి వరకు ఇన్వెస్ట్ చేసేందుకు ఇవి అనువుగా ఉంటాయి. ఇవి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిధిలో ఉంటాయి. ఇక లిక్విడ్ ఫండ్స్‌ని తీసుకుంటే ఇవి 91 రోజుల వరకు మెచ్యూరిటీలు ఉండే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఓవర్‌నైట్ ఫండ్స్‌తో పోలిస్తే కాస్తంత ఎక్కువ రాబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే లిక్విడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కొద్దివారాల నుంచి కొద్ది నెలల వ్యవధి వరకు షార్ట్ టర్మ్ పెట్టుబడులకు ఇవి అనువైనవి.రాబడి ఇలా.. సాధారణంగా వడ్డీ రేట్ల సైకిల్‌ను బట్టి రాబడులు మారుతుంటాయి. ఓవర్‌నైట్ ఫండ్స్ విషయం తీసుకుంటే వార్షికంగా సుమారు 5– 6 శాతం రాబడినిస్తాయి. అదే లిక్విడ్ ఫండ్స్ అయితే సుమారు 6–7 శాతం స్థాయిలో ఉంటుంది. అయితే కచి్చతంగా ఇంత రాబడులే వస్తాయని లేదు కానీ, స్వల్పకాలిక వడ్డీ రేట్లను బట్టి ఇవి ఉంటాయి. ఎవరికి అనువైనవి స్టాక్ మార్కెట్లలో మదుపు చేసేందుకు సన్నద్ధమవుతున్నవారు, ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు తమ దగ్గర ఉన్న నగదును ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే, స్వల్పకాలికంగా, కొద్ది నెలల వ్యవధిలో అవసరం పడే మిగులు డబ్బును కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉపయోగించుకోదల్చుకునే నిధులను కూడా కొందరు ఇన్వెస్టర్లు, లిక్విడ్ ఫండ్స్‌లో ఉంచుతారు.ఇందులోనూ రిసు్కలు ఉంటాయి.. ఈ తరహా పెట్టుబడుల్లో రిస్కులు తక్కువగా ఉంటాయే తప్ప పూర్తి రిస్క్– ఫ్రీగా మాత్రం ఉండవు. వీటిల్లో ప్రధానంగా పొంచి ఉండే రిసు్కలను చూస్తే.. వడ్డీ రేట్లలో మార్పులు: స్వల్పకాలిక వడ్డీ రేట్లు బట్టి రాబడులు హెచ్చుతగ్గులకు లోను కావచ్చు. క్రెడిట్ రిస్కు (లిక్విండ్ ఫండ్స్‌లో): కొన్ని లిక్విడ్ ఫండ్స్, కార్పొరేట్ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలాంటి వాటిలో పరిమిత స్థాయిలో క్రెడిట్ రిస్కు ఉంటుంది. ట్యాక్సేషన్: పన్నులపరంగా చూస్తే ఇన్వెస్టర్ ఆదాయ శ్లాబ్‌ని బట్టి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది.ఏం చేయొచ్చంటే.. ఇలాంటి ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు నిపుణులు మూడు సింపుల్ రూల్స్ సూచిస్తున్నారు. అవేంటంటే.. ⇒ రెగ్యులర్ ప్లాన్లు కాకుండా డైరెక్ట్ ప్లాన్లు తీసుకుంటే చార్జీల మోత తగ్గుతుంది. ⇒ ఇన్వెస్ట్ చేయడానికి ముందే వ్యయ నిష్పత్తిని చూసుకోవాలి. ⇒ మాటిమాటికీ ఎంట్రీ, ఎగ్జిట్ చేయకుండా ఉంటే ఎగ్జిట్ లోడ్ భారాలు తగ్గుతాయి. ⇒ అత్యంత నాణ్యమైన పోర్ట్‌ఫోలియో ఉండే ఫండ్స్‌ని ఎంచుకోవాలి. ⇒ ఇంకా ఎక్కువ ఈల్డ్‌పై అత్యాశతో నాసిరకం ఫండ్స్‌ని ఎంచుకోకూడదు. ⇒ స్వల్పకాలిక అవసరాల కోసమే ఈ సాధనాన్ని ఉపయోగించుకోవాలి. ⇒ దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలుగా పరిగణించకూడదు.ఖర్చులూ చూసుకోవాలి .. సాధారణంగా ఓవర్‌నైట్, లిక్విడ్ ఫండ్స్ అనేవి చౌకైన పెట్టుబడి సాధనాలే అయినప్పటికీ, కొన్ని చార్జీలు ఉంటాయని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. అవేంటంటే.. వ్యయ నిష్పత్తి: స్కీమును నిర్వహించేందుకు ఫండ్ హౌస్ వార్షికంగా విధించే ఫీజును ఎక్స్పెన్స్ రేషియోగా వ్యవహరిస్తారు. ఓవర్‌నైట్ ఫండ్స్‌లో ఇది ఏడాదికి 0.6 నుంచి 0.25 శాతం శ్రేణిలో, లిక్విడ్ ఫండ్స్‌లో 0.8 నుంచి 0.40 శాతంగా శ్రేణిలోను ఉంటుంది. ఈ ఫీజును ఆటోమేటిక్‌గా ఫండ్ రిటర్నుల్లో నుంచి డిడక్ట్ చేస్తారు కనక ఇన్వెస్టర్లు విడిగా చెల్లించనక్కర్లేదు.ఈ చార్జీలు సెబీ పరిధిలో ఉంటాయి. ఉదాహరణకు రూ. 10 లక్షలను 0.30 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉన్న లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే వార్షికంగా సుమారు రూ. 3,000 చార్జీ వర్తిస్తుంది. అయితే మనం ఎన్ని రోజులు ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ను ఉంచితే అన్ని రోజులకే చార్జీలు వర్తిస్తాయి. ఎగ్జిట్ లోడ్: పెట్టుబడులను సత్వరం రిడీమ్ చేసుకుని, వైదొలిగితే కొన్ని ఫండ్లు కొంత ఎగ్జిట్ లోడ్‌ని వసూలు చేస్తాయి. లిక్విడ్ ఫండ్స్ విషయాన్ని చూస్తే, మొదటి రోజు రిడీమ్ చేసుకుంటే సుమారు 0.007 శాతం, రెండో రోజైతే 0.0065 శాతం.. అలా 7 రోజుల తర్వాత జీరో స్థాయికి లోడ్ తగ్గుతుంది. చాలా మటుకు ఓవర్‌నైట్ ఫండ్స్‌లో సాధారణంగా ఎగ్జిట్ లోడ్ ఉండదు. బ్రోకరేజ్ లేదా లావాదేవీ ఫీజులు: కొన్ని ప్లాట్‌ఫాంలు లేదా డి్రస్టిబ్యూటర్ల ద్వారా ఫండ్స్ తీసుకుంటే కొంత ట్రాన్సాక్షన్ చార్జీలు వర్తించవచ్చు. అయితే, ప్రస్తుతం చాలా మటుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు ఇలాంటి ఫీజుల బాదరబందీ లేకుండా డైరెక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ట్యాక్సేషన్: ఈ ఫండ్స్ నుంచి రాబడులపై పన్నులు వర్తిస్తాయి. ఇటీవల పన్ను విధానాల్లో మార్పుల అనంతరం, ఇన్వెస్టర్ ఆదాయ పన్ను శ్లాబ్ బట్టి స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తోంది. స్టాక్ మార్కెట్లు ఇటీవలి కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులకు, కరెక్షన్లకు లోనవుతున్నాయి. ఇప్పటికే కొంత వరకూ మార్కెట్ల నుంచి ఎగ్జిట్ అయిన వారు, ఇంకా కొంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారు ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేసి, బీపీ తెచ్చుకోవడం కంటే డబ్బును సురక్షితంగా ఉంచుకోవటానికి ప్రాధాన్యమిస్తున్నారు. అలా చేస్తే పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చని భావిస్తున్నారు. మరి బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై 2.5 – 4 శాతం వడ్డీ రేటే ఉంటోంది. అందుకే వీరు ఎంట్రీ, ఎగ్జిట్ రెండూ సులభంగా ఉండే ఓవర్‌నైట్, లిక్విడ్ ఫండ్స్‌ను ఆశ్రయించవచ్చు. -
అదే భయం... అదే పతనం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతోపాటు.. చమురు ధరలు మండుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు బేర్‌మంటున్నాయి. వరుసగా మూడో రోజు అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,580 పాయింట్లు పడిపోయి 74,455కు చేరింది. ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం నీరసించడం సెంటిమెంటును దెబ్బతీసింది.ముంబై: చమురు ధరల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నాయి. దీనికితోడు ఇంధన కొరత ఆర్థిక వ్యవస్థల వృద్ధికి విఘాతం కలిగించనున్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో ఆసియాసహా అమెరికావరకూ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దేశీయంగా మూడో రోజూ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,471 పాయింట్లు పడిపోయి 74,564 వద్ద ముగిసింది. నిఫ్టీ 488 పాయింట్లు కోల్పోయి 23,151 వద్ద నిలిచింది. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 1,580 పాయింట్లు క్షీణించి 74,455 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 23,112 వరకూ నీరసించింది. మెటల్స్ మెల్టింగ్.. ఎన్ఎస్ఈలో అన్నిరంగాలూ నీరసించగా.. మెటల్స్ 5 శాతం పతనమైంది. క్రూడ్ సెగతో ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్, కెమికల్స్ 3.6–2.7 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్అండ్టీ 7.5 శాతం పడిపోగా.. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, గ్రాసిమ్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, టీఎంపీవీ, మారుతీ, ఎంఅండ్ఎం, ఐషర్, అల్ట్రాటెక్, యాక్సిస్ బ్యాంక్ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి. కేవలం టాటా కన్జూమర్, ఎయిర్టెల్ 2–1 శాతం బలపడ్డాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు పీపా ధర 102 డాలర్లకు ఎగువన కదులుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం పెరగనున్నట్లు తెలియజేశారు. చిన్న షేర్లు విలవిల తాజా అమ్మకాలతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2.5 శాతం పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో 3,439 నష్టపోగా.. కేవలం 858 లాభపడ్డాయి. నగదు విభాగంలో తాజాగా ఎఫ్‌పీఐలు రూ. 10,717 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 9,977 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 4 రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 24,320 కోట్లకుపైగా పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 27,450 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. ఈ నెల 2–6 మధ్య సైతం ఎఫ్‌పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే.మరో 10 లక్షల కోట్లు ఆవిరిఅమ్మకాల సునామీతో ఒక్క రోజులోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువకు రూ. 10.24 లక్షల కోట్ల మేర చిల్లు పడింది. రెండు వారాల్లో సెన్సెక్స్ 8.3% (6,723 పాయింట్లు) పతనంకాగా.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 33.68 లక్షల కోట్లు ఆవిరైంది. వెరసి మార్కెట్ క్యాప్ రూ. 429.82 లక్షల కోట్లు (4.65 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది. -
ఒక్క రోజులో 10 లక్షల కోట్లు ఆవిరి కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
-
మార్కెట్లు క్రాష్.. కియోసాకి సంచలన ట్వీట్!
