breaking news
Road Accident
-
క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం : ఇండిగో ఉద్యోగిని దుర్మరణం
విధి నిర్వహణ అనంతరం ఇంటికి తిరిగి వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) మహిళా ఉద్యోగి తిరిగి రాని లోకాలకు తరలిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముంబైలో పని ముగించుకుని క్యాబ్‌లో తిరిగి వస్తుండగా జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె కన్నుమూసింది. ఈ ప్రమాదం సెప్టెంబర్ 18న బోరివాలి ఈస్ట్‌లోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగింది.ముంబైలోని మీరా రోడ్ నివాసి,ముప్పై రెండేళ్ల కైనూర్ మిస్త్రీ, కంపెనీ అందించిన క్యాబ్‌లో తన షిఫ్ట్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారువంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో వెనుక సీటులో కూర్చున్న మిస్త్రీకి తలకు తీవ్ర గాయం అయింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. మిస్త్రీకి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు.క్యాబ్ డ్రైవర్ విజయ్ ఖోస్పై పోలీసులు కేసు నమోదు చేశారు.నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ప్రాణాలకు ప్రమాదం కలిగించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేసినప్పటికీ కైనూర్ మిస్త్రీ మృతి నేపథ్యంలో, నిర్లక్ష్యం కారణంగా జరిగిన మరణంపై కింద కేసు నమోదు చేశారు.ఇండిగో తన ఉద్యోగుల రవాణా కోసం 'మయూరేష్ టూర్ అండ్ ట్రావెల్స్' సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉద్యోగులకు కల్పించే రవాణా సౌకర్యాల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదీ చదవండి: సీనియర్ నటి కన్నుమూత, ప్రముఖుల సంతాపం -
అయ్యో పాపం పసివాడు
హైదరాబాద్: మూడేళ్ల పసివాడి నవ్వులు అర్ధంతరంగా ఆగిపోయాయి. అమ్మానాన్నల కళ్లెదుటే కారు రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఐఎస్ సదన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సంతోష్‌నగర్ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మొహియుద్దీన్ దంపతులు తమ మూడేళ్ల కుమారుడు ఇజ్వానుద్దీన్తో కలిసి శనివారం రాత్రి ఐఎస్ సదన్ చౌరస్తాలోని ఓ హోటల్‌కు పార్శిల్ తెచ్చుకునేందుకు వెళ్లారు.రాత్రి 10.55 గంటల సమయంలో ఒకవైపు తండ్రి, మరోవైపు తల్లి ఉండటంతో బాలుడు అటూ ఇటూ తిరుగుతూ.. రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో కారు దూసుకొచ్చి బాలుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమారుడిని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో గుండెలసేలా రోదించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లగ్జరీ కారులో మంటలు ఎలా చెలరేగాయి?
సూర్యాపేటటౌన్/ఖమ్మం అర్బన్ : కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఇనుప రెయిలింగ్‌ను ఢీకొనడంతో మంటలు వ్యాపించి అందులో ప్రయాణిస్తున్న డాక్టర్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన సూర్యాపేట మండలం పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం సుంకువారిగుంట గ్రామానికి చెందిన వైద్యుడు కాసుకుర్తి జగదీశ్(50) ఇరవై ఏళ్లుగా ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆయన భార్య సుమప్రీతి హైదరాబాద్‌లోని సురభి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగదీశ్ భార్య, పిల్లలు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారం లేదా 15 రోజులకు ఒకసారి కుటుంబ సభ్యులను కలిసేందుకు జగదీశ్ హైదరాబాద్‌కు వెళ్తుంటారు.కుమార్తె పుట్టినరోజుకు వెళ్తూ.. సోమవారం జగదీశ్ కుమార్తె పుట్టినరోజు ఉండటంతో ఆదివారం ఉదయం 6 గంటల సమీపంలో ఆయన ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. మార్గమధ్యలో పిల్లలమర్రి సమీపంలో ఖమ్మం–హైదరాబాద్ హైవేపై ఫ్లైఓవర్ ఎక్కుతుండగా కారు అదుపుతప్పి పక్కనే ఉన్న ఇనుప రెయిలింగ్‌ను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోగా.. జగదీశ్ సజీవ దహనమయ్యారు.జగదీశ్ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో పోలీసులు వాహనం వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కొత్త కారు కావడంతో ఇంకా నంబర్ ప్లేటు కూడా లేదు. దీంతో ఖమ్మం రహదారిపై ఉన్న టోల్గేట్ వద్ద వాహనాన్ని గుర్తించి, అందులో డాక్టర్ జగదీశ్ ప్రయాణిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సూర్యాపేట ఆస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.పోలీసుల ఆరా..అత్యంత ఖరీదైన కారులో మంటలు చెలరేగడంపై పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ కారు రెయిలింగ్‌ను ఢీకొన్న సమయంలో ఇంధనం, విద్యుత్ వ్యవస్థలో ఏదైనా సమస్య తలెత్తిందా అని పరిశీలిస్తున్నారు. వాహనం పూర్తిగా దగ్ధం కావడంతో ప్రమాదానికి ముందు కారులో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడిందా అనే అంశంతోపాటు ప్రమాదానికి ముందు కారు వేగం, డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన పరిస్థితుల పైనా ఆరా తీస్తున్నారు.బాలాజీ–సరోజిని దంపతులకు నాలుగో సంతానంగా జగదీశ్ జన్మించారు. తండ్రి రైల్వే కూలీగా, తల్లి దినసరి కూలీగా పనిచేస్తుండగా, అన్నయ్య, అక్కయ్యలు సైతం వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే వారు. జగదీశ్ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఉపాధ్యాయులు, శ్రేయోభి లాషుల సహకారంతో వైద్యవిద్య పూర్తిచేశారు. వినాయకుడిని సాగనంపి.. పేషెంట్‌ను చూసి..డాక్టర్ జగదీశ్ శనివారం రాత్రి వరకు వైద్యులు, విద్యార్థులతో కలిసి వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సాహంగా నృత్యం చేశారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అత్య వసర కేసు రావడంతో ఆస్పత్రికి వెళ్లి రోగిని పరిశీలించారు. సోమవారం ఆపరేషన్ చేస్తానని రోగి కుటుంబీకులకు చెప్పారు. ఇంతలోనే ప్రమాదం జరిగింది. దీనికి నిద్రమత్తు కారణమా అన్న చర్చ జరుగుతోంది. ఖరీదైన కారు.. అయినా దక్కని ప్రాణంసురక్షిత ప్రయాణం కోసం సుమారు రూ.1.20 కోట్లు వెచ్చించి రెండు నెలల క్రితమే డాక్టర్ జగదీశ్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు సహచరులు తెలిపారు. అయితే అదే కారులో జరిగిన ప్రమాదం ఆయన ప్రాణాలను కాపాడలేకపోయిందని పలువురు వైద్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.డాక్టర్ జగదీశ్ భార్య, కుమార్తెలను ఓదార్చిన డాక్టర్లుడాక్టర్ జగదీశ్ బాబు మృతదేహంతో మమత ఆసుపత్రి ప్రాంగణానికి వచ్చిన డాక్టర్ భార్య, ఇద్దరుకుమార్తెలను పలువురు డాక్టర్లు ఓదార్చారు. ఇంతటి ఘోరం జరగడం ఎంతో బాధకరం అని పలువురు వారికి తమ సంతాపం వ్యక్తం చేశారు.వేలాదిమందితో అంతిమయాత్రసూర్యాపేటలో పోస్టుమార్టం అనంతరం డాక్టర్ జగదీశ్‌బాబు మృతదేహాన్ని ఖమ్మానికి తీసుకొచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి మమత ఆసుపత్రి వరకు అంతిమయాత్ర నిర్వహించారు. వేలాదిమంది వైద్యులు, వైద్య విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది, జగదీశ్‌బాబు వద్ద వైద్యం పొందిన రోగులు, వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. మమత ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మమత వైద్య విద్యాసంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ తదితరులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్యులు, విద్యార్థులు డాక్టర్ జగదీశ్ పార్థీవదేహాన్ని సందర్శించి కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యుల రోదనలు, సహచర వైద్యుల కన్నీళ్లతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం అలుముకుంది.పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్యంఒంగోలు టౌన్: నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన డాక్టర్ కాసుకుర్తి జగదీశ్ కసితో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. అయినప్పటికీ తన మూలాలను మరిచిపోకుండా పేదలకు వైద్య సేవలందించారు. వైద్యాన్ని వ్యాపారంగా కాకుండా ప్రజా సేవగా తలచిన డాక్టర్ జగదీశ్పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య చికిత్సలు చేశారని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇదీ చదవండి: మిస్టరీ డాక్టర్ ఎక్కడ?అణగారిన ప్రజల బాధలను తన బాధగా భావించి నిరుపేదలకు అండగా నిలిచిన డాక్టర్ జగదీశ్ మరణం సామాన్య ప్రజలకు తీరని లోటని సీపీఐఎంఎల్ న్యూడెమక్రసీ రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు. కొత్తపట్నం మండలం నుంచి వచ్చిన తొలి వైద్యుడు జగదీష్ మతి పట్ల శ్రీరాం సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ఎండీ డాక్టర్ చాపల వంశీకష్ణ నివాళులు అర్పించారు. నిరుపేదలకు వైద్యం చేయడంలో డాక్టర్ జగదీశ్ ముందుండేవారని, సామాజిక సేవాతో వ్యవహరించే ఆయన మరణం బాధకలిగిస్తుందన్నారు. చిన్నవయసులోనే నూరేళ్లు నిండిన డాక్టర్ జగదీశ్‌కు పలువురు వైద్యులు నివాళులు తెలిపారు. -
వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా..
హైదరాబాద్: గణపతి పూజకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా టిప్పర్ లారీ ఢీకొని యువతి, బాలుడు దుర్మరణం చెందిన ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రా ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన సూర్యనారాయణరెడ్డి కుమార్తె దీప్తికారెడ్డి (21) బీటెక్ చదువుతోంది. శాలివాహన కాలనీలో నివసించే సూర్యనారాయణ స్నేహితుడు వినయ్ కుమారుడు అమర్త్య (15) పదో తరగతి చదువుతున్నాడు. శనివారం రాత్రి దీప్తికారెడ్డి, అమర్త్య కలిసి ప్రశాంత్‌నగర్ కాలనీలో గణపతి పూజకు వెళ్లారు. ఎల్లారెడ్డిగూడలోని శాలివాహన ఎన్‌క్లేవ్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. రాయల్ ఇరానీ కేఫ్ సమీపంలో మట్టిదిబ్బను తప్పించబోయి అదుపుతప్పి కింద పడిపోయారు. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ దీప్తికారెడ్డి, అమర్త్యల తలలపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. పలువురికి గాయాలు
సాక్షి నెల్లూరు: మమ్మిడివరం మండలం కోమానిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి 216పై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని వెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ తీవ్రతతో బస్సు ముందుబాగం నుజ్జునుజ్జయ్యింది. -
ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..
తెలంగాణ: ట్రాక్టర్ ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పల్టీ కొట్టింది. దీంతో 25 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.బిహార్‌కు చెందిన కూలీలు తిమ్మారెడ్డిపల్లి శివారులోని కోళ్ల ఫారంలో పని చేస్తున్నారు. కుకునూరుపల్లిలో కూరగాయల మార్కెట్‌కు ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ట్రాలీని వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ట్రాలీ పలీ్టకొట్టింది. కూలీలు ఎగిరి రోడ్డుపై పడిపోయారు. ట్రాలీలో ఉన్న 25 మందిలో ఆరుగురికి తీవ్ర, 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి.బస్సులోని 10 మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ ఘటనాస్థలికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్, డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలంటూ సూచించారు.ఇదీ చదవండి: తండ్రి మందలించాడని.. విద్యార్థి ఆత్మహత్య -
దళితులంటే సునీతమ్మకు నచ్చదా?
అనంతపురం: దళితులంటే పరిటాల సునీతకు నచ్చదా? అంటూ గొరిదిండ్లకు చెందిన దళిత మహిళలు ఎమ్మెల్యే సునీతపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. శుక్రవారం ఆత్మకూరులో గొరిదిండ్ల దాడి విషయంలోని బాధితులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు సీపీ ఆలమూరు ఓబులేసు, దళిత మహిళలు మాట్లాడుతూ గొరిదిండ్లకు అనూష తన భర్త, తండ్రిని కోల్పోయి ఉన్న ఒక్క కూతురిని చూసుకోవడానికి వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే అదే గ్రామానికి చెందిన అక్కులప్ప అనే వ్యక్తి అనూష పట్ల అనుచితంగా ప్రవర్తించి, అత్యాచార యత్నం చేశాడన్నారు.బుధవారం రాత్రి అక్కులప్ప మధ్యం తాగి అనూషను కత్తితో పొడవగా, తీవ్రంగా గాయపడిందన్నారు. అనూషపై దాడిని అడ్డుకోబోయిన హరీష్ కుమార్, మహేంద్ర, శివానందను గొడ్డలితో దాడి చేశారన్నారు. ప్రస్తుతం వారు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. దాడి చేసిన వారిపై అక్కులప్ప, మధు, సోమశేఖర్, రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేవలం అక్కులప్పపై కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుకున్నారన్నారు. మిగిలిన వారిని టీడీపీ నాయకుడు బాలాజీ ఎమ్మెల్యే సునీత ఇంట్లో దాచిపెట్టారన్నారు. కక్షలను పెంచి పోషిస్తున్న ఎమ్మెల్యే సునీత.. నియోజకవర్గంలో మహిళల పట్ల ఎన్ని దాడులు జరిగినా ఎమ్మెల్యే సునీత మాత్రం పట్టించుకోలేదని గ్రామానికి చెందిన దళిత నాయకులు అన్నారు. పరిటాల సునీత ఎప్పుడు అధికారంలోకొచ్చినా ఎస్సీలపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. హోంమంత్రిగా దళిత మహిళ ఉన్నా.. మహిళలపై దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. టీడీపీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఊర్లు విడిచే పరిస్థితి వచ్చిందన్నారు. నలుగురిపై కేసులు నమోదు చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని బాలాజీ ఎవరి పేరు చెబితే వారిపైన మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారని, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మండల కన్వీనర్ బాల పోతన్న, యూత్ కన్వీనర్ కొండారెడ్డి,మాజీ డీసీసీబీ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, లక్ష్మిరెడ్డి, గొరిదిండ్ల నరసింహ, రమేష్ కేశవరెడ్డి, మాధన్న, గోవింద్ , ఆదినారాయణ, లక్ష్మి, అఖిల, లలితమ్మ, సంగమ్మ,రామక్క,లక్ష్మక్క, ముత్యాలక్క,నారాయణమ్మ,కుంటెమ్మ,నాగమణి, శాంతమ్మ, కుళ్లాయప్ప, పెద్దన్న పాల్గొన్నారు. అమ్మ లేకపోతే అనాథనైతా..మా అమ్మను కత్తితో పొడిచారు.. మా నాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. మా అమ్మ కూలి పనులు చేస్తూ నన్ను చదివిస్తోంది. మా అమ్మను వదిలేయండి.. మా అమ్మను కత్తితో పొడిచారు. మా అమ్మ లేకపోతే నేను బతకను. నన్ను అనాథను చేయకండి అంటూ అనూష కూతురు ప్రీతి సుధ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం అందరినీ కలచివేసింది. సమావేశంలో మాట్లాడుతున్న దళిత నాయకులు ఇదీ చదవండి: రాణీగారి తోటలో చంపేశారు -
శంషాబాద్: గణేశ్ నిమజ్జనం కోసం వెళ్లి వస్తుండగా..
