దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో స్టాక్స్ లో బలమైన లాభాల కారణంగా భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 595.19 పాయింట్లు లేదా 0.71 శాతం పెరిగి 84,466.51 వద్ద, నిఫ్టీ 50 సూచీ 180.85 పాయింట్లు లేదా 0.7 శాతం పెరిగి 25,875.80 వద్ద ముగిసింది.
బీఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్గా ఉండగా, టాటా స్టీల్, టాటా మోటార్స్ పీవీ, బీఈఎల్ ప్రధాన వెనుకబడివాటిలో ఉన్నాయి. ఇక ఎన్ఎస్ఈ విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంట్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ కాగా టాటా మోటార్స్ పీవీ, టాటా మోటార్స్ సీవీ, టాటా స్టీల్ టాప్ లూజర్స్గా నిలిచాయి.
బెంచ్మార్క్తోపాటు విస్తృత సూచీలు కూడా లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.79 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.82 శాతం లాభపడింది. రంగాలవారీగా 2.04 శాతం లాభంతో నిఫ్టీ ఐటీ టాప్ గెయినర్‌గా ఉంది. ఇక నిఫ్టీ ఆటో 1.24 శాతం, ఫార్మా 1 శాతం లాభపడ్డాయి.


