సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 445.06 పాయింట్లు లేదా 0.52 శాతం నష్టంతో 84,786.86 వద్ద, నిఫ్టీ 108.65 పాయింట్లు లేదా 0.42 శాతం నష్టంతో.. 25,959.50 వద్ద నిలిచాయి.
RKEC ప్రాజెక్ట్స్, జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, విఎల్‌ఎస్ ఫైనాన్స్, NRB ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మంగళం డ్రగ్స్ & ఆర్గానిక్స్, మాగెల్లానిక్ క్లౌడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, సుమిత్ వుడ్స్, యూరో ప్యానెల్ ప్రొడక్ట్స్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