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్ట్ను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు ఇన్నోవా కారు నుజ్జునుజ్జయ్యింది. మృతులు.. కేతావత్ లింబ్య, జమున, మాన్సింగ్, వాస్రామ్గా పోలీసులు నిర్ధారించారు. వాళ్ల స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా చౌడూరుగా తెలిపారు. డ్రైవర్ పేరు అశోక్ అని పోలీసులు చెప్పారు. గణేశ్ నిమజ్జనం కోసం సొంతూరికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి కారు అతివేగమా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, కరీంనగర్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడికల్ శివారులో జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిజామాబాద్‌కు చెందిన ట్రాన్స్‌కో ఉద్యోగులు వరంగల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.వేర్వేరు ఘటనల్లో..నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నందిపహాడ్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అంబులెన్స్‌తో పాటు ఐదు కార్లను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి జియో బంక్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదంలో బల్మూరు మండల్ కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ధ్యాపా అరుణ మృతి చెందారు. భర్త రాజేందర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రాజేందర్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఇదీ చదవండి: ‘నా చెల్లికి పట్టిన గతి ఎవరికీ రావొద్దు’.. -
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం.. ఏపీవాసులు మృతి
సాక్షి, విశాఖ: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. బుధవారం (సెప్టెంబర్ 16) రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా క్రికెట్ సంఘం (వీడీసీఏ) మాజీ సంయుక్త కార్యదర్శి జి.టి.ప్రసాద్ భార్య రమాదేవి (67), కోడలు నేహా బొమ్మలి (33) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రసాద్ కుటుంబంతో పాటు విశాఖ నగరంలో తీవ్ర విషాదం నింపింది. విశాఖలోని సీతమ్మధారలో నివాసముంటున్న జి.టి.ప్రసాద్ గతంలో షిప్‌యార్డ్ ఉద్యోగిగా, 2017 వరకు వీడీసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన కుమారుడు, కోడలు మెల్బోర్న్లో స్థిరపడ్డారు. కుమారుడి కుటుంబాన్ని చూడటంతో పాటు అక్కడ జరిగే ఒక శుభకార్యంలో పాల్గొనేందుకు ప్రసాద్, రమాదేవి దంపతులు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లారు. బుధవారం రాత్రి 9:40 గంటల సమయంలో మెల్బోర్న్ నైరుతి శివారు పాయింట్ కుక్లోని బోర్డ్‌వాక్ బౌలేవార్డ్, ఇన్నిస్‌ఫైల్ డ్రైవ్ జంక్షన్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమాదేవి, నేహా అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పదిరోజుల్లో విశాఖకు మృతదేహాలు వరుణ్‌చంద్ర గున్నా, నేహా దంపతులకు మూడున్నరేళ్ల కుమారుడు హారవ్, ఏడాది వయసున్న కుమార్తె వివాన్వి ఉన్నారు. ఇటీవలే వివాన్వి మొదటి పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో ఎంతో వేడుకగా నిర్వహించారు. రమాదేవి, నేహా మృతదేహాలు విశాఖ చేరుకోవడానికి కనీసం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేసి, బాధితులకు అండగా నిలిచేందుకు అక్కడి ఆస్ట్రేలియన్ తెలుగు కమ్యూనిటీ నిధులు సేకరిస్తోంది. ఈ ప్రమాదంలో రమాదేవి, నేహా మృతి చెందడంపై వీడీసీఏ ప్రతినిధులు, విశాఖ క్రీడాకారులు తీవ్ర సంతాపం తెలిపారు. -
వారం రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి
సాక్షి, హైదరాబాద్: మరో వారం రోజుల్లో ఇంట్లో పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆ కుటుంబంలో అంతలోనే తీరని విషాదం నెలకొంది. పెళ్లి పనుల నిమిత్తం బైక్‌పై వెళ్తున్న తండ్రి, కూతురును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని ఆరంఘర్ చౌరస్తా వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.హయత్‌నగర్ నుంచి అత్తాపూర్ వైపు కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కూతురు బురుషాన్ బేగం మృతి చెందారు. మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, పెళ్లి పనుల కోసం బయలుదేరిన తండ్రీకూతుళ్లు ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: వినాయక నిమజ్జనం వేళ విషాదం.. -
కొద్దిసేపట్లో విమాన ప్రయాణం.. అంతలోనే దుర్మరణం
శంషాబాద్(హైదరాబాద్): కంటైనర్ చేసిన బీభత్సంతో అదుపుతప్పిన బస్సు హోటల్ల్లో దూసుకెళ్లడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లేందుకు కొద్దిసేపట్లో విమానం ఎక్కాల్సిన అతడు పరలోకాలకు వెళ్లాడు. ఈ విషాదకర ఘటన శంషాబాద్‌లో కిషన్‌గూడ ఆర్వోబీ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ఆర్జీఐఏ సీఐ సంజీవులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 5.30కు వర్షం కురుస్తోంది. శంషాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కంటైనర్ డివైడర్ మధ్యలోకి దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొంది. అదే సమయంలో బెంగళూరు నుంచి బాచుపల్లికి వెళుతున్న సెవెన్ హిల్స్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై స్తంభం విరిగి పడడంతో నియంత్రణ కోల్పోయిన బస్సు డ్రైవర్ సాధిక్ రోడ్డు పక్కనే నిలిపి ఉన్న వాహనాలను ఢీకొట్టి హోటల్లోకి తీసుకెళ్లాడు. చాయ్ కోసం ఆగితే కరీంనగర్ జిల్లా కేంద్రం రజ్వీచమన్ రోడ్డు సిటిజన్ కాలనీకి చెందిన మహ్మద్ మోహియుద్దీన్.. తన కుమారుడు మహ్మద్ అజీమొద్దీన్ (26)ను దుబాయ్‌కి పంపేందుకు కుటుంబసభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. ఎయిర్‌పోర్టు బ్రిడ్జి సమీపంలోని హోటల్ వద్ద చాయ్ తాగేందుకు కారు నిలిపారు. కారులోంచి బయటికి వచ్చిన అజీమొద్దీన్ను బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. కళ్లెదుటే అజీమొద్దీన్ మృతి చెందడంతో కుటుంబసభ్యులను శోకసంద్రంలో ముంచింది. బీభత్సం బస్సు హోటల్లోకి దూసుకెళ్లడం అక్కడే బోండాలు వేస్తున్న గ్యాస్ స్టవ్‌కు మంటలందుకున్నాయి. పాన్‌షాప్ పూర్తిగా ధ్వంసమైంది. వాహనాలు సైతం ధ్వంసం కాగా బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనై హాహాకారాలు చేయడంతో పక్కనే ఈవీ చార్జింగ్ కోసం వచ్చిన ఓ యువకుడితో పాటు హోటల్ వద్ద ఉన్న మరికొందరు యవకులు ఎమర్జెన్సీ డోర్ తెరిచి ప్రయాణికులను బయటికి రప్పించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కరెంటు సరఫరాను నిలిపివేయించారు. స్వల్పంగా గాయపడిన పదిమందిని, తీవ్ర గాయాలపాలైన బస్సు డ్రైవర్ సాధిక్‌ను ఆస్పత్రికి తరలించారు. -
అనంత ఘోర ప్రమాదం: యువతి స్పాట్ డెడ్.. ఆస్పత్రిలో మరొకరు
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న షెడ్‌ను ఢీకొట్టి ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అందులో ఉన్న ఓ యువతి అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గాయపడ్డ మరో ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉదయం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి అనంతపురం వస్తున్న టాటా సఫారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న షెడ్‌ను ఢీకొట్టి.. అక్కడి హోటల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని గుత్తికి చెందిన హరితగా పోలీసులు గుర్తించారు.అనంతపురం హౌసింగ్ బోర్డుకు చెందిన శ్రీధర్‌రెడ్డి, సింగనమల మండలం సలకం చెరువుకు చెందిన కుమార్, గుత్తికి చెందిన హరితతో పాటు మరో యువతి ప్రమాద సమయంలో కారులో ఉన్నారు. మరో యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ఇద్దరు యువకులకు కూడా గాయాలు కావడంతో వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ముగ్గురిలో మరణించిన మరొకరు ఎవరనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ప్రమాద సమయంలో కారు ఎందుకు అదుపుతప్పిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌కు నిద్రమత్తు వచ్చిందా? లేదంటే మద్యం సేవించి వాహనం నడిపారా? అనే కోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ప్రియుడితో పట్టాలపై ముచ్చట్లు.. ఇంతలో విషాదం -
గురుగ్రామ్ ఘటన.. సియా కుటుంబం చెప్పిన మరో కోణం!
సాక్షి, న్యూఢిల్లీ: గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ బైకర్‌ను కారు వెంబడించి ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. సియా అనే యువతి ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఆమె సోదరుడు తెలిపారు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారు మద్యం మత్తులో ఉన్నట్లు ఆయన ఆరోపించారు.సియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెతో పాటు మరికొందరు బైకర్లు రోడ్డుపై వెళ్తుండగా ఓ కారు వెనుక నుంచి వారిని అనుసరించింది. దాంతో కారు దూరంగా ఉండాలని సైగ చేసినప్పటికీ, అది ఆమె బైక్ వైపు వచ్చి ఢీకొట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఆమెను కారు ఢీకొనడంతో సియా బైక్ నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. న్యాయవాది కూడా పోలీస్ అధికారులను కలిసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సియా సోదరుడు తెలిపారు.అయితే, కారు డ్రైవర్ మాత్రం మరోలా చెప్పాడు. యూటర్న్ వద్ద కారు అదుపుతప్పడంతోనే బైక్‌ను తాకిందని, కావాలని ఢీకొట్టలేదని పేర్కొన్నాడు. అలాగే, తాను బైకర్ అక్కడ ఉన్న విషయాన్ని సరిగ్గా గమనించలేదని చెప్పాడు.ఆ సమయంలో రోడ్డుపై సుమారు 20 నుంచి 22 మంది బైకర్లు ఉన్నారని డ్రైవర్ తెలిపాడు. వారిని నెమ్మదిగా వెళ్లాలని మాత్రమే సూచించానని, ఎలాంటి అసభ్యకర సైగలు చేయలేదని, కారు ఆపితే బైకర్లు తనపై దాడి చేస్తారనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయానని డ్రైవర్ చెప్పాడు. మరోవైపు ఈ ఘటనపై సియా కుటుంబం మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.సియాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్, బైకర్ చెప్పిన విషయాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: నాలుగేళ్ల తర్వాత బీజేపీ కార్యకర్త అస్థిపంజరం వెలికితీత -
ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీబస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో 21 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం మరో ఎస్యూవీ వాహనం కూడా ఆ రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన వెస్టర్న్ కేప్ ప్రావిన్స్‌లోని ఎన్1 రహదారిపై జరిగింది.రోడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ప్రకారం, ప్రిన్స్ ఆల్బర్ట్, లీయూ-గామ్కా ప్రాంతాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతం కేప్ టౌన్‌కు సుమారు 380 కిలోమీటర్ల తూర్పున ఉంది. తొలుత రెండు మినీబస్ టాక్సీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ తర్వాత అదే ప్రాంతంలో ఉన్న శిథిలాలను ఎస్యూవీ వాహనం ఢీకొట్టినట్లు వెస్టర్న్ కేప్ మొబిలిటీ విభాగం వెల్లడించింది.ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, పరిస్థితుల అంచనా కొనసాగుతున్న సమయంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.ప్రమాదం కారణంగా ఎన్1 రహదారిని అధికారులు మూసివేశారు. ప్రమాదానికి అసలు కారణాన్ని గుర్తించేందుకు రోడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.దక్షిణాఫ్రికాలో మినీబస్ టాక్సీలు ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇవి తరచుగా ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన రెండు వేర్వేరు మినీబస్ ప్రమాదాల్లో కనీసం 25 మంది మరణించారు. వారిలో 14 మంది చిన్నారులు ఉన్నారు. తాజా ప్రమాదంలో మృతుల సంఖ్యపై అధికారులు తుది అంచనా వేస్తుండటంతో తదుపరి వివరాలపై దర్యాప్తు నివేదిక కీలకం కానుంది. -
మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన
గురుగ్రామ్‌లో ఒక మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి, పారిపోయిన ఘటన, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కారు నంబరుతో సహా బాధితురాలు షేర్ చేయడంతో కారు యజమాని మీడియా ద్వారా స్పందించారు. దీంతో ఆయన ప్రకటన కీలకంగా మారింది.వాహనాన్నిఎవరు నడిపారనే దానిపై కారు యజమాని మనీష్ స్పష్టత ఇచ్చారు. కారు తనదేనని యజమాని అంగీకరించినప్పటికీ, ఈ ప్రమాద ఘటనలో తన పాత్ర ఏమీ లేదన్నారు. తాను ఆర్మీ ఉద్యోగినని, ప్రస్తుతం తాను విధి నిర్వహణలో భాగంగా అస్సాంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తన స్నేహితుడు కళ్యాణ్ కారు నడిపినట్టు వెల్లడించారు. తన స్నేహితుడు తన కుటుంబం నుండి కారును తీసుకున్నాడని తెలిపారు.ఇదీ చదవండి: గురుగ్రామ్‌లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్‌మాట’!సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే తనకు ఈ ఘటన గురించి తెలిసిందని ఆయన చెప్పారు. తన స్నేహితుడు కళ్యాణ్ సింగ్ రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లాలని చెప్పి కారును తీసుకున్నాడని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలియగానే తాను తన స్నేహితుడికి ఫోన్ చేశానని, కానీ అతను ఫోన్ తీయలేదని మనీష్ చెప్పారు.. తన తండ్రిని, ఇతరులను కూడా అతని ఇంటికి పంపించానని, కళ్యాణ్ సింగ్ హర్యానాలోని పల్వాల్ జిల్లాకు చెందినవాడని కూడా కూడా చెప్పారు. కాగా 'మారుతి సుజుకి సియాజ్' (Maruti Suzuki Ciaz), దీని రిజిస్ట్రేషన్ నంబర్ HR30Y4949. ఇది హర్యానాలోని పల్వాల్ నివాసిమనీష్ పేరు మీద నమోదై ఉంది. -
అమెరికాలో గుండెపోటుతో నగర వాసి మృతి
హైదరాబాద్: అమెరికా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న నగరానికి చెందిన యువకుడు గుండెపోటుతో కన్నుమూశారు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బేగంపేట్ ప్రకాశ్ నగర్‌కు చెందిన నగేష్ సాయికుమారి దంపతుల కుమారుడు రావుల పవన్ సాయి వంశీ (36) చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2016లో అమెరికాలో ఎంబీఏ చేశారు. అనంతరం అక్కడే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడి కొద్ది నెలల క్రితమే ఐబీఎంలో చేరారు. వంశీకి 2018లో వివాహమైంది. మూడున్నర సంవత్సరాల కుమారుడు, మూడు నెలల వయసు కూతురు ఉన్నారు. కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఆయన ఈ నెల 9న ఉదయం పిల్లలతో ఇంట్లో ఆడుకుంటూ కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందడంతో ప్రకాశ్‌నగర్‌లోని ఆయన ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: అతనంటే నాకు ఇష్టం.. దేబ్జానీ ప్రపోజల్ హింట్! -
నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
గ్రేటర్ పరిధిలో జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. మిత్రుడి పుట్టిన రోజు వేడుకకు స్నేహితులతో కలిసి ఆనందంగా వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పడంతో ఇంటర్ విద్యార్థి అసువులు బాశాడు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన కోకాపేటలో చోటుచేసుకోగా.. రోడ్డు పక్కన స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ బాలుడు దుర్మరణం చెందిన మరో ఘటన అత్తాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. కీసర ఓఆర్ఆర్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చెందగా, రాంగ్రూట్లో వచ్చిన ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో బాలుడు మృత్యువాత పడిన ఘటన ఎల్బీనగర్ పరిధిలో జరిగింది. హైదరాబాద్: కూకట్‌పల్లికి చెందిన మదన్మోహన్ రెడ్డి (17) ఇంటర్ విద్యార్థి. మిత్రుడి పుట్టి న రోజు వేడుకల కోసం శనివారం రాత్రి మరో స్నేహితుడికి చెందిన కారు తీసుకుని వెళ్లాడు. వేడుకల అనంతరం కోకాపేట వైపు వెళ్లి వద్దామంటూ స్నేహితులతో కలిసి ఇన్నోవా కారులో బయలుదేరారు. కోకాపేట నియోపోలిస్ వ్యూపాయింట్ వద్ద తెల్లవారు జామున కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న మదన్‌మోహన్‌రెడ్డి డోరులో నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్న స్తంభానికి తగలటంతో తలకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నాయని కోకాపేట సెక్టార్ ఎస్సై మహేందర్, నార్సింగి ఇన్స్పెక్టర్ డి. విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. స్తంభాన్ని బైక్ ఢీకొని.. వేగంగా దూసుకు వచ్చిన ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టిన దుర్ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో మైనర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కార్వాన్ మొగల్ నగర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి (14), అదే ప్రాంతానికి చెందిన మరో బాలుడితో కలిసి ద్విచక్ర వాహనంపై కార్వాన్ నుంచి హైదర్‌గూడ వెళ్తున్నారు. వేగంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డుపక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఇన్స్పెక్టర్ సీతయ్య తెలిపారు. రాంగ్ రూట్లో వచ్చి.. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వచ్చి డివైడర్‌ను ఢీకొట్టడంతో బాలుడు చనిపోగా, మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మలక్‌పేటకు చెందిన సయ్యద్ మాజ్ హుస్సేన్ (16), నారాయణగూడకు చెందిన హంజాలా, న్యూ మలక్‌పేటకు చెందిన అలీఖాన్ స్నేహితులు. ముగ్గురు కలిసి ఆదివారం తెల్లవారు జామున నమాజు కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఉదయం 6.30 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తా సితార హోటల్ వద్ద రాంగ్ రూట్లో వచ్చి డివైడర్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. సయ్యద్ మాజ్ హుస్సేన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగతా ఇద్దరు స్నేహితులు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి : ముందే పక్కా ప్లాన్.. హోటల్ గదిలో దారుణం -
22 ఏళ్ల తరువాత ఆ తల్లి ఒడి మళ్లీ నిండింది!