చమురు ధరల పెరుగుదల.. స్టాక్ మార్కెట్ క్రాష్ వంటివి జరుగుతున్న సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇందులో..పెట్టుబడిదారులు తమ డబ్బును ఉపసంహరించుకోవడంతో, ప్రైవేట్ క్రెడిట్ ఫండ్లు భయాందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. కొన్నిసార్లు పెద్ద మార్పులు జరుగుతాయి. స్టాక్ మార్కెట్ క్రాష్, బ్యాంకులు.. ఫైనాన్షియల్ సంస్థలు కష్టాల్లో పడటం వంటివి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో తమ డబ్బును వెనక్కి తీసుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనిని ఆర్థిక క్రాష్ లేదా మాంద్యం అని అంటారు. కొందరు ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని కొత్త మాంద్యం లేదా డిప్రెషన్ ప్రారంభమవుతోందని కూడా చెబుతారు.ప్రజలు తమ పెట్టుబడులను అమ్మేస్తారు లేదా బ్యాంకుల్లో ఉన్న డబ్బును తీసుకుంటారు. దీన్ని బ్యాంక్ రన్ అని అంటారు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బు ఎప్పుడూ పూర్తిగా మాయం కాదు. అది ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతుంది. అంటే బ్యాంకుల నుంచి బయటకు వెళ్లే డబ్బు, మరో ఆస్తి లేదా పెట్టుబడి వైపు వెళ్తుంది.CRASH ACCELERATES:Private credit funds are panicked as investors withdraw their money.Major big name banks and brand name financial institutions are in trouble.Jim Rickards formally declares the US in the New Depression.What are you going to do?If you have followed my X…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 13, 2026కొంతమంది పెట్టుబడిదారులు ఈ మార్పులను ముందుగానే అర్థం చేసుకుని తెలివిగా తమ డబ్బును.. చమురు, వెండి, బంగారం, డిజిటల్ కరెన్సీలు అయిన బిట్‌కాయిన్, ఈథీరియం వంటి వాటిలో పెట్టుబడిగా పెడుతుంటారు. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి సమయంలో ఈ ఆస్తులు కొన్నిసార్లు విలువను నిలుపుకుంటాయి.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలుమార్కెట్ పెరుగుతున్నప్పుడు మాత్రమే కాకుండా.. పడిపోయే సమయంలో కూడా తెలివైన పెట్టుబడిదారులు లాభాలు పొందగలరని. కానీ దీనికి సరైన సమాచారం, విశ్లేషణ & ఆలోచన అవసరం. భయంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కలగవచ్చు. కాబట్టి ఆర్థిక సంక్షోభ సమయంలో భయపడకుండా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఏ రంగాలు ఎదుగుతున్నాయి, ఏ పెట్టుబడులు భద్రంగా ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతాము. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు లేదా 1.93 శాతం నష్టంతో.. 74,563.92 వద్ద, నిఫ్టీ 468.70 పాయింట్లు లేదా 1.98 శాతం నష్టంతో 23,170.45 వద్ద నిలిచాయి.ఐసీడీఎస్ లిమిటెడ్, కంప్యూకామ్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, సుమిత్ వుడ్స్ లిమిటెడ్, సెంట్రమ్ క్యాపిటల్ లిమిటెడ్, బర్న్‌పూర్ సిమెంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కృతిక వైర్స్ లిమిటెడ్, ఎస్ఈపీసీ లిమిటెడ్, అకీ ఇండియా లిమిటెడ్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, లోరెంజిని అప్పారల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
ఇన్వెస్టర్లకు డబుల్ ధమాకా.. 100 షేర్లకు 1000 షేర్లు ఫ్రీ..
-
కరుగుతోన్న ఇన్వెస్టర్ల సంపద
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 217 పాయింట్లు తగ్గి 23,422 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 694 పాయింట్లు దిగజారి 75,357 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.72బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 100.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.52 శాతం పడిపోయింది.నాస్డాక్ 1.78 శాతం నష్టపోయింది.Today Nifty position 13-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 829.29 పాయింట్ల నష్టంతో 76,034.42 వద్ద, నిఫ్టీ 227.70 పాయింట్ల నష్టంతో 23,639.15 వద్ద నిలిచాయి.ఐసీడీఎస్ లిమిటెడ్, రీగాల్ రిసోర్సెస్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ & సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్, క్రియేటివ్ ఐ లిమిటెడ్, అవాన్మోర్ క్యాపిటల్ & మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, అక్యూస్ లిమిటెడ్, కేంబ్రిడ్జ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలు
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు కూడా ఉంటాయి, నష్టాలు కూడా వస్తాయి. ముఖ్యంగా S&P 500 వంటి పెద్ద మార్కెట్ సూచీలు పడిపోయినప్పుడు (మార్కెట్ క్రాష్ జరిగినప్పుడు) చాలా మంది పెట్టుబడిదారులు డబ్బు కోల్పోతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో మీరు డబ్బు కోల్పోయారా? లేక డబ్బు సంపాదించారా? అని ప్రశ్నించారు.మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ మంది పెట్టుబడిదారులు నష్టపోవడం సాధారణం. అయితే కొందరు పెట్టుబడిదారులు మాత్రం సరైన వ్యూహాలు, మంచి జ్ఞానం & అనుభవం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో కూడా లాభాలు పొందగలుగుతారు. అంటే మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, సరైన నిర్ణయాలు తీసుకుంటే నష్టాలను తగ్గించుకోవడం లేదా కొన్నిసార్లు లాభాలు కూడా పొందటం సాధ్యమే.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. మార్కెట్లో నష్టపోతే, అది కేవలం మార్కెట్ కారణంగా మాత్రమే కాదు. మనం నేర్చుకున్న విధానం, మనకు మార్గదర్శనం చేసిన వ్యక్తులు లేదా గురువులు కూడా కొంతవరకు కారణం కావచ్చు. ఇలాంటి సమయంలో నేను అనుసరిస్తున్న గురువు లేదా నేర్చుకుంటున్న విధానం సరైనదేనా? అనే ప్రశ్న తలెత్తుతుంది.ఇప్పుడు కూడా చాలా మంది పెట్టుబడిదారులు యూట్యూబ్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఫైనాన్స్ & స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నారు. అక్కడ అనేక మంది ఫైనాన్స్ నిపుణులు, ట్రేడింగ్ గురువులు తమ అనుభవాలను & సూచనలను పంచుకుంటారు. కానీ అందరూ నిజంగా విజయవంతమైన పెట్టుబడిదారులే అని అనుకోవడం సరైంది కాదు. కొందరు ప్రసిద్ధ యూట్యూబర్లు కూడా కొన్ని సందర్భాల్లో పెద్ద నష్టాలు చవిచూసి ఉండవచ్చు.అలాగే కొందరు తమ లాభాలను గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ నిజమైన పెట్టుబడి విద్య అంటే కేవలం లాభాలను చూపించడం కాదు. మార్కెట్ ప్రమాదాలను అర్థం చేసుకోవడం, నష్టాలను ఎలా నియంత్రించాలో నేర్చుకోవడం. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్లో డబ్బు కోల్పోయినట్లయితే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అది ఒక పాఠంగా తీసుకుని, మీ పెట్టుబడి పద్ధతిని తిరిగి పరిశీలించాలి. అవసరమైతే మంచి గురువులను, విశ్వసనీయమైన విద్యను ఎంపిక చేసుకోవాలి.మొత్తానికి, మార్కెట్ క్రాష్ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. సరైన జ్ఞానం, సరైన మార్గదర్శనం ఉంటేనే పెట్టుబడుల్లో దీర్ఘకాల విజయాన్ని సాధించవచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే అనుసరించడం చాలా అవసరం. మార్కెట్లో నష్టాలు కూడా ఒక గురువు లాంటివే.. ఎందుకంటే అవి మనకు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్పిస్తాయి.S & P MARKET CRASH: Q: Did you lose money?Q: Did you make money?A: If you lost money is it time to change teachers?Q: Who do you follow on YouTube?A: I could name some YouTube financial rock stars who lost a lot of money.But that would not be cool.And I could…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 11, 2026 -
