ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ పోకడల మధ్య భారత బెంచ్ మార్క్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.23 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 81 పాయింట్లు లేదా 0.10 శాతం తగ్గి 84,592 వద్ద ఉండగా, నిఫ్టీ 50 34 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టపోయి 25,877 వద్ద ట్రేడవుతోంది.
టాటా మోటార్స్ పీవీ, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎటర్నల్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ సెన్సెక్స్‌లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. హెచ్ యూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా స్టీల్, టెక్ ఎం, ట్రెంట్ వంటివి టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం క్షీణించింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.62 శాతం లాభపడింది. దీనికి విరుద్ధంగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయింది.