ఎప్పుడో 22 ఏళ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన అండం మళ్లీ ఊపిరి పోసుకుంది... యాభై మూడేళ్ల వయసులో 21 ఏళ్ల కొడుకును పోగొట్టుకున్న తల్లి కడుపులో జీవమైంది! రోడ్డు ప్రమాదంతో మరణించిన కొడుకు లోటును భర్తీ చేస్తూ... ఆ ఇల్లు మళ్లీ ముద్దు మురిపాలతో నిండిపోయింది. గ్రీకు దేశపు ఈ టెక్నాలజీ అద్భుతం ఎలా ఆవిష్కృతమైందంటే... ఏథెన్స్: కాన్స్టాంటినో రప్తీస్, క్రిస్టీనా రప్తీ జెలెపీలు గ్రీసు రాజధాని ఏథెన్స్ వాసులు. భర్త వయసు 60, భార్యకేమో 54. ఏడాది క్రితం 2025 అక్టోబరులో వీరిద్దరి ఒక్కగానొక్క కొడుకు 21 ఏళ్ల జార్జ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. దాంతో ఆ కుటుంబంలో విషాదం నిండిపోయింది. ఎలాగోలా వాళ్లు ఆ బాధ నుంచి బయటపడ్డారు కానీ.. బోసిపోయిన ఇల్లు మాత్రం వారిని రోజూ వెక్కిరిస్తూనే ఉండింది. వారసుల్లేకుండా పోతారేమో అన్న బెంగ కూడా వారిని బాధించింది. ఈ నేపథ్యంలోనే క్రిస్టీనా రప్తీ జెలెపీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఎప్పుడో 2004లో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కొడుకును కన్నప్పుడే భద్రపరచిన అండాల సాయంతో మళ్లీ బిడ్డను కనాలని నిర్ణయించింది. అయితే అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాభై నాలుగేళ్లు దాటితే కృత్రిమ గర్భధారణతో బిడ్డను కనడం సాధ్యం కాదు. దాంతో అప్పటికప్పుడు కొడుకు పోయిన బాధను కూడా పక్కనబెట్టి క్రిస్టీనా, భర్త కాన్స్టాంటినో రప్తీస్లు మరోసారి కృత్రిమ గర్భధారణకు సిద్ధమయ్యారు. భద్రపరచిన అండాన్ని ఫలదీకరణం చేయించి 2025 డిసెంబరులో పిండాన్ని అభివృద్ధి చేసి గర్భంలోకి ప్రవేశపెట్టారు. నెలలు గడిచాయి. బిడ్డ ఆరోగ్యంగానే ఉంది... చివరకు నెలలు నిండిన తరువాత 4 రోజుల క్రితం ఏథెన్స్లోని ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిప్పుడు ఆ చిన్నారి బరువు 3.49 కిలోలు!!! ఇరవై రెండేళ్ల ఐదు నెలల, 23 రోజులపాటు గడ్డకట్టి ఉన్న అండం నుంచి సరికొత్త జీవం ఉనికిలోకి రావడం వైద్య చరిత్రలో ఇదే రెండోసారి మాత్రమే. గత ఏడాది అమెరికాలోని ఓహాయోకు చెందిన దంపతులు 30 ఏళ్ల క్రితం శీతలీకరించిన అండం సాయంతో బిడ్డను కని గిన్నిస్ రికార్డు సృష్టించారు. గతంలో 18 ఏళ్ల క్రయో ప్రిజర్వేషన్ తరువాత జపాన్‌లో, 17 ఏళ్ల తరువాత ఇజ్రాయెల్‌లోనూ పిల్లలు జీవంతంగా పుట్టిన రికార్డులు ఉన్నాయి. ‘‘కొడుకు పోయిన తరువాత ఇంకో బిడ్డను కనాలి అనుకున్నప్పుడు సమయం సరిపోతుందా? అన్న అనుమానం ఉండింది. 54 ఏళ్లు నిండేలోపు కృత్రిమ గర్భదారణకు సంబంధించిన ప్రక్రియలు అన్నీ ముగియాలన్నది ప్రభుత్వ నిబంధన. దీనికి ప్రభుత్వ అనుమతులు పొందాలి కూడా.’’అని క్రిస్టీనా రప్తీ జెలెపీ బిడ్డను కన్న తరువాత తెలిపారు. కాలంతో పోటీపడుతూ మరోసారి తల్లినయ్యానని, వైద్యబృందం ఇచ్చిన స్థైర్యంతోనే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేసింది. ‘‘జీవితానికి రెండో ఛాన్స్ ఇద్దామని అనుకున్నాం. ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాలని తీర్మానించుకున్నాం. మా జీవితాల్లోకి ఇంకో కొత్త జీవితాన్ని ఆహ్వానించాం. కుటుంబం కొనసాగాలన్నదే సంకల్పం’’అని రప్తీ తెలిపారు. ‘‘కూతురు ఆరోగ్యంగా, ఆనందంగా పెద్దదయితే చాలు. జార్జ్ మాదిరిగానే మా ఇంటిని నవ్వులతో నింపాలి’’అని ఆకాంక్షించారు. అమ్మాయి పేరేంటో తెలుసా? అన్న జార్జ్‌ను గుర్తు చేసేలా జార్జియా అని పెట్టుకున్నారు. గ్రీస్‌లో బర్త్‌రేట్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం 54 ఏళ్ల నిబంధనను సమీక్షించాలని రప్తీ జలెపి వైద్యులైన డాక్టర్ కోస్టాస్ పాంటోస్ తెలిపారు. యాభై నాలుగేళ్లకు ఒక్కరోజు ఎక్కువైనా బిడ్డను కనడాన్ని అనుమతించడం లేదని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. బిడ్డను కనడం తల్లిదండ్రుల హక్కని, ప్రభుత్వం దాన్ని లాక్కోరాదని అభిప్రాయపడ్డారు. రెండోసారి తండ్రి అయిన కాన్స్టాంటిన్ రప్తీస్ మాట్లాడుతూ... భవిష్యత్తులో ఇంకో దేశానికి వెళ్లి మూడో బిడ్డను కంటామేమో అనడం కొసమెరుపు!! -
రక్తమోడిన రహదారులు
దత్తిరాజేరు: విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలంలోని షికారుగంజి కూడలి వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ బూర్జవలస పోలీసుల కథనం ప్రకారం.. రామభద్రపురం నుంచి గజపతినగరం వైపు వస్తున్న లారీ విజయనగరం నుంచి బాడంగి మండలం గజరాయునివలస వస్తున్న ఆటోను షికారుగంజి కూడలి వద్ద బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గజరాయునివలసకు చెందిన ఆటో డ్రైవర్ గుణుపూరి తిరుపతి(40), అదే గ్రామానికి చెందిన తెర్లి ఆదినారాయణ(50), పెదమానాపురం గ్రామానికి చెందిన గుడ్ల రాము(40) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు, గజపతినగరం సీఐ సన్యాసినాయుడు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను 108లో గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు. ఎస్ బూర్జవలస ఎస్ఐ ప్రయోగమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిఅగనంపూడి (విశాఖ): అతివేగంతో ఓ టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన విశాఖలోని దువ్వాడ పోలీస్‌స్టేషన్ సమీప ఆర్టీసీ డిపో ఎదురుగా ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సామర్లకోట ప్రాంతానికి చెందిన పెట్టా రవికుమార్(46) అచ్యుతాపురం మండలం బ్రాండెక్స్ సెజ్ సమీపంలోని దుప్తూరులో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తూ శ్రీనగర్‌లో నివాసముంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం వీటీసీ కట్రవులపల్లికి చెందిన రవి మేనకోడలి కుమారుడు పడాల సుధా వెంకట్ ఐటీఐ పూర్తి చేసి ఉపాధి కోసం మూడు రోజుల క్రితం రవి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం కూర్మన్నపాలెంలో తన స్నేహితుడు ఓ ఉద్యోగంలో చేరేందుకు రావాలని చెప్పడంతో రవి తన ద్విచక్రవాహనంపై వెంకట్‌ను తీసుకుని బయల్దేరారు. దువ్వాడ పోలీస్‌స్టేషన్ దాటిన తర్వాత ఆర్టీసీ డిపో ఎదురుగా వెనుక నుంచి వస్తున్న టిప్పర్ వీరి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి, వెంకట్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.డ్రిల్లింగ్ ట్రాక్టర్ బోల్తా .. ఇద్దరి మృత్యువాతమరో వ్యక్తికి స్వల్పగాయాలు.. బ్రేకులు పట్టేయడంతో ప్రమాదంఅనకాపల్లి: క్వారీ లోయలోకి డ్రిల్లింగ్ యంత్రంతో కూడిన ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన అనకాపల్లి మండలం మాకవరం గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... ఎస్‌జీఎక్స్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ క్వారీలో డ్రిల్లింగ్ పనులు చేసేందుకు రోజులాగే ఆదివారం తెల్లవారుజామున డ్రిల్లింగ్ యంత్రంతో కూడిన ట్రాక్టర్‌తో అనకాపల్లి మండలం తుమ్మపాలకు చెందిన తుమ్మపాల నాగేశ్వరరావు(37), మాకవరంలో స్థిరపడిన ఒడిశా రాష్ట్రం బలంగీర్ జిల్లా గుశ్రామ్ముడకు చెందిన మాధవ్ ప్రధాని(32), తుమ్మపాలకు చెందిన రమేష్ బయలుదేరారు. ట్రాక్టర్ కొండ ఎక్కుతున్న సమయంలో బ్రేకులు పట్టేశాయి. దీంతో ట్రాక్టర్ దిగువకు జారిపోయి లోయలోకి బోల్తాపడింది. ట్రాక్టర్‌తో సహా కింద పడిన నాగేశ్వరరావు, మాధవ్ ప్రధాని శరీరాలు ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్‌పై నుంచి దూకేయడంతో రమేష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతుల్లో తుమ్మపాల నాగేశ్వరరావుకు భార్య లక్ష్మీ భవాని, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాధవ్ ప్రధానికి భార్య కుమారి, ముగ్గురు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్ ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహకారంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎనీ్టఆర్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని, తమకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ సీఐ అశోక్ కుమార్ చెప్పారు. -
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి..
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నూరు మండలం శేషయ్యగారిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శేషయ్యగారిపల్లి వద్ద బస్సు వెనుక టైర్ కింద పడి గంగవరం నరసింహులు (18), మాలికా మణి (15) మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మృతులు కడపలోని లోహియా నగర్‌కు చెందినవారిగా తెలుస్తోంది. అదే ప్రమాదంలో కానూరు మనోహర్ (20) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో శేషయ్యగారిపల్లి వద్ద విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు -
భర్త కళ్ళముందే ప్రాణం విడిచిన నవ వధువు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నవ వధువు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చినబూద గ్రామానికి చెందిన తేజశ్రీ(27)ని వాంకిడి మండలం ఖమాన గ్రామానికి చెందిన బండె తిరుపతితో గత జూలై 5న వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ బైక్‌పై తేజశ్రీ తల్లిగారింటికి వెళ్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలో ఆదిలాబాద్ ఎక్స్‌రోడ్డు ప్లైఓవర్‌పై బైక్ అదుపుతప్పి కిందపడటంతో తేజశ్రీ తలకు, ముఖానికి తీవ్ర గాయాలు కాగా, తిరుపతికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు పంపించారు. మంచిర్యాలలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదీ చదవండి: భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త! -
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దత్తిరాజేరు మండలం షికారుగంజి జంక్షన్ సమీపంలో లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ తిరుపతితో సహా మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, మృతులు బాడంగి మండలం గజరాయనివలస వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: చెన్నై విమానం రాజమండ్రికి మళ్లింపు -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. యువతి అక్కడికక్కడే మృతి!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువతి మృతి చెందగా, ఊబర్ టూవీలర్ డ్రైవర్ గాయాలతో బయటడ్డాడు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా వెంకటరాయపురానికి చెందిన వజ్జిపర్తి హేమ దుర్గ (26) అమీర్‌పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఓ కార్ల షోరూంలో కస్టమర్ రిలేషన్íÙప్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. శనివారం మధ్యాహ్నం సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు అమీర్‌పేట హాస్టల్ నుంచి ఊబర్ బైక్ బుక్ చేసుకుంది. అమీర్‌పేట బిగ్‌బజార్ వెనకవైపు శ్రీనగర్ కాలనీ రోడ్డులో వీరు వెళ్తున్న వాహనాన్ని కూకట్పల్లి డిపో బస్సు ఢీకొట్టింది. వెనక కూర్చున్న హేమ దుర్గ కిందపడడంతో ఆమె తలపైనుండి బస్సు చక్రాలు వెళ్లాయి. దీంతో హేమదుర్గ అక్కడికక్కడే మృతి చెందింది.ఊబర్ బైక్ డ్రైవర్ ఒరిస్సాకు చెందిన హిమాంచల్ పట్రో గాయాలపాలయ్యాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హేమ దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ షేక్ అన్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి... -
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మళ్లీ ప్రమాదాలు!
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణిచారు. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో క్లీనర్ మరణించగా.. అతి వేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొని కారు బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఇటీవల ఈ హైవేపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. సత్తుపల్లిటౌన్: ‘అంతా నిద్రలో ఉన్నాం..అంతలోనే పెద్ద శబ్దం వచ్చింది..లేచి చూసేసరికి చాలామంది చిందరవందరగా పడిపోగా.. నొప్పులు భరించలేక మరికొందరు ఆర్తనాదాలు చేస్తున్నారు’అంటూ ఏపీ–తెలంగాణ సరిహద్దున శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన పలువురు వెల్లడించారు. హైదరాబా ద్ నుంచి విశాఖపటా్ననికి 57 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ కోచ్ బస్సు శుక్రవారం రాత్రి బయలుదేరింది. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై బస్సు వేగంగా వెళ్తుండగా ఏపీలోని చింతలపూడి మండలం ఎండపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో బస్సు నుజ్జునుజ్జయి క్లీనర్ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి సమీపాన తెలంగాణ–ఏపీ సరిహద్దులో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి నేషనల్ హైవే అంబులెన్స్‌లో తరలించారు. ఇందులో పి.సురేష్, ఆనంద్ పటేల్, కె.సాహితి(విజయనగరం), బస్సు డ్రైవర్ బండి గోపి(పెద్దిపాలెం)తో పాటు చక్రధర సాహో(గోపీనాథ్‌పూర్), దుర్గేష్ రావత్(ఉత్తరాఖండ్), ట్రావెల్ బస్సు మరో డ్రైవర్ సాయిఉజ్(కేరళ), డేర్లిన్ అబ్రహం(తమిళనాడు) తీవ్రంగా గాయపడి చికి త్స పొందుతున్నారు. కాగా, ఘటనలో క్లీన ర్ మృతి చెందగా మరో ఏడుగురిని చింతల పూడి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పెనుబల్లి: బంగారం కొనుగోలు చేసేందుకు బస్సులో వెళ్లారు.. తిరిగి బయలుదేరే సమయానికి చీకటి పడడం, వెంట బంగారం ఉండడంతో జాగ్రత్తగా వెళ్లొచ్చని అద్దెకు కారు మాట్లాడుకున్నారు. కానీ ఆ కారే ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంటుందని ఊహించలేకపోయారు. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై శనివారం రాత్రి ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారానికి చెందిన సీతామహాలక్ష్మి, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన ఉషారాణి అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ కిష్టారానికి చెందిన పుచ్చకాయల శేషు, గోలి రాజేశ్వరితో కలిసి బస్సులో శనివారం ఉదయం ఖమ్మం వెళ్లి బంగారం కొనుగోలు చేశారు. షాపింగ్ పూర్తయ్యే సరికి చీకటి పడడం, తమ వద్ద బంగారం ఉండడంతో ఖమ్మం నుంచి నాగారపు నాగేశ్వరరావు(45) కారు అద్దెకు మాట్లాడుకుని సత్తుపల్లి మండలం కిష్టారానికి గ్రీన్‌ఫీల్డ్ హైవే మీదుగా వెళ్తున్నారు. ఈక్రమాన పెనుబల్లి మండలం ముత్తగూడెం సమీపాన కారు అతివేగంతో వెళ్తూ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ నాగేశ్వరరావుతో పాటు ఎర్రగుంటపల్లికి చెందిన కొల్లి ఉషారాణి(54) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాజేశ్వరి, సీతామహాలక్ష్మి, శేషుకు తీవ్రగాయాలు కావడంతో పెనుబల్లి ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలిలించారు. వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని సీఐ ముత్తులింగయ్య, ఎస్ఐ షాకీర్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుల కుటుంబంలోని ఒకరు ఇటీవల మృతి చెందగా ఆమెకు సంబంధించిన పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకునేందుకు వెళ్లివస్తున్నట్లు తెలియగా.. కుటుంబంలో శుభకార్యం నిమిత్తం బంగారం కొనుగోలు వెళ్లి వస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. -
మళ్లీమళ్లీ అవే మాటలు..