మార్కెట్ సూచీలు నేల చూపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 255 పాయింట్లు తగ్గి 23,606 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 809 పాయింట్లు దిగజారి 76,045 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.51బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 100.92 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.08 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.08 శాతం పెరిగింది.Today Nifty position 12-03-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పడగొట్టిన పశ్చిమాసియా
ముంబై: యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పశ్చిమాసియాలో యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకనున్నట్లు చేసిన ప్రకటనపై స్టాక్ మార్కెట్లు ఒక్క రోజులోనే విశ్వాసాన్ని కోల్పోయాయి. మరోపక్క ముడిచమురు ధరలు సైతం తిరిగి జోరందుకోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. వెరసి సెన్సెక్స్ 1,342 పాయింట్లు పతనమైంది. 76,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 395 పాయింట్లు కోల్పోయి 23,867 వద్ద నిలిచింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 5.14 లక్షల కోట్లు ఆవిరైంది. తొలుత ఆసియా మార్కెట్ల సానుకూలతలతో స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చమురు ధరల సెగతో వెనువెంటనే డీలా పడ్డాయి. ఉదయం లండన్ మార్కెట్లలో బ్రెంట్ చమురు ధర పీపాకు 6 శాతం ఎగసింది. 93 డాలర్లకు చేరింది. యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభంకావడంతో మిడ్‌సెషన్ నుంచీ సెంటిమెంటు మరింత బలహీనపడింది. ఫలితంగా సమయం గడిచేకొద్దీ అమ్మకాలు పెరిగిపోయాయి. దీంతో చివర్లో సెన్సెక్స్ 1,447 పాయింట్లు పడిపోయి 76,759ను తాకగా.. నిఫ్టీ 23,834వరకూ క్షీణించింది. ఫైనాన్స్, ఆటో వీక్..: ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, రియల్టీ, కెమికల్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ 3–1% మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్, బజాజ్ ఆటో, కొటక్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ, మారుతీ, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, టీఎంపీవీ, టీసీఎస్, ఎయిర్టెల్ 5–2% మధ్య డీలాపడ్డాయి..గ్యాస్, జల్ జీవన్ పుష్.. గ్యాస్ కొరత ప్రభావంతో అదానీ టోటల్ గ్యాస్ 18 శాతం ఎగసింది, ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ పెరగడంతో టీటీకే ప్రెస్టీజ్, స్టవ్‌క్రాఫ్ట్ షేర్లు 12 శాతం చొప్పున జంప్‌చేశాయి. కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌కు మరింత మద్దతివ్వడంతో శక్తి పంప్స్, రోటో పంప్స్, జైన్ ఇరిగేషన్, జిందాల్ సా, ఎన్విరో ఇన్ఫ్రా, ఇండియన్ హ్యూమ్ పైప్, ఎస్పీఎంఎల్ తదితరాలు 20–13 శాతం మధ్య దూసుకెళ్లాయి.సెడెమాక్ లిస్టింగ్ భేష్ పతన మార్కెట్లోనూ ఆటో విడిభాగాల(పవర్‌ట్రెయిన్ కంట్రోల్స్) తయారీ కంపెనీ సెడెమాక్ మెకట్రానిక్స్ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 1,352తో పోలిస్తే ఎన్ఎస్ఈలో రూ. 1,535 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 13.5 శాతం అధికం కాగా.. బీఎస్ఈలో 12 శాతం లాభంతో రూ. 1,510 వద్ద లిస్టయ్యింది. చివరికి 7.4 శాతం బలపడి రూ. 1,452 వద్ద ముగిసింది. -
స్టాక్ మార్కెట్లో ‘బ్లడ్ బాత్’
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ ఏకంగా 394 పాయింట్లు నష్టపోయి 23,866 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1342 పాయింట్లు దిగజారి 76,863 వద్దకు చేరింది. దీంతో మార్కెట్లో ఈ ఒక్కరోజే దాదాపు రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్లు అయింది.అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. ఈరోజు (మార్చి 11, 2026) ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రధానంగా ఎనర్జీ, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడి సూచీలను పాతాళానికి నెట్టింది.సూచీల పతనానికి ప్రధాన కారణాలుఇంధన సంక్షోభం: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు మార్కెట్‌ను భయపెట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర పెరుగుతోంది. భారత్ లాంటి చమురు దిగుమతి దేశానికి పెద్ద దెబ్బగా మారింది.ఎనర్జీ సెక్టార్లో అమ్మకాలు: ముడిచమురు ధరల పెరుగుదల వల్ల ముడి పదార్థాల వ్యయం పెరుగుతుందన్న ఆందోళనతో ఎనర్జీ ఇండెక్స్ ఏకంగా కుప్పకూలింది.ఎఫ్ఐఐల విక్రయాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల వారు సురక్షితమైన బాండ్లు, బంగారం వైపు మళ్లుతుండటంతో దేశీయ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోతోంది.రూపాయి రికార్డు పతనం: చమురు దిగుమతుల కోసం డాలర్లకు డిమాండ్ పెరగడం, ఎఫ్ఐఐల నిష్క్రమణతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇది దిగుమతి చేసుకునే వస్తువుల ధరలను పెంచి, దేశీయ ద్రవ్యోల్బణానికి దారితీస్తుందన్న భయం నెలకొంది.కీలక రంగాలు పతనం: బ్యాంకింగ్, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రెడ్ మార్క్‌లో ట్రేడయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ ఉన్న షేర్లు నష్టపోవడం సూచీల పతనానికి ఆజ్యం పోసింది.ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉంది. నిఫ్టీకి 23,700 వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి, చమురు ధరలు తగ్గితే తప్ప తక్షణ రికవరీ కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ అస్థిర సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, నాణ్యమైన షేర్లలో సిప్ పద్ధతిని కొనసాగించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు? -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 43 పాయింట్లు తగ్గి 24,221 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 182 పాయింట్లు దిగజారి 77,988 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.82బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87.65 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.14 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.21 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.01 శాతం పెరిగింది.Today Nifty position 11-03-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రూడ్ కూల్.. బుల్ చల్!
