 
													దేశీయ కంపెనీల క్యూ2 ఫలితాలపై మదుపరుల అంచనాల మధ్య భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు అస్థిరంగా ఉన్నాయి. ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు వెంటనే పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 146 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 84,550 వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా, నిఫ్టీ 50 సూచీ 33 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 25,911 వద్ద కదులుతోంది.
మారుతి సుజుకి, టీసీఎస్, బీఈఎల్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ పీవీ, ఎల్ అండ్ టీ, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం మార్కెట్ రికవరీలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా షేర్లు కూడా లాభాల వైపు పయనిస్తున్నాయి.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.61 శాతం, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.06 శాతం క్షీణించాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.8 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.5 శాతం, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