సాక్షి, అమరావతి: గతేడాది అక్టోబర్‌లో కర్నూలు జిల్లా చిన్నటేకూరులో కావేరి బస్సు కాలిపోయి 19 మంది సజీవదహనమైతే.. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినచర్యలు తీసుకుంటాం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో మార్కాపురం జిల్లా రాయవరంలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం పాలై, 28 మంది గాయపడితే.. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినచర్యలు తీసుకుంటాం అంటూ సీఎం మళ్లీ అదే ప్రకటన చేశారు. గత కలెక్టర్ల సమావేశంలోను రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చేశారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలోను అదే పాట పాడారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటడంలేదన్నది వీటిని గమనిస్తే అర్థమవుతోంది. దేశంలోనే రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని చెబుతున్న సీఎం.. ఆ ప్రమాదాల నివారణకు ఆచరణలో కనీస చర్యలు కూడా తీసుకోవడంలేదన్నది తేటతెల్లమవుతోంది. ప్రమాదాలు జరిగినప్పడు, అధికారులతో సమీక్ష నిర్వహించినప్పుడు ఊకదంపుడు మాటలు తప్ప.. ఆచరణలో అడుగు ముందుకు వేయడంలేదు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో రోడ్డు భద్రత కమిటీలు పనిచేయడంలేదు. ఈ ఏడాది ప్రారంభంలో రోడ్డు భద్రత కమిటీలను నియమిస్తున్నట్టు రవాణాశాఖ ఉత్తర్వులు ఇచ్చినా.. అవి ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలే లేవు. జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ వైస్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలు ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రమాద ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్) గుర్తించాలి. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. అవేవీ ఎక్కడా పనిచేస్తున్నట్లు కనిపించడంలేదు. మరోవైపు రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.40 కోట్లతో రోడ్డు భద్రత పరికరాలు కొనుగోలు చేసేందుకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంది. పోలీసుశాఖకు రూ.20 కోట్లు, రవాణాశాఖకు రూ.20 కోట్లు చొప్పున కేటాయించిన ఈ నిధులతో స్పీడ్‌గన్స్ తదితర పరికరాలు కొనుగోలు చేయాలనే ప్రతిపాదన ఎందుకు అమలవలేదన్నది సీఎంకే తెలియాలి. ప్రతిసారి రోడ్డు ప్రమాదాల విషయంలో సీఎం చంద్రబాబు మాటలకే పరిమితమవుతున్న విషయం తాజాగా కలెక్టర్ల సమావేశంలో మరోసారి స్పష్టమైంది. సోషల్ మీడియాను కట్టడి చేయాలి రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయిలో మొదటిస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని ఆడిట్ చేయాలని, ప్రమాద ప్రాంతానికి అంబులెన్స్‌లు ఎంత సమయానికి చేరుకోగలుగుతున్నాయనేది విశ్లేషించాలని సూచించారు. డ్రగ్స్, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించే లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. సోషల్ మీడియా ఆగడాలపై మంత్రుల కమిటీ లోతుగా అధ్యయనం చేయాలని, పోలీసులు వాటిని కట్టడి చేయాలని చెప్పారు. సైబర్ టెక్నాలజీలో నిపుణుల్ని సీఐడీలో ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. గత రెండేళ్లలో 14 శాతం మేర నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నేరాలు 29.2శాతం దిగివచ్చాయన్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్-పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శుక్రవారం రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నాగ్‌పూర్-రాయ్‌పూర్ జాతీయ రహదారిపై ఉన్న పింపల్గావ్ రోడ్డు ప్రాంతంలోని 'భౌ ధాబా' సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక ట్రక్, పికప్ వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది మృతి మరణించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ప్రమాద స్థలం నుండి వెలికితీశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గుర్ని సకోలి సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొంతమేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ ధ్వజం -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
ఉరవకొండ/వజ్రకరూరు: అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. వజ్రకరూరుకి చెందిన కణేకల్లు జైనుల్లా(45), మహబూబ్‌బాషా(32), భగవాన్ మహ్మద్‌రఫీ(30) ద్విచక్రవాహనంపై ఉరవకొండకు కోర్టు కేసు నిమిత్తం గురువారం వచ్చారు. వాయిదా ముగించుకుని∙స్వగ్రామం బయలుదేరారు. ఉరవకొండ దాటగానే టీవీ టవర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ద్విచక్రవాహనాన్ని దాదాపు అర కిలోమీటరు మేర ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
చౌటుప్పల్‌లో విషాదం.. డీసీఎం ఢీకొని ఒకరి మృతి
తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్నవారిలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, రోడ్డు ప్రమాదం జరిగిన చోటు కొద్దిసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
పెళ్లయిన 24 గంటల్లోనే వరుడు దుర్మరణం
పెరవలి: పెళ్లయిన 24 గంటలు కూడా గడవకముందే వరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం తూర్పుగోదావరి జిల్లా, పెరవలి మండలం పిట్టల వేమవరం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్కూటీపై స్నేహితుడితో కలిసి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన అంబులెన్స్ ఢీకొనడంతో ఇద్దరూ మృతిచెందారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిట్టల వేమవరం గ్రామానికి చెందిన నేలపూడి ప్రదీప్ (24)కు అదే గ్రామానికి చెందిన యువతితో సోమవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. ఈ క్రమంలో అన్నవరప్పాడు సెంటర్లో దిగిన స్నేహితుడు హరిదాసు సాయి (21)ను స్కూటీపై ఎక్కించుకుని తీసుకువస్తుండగా ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ఎగిరి పక్కనే ఉన్న రాళ్ళగుట్టపై పడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఢీకొట్టిన అంబులెన్సులోనే ఆస్పత్రికి తరలించారు. వరుడు అంబులెన్సులో ఎక్కించకముందే మృతిచెందగా, కొన ఊపిరితో స్నేహితుడు తణుకు ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న ప్రదీప్ పెళ్లికోసం సెలవుపెట్టి నెల రోజుల క్రితమే గ్రామానికి రావడం గమనార్హం. -
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
తెలంగాణ: కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కల్లెడ శివారు ధర్మపురి రోడ్డులో జరిగింది.స్థానికుల సమాచారం ప్రకారం.. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అంబులెన్స్‌కి సమాచారం అందించి, క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేశారు.అయితే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివరాత్రి మహేష్ (23) పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురిని చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంతో ఘటనాస్థలంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
రాయచోటి ఘాట్‌లో ఘోరం.. లారీ బోల్తా, ఇద్దరు సజీవ దహనం!
వైయస్సార్ కడప: జిల్లాలోని రాయచోటి ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాయచోటి నుంచి కడపకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ కడప, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని ఘాట్‌లో ప్రమాదానికి గురైంది. ఘాట్‌లోని మలుపు వద్ద లారీ అదుపుతప్పి ఎడమవైపు తిరగకుండా నేరుగా అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.అయితే, లారీ బోల్తా పడిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో లారీ డ్రైవర్, క్లీనర్ చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.అలాగే, లారీకి అంటుకున్న మంటలు సమీపంలోని అడవికి వ్యాపించగా, అటవీ ప్రాంతం దట్టంగా ఉండటంతో మంటలు వేగంగా విస్తరించి పెద్ద ఎత్తున అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. దీంతో ఘాట్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఫైర్ ఇంజన్లను రప్పించి లారీకి అంటుకున్న మంటలతో పాటు అడవిలో వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే, లారీ అదుపుతప్పడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
చెన్నై-బెంగళూరు హైవేపై రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి
చెన్నై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా బెంగళూరు వాసులుగా తెలుస్తోంది. తిరుమల నుంచి వెళ్తుండగా బంగారుపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. -
పుట్టినరోజు నాడే నూరేళ్లు నిండాయి!
విశాఖపట్నం: నేడు పుట్టినరోజు. కొత్త దుస్తులు ధరించి, మిత్రులతో సరదాగా గడపాలి. అమ్మానాన్నల ఆశీస్సులు అందుకోవాలి. ఇదీ ఆ యువకుడి ఆశ. కానీ, విధి మరోలా తలచింది. పుట్టినరోజు సంబరాల ఏర్పాట్లు చేసుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా మృత్యువు కాటేసింది. స్నేహితుడితో కలిసి బైక్‌పై వస్తుండగా ఎన్ఏడీ జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బస్సు మీద నుంచి వెళ్లిపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చున్న స్నేహితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. రెండు బస్సుల మధ్య.. ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన తంగుడు మదన్ (24) ఆదివారం తన పుట్టినరోజు కావడంతో పార్టీ ఏర్పాట్ల నిమిత్తం మిత్రుడు మణికుమార్‌తో కలిసి బైక్‌పై కంచరపాలెం వెళ్లాడు. పనులు ముగించుకుని ఎన్ఏడీ వైపు జాతీయ రహదారిలో వస్తుండగా, ఎన్ఎస్టీఎల్ గేటు ఎదురుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో వీరు ముందు వెళ్తున్న ఫార్మా బస్సును ఢీకొని కిందపడిపోయారు. ఆ సమయంలో మదన్‌పై నుంచి ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో మదన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న కంచరపాలెం యువకుడు మణికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108లో కేజీహెచ్‌కు తరలించారు. బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సొంతింటి ఈఎంఐ కోసం శ్రమిస్తూ.. మదన్ తల్లిదండ్రులు ఎన్ఏడీ జంక్షన్లో తోపుడు బండిపై టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు. మదన్ డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే, ఈవెంట్లలో డెకరేషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. ఇటీవలే శాంతినగర్‌లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేయగా, దానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బాధ్యతలు మోస్తూ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు.. పుట్టినరోజే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘నువ్వు లేకపోతే మాకెవరురా దిక్కు’ అంటూ ఆ తల్లి పెడుతున్న రోదనలు స్థానికులను కలచివేశాయి. చదవండి: భోగాపురంలో దారుణం.. యువకుడ్ని బైక్‌కు తాళ్లతో కట్టేసి -
ట్యాంకర్ బీభత్సం.. 11 మంది మృతి
టెహ్రాన్: పశ్చిమ ఇరాన్లో ఇంధన ట్యాంకర్ పేలిపోవడంతో 11 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇరాన్‌లోని కుర్దిష్ నగరం సనందజ్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ట్యాంకర్ పలు వాహనాలను ఢీకొన్న తర్వాత మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రాంతం టెహ్రాన్‌కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన ఉంది.ట్యాంకర్లో బ్రేక్ వ్యవస్థలో లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు నివేదిక పేర్కొంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. హమదాన్ నుంచి మరీవాన్ వైపు ట్యాంకర్ వెళ్తుండగా, బ్రేక్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు గవర్నర్ తెలిపారు. ఇరాన్ ఇంటర్నేషనల్ తన నివేదికలో ఈ వివరాలను పేర్కొంది.2018లో ఇలాంటి ప్రమాదంలో 15 మంది మృతితాజా ఘటనకు ముందు 2018లో సనందజ్ సమీపంలో ఇలాంటి రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు ఇంధన ట్యాంకర్ అంతర్ నగర ప్రయాణికుల బస్సును ఢీకొనడంతో 15 మంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.ఇరాన్లో ప్రతి ఏడాది రోడ్డు, రవాణా ప్రమాదాల్లో 17,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అసురక్షిత వాహనాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, సరైన అత్యవసర సేవలు లేకపోవడం వల్ల ఆ దేశంలో రోడ్డు ప్రమాద మరణాల రేటు అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.At least 11 people were killed and seven others injured after a fuel tanker crashed, exploded and caught fire on the Sanandaj-Hamadan road in western Iran, the governor of Sanandaj said Saturday.The tanker was traveling from Hamadan toward Marivan when a technical failure in its… pic.twitter.com/lYntHeoNIu— Iran International English (@IranIntl_En) September 5, 2026 -
ఇదీ బెంగళూరు రోడ్ల పరిస్థితి.. ఇప్పుడు నా వంతు.. రేపు ఎవరివంతో?
సాక్షి,బెంగళూరు: దేశ ఐటీ రాజధాని, సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో రోడ్ల దుస్థితి మరోసారి తీవ్ర విమర్శలకు దారితీసింది. రోడ్డుపై కనిపించకుండా ఉన్న ఓ పెద్ద గుంత టెక్కీ పాలిట శాపంగా మారింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు చీలమండలం తీవ్రంగా గాయపడగా, అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.ఐటీ ఉద్యోగిణి ఐషాని ఖన్నా గత నెలలో తన స్కూటర్‌పై ఆఫీసుకు బయలుదేరారు. వైట్‌ఫీల్డ్-వర్తూర్ రోడ్డులోని నెక్సస్ మాల్ సమీపంలో వెళ్తున్న సమయంలో భారీ వర్షం కారణంగా రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. అది గమనించని బాధితురాలు గుంతలో పడి అదుపుతప్పి కిందపడ్డారు.ఈ సంఘటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను వర్షంలో చాలా జాగ్రత్తగా స్కూటర్ నడుపుతాను. కానీ నీటితో నిండి ఉన్న ఆ గుంత నా కంటికి కనిపించలేదు. ఒక్కసారిగా స్కూటర్‌తో సహా కిందపడ్డాను. నా ఎడమ కాలి చీలమండలంపై తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరగా.. ప్లాస్టిక్ సర్జరీతో పాటు ఇతర వైద్య సేవల కోసం రూ. 1.97 లక్షల బిల్లు అయింది. గాయాలు పూర్తిగా తగ్గడానికి భవిష్యత్తులో మరో సర్జరీ కూడా చేయించుకోవాల్సి రావొచ్చు. కేవలం శారీరక నొప్పే కాకుండా, ఊహించని ఈ పరిణామం వల్ల తీవ్రమైన మానసిక వేదనకు, ఆర్థిక భారానికి గురయ్యామని వాపోయారు.గత 30 ఏళ్లుగా బెంగళూరులోనే ఉంటున్నానని, నగరంలో రోడ్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని ఐషాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ నేను అనుభవిస్తున్న నరకం రేపు మరెవరికైనా జరగవచ్చు. ఇప్పటికైనా రోడ్లను బాగు చేయండి అంటూ ఆమె అధికారులను, మంత్రులను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఘటనపై నగరవాసులు, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్ల అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.hidden pothole on Varthur road cost me a crushed ankle, emergency plastic surgery, 5 days in hospital, and₹1.97L.This could happen to ANY of us tomorrow.Fix the roads now!@BBMPCOMM @GBA_office @krishnabgowda @BangaloreMirror @BangaloreTimes1 @BangaloreBuzz #bloreroads @gkcs_ pic.twitter.com/b5z4X2akmr— Aishani Khanna (@Aishani_Khanna) September 4, 2026 -
చిన్న పిల్లలు ఉన్నారన్నా.. నన్ను బతికించండి!
కర్నూలు: ఓ వైపు రక్తమోడుతున్నా ఇంటి వద్ద ఉన్న భార్యా పిల్లలను గుర్తు చేసుకుంటూ.. ‘అన్నా.. నన్ను రక్షించండి.. నాకు చిన్న పిల్లలన్నా’ అంటూ విలపించాడు. కదలలేనిస్థితిలో ఇరుక్కుపోయినా ‘మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడాలా’ అంటూ విలవిలలాడాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ క్షతగాత్రుని వేదన అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై మంగంపల్లె స్టేజీ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ఐరన్ మెటీరియల్ లోడ్‌తో వెళ్తున్న లారీ మంగంపల్లె స్టేజ్ వద్ద టైర్ బరస్ట్ అయ్యి రహదారికి కుడి వైపు డివైడర్ పక్కనే నిలిచిపోయింది. లారీ డ్రైవర్ కిందకు దిగి పరిస్థితిని చూసి 1032 ద్వారా సమాచారమిచ్చాడు. అయితే నిమిషాల వ్యవధిలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఐచర్ వాహ నం లారీని ఢీకొంది. దీంతో ఐచర్ వాహన డ్రైవర్ తాడిపత్రికి చెందిన నాగేంద్ర (35) డ్రైవింగ్ సీటులోనే ఇరుక్కుపోయాడు. వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న హైవే పోలీసులు ఆనంద్, శివ, హైవే అంబులెన్స్ సిబ్బంది, క్రేన్ సిబ్బంది ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను దాదాపు గంటపాటు శ్రమించి బయటకు తీశారు. ఆ సమయంలో డ్రైవర్ ‘త్వరగా తీయండన్నా.. తట్టుకోలేకపోతున్నాను.. నాకు చిన్న పిల్లలన్నా.. మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడాలి’ అంటూనే సృహ కోల్పోతుండడం అక్కడి వారి హృదయాలను కలచివేసింది. అతి కష్టం మీద బయటకు తీయగా అప్పటికే తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. చదవండి: రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి -
బంగారు తల్లుల్ని బలిగొన్న బస్సు!