వారం రోజులుగా భగభగలాడి చప్పున చల్లారిన చమురు ధరలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్లు 2 శాతంపైగా బలపడటంతో దేశీయంగానూ ఇండెక్సులు జోరందుకున్నాయి. వెరసి ఒక దశలో సెన్సెక్స్ 960 పాయింట్లు జంప్‌చేసింది.ముంబై: పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ సంక్షోభం త్వరలోనే ముగియనున్న అంచనాలకుతోడు.. ముడిచమురు ధరలు ఒక్కసారిగా చల్లబడటంతో ప్ర పంచవ్యాప్తంగా సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నేలక్కొట్టిన బంతిలా మార్కెట్లు పైకెగశాయి. సెన్సెక్స్ 640 పాయింట్లు జంప్‌చేసి 78,206 వద్ద ముగిసింది. నిఫ్టీ 234 పాయింట్లు జమ చేసుకుని 24,262 వద్ద స్థిరపడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు 5–2 శాతం మధ్య పుంజుకోవడంతో ఇన్వెస్టర్లకు జోష్‌వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 960 పాయింట్లు ఎగసి 78,526ను తాకగా.. నిఫ్టీ 24,303వరకూ బలపడింది. ఐటీ డీలా ఎన్ఎస్ఈలో ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్(0.4 శాతం)మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ముందురోజు పతనమైన ఆటో, బ్యాంకింగ్, కన్జూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్ 3–1.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్ ఫైనాన్స్ 8 శాతం దూసుకెళ్లగా.. ఇండిగో, ఎంఅండ్ఎం, ఐషర్, టీఎంపీవీ, ఐసీఐసీఐ, మారుతీ, యాక్సిస్, అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ 3.5–2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో ఇన్ఫోసిస్, ఎటర్నల్, రిలయన్స్, ఎయిర్టెల్, టీసీఎస్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.4–0.4 శాతం మధ్య నీరసించాయి. చల్లారిన చమురు...ఉదయం సెషన్లో లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు పీపా ధర 9 శాతం పతనమై 90 డాలర్లకు చేరగా.. న్యూయార్క్‌లో లైట్ స్వీట్ చమురు బ్యారల్ 87 డాలర్లకు దిగివచ్చింది. ఫలితంగా ఏవియేషన్, ఆటో, బ్యాంకింగ్ తదితర రంగాల కౌంటర్లకు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. పశి్చమాసియా ఆందోళనలకు త్వరలోనే ముగింపు పలకనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో సెంటిమెంటుకు ప్రోత్సా హం లభించినట్లు తెలియజేశారు. దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 3,053 లాభపడితే.. 1,231 మాత్రమే డీలా పడ్డాయి. ఎఫ్‌పీఐల వెనకడుగు ఇటీవల దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో తాజాగా రూ. 4,673 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్ (డీఐఐలు) మాత్రం రూ. 6,333 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 6346 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 9,014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో(2–6)నూ ఎఫ్‌పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించడం గమనార్హం.రూపాయి రయ్.. 36 పైసలు అప్– 91.85కు చమురు ధరలు దిగిరావడంతో దేశీ కరెన్సీకి జోష్ వచ్చింది. డాలరుతో మారకంలో 36 పైసలు బలపడింది. వెరసి చరిత్రాత్మక కనిష్టం 92.21 నుంచి కోలుకుని 92 దిగువన 91.85 వద్ద ముగిసింది. రోజంతా 91.71– 92.19 మధ్య ఊగిసలాడింది. సోమవారం 39 పైసలు క్షీణించి 92.21 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ సైతం 0.5 శాతం క్షీణించి 98.65కు చేరింది.ఎరువుల షేర్లకు బలిమి గ్యాస్ కేటాయింపులలో ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తదుపరి ఎరువులకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఫెర్టిలైజర్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. దీంతో రాష్ర్టీయ కెమికల్స్(ఆర్సీఎఫ్) 16%, నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్) 13%, దీపక్ ఫెర్టిలైజర్స్, పారదీప్ ఫాస్ఫేట్స్, చంబల్ ఫెర్టిలైజర్స్ 5%, కోరమాండల్ ఇంటర్నేషనల్ 4% చొప్పున దూసుకెళ్లాయి. -
2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
ఒకవైపు ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, మరోవైపు భారీగా పతనమవుతున్న మార్కెట్లు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం వస్తుందని ఇందులో హెచ్చరించారు.చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం గురించి నేను రిచ్ డాడ్స్ ప్రాఫసీ (2013)లో హెచ్చరించాను. అది రాబోతోంది. 2008లో ప్రపంచం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనిని గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని పిలుస్తారు. ఆ సమయంలో చాలా బ్యాంకులు & ఆర్థిక సంస్థలు కూలిపోయాయి. ముఖ్యంగా అమెరికాలోని పెద్ద పెట్టుబడి బ్యాంక్ అయిన లెమాన్ బ్రదర్స్ దివాళా తీసింది. భవిష్యత్తులో ఇంకా పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 2026లో మరో పెద్ద ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉంది. ఈ పతనం ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థలలో ఒకటైన 'బ్లాక్ రాక్'తో సంబంధం ఉన్న.. ప్రైవేట్ క్రెడిట్ వ్యవస్థ కారణంగా రావచ్చని ఆయన భావిస్తున్నారు.REPEATING A WARNINGIn Rich Dad’s Prophecy (2013) I warned the biggest stock market crash in history….was STILL coming.In 2026, I hope I am wrong…. Yet I am afraid that crash is now arriving.Why did I make that prediction?Because the cause of the 2008 crash, the GFC,…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 10, 2026ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భారీ అప్పుల్లో ఉన్నాయని, ఆ అప్పులను తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వృద్ధుల సేవింగ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం.. డబ్బును కాపాడుకోవాలంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం, ఆయిల్ వెల్స్ వంటి సహజ వనరులలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని చెబుతున్నారు.నాకు వెండి అంటే చాలా ఇష్టమని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఎందుకంటే తక్కువ డబ్బుతో కూడా వెండిని కొనుగోలు చేయవచ్చని ఆయన అభిప్రాయం. కాబట్టి మీరు కూడా కేవలం 10 డాలర్లతో వెండి నాణేలు లేదా చిన్న ముక్కలు కొనుగోలు చేయండి. అవసరమైతే ఒక రోజు తినడం ఆపేసి.. వెండిపై పెట్టుబడి పెట్టండి. తప్పకుండా మీరు ధనవంతులు అవుతారని, జాగ్రత్త వహించండి, అని కియోసాకి తన ట్వీట్ పూర్తి చేశారు. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
మంగళవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 639.82 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 78,205.98 వద్ద, నిఫ్టీ 233.55 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 24,261.60 వద్ద నిలిచాయి.ఆటమ్ ఇన్వెస్ట్మెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుడ్స్ & ఇన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందూస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, డీసీఎం నౌవెల్ లిమిటెడ్, అక్షర్‌కెమ్ (ఇండియా) లిమిటెడ్, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
యుద్ధం ఎఫెక్ట్.. ఆకాశానికి క్రూడ్ ఆయిల్ ధరలు
-
పేకమేడల్లా కుప్పకూలిన సూచీలు.. కారణాలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 449 పాయింట్లు నష్టపోయి 24,001 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1424 పాయింట్లు దిగజారి 77,494 వద్దకు చేరింది.భారత స్టాక్ మార్కెట్లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు పేకమేడల్లా కూలిపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల సెన్సెక్స్, నిఫ్టీలను పాతాళానికి నెట్టేశాయి. కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు దాదాపు ఒకనొక సమయంలో రూ.13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలుగత వారాంతంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ కాల్పుల విరమణకు నిరాకరించడం, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే సూచనలు కనిపిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ పెరిగింది.యుద్ధ భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 26% పెరిగింది. భారత్ తన చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పెంచి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 92.33 కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది.అమెరికాలో 10 ఏళ్ల బాండ్ యీల్డ్స్ 4.20% స్థాయికి చేరడం, డాలర్ ఇండెక్స్ బలపడటం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు సురక్షితమైన అమెరికా బాండ్ల వైపు మళ్లుతున్నాయి.వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆశలు ఆవిరి కావడంతో బ్యాంకింగ్ స్టాక్స్ కుదేలయ్యాయి.ఇదీ చదవండి: ‘చైనాతో చేసిన పొరపాటు భారత్‌తో చేయం’ -
స్టాక్ మార్కెట్ క్రాష్.. రూ.12 లక్షల కోట్లు ఆవిరి!
గత వారం నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ఉదయం కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా దాదాపు 3% పడిపోయాయి. సెన్సెక్స్ దాదాపు 2,400 పాయింట్లు పడిపోయి 76,424కి చేరుకోగా, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా పడిపోయి 23,750కి చేరుకుంది.బీఎస్ఇలో జాబితా చేసిన అన్ని కంపెనీల మొత్తం.. మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి ప్రారంభమైన 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే రూ.12.39 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. సెన్సెక్స్‌లోని అన్ని భాగాలు నష్టాల్లో కూరుకున్నాయి. ఇండిగో షేర్లు దాదాపు 8% నష్టపోయాయి. టాటా స్టీల్, ఎల్ అండ్ టి, ఎస్బీఐ, మారుతి సుజుకి & ఎటర్నల్ షేర్లు వరుసగా 5% నష్టపోయాయి.ఎన్ఎస్ఈలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 5% కంటే ఎక్కువ పడిపోయి భారీ నష్టాన్ని చవిచూసింది. నిఫ్టీ ఆటో దాదాపు 4% పడిపోయింది, నిఫ్టీ రియాలిటీ అండ్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 3% పైగా పడిపోయాయి.పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు ప్రపంచం ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇలాంటి సమయంలో ధరల పెరుగుదల శాశ్వతం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. -
బేర్మన్న స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లో ప్రారంభం!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 2,284.27 పాయింట్లు లేదా 2.89 శాతం నష్టంతో 76,634.63 వద్ద, నిఫ్టీ 703.35 పాయింట్లు లేదా 2.88 శాతం నష్టంతో 23,747.10 వద్ద సాగుతున్నాయి.క్యుపిడ్ లిమిటెడ్, కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ & హాలిడేస్ లిమిటెడ్, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, శేషసాయి టెక్నాలజీస్ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్ టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జింకుశల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లిమిటెడ్, ట్రిజిన్ టెక్నాలజీస్ లిమిటెడ్, నోయిడా టోల్ బ్రిడ్జ్ కంపెనీ లిమిటెడ్, మీషో లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
Stock Markets: ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలిపుడు?
