దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 133 పాయింట్లు పెరిగి 25,826కు చేరింది. సెన్సెక్స్(Sensex) 441 పాయింట్లు పుంజుకొని 84,328 వద్ద ట్రేడవుతోంది.

కొన్ని రోజులుగా నిఫ్టీ సూచీ 25,500(50 పాయింట్లు బఫర్) నుంచి 26,000 మార్కు మధ్యే కదలాడుతుంది. పైన తెలిపిన కనిష్ట మార్కు వద్దకు సూచీ రాగానే కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ 26,000 మార్కు పైకి వచ్చి ఒకటి లేదా రెండు రోజులు నిలకడగా ఉంటే టెక్నికల్ సమాచారం ప్రకారం మార్కెట్ సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