తమిళనాడులో ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అమ్మాయిలు మరణించారు. ప్రమాదకరమైన మలుపు దాటే క్రమంలో.. వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం సైతం ప్రకటించారు. నమక్కల్ జిల్లా తిరుచెంగోడు(tiruchengode Accident) సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. వారి బంధువైన మరో బాలిక.. నలుగురూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న 19 ఏళ్ల యువతి తన ఇద్దరు చెల్లెళ్లను, బంధువైన బాలికను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.సంకరంపాళయం ప్రాంతానికి చెందిన సుభిత కలైసెల్వి (19), ఆమె చెల్లెళ్లు నివేత (17), ధనుశ్రీ (12), బంధువైన అభినయ (11) ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. సుభిత కళాశాల నుంచి ఇంటికి వచ్చిన అనంతరం.. ఎలచిపాళయం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న తన చెల్లెళ్లు, అభినయను తీసుకుని ఇంటికి బయలుదేరింది. అయితే..రసిపురం–తిరుచెంగోడు రహదారిపై చక్కరంపాళయం జంక్షన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా.. రసిపురం వైపు నుంచి వచ్చిన ముత్తాయమ్మాళ్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి నలుగురూ రోడ్డుపై పడిపోయారు. సుభిత, అభినయ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన నివేత, ధనుశ్రీని తిరుచెంగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. డ్రైవర్ అరెస్ట్ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎలచిపాళయం పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలించారు. చివరకు డ్రైవర్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్, మృతికి కారణమైన ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తాజా సమాచారం.Tiruchengode 🚨⚠️Disturbing Visuals🚨4 on a 2 wheeler behind College Bus, taking right turn next to petrol bunk with blocked vision, headON with other Bus.Always look ahead & behind, before taking any such turns.@DriveSmart_IN https://t.co/8hVIFtjdhE— Dave (Road Safety: City & Highways) (@motordave2) September 4, 2026పేద కుటుంబం.. పెద్ద కష్టంమృతుల్లో సుభిత, నివేత, ధనుశ్రీ ముగ్గురూ శేఖర్, అముధ దంపతుల కుమార్తెలు. వారు కూరగాయల వ్యాపారం/కూలీ పనులతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో సుభిత చదువుకు గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్. ఉమా సహాయం చేసినట్లు సమాచారం. ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుఓంది. ఇక అభినయ.. శేఖర్ సోదరుడు రమేశ్‌బాబు కుమార్తె. ఇలా ఒకే కుటుంబ బంధంలో ఉన్న నలుగురు చిన్నారులు, యువతులు ఒకే ప్రమాదంలో మృత్యువాత పడటంతో సంకరంపాళయంలో విషాదఛాయలు అలుముకున్నాయి.సీఎం విజయ్ సంతాపం.. రూ.3 లక్షల పరిహారంఈ విషాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ శుక్రవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి బాధ కలిగించిందని అన్నారు. మృతులు సుభిత, నివేత, ధనుశ్రీ, అభినయ కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు.కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదంచదువుకుని జీవితంలో ఎదగాల్సిన వయసులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వారి బంధువైన మరో బాలిక ఇలా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. సుభిత తన చెల్లెళ్లను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్న ప్రయాణమే.. ఆ కుటుంబానికి చివరి ప్రయాణంగా మారింది. అదే సమయంలో.. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. నలుగురు ఒకే బైక్‌పై ప్రయాణించడం.. అందునా ప్రమాదకరమైన మలుపులో ప్రయాణం.. తప్పంతా యువతులదే అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఇదీ చదవండి: తుక్కుతుక్కైన కారు.. 8 మంది బీటెక్ స్టూడెంట్స్ దుర్మరణం -
కారు-లారీ ఢీ.. 8 మంది బీటెక్ విద్యార్థుల దుర్మరణం
కేరళ త్రిసూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఎనిమిది మరణించారు. మృతుల్లో ఏడుగురు తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. మరొకరు డ్రైవర్‌గా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.తమిళనాడు దిండిగల్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కారులో వెళ్తున్నారు. కైపమంగళం సమీపంలోని పనంబిక్కున్ను సెంటర్ వద్ద NH-66పై శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో ఆ కారు ప్రమాదానికి గురైంది. గురువాయూర్ వైపు నుంచి కొడుంగల్లూర్ వెళ్తున్న టైంలో.. హైవేపై నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు. కారు నుజ్జు నుజ్జు కావడంతో అందులో చిక్కుకున్నవాళ్లను బయటకు తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఊపిరి వదిలారు. ప్రమాదానికి గురైన కారు తమిళనాడు రిజిస్ట్రేషన్‌తోనే ఉంది. మృతదేహాలను త్రిసూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి అమిత వేగం ఒక కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న రహదారిపై డైవర్షన్, తగిన హెచ్చరికలు, లైటింగ్ వంటి అంశాలపైనా పోలీసులు పరిశీలన చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ మూడు లారీలు నిలిపి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: మంచి స్కూల్స్ అడిగితే తప్పా? -
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
మలికిపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన అన్నదమ్ములు ముదునూరి రామభద్రరాజు (రాంబాబు రాజు) (55), అతని తమ్ముడు ముదునూరి వెంకట సుబ్బరాజు (శ్రీనివాసరాజు) (52) అక్కడిక్కడే మృతి చెందారు. తోటికోడళ్లయిన రాంబాబు రాజు భార్య విజయలక్ష్మీ మాధురి, శ్రీనివాసరాజు భార్య శారద తీవ్రంగా గాయపడగా వారిని కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరు భీమవరం నుంచి స్వగ్రామం లక్కవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాంబాబు రాజు, విజయలక్ష్మీ మాధురి భీమవరంలో బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళారు. శ్రీనివాసరాజు, శారద తమ కుమార్తెను అమెరికా పంపించేందుకు బెంగళూరులో విమానం ఎక్కించి రైలులో భీమవరం వచ్చారు. పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక రాంబాబు రాజు దంపతులు, భీమవరంలో రైలు దిగిన శ్రీనివాసరాజు దంపతులు కలిసి తెల్లవారుజామున కారులో లక్కవరం బయలుదేరారు. మరొక్క నిమిషంలో ఇంటికి చేరుకుంటారనగా.. లక్కవరం ఓఎన్జీసీ సైట్ వద్ద వీరి కారు అదుపు తప్పి ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తోటికోడళ్లిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం వేకువజామున 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ చేస్తుండగా కునుకు రావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధంప్రయాణికులు సురక్షితంపెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. టీజీ13టీ1986 నంబరు గల బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు గురువారం రాత్రి 8.40 గంటలకు బయలు దేరింది. బస్సులో 33 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో పామిడి దాటిన తర్వాత కాలుతున్న వాసన రావడంతో ప్రయాణికులు, డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ కొద్దిదూరంలోని మిడుతూరు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దింపేశారు. అందరూ దిగేయగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగి్నమాపక వాహనం ఘటన స్థలానికి చేరుకొనేలోపే బస్సు మొత్తం కాలిపోయింది. సీఐ నరేంద్రరెడ్డి, ఎస్ఐ రాఘవేంద్రప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,కాకినాడ: తాళ్ళరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మట్లపాలెం గ్రామం వద్ద వేగంగా వస్తున్న ఆటో, బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సమాచారం మేరకు.. కృష్ణ, మణికంఠ, తమ్మి అనే ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై కాకినాడ నుండి యానం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాళ్ళరేవు మండలం మట్లపాలెం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటో వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద తీవ్రతకు తీవ్ర గాయాలపాలైన కృష్ణ, మణికంఠ ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలతో ఉన్న మరో యువకుడు తంబిని స్థానికులు తక్షణమే కాకినాడ జిజిహెచ్ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అతను కన్నుమూశాడు. ఒకే ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి
కైరో: ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు సినాయ్ ద్వీపకల్పంలో ఓ బస్సు దురదృష్టవశాత్తు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెనువెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా రోడ్డు ప్రమాద వివరాలను ఆ దేశ మీడియా కథనాలుప్రకటించాయి. ఈజిప్టులోని దక్షిణ సినాయ్ గవర్నరేట్‌లోని దహబ్-నువైబా రహదారిపై ఒక ప్రయాణికుల బస్సు బోల్తా పడటంతో పది మంది జోర్డాన్ దేశస్థులు మరణించారని జోర్డాన్ అధికారిక అల్-మమ్లకా ఛానల్ తెలిపింది. ఆ బస్సులో మొత్తం 43 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 22 మంది జోర్డాన్ దేశస్థులు ఉన్నారని పేర్కొంది. గాయపడిన వారికి వైద్య సంరక్షణ అందిస్తున్నారని అధికారులు తెలిపారు, కానీ ప్రమాదానికి గల కారణాన్ని వెల్లడించలేదు.కాగా ఈజిప్టు ప్రాంతం ప్రముఖ పర్యాటక ప్రాంతం ఇక్కడ సముద్ర జీవవైవిధ్యం, సహజ సౌందర్యం, పర్వతారోహణ కోసం ప్రత్యేకంగా టూరిస్టులు వస్తుంటారు.ఇటీవల ఈజిప్టులో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో సహా సరైన నిర్వహణ సామర్థ్యం లేకపోవడం తదితర కారణాలతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెలలో, ఉత్తర ఈజిప్టులో వ్యవసాయ దినసరి కూలీలను తీసుకువెళ్తున్న రెండు పికప్ ట్రక్కులు ఢీకొన్న ఘటనలో, మరణించిన వారిలో చాలామంది టీనేజర్లు ఉన్నారు, కనీసం 18 మంది మరణించారు.ఈజిప్ట్ ప్రభుత్వ గణాంకాల సంస్థ ప్రకారం, గత సంవత్సరం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 6,000 మంది మరణించారు. -
కార్ల మధ్య రహస్య సంభాషణతో రోడ్డు ప్రమాదాలకు చెక్
దేశంలోని రోడ్లపై ప్రయాణం ఇకపై పూర్తిగా మారిపోనుంది. ఎదురుగా వచ్చే ప్రమాదాలను ముందే పసిగట్టి, ఒకదానితో ఒకటి మాట్లాడుకునే సరికొత్త కార్లు త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి. దేశంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వెహికల్-టు-వెహికల్’ (వీ టు వీ) కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. కేంద్రం సంచలన నిర్ణయం2025లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 1.83 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య సుమారు 6,000 పెరగడం ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ‘కేంద్ర మోటార్ వాహనాల (సవరణ) నిబంధనలు, 2026’ ముసాయిదాను జూలై 22న విడుదల చేసి, ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించింది.అసలు ఏమిటీ ‘వీ టు వీ’టెక్నాలజీ?వీ టు వీ అంటే ‘వెహికల్-టు-వెహికల్’ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ సాంకేతికత ద్వారా రోడ్డుపై వెళ్లే వాహనాలు పరస్పరం సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయి. ప్రస్తుతం కార్లలో వస్తున్న ఏడీఏఎస్ భద్రతా ఫీచర్ల కంటే ఇది ఎంతో ముందంజలో ఉంటుంది. ఈ వ్యవస్థ సాయంతో ప్రయాణంలో ఎదురయ్యే ముప్పును డ్రైవర్ కంటే ముందే వాహనం గుర్తించి హెచ్చరిస్తుంది.అమలు గడువులు.. పాటించాల్సిన ప్రమాణాలుకొత్త నిబంధనల ప్రకారం, 2027 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే ఎల్ (ద్విచక్ర, త్రిచక్ర), ఎం (కార్లు, బస్సులు), ఎన్ (సరుకు రవాణా వాహనాలు) కేటగిరీ వాహనాల్లో వీ టు వీ సిస్టమ్ అమర్చితే అవి కచ్చితంగా ‘ఏఐఎస్-230’ ప్రమాణాలకు లోబడి ఉండాలి. అలాగే 2028 అక్టోబర్ 1 తర్వాత దేశంలో తయారయ్యే ఈ కేటగిరీల అన్ని వాహనాల్లోనూ ‘వీ టు వీ’ సిస్టమ్ ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సిగ్నల్స్ బదిలీ, రేడియో ఫ్రీక్వెన్సీ, జీపీఎస్ అనుసంధానం, సైబర్ భద్రత నియమాలను ఈ ఏఐఎస్-230 ప్రమాణాలు నిర్దేశిస్తాయి.సాంకేతికత ఎలా పనిచేస్తుంది?వాహనంలో అమర్చే చిన్న ‘ఆన్-బోర్డ్ యూనిట్’ (ఓబీయూ)ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది 5.875 GHz నుండి 5.925 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌పై సెల్యులార్ వెహికల్-టు-ఎవ్రీథింగ్ (C-V2X) సాంకేతికతను వాడుకుంటుంది. టెలికాం శాఖ (DoT) ఇప్పటికే ఈ స్పెక్ట్రమ్‌ను లైసెన్స్ రహితంగా ప్రకటించింది. ఈ ఓబీయూ పరికరం దాదాపు 300 మీటర్ల పరిధిలోని వాహనాలను సులువుగా పసిగడుతుంది. కొత్త కార్లలో అమర్చే ఈ పరికరం ఖరీదు సుమారు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సాధారణ సెన్సార్లకు ‘వీ టూ వీ’కి తేడా ఏమిటి?ప్రస్తుతం కార్లలో ఉండే కెమెరా లేదా రాడార్ ఆధారిత ఏడీఏఎస్ వ్యవస్థలు కేవలం డ్రైవర్ లేదా కెమెరా చూడగలిగే పరిధిని మాత్రమే గుర్తిస్తాయి. కానీ ‘వీ టూ వీ’ వ్యవస్థ దృష్టికి ఆవల ఉన్న ప్రమాదాలను కూడా పసిగడుతుంది. ప్రమాదకరమైన మలుపులు (బ్లైండ్ కార్నర్స్), భారీ ట్రక్కుల వెనుక ఉన్న కార్లు, దట్టమైన పొగమంచులో దాగి ఉన్న వాహనాల వివరాలను వేగం, దిశ, బ్రేకింగ్ డేటా ద్వారా పరస్పరం పంచుకుంటుంది. విమానాలు తమ ఎత్తు, వేగాన్ని రేడియో సిగ్నల్స్ ద్వారా పంచుకునే విధానాన్ని పోలి ఉండే ఈ వ్యవస్థతో ఎదురెదురు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి.డేటా భద్రత.. ఎదురవుతున్న సవాళ్లు‘వీ టు వీ’ ఎంతో ఉపయోగకరమైనప్పటికీ, ప్రయాణ డేటా, వాహనం లొకేషన్, రూట్ సమాచారం నిరంతరం సేకరించడం వల్ల సైబర్ దాడులు, గోప్యతా సమస్యలు తలెత్తే ముప్పు ఉంది. లక్షలాది వాహనాలు ఒకేసారి రోడ్లపైకి వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌పై ట్రాఫిక్ లోడ్ పెరగడం, సిగ్నల్ లోపాలు రాకుండా చూసుకోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. ఈ భద్రతా లోపాలను అధిగమించేందుకు పటిష్టమైన సైబర్ చట్టాలు, రక్షణ చర్యలు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నేపాల్: శవాల గుర్తింపు ఎలా? కుటుంబ సభ్యులకు చూపిస్తారిలా.. -
గృహప్రవేశం చేసిన 4 రోజులకే కబళించిన మృత్యువు