గల్ఫ్ అంటేనే చమురు మార్కెట్‌కు హృదయం లాంటిది. అలాంటి గల్ఫ్‌లో పెద్ద దేశంగా చెలామణి అవుతున్న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడులు ప్రపంచ ఇంధన మార్కెట్లనే కాదు... స్టాక్ మార్కెట్లనూ అతలాకుతలం చేస్తున్నాయి. దేశానికి కావలసిన ముడి చమురులో 88 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న భారత్‌పైనా ఈ ప్రభావం పడుతోంది. మార్కెట్లు అనూహ్యంగా కదులుతున్నాయి. సూచీలు రోజూ 1–2 శాతం పడటం... కొంత రికవరీ కావటం జరుగుతోంది. ఇక కొన్ని షేర్లయితే దారుణంగా పడ్డాయి.ఐటీ సహా పలు షేర్లు మూడేళ్ల కనిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. మరిప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? మార్కెట్ల నుంచి విత్‌డ్రా అయి సురక్షిత సాధనాలవైపు మళ్లాలా? లేక మరికొంత ఇన్వెస్ట్ చేయాలా? సిప్‌లు ఆపేయాలా? కొనసాగించాలా? అసలు యుద్ధ ప్రభావం ఎన్నాళ్లుంటుంది? గతంలో యుద్ధాలు జరిగినపుడు మార్కెట్లు ఎలా స్పందించాయి? ఎన్నాళ్లకు కోలుకున్నాయి? వీటన్నిటిపైనా ఇన్వెస్టర్లకు అవగాహన కలిగించడానికే ఈ ‘వెల్త్’ స్టోరీ...భారత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లవైపు వెళ్లటం పెరిగిన నాటి నుంచీ... అంటే 1990ల నుంచీ చాలా యుద్ధాలు, సంక్షోభాలు వచ్చాయి. 1991 గల్ఫ్ యుద్ధం నుంచి ఇప్పటి ఇరాన్– అమెరికా, ఇజ్రాయెల్ వరకూ పలు యుద్ధాలతో పాటు.. కోవిడ్ వంటి అంతర్జాతీయ సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినపుడు మార్కెట్లు తక్షణ స్పందనగా పతనమయ్యాయి. ఆ పతనం కొన్ని సార్లు భారీగా ఉంటే... మరికొన్నిసార్లు తక్కువగానే కనిపించింది. కోలుకోవటానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పడితే... కొన్నిసార్లు వేగంగానే రికవరీ అయ్యాయి. మరో అద్భుతం ఏంటంటే ప్రతి యుద్ధం... ప్రతి సంక్షోభం ఓ కొత్త చరిత్రకు మార్గం చూపించింది. 1991 గల్ఫ్ యుద్ధం: సంస్కరణలకు మార్గం గల్ఫ్ యుద్ధ సమయంలో చమురు ధరలు 17 డాలర్ల నుంచి 36 డాలర్లకి ఎగబాకాయి. అంటే రెట్టింపుకన్నా ఎక్కువ. పైపెచ్చు మన దగ్గర చాలినంత విదేశీ కరెన్సీ నిల్వలు లేవు. దీంతో భారత్ తీవ్ర ఒత్తిడికి గురయింది. సెన్సెక్స్ సుమారు 21శాతం పతనమైంది. అయితే ఇదే సమయంలో భారతదేశంలో కొత్త చరిత్ర మొదలైంది. నాటి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తెచ్చింది. ఆర్థిక సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణతో పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా కొత్త భారతదేశం ఆవిష్కృతమయ్యింది. 1990ల చివరినాటికి మార్కెట్ కొన్ని రెట్లు పెరిగింది. 2000 డాట్‌కామ్ బబుల్: సుదీర్ఘ రికవరీ ఇంటర్నెట్ కంపెనీలు పుట్టగొడుగులుగా వచ్చి... వాటికి సరైన ఆదాయ మార్గాలు లేకపోవటంతో మూతపడాల్సి వచ్చిన సమయమది. డాట్‌కామ్ బుడగ బద్దలయింది. కంపెనీలు మూతపడ్డాయి. ఈ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 6,150 పాయింట్ల నుంచి 2,594 పాయింట్లకి పడిపోయింది. రికవరీకి రెండున్నరేళ్లకు పైగానే (దాదాపు 850 రోజులు) పట్టింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సాగిన రికవరీ ఇది.అయితే ఈ కాలంలో ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవటం... ద్రవ్యపరంగా క్రమశిక్షణ పాటించటం వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్నిచ్చాయి. 2004 తర్వాత మళ్లీ బలమైన బుల్ రన్ ప్రారంభమైంది. మార్కెట్ల రికవరీని పక్కనబెడితే... డాట్‌కామ్ విప్లవం వల్ల ప్రపంచాన్ని కనెక్ట్ చేసే బలమైన ఇంటర్నెట్ వ్యవస్థ ఏర్పడింది. సముద్రగర్భ కేబుళ్లతో పాటు విస్తృతమైన నెట్వర్క్ వచ్చింది. అది తరువాతి కాలంలో ప్రపంచ గతినే మార్చేసింది. 2008 ఆర్థిక మాంద్యం: భారీ పతనంఅమెరికాలో సబ్‌ప్రైమ్ సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసిన సమయమది. లేమన్ బ్రదర్స్‌తో మొదలుపెట్టి పలు ఆర్థిక సంస్థలు అప్పులు రికవరీ అయ్యే పరిస్థితి లేక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఆర్థిక దిగ్గజాలు బోర్డు మూసేశాయి. పొదుపుపై నిలబడ్డ భారత వ్యవస్థ దేశంలో ఏ ఆర్థిక సంస్థా కుప్పకూలకుండా కాపాడినా... భారత్‌కు కూడా మాంద్యం తాకిడి తప్పలేదు.ఫలితంగా సెన్సెక్స్ 21,206 పాయింట్ల నుంచి 7,697 పాయింట్లకు పతనమైంది. అంటే దాదాపు 64% పతనం. అప్పట్లో స్టాక్ మార్కెట్ యుగం ముగిసినట్టే అని ప్రచారం కూడా జరిగింది. కానీ ఆర్బీఐ లిక్విడిటీ మద్దతు, ప్రభుత్వ ఆరి్ధక ఉద్దీపన ప్యాకేజీలు, ఇన్ఫ్రా పెట్టుబడులు మార్కెట్‌కు మళ్లీ ఊపిరి పోశాయి. 750 రోజుల్లో సెన్సెక్స్ తిరిగి పాత గరిష్ట స్థాయికి చేరింది. ఈ సంక్షోభం అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో స్రూ్కటినీని పెంచటంతో పాటు కొత్త పెట్టుబడి సాధనాలకు మార్గం చూపించింది. 2020 కోవిడ్: వేగవంతమైన రికవరీ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టేయటంతో అంతర్జాతీయంగా స్టాక్‌మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ప్రపంచం లాక్డౌన్ అయింది. సెన్సెక్స్ 39 శాతం పతనమైంది. కానీ కేవలం 230 రోజుల్లోనే తిరిగి పాత గరిష్ఠ స్థాయిని చేరుకుంది. కాకపోతే ఈ సంక్షోభం ప్రపంచాన్ని డిజిటల్‌వైపు నడిపించింది. సోషల్ మీడియాను కొత్త శిఖరాలకు చేర్చింది. పేమెంట్ల వ్యవస్థను, కార్యాలయాల్లో పనిచేసే పద్ధతిని సమూలంగా మార్చేసింది. ఇప్పుడు చూస్తున్న చాలా మార్పులు కోవిడ్ ఫలితమేనంటే అతిశయోక్తి కాదు. 2022 రష్యా– ఉక్రెయిన్ యుద్ధం: ద్రవ్యోల్బణ షాక్ ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగటంతో ముడి చమురు బ్యారెల్ ధర 130 డాలర్ల వరకు పెరిగింది. ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరుకుంది. స్టాక్ మార్కెట్లు 8 శాతం దాకా పతనమయ్యాయి. అయితే దేశం 6 నెలల్లో ఈ యుద్ధ ప్రభావం నుంచి కోలుకోగలిగింది. ఉక్రెయిన్ ఉద్రిక్తత కారణంగా భారత్ తన సరఫరా వ్యవస్థను సమూలంగా మార్చుకుంది. గ్లోబల్ యుద్ధాల్లో నిలబడే శక్తిని సమకూర్చుకుంది. 2023–2026 అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతలు పది రోజుల కిందట.. అంటే ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై దాడులకు దిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయొతుల్లా ఖమేనీని క్షిపణి దాడులతో హతమార్చాయి. ఇరాన్ ప్రతి దాడులకు దిగటంతో పాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేసింది. ఈ యుద్ధం ఫలితంగా ముడి చమురు ధరలు గడిచిన వారం రోజుల్లోనే 36 శాతం వరకూ పెరిగాయి. దీని ప్రభావం భారత్‌పై ఎక్కువే కావటంతో స్టాక్ మార్కెట్లు విపరీతంగా ఊగిసలాటకు గురవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలతో మదుపరులు అమ్మకాలకు దిగుతున్నారు. ఈ యుద్ధం ఆరంభానికి ముందు 26,300 పాయింట్లను తాకిన నిఫ్టీ... దాదాపు 1,800 పాయింట్లు నష్టపోయింది. అంటే దాదాపు 7 శాతం పతనమైంది. యుద్ధం ఇంకా కొనసాగుతోంది. భారత్‌పై యుద్ధ ప్రభావాలు ఒకప్పటిలా ఉండే అవకాశం తక్కువ, ఎందుకంటే..⇒ సుమారు 700 బిలియన్ డాలర్లకు పైగా భారీ ఫారెక్స్ రిజర్వులున్నాయి. ⇒ పొదుపు ఆధారితం నుంచి వినియోగదారుల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోంది. ⇒ రూపాయి కదలికలను – లిక్విడిటీని నియంత్రించే సామర్థ్యం రిజర్వ్‌బ్యాంకుకు ఉండడం. ⇒ దేశీ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.ఇన్వెస్టర్లు ఏం చేయాలి?సంక్షోభాల గురించి స్టాక్‌మార్కెట్లు చెబుతున్నదొకటే. పతనం తాత్కాలికం. ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంటే మార్కెట్లూ పెరుగుతాయి. నిపుణుల సూచన ప్రకారం... ఇప్పటికే మార్కెట్లు కొంత పడ్డాయి. భారీగా లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు తాత్కాలికంగా కొంతవరకూ వెనక్కి తీసుకున్నా పర్వాలేదు. కానీ నష్టాల్లో వైదొలగటం అనేది సరైన నిర్ణయం కాదు. మార్కెట్ల పతనం అనేది మరింత పెట్టుబడులకు అవకాశంగానే భావించాలి తప్ప ఉపసంహరణకు కాదు. సిప్ చేస్తున్నవారు మార్కెట్లు మరింత పతనమైతే మరింత పెట్టుబడి పెట్టే మార్గాన్ని పరిశీలించుకోవాలి. దిగువ స్థాయిల్లో సిప్‌ను కొనసాగిస్తేనే మంచి లాభాలు కళ్లచూస్తారు. యుద్ధాలు, సంక్షోభాలు ప్రతికూలం (నష్టపోయే రంగాలు)⇒ ఏవియేషన్⇒ ఆటోమొబైల్స్ ⇒ కెమికల్స్ ⇒ ఆయిల్ ఆధారిత పరిశ్రమలుఅనుకూలం (లాభపడే రంగాలు)⇒ డిఫెన్స్ సంబంధిత కంపెనీలు ⇒ ఎఫ్ఎంసీజీ సంస్థలు ⇒ ఫార్మా కంపెనీలు⇒ చమురు అన్వేషణ సంస్థలు ⇒ గోల్డ్ సంబంధిత పెట్టుబడులు -
కుప్పకూలిన మార్కెట్లు.. కూల్చేసిన క్రూడ్
