గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 90.33 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 83,368.82 వద్ద, నిఫ్టీ 78.30 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో.. 25,519.35 వద్ద నిలిచాయి.
ఎక్స్‌క్సారో టైల్స్, రెడింగ్టన్, ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్, సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్, స్మార్ట్‌లింక్ హోల్డింగ్స్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫైనోటెక్స్ కెమికల్, అప్‌డేటర్ సర్వీసెస్, ఓస్వాల్ ఆగ్రో మిల్స్, జ్యోతి స్ట్రక్చర్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