ఆనందపురం: విశాఖ జిల్లా ఆనందపురం నుంచి పెందుర్తి వైపు సర్వీస్ రోడ్డులో వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగి కారు నడుపుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సజీవ దహనమయ్యాడు. ఒడిశాలోని రాయగడ జిల్లా గుణుపూర్కి చెందిన పోలాకి అమర్నాథ్ పాత్రో (28) హైదరాబాద్‌లోని టీసీఎస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. 3 నెలల క్రితం ఆయన విశాఖలోని పరదేశిపాలెంలోని జగన్నాథ్ స్కై గార్డెన్స్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఈ నెల 27న గృహప్రవేశం పూర్తి చేసుకుని కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. ఆదివారం స్నేహితులను కలిసి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి కారులో బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో సోమవారం వేకువజామున ఆనందపురం– పెందుర్తి సర్వీస్ రోడ్డులోని సత్రం కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అమర్నాథ్ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. మంటల ఉధృతికి కారు తలుపులు తెరుచుకోకపోవడంతో వాహనంలోనే తీవ్రంగా కాలిపోయి అక్కడే మృతి చెందాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త ఇల్లు కొనుగోలు చేసి గృహప్రవేశం చేసిన నాలుగు రోజులకే అమర్నాథ్ దుర్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు నిర్మల్ జిల్లా వాసుల దుర్మరణం
నిర్మల్ జిల్లా: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ జీపు బోల్తా పడి నలుగురు దుర్మరణం చెందారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వస్తుండగా జీపు బోల్తా పడటంతో నలుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్టీ(బి) గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని బైంసా ఏరియా హాస్పిటల్‌కు తరిలించి చికిత్స అందిస్తున్నారు. -
కారు లోపం కాదు.. సంజూష్ నిర్లక్ష్యమే
సాక్షి, హైదరాబాద్: జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ నిర్లక్ష్యం వల్లే ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్పష్టమైంది. నిందితుడు సంజూష్ నడిపిన లగ్జరీ కారు ఆస్టన్ మార్టిన్‌లో ఎలాంటి సాంకేతిక, యాంత్రిక లోపం లేదని తేటతెల్లమైంది. ఈమేరకు రంగారెడ్డి జిల్లా రవాణా అధికారులు (డీటీఓ) మాదాపూర్ పోలీసులకు మోటారు వాహన తనిఖీ (ఎంవీఐ) సమర్పించిన తుది నివేదికలో వెల్లడించారు. ఈనెల 16న మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా ఆస్టన్ మార్టిన్ కారులో దూసుకొచ్చిన సంజూష్.. రోడ్డు దాటుతున్న ఒడిశాకు చెందిన భారతి ముఖీని బలంగా ఢీ కొట్టడంతో ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన తీరు, కారు మెకానికల్ పనితీరుపై సమగ్ర విచారణ కోరుతూ మాదాపూర్ పోలీసులు డీటీఓకు లేఖ రాశారు. దీంతో ఈనెల 21న మాదాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న కారును ఠాణా పరిసరాల్లోనే మోటార్ వాహనాల తనిఖీ అధికారి క్షుణ్నంగా తనిఖీ చేసి నివేదికను సమర్పించారు. బ్రేక్‌లు ఫెయిల్ కాలేదు సాధారణంగా ఇలాంటి లగ్జరీ కార్ల ప్రమాదాలు జరిగినప్పుడు ‘బ్రేక్‌లు పనిచేయలేదు’అనే సాకులు వినిపిస్తుంటాయి. కానీ, ఈ కేసులో ఆర్టీఏ అధికారులు ఆస్టన్ మార్టిన్ కారును క్షుణ్నంగా తనిఖీ చేసి ‘ఈప్రమాదం వాహన యాంత్రిక లోపాల వల్ల జరగలేదు’అని స్పష్టం చేశారు. ఫుట్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్, పార్కింగ్ బ్రేక్‌లు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కారులోని డ్యాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయిన ఆడియో, వీడియో ఫుటేజ్‌లను కూడా సమగ్ర విచారణ చేసి, నివేదిక అందించాలని మాదాపూర్ పోలీసులు లేఖ రాయనున్నారు. యూకే నుంచి కారు దిగుమతి.. సంజూష్ నడిపిన లగ్జరీ కారు ఆస్టన్ మార్టిన్ యూకే నుంచి దిగుమతి అయింది. గతేడాది జూలై 11న ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో టీజీ09 జీ0666 నంబరుతో హానర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్ఎల్పీ, మేంపరాల ఐశ్వర్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. సంజూష్ కు డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) వచ్చి రోడ్డు ప్రమాదం చేసిన రోజు నాటికి కేవలం 88 రోజులే అయ్యాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి మృతికి కారణమైన కారణంగా అతడికి ప్రస్తుతానికి డీఎల్ 6 నెలల పాటు రద్దవుతుందని, పోలీసుల విచారణ, కోర్టు తీర్పు అనంతరం డీఎల్ శాశ్వతంగా రద్దయ్యే అవకాశం కూడా ఉందని ఓ ఆర్టీఏ అధికారి స్పష్టం చేశారు. -
CCTV Footage: కేరళంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్‌ను ఈడ్చుకెళ్లిన లారీ
కాకినాడ: ఆ కుటుంబ సభ్యులు అప్పటి వరకూ సినిమా చూసి, ఆనందంగా గడిపారు. అతడు భార్యాపిల్లలను ఇంటి దగ్గర దింపి, పలావ్ కొనుక్కుని వచ్చేందుకు బయల్దేరాడు. తిరిగి వెళ్తూండగా మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. అతడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘోర సంఘటన జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నీలాపు సంతోష్ కుమార్ రెడ్డి (34) ప్రతిపాడులోని సీఎఫ్‌సీ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పని చేస్తూ, 11 సంవత్సరాలుగా జగ్గంపేట బాలాజీ నగర్లో నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి భార్య శ్రీలిఖిత, కుమార్తెలు శాన్వి, లాస్య(చిన్న పిల్లలు)తో కలసి సినిమాకు వెళ్లారు. అనంతరం, భార్యాపిల్లలను సంతోష్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద దించి, పలావు కోసం గోకవరం రోడ్డులోని బిర్యానీ సెంటర్‌కు మోటార్ సైకిల్‌పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ అతడిని ఢీకొంది. దీంతో, సంతోష్ కుమార్ రెడ్డి బైక్ అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్‌ను ఢీకొంది. అందరూ కింద పడిపోగా ఆ లారీ సంతోష్ కుమార్ రెడ్డి బైక్‌ను కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అతడి చెయ్యి నుజ్జునుజ్జయి ఊడిపోయింది. తీవ్ర గాయంతో రక్తస్రావం అవుతూండగానే సంతోష్ కుమార్ రెడ్డి మరో చేత్తో కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి మొబైల్ ఫోన్లో సమాచారం అందించడం స్థానికులను కలచివేసింది. అతడిని స్థానికులు, పోలీసులు, బంధువులు తొలుత స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలిస్తూండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వారు కూడా గాయపడ్డారు. సంతోష్ కుమార్ రెడ్డి భార్య శ్రీలిఖిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.చదవండి: ఫ్రెండ్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం? -
చిలకలూరిపేటలో కొనసాగుతున్న హైటెన్షన్
సాక్షి, పల్నాడు: చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన శుక్రవారం ఉదయం కూడా కొనసాగుతోంది. మృతుల కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాల నాయకులు, వేలూరు గ్రామస్తులు నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో ఎన్ఆర్టీ సెంటర్లోని చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన విరమించే ప్రసక్తే లేదని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంతో పాటు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.చిలకలూరిపేటలో నిన్న సాయంత్రం 4.30 గంటల నుంచి ఆందోళన కొనసాగుతుండగా.. జాతీయ రహదారిపై సుమారు 12 గంటలుగా బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్నామని.. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.ఎమ్మెల్యే రావాల్సిందే..తమ వద్దకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే తమ వద్దకు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించడంలో వెంటనే చొరవ చూపాలని దళిత సంఘాలు కోరుతున్నాయి.సంబంధిత వార్త: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి దుర్మరణంఅధికారులతో చర్చలుఅంతకు ముందు.. ఆందోళన నేపథ్యంలో రాత్రి 11 గంటల సమయంలో డీఎస్పీ, ఆర్డీఓ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని అధికారులు కోరినప్పటికీ.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తమ వద్దకు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సెంటర్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.ఎంపీ మాటతో భగ్గుమన్న దళిత సంఘాలుచిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు నిరసన సెగ తగిలింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మృతుని బంధువులతో.. వినతిపత్రం ఇవ్వండి అంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. దీంతో ఎంపీ తీరు పట్ల మృతుల కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు చనిపోతే న్యాయం చేయడానికి వినతిపత్రం ఇవ్వాలా? అంటూ ఎంపీని వారు ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని ఎంపీ ముందు నినాదాలు చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.ఇదీ చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. -
మాకు ఏ భేషజాలు లేవు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విజయవాడ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో ఇప్పటికే వేల మంది ప్రాణాలను కోల్పోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రోడ్లు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి గురు వారం సమీక్షించారు. ఈ సందర్భంగా కోదాడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంతో పాటు ఇటీవల జరిగిన పలు ప్రమాదాలపై మంత్రి ఆరా తీశారు. హైదరాబాద్–విజయవాడ రహదారిలో గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్‌పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, హైమాస్క్ లైట్స్ పనుల పురోగతిని తెలుసుకున్నారు. చిట్యాల ఫ్లైఓవర్ ఈ దసరా నాటికి పూర్తిచేయాలని, మిగతావి డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు. 6+2 రహదారి విస్తరణ కోసం ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు కలిశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే తమ ధ్యేయమని, అందుకోసం తమకు ఎలాంటి భేషజాలు లేవు అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులతో కలిసి మరోసారి నితిన్ గడ్కరీని.. అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తామన్నారు. -
ప్రాణాలు పోతే వినతిపత్రం కావాలా?
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దళితులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బాధిత కుటుంబాలు, దళిత సంఘాల ఆగ్రహం తీవ్రస్థాయికి చేరింది. ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడినా ప్రభుత్వం నుంచి తగిన భరోసా, పరిహారం ప్రకటించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చిన నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బాధితుల సమస్యలను విన్న ఎంపీ.. వినతిపత్రం ఇవ్వాలని, దానిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో బాధితులు భగ్గుమన్నారు. ఇంతటి విషాదంలో ఉన్న తమకు ప్రభుత్వం నేరుగా అండగా నిలవాల్సింది పోయి వినతిపత్రం ఇవ్వాలని చెప్పడం ఏమిటంటూ వారు మండిపడ్డారు. పైగా.. ఇప్పటివరకు ఎలాంటి భరోసా కల్పించకపోవడంపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి..ప్రమాదంలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరాయి. అలాగే, డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేదిలేదంటూ బాధితులు సా.4.30కు చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి వద్ద రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీంతో చీరాల–చిలకలూరిపేట మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడి నుంచి ఆందోళనకారులు ర్యాలీగా బయల్దేరి జాతీయ రహదారి–16పై బైఠాయించారు. సా.7.30 గంటల నుంచి మూడు గంటలకు పైగా ధర్నా పెద్దఎత్తున కొనసాగింది. తాము ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ధర్నాతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో వాటిని మళ్లించారు. -
అన్నయ్య వచ్చేసరికే నేనక్కడ ఉండాలి! చెల్లెలి విషాదం!
ఆంధ్రప్రదేశ్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ప్రైవేటు బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.వీరిలో కొండూరు భావన వర్ష(23)ది విజయవాడ. హైదరాబాద్‌లో హెచ్ఆర్ ఉద్యోగం చేస్తున్న ఆమెకు తండ్రి కృష్ణారావు, తల్లి సుభాషిణి ఉన్నారు. వీరు అజిత్‌సింగ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో జ్యూయలరీ వర్క్‌షాపు ఉంది.దీంతో మంగళవారం మకాం అడవినెక్కలంకు మార్చారు. భావన వర్ష సోదరుడు రెశ్వంత్ సౌదీలో పనిచేస్తున్నారు. ఆయన రాఖీ పండగ కోసం వస్తుండడంతోపాటు తనకు బెంగళూరులో ఉద్యోగం రావడంతో కొన్ని రోజులు తల్లిదండ్రులతో ఉండాలని భావించిన భావన వర్ష చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి విజయవాడకు బయలుదేరారు.ముందు వేరే బస్సుకు టికెట్ బుక్ చేసుకున్న ఆమె ఆ బస్సు వెళ్లిపోవడంతో ప్రమాదానికి గురైన బస్సు ఎక్కారు. రూమ్మేట్స్ బుధవారం వెళ్లొచ్చుకదా అన్నా.. సోదరుడికి రాఖీ కట్టాలని, అన్నయ్య వచ్చేటప్పటికే తాను అక్కడ ఉండాలని ఉత్సాహంగా బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారారు.ఆమె మృతదేహాన్ని అంబులెన్సులో విజయవాడ మధురానగర్‌లోని తాతయ్య బ్రహ్మయ్య ఇంటి వద్దకు తీసుకురావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అమ్ములూ ఒక్కసారి కళ్లుతెరువమ్మా అంటూ ఆమె తల్లి, పెద్దమ్మలు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. సోదరుడు రెశ్వంత్ సౌదీ నుంచి వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఇవీ చదవండి: తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు -
సరే.. మమ్మీ నువ్వే కాల్ చెయ్
నిజామాబాద్‌అర్బన్: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లాకు చెందిన రాహుల్ చివరి సారిగా తన తల్లితో ఫోన్లో ఈనెల 24వ తేదీన ఉదయం 9గంటలకు మాట్లాడాడు. తల్లితో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలోనే స్నేహితులు క్యాబ్‌లో రావడంతో ‘‘ఆఫీస్‌కు వెళ్తున్నానని, రేపు ఉదయం నువ్వే కాల్ చెయ్ మమ్మీ..’’ అంటూ ఫోన్ కట్‌చేశాడు. అవే రాహుల్ చివరి మాటలు అంటూ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. నవీపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన నాగమణి, హరిబాబు జిల్లా కేంద్రంలోని గూపన్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నాగమణి గృహిణి కాగా, హరిబాబు రైల్వేలో ఏఎస్సైగా పని చేసి రిటైర్ అయ్యారు. కొడుకు రాహుల్ నాలుగేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న రాహుల్ అక్కడే పీహెచ్డీ పూర్తి చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. మే 5వ తేదీన తన చెల్లె పెళ్లికి ఇంటికొచ్చిన రాహుల్ అదే నెలలో 18వ తేదీన తిరిగి అమెరికాకు వెళ్లిపోయాడు. తన తల్లితో సోమవారం ఫోన్లో మాట్లాడిన కొద్దిసేపటికే రాహుల్ దుర్మరణం పాలయ్యాడు. చేతికొచ్చిన కొడుకు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుంబెలుబాదుకుంటున్నారు. తన కొడుకు మృతదేహాన్ని త్వరగా తెప్పించాలని తండ్రి హరిబాబు రోదిస్తూ వేడుకుంటున్నాడు. -
పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు-ఆటో ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని పేర్కొన్నారు. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా తెలిసిందని, ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరమన్నారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని వైఎస్ జగన్ కోరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి...