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడంతో బ్రెంట్ క్రూడ్ ఏడాది కాల గరిష్టానికి పెరగడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు షెషన్ చివర్లో గణనీయ నష్టాలను చవిచూశాయి.నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 1.27 శాతం లేదా 315.45 పాయింట్ల నష్టంతో 24,450.45 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 1.37 శాతం లేదా 1,097 పాయింట్లు నష్టపోయి 78,918.90 వద్ద ముగిసింది.యూఎస్-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నందున హోర్ముజ్ జలసంధి షిప్పింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసిందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఇది సరఫరా అంతరాయం భయానికి ఆజ్యం పోసింది. దీంతో యూరోపియన్ వాణిజ్య సెషన్ లో బ్రెంట్ క్రూడ్ ను బ్యారెల్ కు 87 డాలర్ల మార్కుకు పైగా నెట్టింది.నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.69 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.24 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 2.27 శాతం క్షీణతతో అత్యంత చెత్త పనితీరు కనబరిచిన సూచీగా నిలిచింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్‌లో నష్టపోయిన ఇతర రంగాలు. ఇదిలా ఉండగా, నిఫ్టీ ఐటీ స్వల్ప లాభాలతో సెక్టోరల్ సూచీలను అధిగమించింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 101 పాయింట్లు నష్టపోయి 24,659 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 353 పాయింట్లు పడిపోయి 79,662 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.96బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.51 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.13 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.56 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.26 శాతం నష్టపోయింది.Today Nifty position 06-03-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
-
మార్కెట్లకు జోష్.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 811.21 పాయింట్లు (1.03 శాతం) పెరిగి 79,927.40 వద్ద, నిఫ్టీ 285.40 పాయింట్లు (1.17 శాతం) పెరిగి 24,765.90 వద్ద నిలిచాయి.ఎల్గీ రబ్బర్ కంపెనీ లిమిటెడ్, మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, సెంచరీ ఎక్స్‌ట్రూషన్స్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్, ఇంటిగ్రే ఎసెన్షియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అక్విలాన్ నెక్సస్ లిమిటెడ్, పిఎన్‌జిఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.స్టాక్ మార్కెట్స్ పెరగడానికి కారణంభారతీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ వదిలివేయడానికి కొన్ని షరతులతో సిద్ధంగా ఉందని వదంతులు రావడమే. దీంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చని భావించి పెట్టుబడిదారులు మార్కెట్లో కొనుగోళ్లు పెంచారు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్ సూచీల దారెటు?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 117 పాయింట్లు పెరిగి 24,596 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 375 పాయింట్లు పుంజుకొని 79,502 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 05-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యుద్ధం దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
-
స్టాక్ మార్కెట్ క్రాష్.. 1122 పాయింట్లు కూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మధ్యప్రాచ్యంలో ఏర్పడుతున్న పరిస్థితి గురించి మదుపరులు ఆందోళన చెందడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడవ సెషన్లోనూ క్షీణించాయి. సెన్సెక్స్ 10 నెలల కనిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 50 ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 1.6 శాతం లేదా 385.2 పాయింట్ల నష్టంతో 24,480.5 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 1.40 శాతం లేదా 1,122.66 పాయింట్లు నష్టపోయి 79,116.19 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఎన్బీ ట్రేడ్& ఫైనాన్స్, సికాల్ లాజిస్టిక్స్, సాధన నైట్రో కెమ్, పాదం కాటన్ యార్న్స్, ఎఫ్ మెక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఎకో హోటల్స్ అండ్ రిసార్ట్స్, రూబీ మిల్స్, మార్గ్ టెక్నో ప్రాజెక్ట్స్, పిక్చర్‌హౌస్ మీడియా, శ్రీ హవిషా హాస్పెటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను మించి పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.2 శాతం, 2.1 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్ అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బుధవారం సెషన్ ను లాభాలతో ముగించిన ఏకైక సెక్టోరల్ సూచీ నిఫ్టీ ఐటీ. -
యుద్ధ భయాలు.. మార్కెట్లో నీలినీడలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 486 పాయింట్లు తగ్గి 24,384 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1580 పాయింట్లు నష్టపోయి 78,661 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.15బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.06 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.94 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.02 శాతం దిగజారింది.అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఆధారిత ఇంధనాలను గణనీయంగా ఉపయోగించే దేశాల స్టాక్ మార్కెట్లు, కంపెనీలను కుదేలు చేస్తోంది. అటు ఆసియా, యూరప్ సూచీలు కూడా భారీగా తగ్గాయి.దక్షిణ కొరియా కోస్పి స్టాక్ ఇండెక్స్ ఏకంగా 7.2 శాతం పతనమైంది. ఆరు నెలలకు పైగా సరిపడే ఆయిల్ నిల్వలున్నప్పటికీ జపాన్ నికాయ్ 225 సుమారు 3 శాతం క్షీణించగా, జర్మనీకి చెందిన డాక్స్ సూచీ 3.9 శాతం పతనమైంది. మంగళవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో దేశీ మార్కెట్లు పనిచేయలేదు.అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కి 7% పైగా పెరిగి 82.2 డాలర్ల వద్ద, నైమెక్స్ 7.5 శాతం పెరిగి 76.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, ఔన్సు (31.1 గ్రాముల) పసిడి 3 శాతం పైగా నష్టపోయి 5,133 డాలర్ల వద్ద, సిల్వర్ 6 శాతం పైగా క్షీణించి 83.42 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.Today Nifty position 04-03-2026(time: 9:22 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నా యుద్ధం కారణంగా.. సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,048.34 పాయింట్ల నష్టంతో 80,238.85 వద్ద, నిఫ్టీ 312.95 పాయింట్ల నష్టంతో 24,865.70 వద్ద నిలిచాయి.జిందాల్ డ్రిల్లింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్, ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. వర్వీ గ్లోబల్ లిమిటెడ్, కృధాన్ ఇన్ఫ్రా లిమిటెడ్, AKG Exim లిమిటెడ్, క్లీన్ మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఫింకుర్వే ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
యుద్ధం పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలు
-
1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 283 పాయింట్లు తగ్గి 24,886 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1004 పాయింట్లు నష్టపోయి 80,294 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.8బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.98 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.18 శాతం దిగజారింది.ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్‌అరబ్ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి.హుర్ముజ్ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది.Today Nifty position 02-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ సెలవులు.. ట్రేడింగ్ బంద్
