దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. నవంబర్ సిరీస్కు సంబంధించి నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల నెలవారీ గడువు ముగింపు ఒత్తిడితో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 క్షీణించాయి.
సెషన్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 313.7 పాయింట్లు లేదా 0.37 శాతం నష్టపోయి 84,587.01 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 74.7 పాయింట్లు లేదా 0.29 శాతం తగ్గి 25,884.8 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ లో ట్రెంట్, టాటా మోటార్స్ పీవీ, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్గా మిగిలిపోగా బీఈఎల్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఎటర్నల్ టాప్ గెయినర్స్ లో చోటు దక్కించుకున్నాయి.
రంగాలవారీగా నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకులు వరుసగా 1.62 శాతం, 1.44 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీ 0.57 శాతం, నిఫ్టీ మీడియా 0.8 శాతం క్షీణించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.36 శాతం, 0.19 శాతం లాభపడ్డాయి.