పటమట(విజయవాడతూర్పు): బీటెక్ చదివిన సూరవరపు షకీనా(24) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం సోమవారం హైదరాబాదు వెళ్లారు. ఇంటర్వ్యూ బాగా చేశానని, తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని మంగళవారం రాత్రి తన భర్తకు ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది. ఉద్యోగం సాధిస్తే తను జీవిత లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం అంతలోనే ఆవిరైందని ఆమె కుటుంబ సభ్యులు గుండలవిసేలా విలపిస్తున్నారు. భీమవరానికి చెందిన షకీనాకు రాజమండ్రికి చెందిన సాయికృష్ణతో గత ఏడాది వివాహం జరిగింది. సాయి కృష్ణ విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ ప్రైవేటు కన్సల్టెన్సీలో ఆర్కిటెక్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరు పెళ్లయిన రెండునెలల తర్వాత విజయవాడ పటమట ఆర్ఆర్ గార్డెన్స్‌లోని కనకదుర్గ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రోజూ తమతో కలుపుగోలుగా ఉండే షకీనా మరణించడంతో స్థానికులూ కంటతడి పెట్టారు. చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణంతేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు -
ఘోర రోడ్డు ప్రమాదం
కోదాడ, కోదాడ రూరల్/సాక్షిప్రతినిధి, విజయవాడ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై సగం రోడ్డుమీద, సగం డివైడర్‌పై ఆగిపోయిన ట్రాలీ లారీని గమనించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్‌డ్రైవర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (టీఎస్ 08యుఎల్ 5112) 42 మంది ప్రయాణికులతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఏలూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూర్యాపేట సమీపంలోని చార్జింగ్ స్టేషన్ వద్ద ఆపి బస్సు చార్జింగ్ పెట్టుకున్నారు. ఈ సమయంలో మొదటి డ్రైవర్ డ్యూటీ దిగి రెండో డ్రైవర్‌కు బస్సు అప్పగించాడు. హైదరాబాద్ నుంచి విజయవాడవైపు ఐరన్ పిల్లర్లలోడ్తో వెళ్తున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కోదాడ శివారులో అదుపుతప్పి డివైడర్‌పైకి సగం వెళ్లి ఆగింది. ఆ తర్వాత 48 నిమిషాలకు కోదాడ శివారుకు చేరుకున్న బస్సు డ్రైవర్ ట్రాలీ లారీని గమనించకుండా వెనుకవైపు నుంచి వేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాలీ లారీలో ఉన్న ఐరన్ పిల్లర్లు బస్సులోకి చొచ్చుకురావడంతో బస్సు కుడివైపు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ సీటు వెనుక సీట్లలో ఉన్న యాసారపు చిన్ని(32), బొల్లిపోగు మేరీ జ్యోత్స్న (29), సూరవరపు షకీనా(24), చెన్నకేశవుల నాగేంద్రబాబు(31), పడికిటి లక్ష్మీతేజ (30), కొండూరు భావన వర్ష(23) అక్కడిక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కోదాడ రూరల్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణారెడ్డి, పలువురు ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ ఘటనాస్ధలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు మీద నిలిచిపోయిన ట్రాలీ లారీతోనే..కోదాడ దాటిన తరువాత కిలోమీటరు దూరంలో ఇనుప పిల్లర్ల లోడ్‌తో వెళుతున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ప్రమాదానికి గురై డివైడర్మీదకు దూసుకెళ్లింది. సగం టైర్లు రోడ్డుమీద, సగంటైర్లు డివైడర్‌పై ఉన్నాయి. లారీ డ్రైవర్ ఎలాంటి హెచ్చరిక బోర్డులూ పెట్టకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి అరగంట ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కూడా ట్రాలీ లారీని ఢీకొట్టబోయి తృటిలో తప్పించుకుంది. ఆ బస్సుకు స్వల్పంగా గీతలు పడ్డాయి.ఆ బస్సు డ్రైవర్ తన బస్సును పక్కకు ఆపి ట్రాలీ లారీ వద్దకు వచ్చి డ్రైవర్‌ను తీవ్రంగా హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే హెచ్చరిక బోర్డులు పెట్టాలని గట్టిగా చెప్పి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ బస్సు వెళ్లిన 15 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టంమీద వెలికితీశారు. కోదాడ వైద్యశాలకు తరలించారు. పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.మృతుల్లో ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులే..మృతి చెందిన ఆరుగురిది ఉమ్మడి కృష్ణా జిల్లా. వీరిలో యాసరపు చిన్ని, భావనవర్ష, షకీనా మినహా మిగిలిన ముగ్గురూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. షకీనా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లి తిరిగి వస్తూ మృత్యుఒడికి చేరారు.క్షతగాత్రుల వివరాలు» విజయవాడకు చెందిన యాసరపు సుధాకర్, కేతు రమణమ్మ, ఆదిలాబాద్‌కు చెందిన రాథోడ్ విశాల్‌లకు గాయాలు కావడంతో వారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు, ఉన్నం యశ్వంత్ సూర్యాపేట ఏరియా వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు.» తాడేపల్లిగూడెంకు చెందిన పెద్దోజు భవానీకి తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. » విజయవాడకు చెందిన గరికపాటి మనోహర్, ఏలూరుకు చెందిన బండి చందన, సాయిల అనిల్‌కుమార్, సుంకర విజయలక్ష్మి, కరిషపోగు వంశీ, ఆకుల నవీన్‌కుమార్, జి.వి. ధృవకుమార్, ఎం.జేసన్కుమార్ విజయవాడలోని పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. రేపల్లి వేదవ్యాస్ ఏలూరు ఆంధ్ర వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు. గాయపడిన వారిలో వరంగల్‌కు చెందిన జి.అవినాష్ ఉండగా.. ఆయన ఎక్కడ చికిత్సపొందుతున్నాడన్న వివరాలు తెలియరాలేదు.తీవ్ర విషాదకరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్సాక్షి, అమరావతి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి, విషమ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
అమెరికాలో తెలంగాణ యువకుల దుర్మరణం
ఎన్నారై న్యూస్: అమెరికా స్టేట్ ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లని సమాచారం. మృతుల్లో ఓ యువకుడు నిజామాబాద్ వాసిగా నిర్ధారణ అయ్యింది. మిగతా ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.ఫ్లోరిడా హైవే పెట్రోల్ అందించిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున వాళ్లు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు సమాచారం చేరవేశారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్.. మూడు నెలల కిందట ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ప్రమాదంలో అతనూ మరణించినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ వార్తతో ముగ్గురి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాల్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: నేపాల్‌లో ప్రకృతి విలయ తాండవం -
సూర్యాపేట: ప్రాణాలు తీసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు.బుధవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రెష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో డివైడర్ మధ్యలో ఐరన్ లోడ్ లారీ ఆగిపోయింది. అయితే వేగంగా వెళ్లిన బస్సు.. లారీ కంటైనర్‌ను ఢీ కొట్టింది. దీంతో ఐరన్ దిమ్మెలు బస్సులోకి దూసుకెళ్లాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాయపడిన వాళ్లను హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.అతివేగం.. ముందు ఆగిఉన్న లారీని బస్సు డ్రైవర్ గమనించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ఎస్సీ నరసింహ తెలిపారు. డ్రైవర్ అందుబాటులో లేడని(పరారీ?).. ఉదయం 4గం. సమయంలో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మృతుల్లో.. చిన్ని, మేరీ, నాగేంద్రబాబులను గుర్తించినట్లు తెలిపారు. మిగతా మృతుల పేర్లు.. వివరాలు అందాల్సి ఉంది. ఈ ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలకి దిగి క్లియర్ చేశారు.టీ విరామం తర్వాత బస్సు ప్రారంభమైన గంటకు ప్రమాదం జరిగిందని.. బస్సు బలంగా ఢీ కొట్టాక ఐరన్ దిమ్మెలు వచ్చి పడ్డాయని క్షతగాత్రుడొకరు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత 20 మందిని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినట్లు కోదాడ ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు. వాళ్లలో ముగ్గురిని సూర్యాపేటకు తరలించినట్లు వెల్లడించారు. -
గుండెపోటుతో అంగన్వాడీ టీచర్ మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా: ఆ కుటుంబంపై మృత్యువు పగబట్టింది. ఉదయం విధులకు బయలుదేరిన తల్లి బస్టాండ్‌లోనే అకస్మాత్తుగా మృతి చెందగా, ఈ విషాద వార్త తెలుసుకుని పరామర్శించేందుకు వస్తున్న కుమారుడు, కోడలు, అల్లుడు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో కోడలు, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందారు. గంటల వ్యవధిలోనే ముగ్గురూ మృత్యువాత పడటంతో నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రాయవరం గ్రామానికి చెందిన లావుడ్యా లలిత (50) గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం విధులకు వెళ్లేందుకు అచ్చంపేట బస్టాండ్‌కు చేరుకున్న ఆమె అక్కడే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంత్యక్రియలకు వస్తూ అనంతలోకాలకు.. లలిత మృతి విషయం తెలుసుకున్న హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆమె కుమారుడు శ్రీకాంత్, కోడలు చంద్రకళ (32), అల్లుడు నాగరాజు (35) అచ్చంపేటకు బయలుదేరారు. ముగ్గురూ ఒకే ద్విచక్రవాహనంపై వస్తుండగా నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేయబోయారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కోడలు చంద్రకళ, అల్లుడు నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందడంతో రాయవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీకాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. -
రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఆరుగురికి గాయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఐటీవో సమీపంలో వికాస్ మార్గ్‌లోని పీడబ్ల్యూడీ ప్రధాన కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అనిల్ ఝా, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సహా ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీని ఎదురుగా వచ్చిన ఓ హ్యాచ్‌బ్యాక్ కారు వేగంగా ఢీకొట్టింది. సెంట్రల్ ఢిల్లీ డీసీపీ రోహిత్ రణ్‌బీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఢిల్లీ రిజిస్ట్రేషన్ కలిగిన రెండు దెబ్బతిన్న వాహనాలను గుర్తించారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఢిల్లీలోని ఆర్య నగర్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఇద్దరు మైనర్ పిల్లలతో కలిసి లక్ష్మీ నగర్ నుంచి ఐటీవో వైపు హ్యాచ్‌బ్యాక్ కారులో వెళ్తున్నారు. పీడబ్ల్యూడీ కార్యాలయం సమీపంలోకి రాగానే, ఆ కారు అదుపుతప్పి రహదారి డివైడర్‌ను, రైలింగ్‌ను ఢీకొట్టింది. అనంతరం ఆపోజిట్ క్యారేజ్‌వే వైపు దూసుకెళ్లి, ఐటీవో నుంచి లక్ష్మీ నగర్ వైపు వెళ్తున్న ఎస్‌యూవీని బలంగా ఢీకొంది. ఆ ఎస్‌యూవీలో కిరారీ విధానసభ నియోజకవర్గ సిట్టింగ్ ఆప్ ఎమ్మెల్యే అనిల్ ఝా, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ప్రయాణిస్తున్నారు.ఈ ప్రమాదంలో ఎస్యూవీ ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. రెండు వాహనాల్లోని మొత్తం ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లోక్‌నాయక్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు.ఇది కూడా చదవండి: భారత్‌కు 150 మంది పాక్ వధువులు -
మద్యం మత్తులో బైక్ రైడ్... యువకుడి విషాదం!
సాక్షి హైదరాబాద్: మద్యం మత్తులో ద్విచక్రవాహనం నడుపుతూ అదుపు తప్పడంతో కోల్‌కతాకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ భూపతి తెలిపిన వివరాల ప్రకారం... కోల్‌కతాకు చెందిన అబ్బాస్ సిద్ధిఖీ (26) రెండు రోజుల క్రితం నగరంలో జరిగిన ఎక్స్‌పోకు వచ్చి వెస్టిన్ బంజరాలో ఉంటున్నాడు. అతని స్నేహితులు అభిరూప్ సింగ్ మిరాజ్ (25), సహస్ర చటోపాధ్యాయలతో కలిసి శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌లోని మధుశాల బార్లో మద్యం తాగారు. అర్ధరాత్రి ముగ్గురూ కలిసి చార్మినార్ చూసేందుకు క్యాబ్‌లో వెళ్లారు.తెల్లవారుజామున 3 గంటలకు బార్‌కు తిరిగి వచ్చి పార్కింగ్‌లో ఉన్న బైక్‌పై ఖాజాగూడ లేక్ వద్దకు వెళ్లి తిరిగి బయలుదేరారు. చటోపాధ్యాయ మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడుపుతూ ఖాజాగూడ లేక్రోడ్డులో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ వద్ద అదుపు తప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టాడు. వెనుక కూర్చున్న అబ్బాస్ సిద్ధిఖీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యలో కూర్చున్న అభిరూప్సింగ్ మిరాజ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించడంతో సహస్ర చటోపాధ్యాయ ప్రాణాలు దక్కాయి. వీరి ఇద్దరు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
సంజూష్‌ను తప్పించాలని స్కెచ్!
సాక్షి, హైదరాబాద్: జనసేన రాజ్యసభ సభ్యుడు, వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ (21) చేసిన రోడ్డు ప్రమాదం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 16న హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ముందు రోడ్డు దాటుతున్న భారతి ముఖి (26) అనే సేల్స్ గర్ల్‌ను అతివేగంగా, నిర్లక్ష్యంగా లగ్జరీ కారుతో (టీజీ 09 జీ 0666) సంజూష్ ఢీకొట్టడం వల్ల ఆమె మృతిచెందడం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కేసు నుంచి సంజూష్‌ను తప్పించేందుకు, మరొకరిని కారు నడిపిన డ్రైవర్‌గా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. మొదట్లో కారు రిజి్రస్టేషన్ నంబర్ మాత్రమే బయటకు రావడంతో కేసును పక్కదారి పట్టించేందుకు ప్రైవేట్ డ్రైవర్‌ను నిందితుడిగా చూపే యత్నాలు జరిగాయి.నిందితుడు జనసేన ఎంపీ కొడుకు కావడంతో కేసు తీవ్రతను తగ్గించేందుకు రాజకీయ, ఆర్థిక వర్గాల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు మొదలయ్యాయి. కారు నడిపినది తమ వద్ద పనిచేసే ప్రైవేట్ డ్రైవర్ అని చూపించేందుకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపడుతున్న సమయంలోనే బాధ్యతను తనపై వేసుకోవడానికి ఒక ప్రైవేట్ డ్రైవర్ ముందుకొచి్చనట్లు తెలిసింది. ‘కారు నేనే నడిపాను, ప్రమాదం నా వల్లే జరిగింది’అని పోలీసు స్టేషన్లో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారంలో వచి్చన పెద్దల ఫోన్ కాల్స్, రాజకీయ వర్గాల ఒత్తిళ్లను లెక్కచేయకుండా ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కేసు విచారణను నేరుగా తన పర్యవేక్షణలోకి తీసుకున్నారు.సంజూష్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహిస్తున్న దృశ్యం (ఫైల్) సీన్ వద్ద ఉన్న పరిస్థితులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంతో డ్రైవర్ చెప్పిన కథనానికి పొంతన లేకపోవడాన్ని ఆ అధికారి గుర్తించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అసలు నిందితుడిని మార్చడానికి వీల్లేదని.. డ్రైవర్‌ను ముసుగుగా పెడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. దీంతో వేరే దారి లేక పోలీసులు కారు యాజమాన్య సంస్థ ప్రతినిధులను, సంజూష్ ను పిలిపించి అసలు డ్రైవర్ అతనేనని అధికారికంగా నిర్ధారించారు.అనంతరం అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిపై మాదాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 106(1) (అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల మరణం సంభవించడం) కింద కేసు నమోదు చేశారు. మద్యం, డ్రగ్స్ పరీక్షల ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని, చట్టప్రకారం 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో అతనికి పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. వాహనాన్ని స్వా«దీనం చేసుకొని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హానర్ ప్రైమ్ హౌసింగ్ పేరు మీద కారు.. అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి సీఎస్ డిగ్రీ పూర్తి చేసిన సంజూష్.. బ్లాక్ రిడ్జ్ ఎనర్జీ, క్యాపిటల్ ఎనర్జీ సంస్థల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సంజూష్ నడిపిన టీజీ 09జీ 0666 నంబర్‌గల ఆస్టిన్ మారి్టన్ లాగోండ లగ్జరీ కారు హానర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్ఎల్పీ కంపెనీ పేరిట రిజిస్టర్ అయిఉంది. హైదరాబాద్‌లో ప్రముఖ స్థిరాస్తి కంపెనీ అయిన హానర్ హోమ్స్ అనుబంధ సంస్థ ఇది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ విభాగంలో కారు యజమాని జూబ్లీహిల్స్‌లోని కేఆర్‌బీ టవర్ ఫ్లాట్ నంబర్–1 చిరునామా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సంజూష్తోపాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంవీఐ నివేదిక కీలకం కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ కేసు నమోదైన వెంటనే ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని మద్యం, డ్రగ్స్‌కు సంబంధించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించామని కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ చెప్పారు. ఆ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచి్చనట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడి రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేసి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) తనిఖీకి పంపినట్లు చెప్పారు. ఎంవీఐ నివేదిక ఇంకా రావాల్సి ఉందని.. అది కూడా దర్యాప్తులో కీలక ఆధారంగా ఉంటుందని పేర్కొన్నారు.సెక్షన్ 106 (1) కింద నమోదైన నేరానికి గరిష్టంగా ఐదేళ్ల శిక్ష విధించే అవకాశం ఉన్నందున ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాల్లో అరెస్ట్ అవసరమా లేదా? అనే అంశాన్ని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 ప్రకారం పరిశీలించాల్సి ఉంటుందని డీసీపీ తెలిపారు. అరెస్ట్‌కు సంబంధించి సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను కూడా దర్యాప్తు అధికారి పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు.ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించాక నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు కనిపించలేదని.. అందుకే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 కింద నోటీసు జారీ చేసి దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించినట్లు డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. పూర్తిగా చట్టపరమైన నిబంధనలు, కేసులో అప్పటివరకు అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎంవీఐ నివేదికతోపాటు ఇతర ఆధారాలను సేకరించి పరిశీలిస్తామని తెలిపారు. తదుపరి దర్యాప్తులో అరెస్ట్ అవసరమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు. -
నువ్వు 10 కోట్లు ఇవ్వకపోతే.. లింగమనేని కొడుకు యాక్సిడెంట్ పై KA పాల్
-
గేదె కొమ్ముకు వేలాడుతూ.. యువకుడి విషాదం!