భారత స్టాక్ మార్కెట్లకు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) మార్చి నెలలో వారాంతాలతోపాటు మూడు ప్రధాన సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు హోలీ, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి పండుగలకు సంబంధించినవి. మార్చి 3 (మంగళవారం) హోలీ సెలవు, మార్చి 26 (గురువారం) శ్రీరామ నవమి సెలవు, మార్చి 31 (మంగళవారం) మహావీర్ జయంతి సెలవుగా ప్రకటించారు. ఈ రోజుల్లో ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ సెగ్మెంట్లలో ట్రేడింగ్ పూర్తిగా అందుబాటులో ఉండదు.ట్రేడింగ్ ఏయే రోజుల్లో..మార్చి నెలలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు, శని, ఆదివారాలు,పైన పేర్కొన్న సెలవులు మినహా అందుబాటులో ఉంటుంది. మార్చిలో మొత్తం 31 రోజులు ఉండగా, మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారాలు, మార్చి 7, 14, 21, 28 తారీఖుల్లో శనివారాలు వస్తాయి. వీటితోపాటు పండుగల సెలవులు పోగా మిగిలిన 19 రోజులు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలుమార్కెట్ రీసెర్చ్: ఏదైనా స్టాక్ లేదా సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు పూర్తి అధ్యయనం చేయండి. కంపెనీ ఫండమెంటల్స్, మార్కెట్ ట్రెండ్స్, ఆర్థిక సూచికలను పరిశీలించండి.రిస్క్ మేనేజ్మెంట్: మొత్తం మూలధనాన్ని ఒకే స్టాక్‌లో పెట్టకుండా, డైవర్సిఫికేషన్ చేయండి. స్టాప్-లాస్ ఆర్డర్లు ఉపయోగించి నష్టాలను నియంత్రించండి.ఎమోషనల్ డెసిషన్స్ వద్దు: మార్కెట్ హెచ్చుతగ్గులకు భావోద్వేగాలతో స్పందించకుండా, లాంగ్-టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేయండి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (FOMO) లాంటి భావనలను నివారించండి.ట్యాక్స్, రెగ్యులేటరీ అవగాహన: షార్ట్-టర్మ్, లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రూల్స్ తెలుసుకోండి. సెబీ రెగ్యులేషన్లకు అనుగుణంగా ట్రేడ్ చేయండి.సెలవుల సమయంలో ప్లానింగ్: సెలవుల ముందు లేదా తర్వాత మార్కెట్ వాల్యూమ్ తక్కువగా ఉండవచ్చు, దీంతో వోలటాలిటీ పెరగవచ్చు. అందువల్ల ముందుగానే పొజిషన్లను అడ్జస్ట్ చేయండి.ఈ సెలవులు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వెబ్సైట్లను చెక్ చేయాలి. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
-
బ్యాంకుల షేర్లు విలవిల.. స్టాక్ మార్కెట్ భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీతా పతనమయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య రియల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ క్షీణించడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు గణనీయంగా క్షీణించాయి.నిఫ్టీ 1.22 శాతం లేదా 311.85 పాయింట్ల నష్టంతో 25,178.65 వద్ద, సెన్సెక్స్ 961.42 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టపోయి 81,287.19 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా పడిపోయాయి.విస్తృత మార్కెట్లు కూడా బెంచ్ మార్క్ సూచీలకు అనుగుణంగా పడిపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.14 శాతం, 1.10 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు అత్యధికంగా క్షీణించాయి. ఈ సూచీలు వరుసగా 2.3 శాతం, 2.1 శాతం నష్టపోయాయి. -
టైమ్ వచ్చేసింది మిత్రమా.! ఇప్పుడే కొనేయండి.. లేదంటే పేదలుగా మిగిలిపోతారు
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు తగ్గి 25,403 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 269 పాయింట్లు నష్టపోయి 81,971 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.81బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 70.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.54 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.18 శాతం దిగజారింది.Today Nifty position 27-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రేడింగ్‌కు కనీస అర్హత ఉండాలి
డెరివేటివ్స్(ఎఫ్‌అండ్‌వో)లో పాలుపంచుకునే ఇన్వెస్టర్లకు కనీస అర్హతా ప్రమాణాలు ఉండాలని స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. తద్వారా ఆర్థికంగా బలహీనవర్గాలు లేదా కనీస అవగాహనలేని ప్రజలు స్పెక్యులేషన్‌తో సొమ్మును వృధా చేసుకోకుండా నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.నిజానికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో లావాదేవీలు నిర్వహిస్తున్న ట్రేడర్లలో 90 శాతంమంది సొమ్ము నష్టపోతున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పదేపదే వెల్లడిస్తున్న నేపథ్యంలో చౌహాన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అంతంతమాత్రం ఆదాయాలు, అవగాహన ఉండే సామాన్య ప్రజానీకం తమ సొమ్మును, వనరులను, ఎనర్జీని స్పెక్యులేషన్‌పై వృధా చేసేందుకు ఏ వర్ధమాన దేశమూ అనుమతించబోదని చౌహాన్ పేర్కొన్నారు.డెరివేటివ్స్ లావాదేవీలు చేయాలంటే కనీస అర్హత ప్రమాణాలు ఉండేలా నిబంధనలు రూపొందించవలసి ఉన్నట్లు ఇక్కడ జరిగిన ఒక సదస్సులో అభిప్రాయపడ్డారు. యూఎస్, సింగపూర్ తదితర దేశాలలో ఉన్న నియంత్రణలతరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో కనీస అవగాహనలేని సామాన్య ప్రజలు డెరివేటివ్స్‌లో లావాదేవీలు నిర్వహించకుండా అడ్డుకోవచ్చని, తద్వారా వారు నష్టపోకుండా నివారించవచ్చని వివరించారు.ఇదీ చదవండి: షాపింగ్ బిల్లుకు నో ఫోన్‌నెంబర్! -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 45.52 పాయింట్ల నష్టంతో 82,230.55 వద్ద, నిఫ్టీ 14.05 పాయింట్ల లాభంతో 25,496.55 వద్ద నిలిచాయి.ఎక్స్‌టిగ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్, రుద్ర గ్లోబల్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్, సనోఫీ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ఇండియా లిమిటెడ్, రినైసాన్స్ గ్లోబల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ & సొల్యూషన్స్ లిమిటెడ్, జిందాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్, ట్రాన్స్‌వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, వీఎల్ ఈ గవర్నెన్స్ & ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఏఐ మార్కెటింగ్ గిమ్మిక్స్‌తో జాగ్రత్త!
ఏఐ వినియోగించడం ద్వారా అనూహ్య లాభాలు పేరిట తెరతీసే మార్కెటింగ్ గిమ్మిక్స్‌పట్ల జాగ్రత్త వహించవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ డైరెక్టర్ అమర్జీత్ సింగ్ తాజాగా పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు స్టాక్ మార్కెట్లపట్ల ప్రజలలో విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఏఐ వినియోగం ద్వారా అత్యుత్తమ రిటర్నులు ఆర్జించవచ్చంటూ మార్కెట్ పార్టిసిపెంట్లు కొంతమంది అతిచేయడాన్ని ఈ సందర్భంగా సింగ్ ప్రస్తావించారు. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, ఐఐఎంకే సంయుక్తంగా నిర్వహించిన ఈవెంట్లో సింగ్ పలు విషయాలను పేర్కొన్నారు.ఏఐ వినియోగించడం ద్వారా సాధించిన అంశాలను కంపెనీలు అర్ధవంత విధానంలో తెలియజేయవలసి ఉంటుందని సూచించారు. అతిగా ఆర్జించినట్లు లేదా కొన్ని రకాల క్లెయిముల ప్రకటనలు ఇన్వెస్టర్లను మార్కెట్లపట్ల తప్పుదోవపట్టించడంతోపాటు.. విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశమున్నట్లు హెచ్చరించారు. నిజానికి విద్య, పరిశోధన, సమాచారం తదితరాలకు ఏఐ శక్తివంతమైన టూల్ అని పేర్కొన్నారు. అయితే ఏఐతో తప్పుడు సమాచార వ్యాప్తికీ వీలున్నదని, వీటిపట్ల అప్రమత్తత అవసరమని తెలియజేశారు. -
25,500 మార్కు వద్ద నిఫ్టీ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 25,536 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 148 పాయింట్లు పుంజుకొని 82,424 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.58బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.81 శాతం పెరిగింది.నాస్డాక్ 1.26 శాతం పుంజుకుంది.Today Nifty position 26-02-2026(time: 9:22 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడే లాభాలను వదులుకున్నప్పటికీ భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాలతో ముగియగలిగాయి. మెటల్, ఐటీ స్టాక్స్ లో లాభాలు మొత్తంగా నష్టాలను తగ్గించాయి. నిఫ్టీ 57.85 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 25,482.50 వద్ద, సెన్సెక్స్ 0.06 శాతం లేదా 50.15 పాయింట్లు లాభపడి 82,276.07 వద్ద ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, సుఫార్మా, టీసీఎస్ ఎగిశాయి. 2 నుంచి 3 శాతం వరకు లాభపడ్డాయి. కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ, ఆర్ఐఎల్, భారతీ ఎయిర్టెల్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.14 శాతం, స్మాల్ క్యాప్ 100 0.45 శాతం లాభపడ్డాయి. ఇండియా బీఐఎక్స్ 5 శాతానికి పైగా తగ్గి 14.15 వద్ద ముగిసింది.రంగాలవారీగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 2 శాతం లాభపడగా, ఆటో, ఐటీ ఇండెక్స్ ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. విస్తృత మార్కెట్లో, అమెరికా దిగుమతి సుంకాల ప్రకటన తరువాత సోలార్ సంబంధిత స్టాక్స్ 14 శాతం వరకు పడిపోయాయి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 152 పాయింట్లు పెరిగి 25,573 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 501 పాయింట్లు పుంజుకొని 82,722 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.82బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.77 శాతం పెరిగింది.నాస్డాక్ 1.05 శాతం పుంజుకుంది.Today Nifty position 25-02-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీలో పెను మార్పులు
ప్రస్తుతం ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ).. సాఫ్ట్వేర్ సర్వీసుల్లో పెను మార్పులకు తెరతీస్తున్నట్లు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తాజా నివేదిక పేర్కొంది. వెరసి ఐటీ రంగం వ్యవస్థాగతంగా తీవ్ర మార్పులకు లోనుకానున్నట్లు అభిప్రాయపడింది. ఐటీ రంగానికి కీలకమైన బిజినెస్ మిక్స్‌ను ఏఐ పునర్నిర్వచించనున్నట్లు తెలిపింది. తద్వారా కాలానుగుణ మార్పులు (సైక్లికాలిటీ) పెరగడంతోపాటు.. నిర్వహణా పద్ధతులు, నైపుణ్యాలు పునసమీక్షించుకోవలసి ఉన్నట్లు వివరించింది. ఏఐ సవాళ్లు ముగియలేదని, కన్సల్టింగ్, ఇంప్లిమెంటేషన్ పెరుగుతున్నప్పటికీ ఏఐ ఆధారిత మార్పులు సంప్రదాయ మేనేజ్డ్ సర్వీసులకు చెక్ పెట్టే అవకాశమున్నదని పేర్కొంది. డౌన్‌గ్రేడ్ బాటలో..ఇప్పటికే ఐటీ దిగ్గజ కౌంటర్లు గరిష్టాల నుంచి 20–25 శాతం మధ్య పతనమైనప్పటికీ మరింత క్షీణతకు వీలున్నట్లు నివేదికలో జెఫరీస్ అంచనా వేసింది. ఈ బాటలో ఐటీ పరిశ్రమ లీడర్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లను సైతం డౌన్‌గ్రేడ్ చేసింది. తద్వారా షేర్ల ధరల టార్గెట్‌ను 33 శాతంమేర కుదించింది. ఇటీవల ఆంత్రోపిక్ క్లాడ్ తదితరాలు అసిస్టెంట్ల స్థాయి నుంచి క్లిష్టమైన టాస్క్‌లకు సైతం పూర్తి చేయగల టూల్స్‌ను రూపొందిస్తూ ఏఐ సవాళ్లు విసురుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొద్ది వారాలుగా సంప్రదాయ ఐటీ సర్వీసులు సహా.. సాఫ్ట్వేర్ విభాగ సేవలకు చెక్ పడే వీలున్నదని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నట్లు నివేదిక వివరించింది. ఆదాయాల్లో 22–45% వరకూ ఆక్రమిస్తున్న అప్లికేషన్ మేనేజ్డ్ సర్వీసుల నుంచి ఐటీ కంపెనీలు అడ్వయిజరీ, ఇంప్లిమెంటేషన్వైపు వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టవలసి ఉంటుందని సూచించింది. కాగా.. ఈ ప్రభావంతో దేశీయంగా ఫిబ్రవరి తొలి 3 వారాల్లోనే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 20% పతనంకావడం గమనార్హం! -
కోబాల్ షాక్
ముంబై: అమెరికా ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ కొత్త అప్డేట్ తీసుకొచ్చినప్పుడల్లా ‘ఐటీ మార్కెట్’ వణికిపోతోంది. తాజాగా కోబాల్ వంటి పాత ప్రోగ్రామింగ్ భాషలతో పనిచేస్తున్న సిస్టమ్‌లు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మార్చేందుకు తమ ‘క్లాడ్ కోడ్’ టూల్ ఉపయోగపడుతుందని ప్రకటించింది. ఈ కోడింగ్ టూల్స్‌తో ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ప్రాజెక్టులపై వ్యయాలు తగ్గి, కంపెనీల ఆదాయాల పరిమితం కావొచ్చని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో ఐటీ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఒకశాతానికి పైగా పతనమైంది.అంతర్జాతీయ వాణిజ్య సంబంధిత అనిశి్చతులు, క్రూడాయిల్ ధరలు, అమెరికా–ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 1069 పాయింట్లు పతనమై 82,226 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 25,425 వద్ద నిలిచింది. ఒక్కరోజే రూ.2.85 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.466 లక్షల కోట్లకు దిగివచ్చింది. అంతర్జాతీయంగా డాలర్ పుంజుకోవడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలహీనపడి 90.95 వద్ద స్థిరపడింది. బలహీనంగా మొదలై.. భారీ నష్టాల్లోకి..అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ గడిచే కొద్ది మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఏఐ భయాలు ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేయటంతో ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో చిత్తు అయ్యాయి. రియల్టీ, మీడియా స్టాక్స్ కూడా భారీగానే నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,360 పాయింట్లు క్షీణించి 82 వేల స్థాయి దిగువన 81,934 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పతనమై 25,328 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అలాగే మంగళవారం నిఫ్టీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల వీక్లీ ఎక్స్పైరీ కావడంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మార్పు, చేర్పులు చేసుకోవడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. ⇒ ఆంథ్రోపిక్ తాజా అప్డేట్ ప్రకటనతో భారత ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఎల్టీఐఎం 6.50%, టెక్ మహీంద్రా 6.17%, పెర్సిస్టెంట్ 6%, హెచ్‌సీఎల్ టెక్ 5.83%, కోఫోర్జ్ 5.24% క్షీణించాయి. ఎంఫసిస్ 3.67%, టీసీఎస్ 3.56%, ఇన్ఫోసిస్ 3.56%, విప్రో 3% పతనమయ్యాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్సు 4.8% నష్టపోయింది. కృత్రిమ మేధ ఆందోళనలతో నిఫ్టీ ఐటీ ఇండెక్సు ఈ ఫిబ్రవరిలో ఏకంగా 21% కుప్పకూలింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2008) తర్వాత ఈ సూచీ ఒక నెలలో ఆ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 5%, రియల్టీ 2.61%, టెలీకమ్యూనికేషన్ 1.79%, కన్జూమర్ డి్రస్కేషనరీ 1.12%, ఇండ్రస్టియల్స్ 0.91%, క్షీణించాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.68%, 0.54% చొప్పున క్షీణించాయి. ⇒ ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ యూఎస్ సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా ఇతర చట్టాల ద్వారా టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో ఇండోనేíÙయా 1.4%, హాంగ్‌కాంగ్ 1.85%, సింగపూర్ 0.4% పతనమయ్యాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు అరశాతం వరకు పతనమయ్యాయి. అమెరికా స్టాక్ సూచీలు ఆరంభంలో భారీగా పడి, వెంటనే కోలుకుని లాభాలతో ట్రేడవుతున్నాయి.ఐబీఎంకు ఆంథ్రోపిక్ భయంఐబీఎం సిస్టమ్స్‌లో ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోబాల్‌ను తమ ‘క్లాడ్ కోడ్ టూల్ ఆధునికీకరించగలదంటూ ఆంథ్రోపిక్ చేసిన ప్రకటనతో ఐబీఎం షేరు కుప్పకూలింది. సోమవారం ఏకంగా 13.2% క్షీణించి 223.35 డాలర్ల వద్ద ముగిసింది. 2000 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువకు ఒక్కరోజే 40 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.టెక్ నిపుణులు నెలల పాటు శ్రమించి రూపొందించే కోడ్ లాంగ్వేజీని స్వల్ప వ్యవధిలో పూర్తి చేసే కోబాల్ క్లాడ్ కోడ్ టూల్ ఆవిష్కరణతో ఐబీఎంతో పాటు అంతర్జాతీయంగా సైబర్ సెక్యురిటీ, సాఫ్ట్వేర్ యాస్ ఏ సర్వీస్ (సాస్) రంగంలోని దిగ్గజ కంపెనీల షేర్లు భారీ నష్టపోయాయి. ఈ ప్రభావమూ దేశీయ ఐటీ సంస్థల షేర్లపై పడింది. సోమవారం భారీ నష్టం నుంచి తేరుకున్న ఐబీఎం షేరు మంగళవారం ఇంట్రాడేలో 4.27% లాభంతో 232.88 డాలర్లను తాకింది. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్: సెన్సెక్స్ & నిఫ్టీ ఇలా..
మంగళవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 974.77 పాయింట్ల నష్టంతో 82,319.89 వద్ద, నిఫ్టీ 253.65 పాయింట్ల నష్టంతో 25,459.35 వద్ద నిలిచాయి.డాల్ఫిన్ ఆఫ్‌షోర్ ఎంటర్ప్రైజెస్ (ఇండియా) లిమిటెడ్, రీగాల్ రిసోర్సెస్ లిమిటెడ్, తమిళనాడు టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఎంబీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, డీఈఈ డెవలప్మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అకీ ఇండియా లిమిటెడ్, యాత్ర ఆన్లైన్ లిమిటెడ్, భండారీ హొజియరీ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఆరే డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 198 పాయింట్లు తగ్గి 25,512 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 706 పాయింట్లు దిగజారి 82,587 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.78బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.07 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.04 శాతం తగ్గింది.నాస్డాక్ 1.13 శాతం దిగజారింది.Today Nifty position 24-02-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాక్..!
-
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 479.95 పాయింట్ల లాభంతో 83,294.66 వద్ద, నిఫ్టీ 132.70 పాయింట్ల లాభంతో 25,703.95 వద్ద నిలిచాయి.అక్మే ఫిన్‌ట్రేడ్ (ఇండియా) లిమిటెడ్, మోర్పెన్ లాబొరేటరీస్ లిమిటెడ్, అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, డీఈఈ డెవలప్మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్, ఇండో టెక్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, యూపీఎల్ లిమిటెడ్, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, ఈ2ఈ నెట్వర్క్స్ లిమిటెడ్, 63 మూన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బిగ్ షాక్