తెలంగాణ: గేదెను బైక్ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారంగేట్ సమీపంలో 765డీ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది.ఏఎస్ఐ ఆండాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఆకుల దుర్గాప్రసాద్ (19), రామాయంపేట మండలం కాట్రియాలకు చెందిన మహేశ్ బైక్‌పై నర్సాపూర్ వైపు నుంచి ఇంటికి వెళ్తున్నారు. అంతారంగేట్ సమీపంలో జాతీయ రహదారిపై గేదెలు అడ్డురాగా బైక్ అదుపుతప్పి వాటిని ఢీకొంది. దుర్గాప్రసాద్ తలలో గేదె కొమ్ము చొచ్చుకుపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.గేదె కొమ్ము తలలో గుచ్చుకుపోవడంతో మృతుడి శరీరం గేదె మెడకు వేలాడింది. దీంతో గేదె గంటపాటు అటు ఇటు పరుగులు పెట్టింది. స్థానికులు, ప్రయాణికులతో కలిసి పోలీసులు గంటపాటు శ్రమించి గేదెను కిందపడేసి కొమ్ము నుంచి మృతుని తలను తొలగించారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'చీకటి అవుతుంది.. వద్దు తమ్మి.. పొద్దున పోదువు'
సాక్షి, సిద్దిపేట: “చీకటి అవుతోంది తమ్మీ.. ఈ రాత్రికి వెళ్లొద్దు.. పొద్దున్నే బయల్దేరు”.. అన్న చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చాయి. తమ్ముడు మాత్రం “అన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఈ రాత్రే వెళ్లనివ్వు” అంటూ భార్య, పిల్లలతో కలిసి కారులో బయల్దేరాడు. కొన్ని గంటల్లోనే ఆ ప్రయాణం తిరిగిరాని ప్రయాణంగా మారింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.బల్వంతపూర్‌కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కారు బావిలో పడింది. ఈ ఘటనలో నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం కంటే కూడా.. మృతుడు రాజు అన్న రవి చెబుతున్న మాటలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేశాయి.రవి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటలో వారి బావ దీశెట్టి మల్లేశం మృతి చెందడంతో 19న దశదిన కర్మకు రాజు తన భార్య, పిల్లలతో కలిసి అక్కడికి వచ్చాడు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. సాయంత్రం కావడంతో రాజు ఇంటికి బయల్దేరుతానని అన్నకు చెప్పాడు. దీంతో రవి.. “చీకటి అవుతుంది తమ్మీ.. వద్దు. పొద్దున్నే పోదువు” అంటూ వారించాడు. కానీ రాజు వినలేదు. “అన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఈ రాత్రే పోనివ్వు” అంటూ భార్య, పిల్లలతో కలిసి కారులో బయల్దేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది.తమ్ముడిని కాపాడలేకపోయానన్న బాధతో రవి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. “నా మాట విని ఉంటే తమ్ముడు ఇప్పుడు బతికుండేవాడు” అంటూ ఆయన రోదించడం చూసి స్థానికులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు తమ్ముడిని ఇంటికి వెళ్లొద్దని ఆపిన అన్న.. మరోవైపు కుటుంబంతో కలిసి ఎలాగైనా ఇంటికి చేరుకోవాలన్న తమ్ముడి ఆరాటం.. చివరికి నాలుగు ప్రాణాలను బలిగొన్న విషాదంగా మారింది. -
జనసేన ఎంపీ లింగమనేని కుమారుడి రాష్ డ్రైవింగ్ యువతి మృతి
మాదాపూర్ (హైదరాబాద్): జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో లగ్జరీ స్పోర్ట్స్ కారుతో అతి వేగంతో దూసుకొచ్చి ఓ యువతిని బలిగొన్నాడు. అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఈ నెల 16న మధ్యాహ్నం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26) దుర్మరణం చెందింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజ్యసభ సభ్యుడు, జనసేన పార్టీ నేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ (23) ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్లు తేలింది. దీంతో సంజుష్‌పై మాదాపూర్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.జీబ్రా క్రాసింగ్‌పై రోడ్డు దాటుతుండగా..ఇనార్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పని చేసే భారతి ముఖి తన సహోద్యోగి పూజా అశోక్ అలోన్‌తో కలిసి ఈ నెల 16న మధ్యాహ్నం ఐటీసీ కోహినూర్ సమీపంలో భోజనం చేయడానికి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారిద్దరూ తిరిగి వస్తూ ఇనార్బిట్ మాల్‌లోకి వచ్చేందుకు జీబ్రా లైన్‌పై రోడ్డు దాటుతుండగా టీజీ 09 జీ 0666 నంబరు ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చి భారతి ముఖిని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడింది. ఆమె తల, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆస్పత్రికి వచ్చిన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు లింగమనేని సంజుష్ అక్కడి నుంచి జారుకున్నట్లు చెబుతున్నారు. లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ పంజాల అశ్విన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంజుష్ కారును నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడిపి మరణానికి కారణమైనట్లు తేల్చి, అతనిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 106(1)కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంజుష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ టెస్ట్‌లు చేయగా నెగెటివ్ వచ్చిందని, అందువల్ల నోటీసులు ఇచ్చి వదిలేశామని పోలీసులు చెబుతున్నారు. ఐటీ కారిడార్‌లో వాహనాలు గంటకు 40 కిలోమీటర్లు, కేబుల్ బ్రిడ్జిపై 30 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లకూడదని నిబంధనలు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో మితిమీరిన వేగంతో వెళ్లడం నిందితుడి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అయినప్పటికీ, అతి వేగంగా కారు నడిపి ఓ యువతి మృతికి కారణమైన సంజుష్‌కు కేవలం నోటీసులు ఇచ్చి వదిలివేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు అతి వేగంగా రోడ్డు ప్రమాదానికి కారణమైతే ఇలానే వ్యవహరిస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
టిప్పర్ బీభత్సం అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి..
-
సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్వంతపూర్‌కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. సిద్ధిపేటలో బంధువు మృతి చెందడంతో అక్కడికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో కారు అదుపు తప్పింది. వేగంగా వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.అర్ధరాత్రి దాటినా కుటుంబం ఇంటికి చేరుకోకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. రాజు, భాగ్యలకు ఫోన్ చేయగా రెండూ స్విచ్ఛాప్ రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టగా అప్పనపల్లి శివారులోని బావిలో కారు ఉన్నట్లు గుర్తించారు.సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు కారులో నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను రాజు, ఆయన భార్య భాగ్య, వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ప్రమాదాలకు నిలయంగా సిద్ధిపేట రోడ్లు..సిద్ధిపేట జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ రహదారులు, ప్రధాన మార్గాల్లో వాహనాల రద్దీ పెరగడం, వేగ నియంత్రణ లేకపోవడం, ప్రమాదకరమైన మలుపులు, రహదారి భద్రతా లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బలవంతపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారులను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. -
మాదాపూర్‌లో విషాదం.. కారు ఢీకొని యువతి మృతి
హైదరాబాద్: రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఓ యువతిని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం... ఇనార్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పనిచేస్తున్న భారతిముఖి(26), పూడా అశోక్ అలోన్(26) ఈ నెల 16న మధ్యాహ్నం సమీపంలోని ఐటీసీ కోహినూర్ ప్రాంతంలో భోజనం చేశారు. తిరిగి వస్తూ ఇనార్బిట్‌మాల్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా సంజుస్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి భారతిముఖిని బలంగా ఢీ కొట్టాడు. ఆమె తలకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆమెను అదే వాహనంలో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
చీరతో కట్టేసి.. కర్రతో కొట్టి..
మేడిపల్లి: భర్తను హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్య ను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడకు చెందిన సత్యనారాయణ (51) సునీత దంపతులు. రాత్రి విధులు ముగించుకొని ఆగస్టు 6న మధ్యాహ్నం సత్యనారాయణ ఇంటికి వచ్చాడు. రోజువారీ పనులకు వెళ్లిన సునీత కూడా మధ్యాహ్నం 1.30కు ఇంటికి వచ్చింది. సత్యనారాయణ మద్యం సేవించి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.భర్త ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత.. మద్యం మత్తులో ఉన్న సత్యనారాయణ కాళ్లను చీరతో కట్టేసి సెంట్రింగ్ కర్రతో తలపై, ఇతర భాగాలపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ స్పృహ కోల్పోయాడు. కాగా, దాడి అనంతరం సునీత కుమారుడికి ఫోన్ చేసి సత్యనారాయణ వాహనంనుంచి కింద పడినట్లు చెప్పింది. మొదట బోడుప్పల్‌లోని ఓ ఆసుపత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తరలించగా.. రాత్రి 10.18 గంటలకు సత్యనారాయణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.పోలీసులు కేసును మొదట రోడ్డు ప్రమాదంగా నమోదు చేసినప్పటికీ అనంతరం దర్యాప్తులో సత్యనారాయణను భార్య హత్యచేసినట్లు గుర్తించారు. తనను, పిల్లలను మానసికంగా, శారీరకంగా వేధించడంతోనే హత్యచేసినట్లు సునీత అంగీకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం సునీతను కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. -
రోడ్డు బాలేదు.. బిడ్డ దక్కలేదు
సోంపేట: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని సోంపేట మండలం గొల్లవూరు పంచాయతీ దామోదరపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారవ్వడంతో ఓ గర్భిణి తీవ్ర రక్తస్రావానికి గురై బిడ్డను కోల్పోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలివీ.. వ్యాపారరీత్యా భువనేశ్వర్‌లో ఉంటున్న యజ్జల లోలాక్షి కుటుంబం శుక్రవారం ఏరినమ్మ పూజ నిమిత్తం స్వగ్రామం దామోదరపురం వచ్చారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో గర్భిణి లోలాక్షి తీవ్ర ఇబ్బందులుపడి ఇంటికి చేరుకుంది. అప్పటికే రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటోలకు ఫోన్‌చేయగా అధ్వాన రోడ్డు కారణంగా వాహనాలు పాడైపోతున్నాయని, తాము రాలేమని చెప్పారు. చివరికి ఓ వ్యక్తిని అతికష్టంమ్మీద ఒప్పించి సోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల సూచనతో అక్కడ నుంచి బరంపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ తల్లీబిడ్డ అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం.. బిడ్డ ప్రాణాలు పోయాయని, తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బాధిత తల్లికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో కనీసం అంబులెన్స్ వాహనం కూడా రాని దుస్థితిలో రోడ్డు ఉన్నందున, ఈ మృతిని ప్రభుత్వ హత్యగా పరిగణనలోకి తీసుకుని బాధితులకు తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ముందు కొడుకు, తర్వాత భర్త.. ఇప్పుడు తల్లి!
వెంటాడిన మృత్యువు.. రెండేళ్ల వ్యవధిలో ఆ కుటుంబాన్ని పూర్తిగా కబళించింది. మొదట కొడుకు.. ఆ తర్వాత భర్త.. ఇప్పుడు ఆ తల్లే అనంతలోకాలకు వెళ్లిపోయారు. తాడ్వాయి మండలం కొండపర్తి సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా మార్కెటింగ్ అధికారి కలకోట్ల సురేఖ మృతి చెందడంతో హనుమకొండ జూలైవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న విషాదాలు బంధువులు, స్థానికులను కలచివేశాయి.వరంగల్: ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. మృత్యువు ఒక్కొక్కరిని తన ఒడికి చేర్చుకుంది. రెండేళ్లలో కుటుంబాన్ని మొత్తం కబళించింది. రెండేళ్ల క్రితం కొడుకు, ఐదు నెలల క్రితం భర్త మృతి చెందగా.. శనివారం భార్య సైతం అనంతలోకాలకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన వరంగల్ మార్కెటింగ్ శాఖ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ(43) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలుసుకున్న స్థానికుల రోదనలతో పెద్దమ్మగడ్డ దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృత్యుపాశమైన ఇసుకలారీ..హనుమకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన కలకోట్ల సురేఖ వరంగల్ డీఎంఓగా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఆమె గుడెప్పాడ్ మార్కెట్ యార్డులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో చింత విజయబాబు అనే వ్యక్తితో కలిసి ఏటూరునాగారం వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఇసుకలారీ ఢీకొట్టడంతో సురేఖతోపాటు విజయబాబు కూడా దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు.. అనారోగ్యంతో భర్తసురేఖ, కిరణ్ స్వస్థలం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అయినప్పటికీ పదిహేనేళ్ల క్రితం జూలైవాడలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. సురేఖ ఒక్కగానొక్క కుమారుడు సుక్రీత్ (16) రెండేళ్ల క్రితం క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తుండగా.. బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు. సురేఖ భర్త బొక్క కిరణ్ (50) అనారోగ్యంతో బాధపడుతూ ఐదు నెలల క్రితం మృతిచెందాడు. శనివారం సురేఖ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండేళ్లలో కుటుంబమంతా మృత్యు ఒడిలోకి చేరినట్లయ్యిందని కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరి స్టేటస్‌లో కొడుకు జ్ఞాపకాలు..పతాకావిష్కరణ అనంతరం సురేఖ తన విధి నిర్వహణకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నారు. అదే సమయంలో తన కుమారుడు బతికున్నప్పుడు పాఠశాలలో దిగిన ఫొటోలు, అతడితో సరదాగా గడిపిన సందర్భాల ఫొటోలను కూడా స్టేటస్‌గా ఉంచుకున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకంకొడుకు, భర్త మరణించిన తర్వాత సురేఖ తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జూలైవాడలోని ఇంట్లో నివసిస్తున్నారు. సురేఖ తండ్రి సురేందర్ సీపీఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. కూతురుకు వరుసగా ఎదురైన విషాదాలను తలచుకుంటూ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘ముందు మనవడిని.. ఆ తర్వాత అల్లుడిని కోల్పోయాం.. ఇప్పుడు కూతురిని కూడా కోల్పోయాం.. ఈ ఘోరాన్ని ఎలా భరించాలి..?’ అంటూ బంధువులను పట్టుకుని వారు గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సురేఖకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. సురేఖ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషాదంలో పాలకవర్గం, సిబ్బందిఅప్పటివరకు తమతో ఉన్న అధికారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియగానే గూడెప్పాడ్ మార్కెట్ పాలకవర్గం, సిబ్బంది, వరంగల్ మార్కెటింగ్‌శాఖ అధికారులు విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిని కోల్పోయామని పాలకవర్గం విచారం వ్యక్తం చేసింది. సిబ్బంది.. అధికారి సురేఖతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. -
బోనాలకు పండగకు వెళ్తుండగా..
హైదరాబాద్: బోనాల పండగ కోసం కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరుకు వెళ్తుండగా.. మృత్యురూపంలో వచ్చిన ఓ లారీ.. యువతిని బలి తీసుకుంది. ఈ విషాదకర ఘటన ఘట్కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడలో ఉంటున్న గూబ సురేశ్, ఉమారాణి దంపతులు కూతురు శ్రావణి (30)తో కలిసి ఆదివారం జరిగే బోనాల పండగకు సొంతూరైన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై శనివారం బయలుదేరారు. ఘట్కేసర్ బైపాస్ రోడ్డులో వందన హోటల్ హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్దకు చేరుకోగానే అతివేగంతో వచ్చిన లారీ వెనక వైపు నుంచి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం రోడ్డుపై పడిపోగా వెనక కూర్చున్న తలకు తీవ్రగాయాలు కావడంతో శ్రావణి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. సురేశ్, ఉమారాణికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేంద్ర ప్రభుత్వ పీఎఫ్ ఉద్యోగిని మేధ మృతి
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర శివారులోని ఆనేకల్ తాలూకా హెబ్బగోడి దగ్గర అనంతనగరలో బైక్‌పై వెళ్తున్న యువతి గుంతల రోడ్డుకు బలైంది. కేరళకు చెందిన మేధ (32) మృతురాలు. ఆమె ఎలక్ట్రానిక్ సిటీలోని కేంద్ర ప్రభుత్వ పీఎఫ్ ఆఫీసులో ఉద్యోగిని. వివరాలు.. మేధ తన స్నేహితుడు అజయ్ గురుతో కలిసి బుధవారం సాయంత్రం బైక్‌పై వెళ్తోంది. ఈ సమయంలో, ముందు వెళ్తున్న కారు డ్రైవర్ గుంతను చూసి హఠాత్తుగా బ్రేకులు వేశాడు. వెనుక వస్తున్న అజయ్ బైక్ గాభరాపడి బ్రేక్ నొక్కగా అదుపుతప్పి కింద పడిపోయారు. వెనుక నుంచి వస్తున్న ఓ గూడ్స్ వ్యాన్ మేధ మెడపై నుంచి దూసుకెళ్లింది. ఆమెకు తీవ్ర రక్తస్రావమై అక్కడే మరణించింది. ఇదంతా క్షణాల్లోనే జరిగింది.స్థానికుల నిరసనఈ ఘోరాన్ని చూసిన స్థానికులు, వాహనదారులు రోడ్డును దిగ్బంధించారు. కొవ్వొత్తులు వెలిగించి, మేధ ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. ఎలక్ట్రానిక్ సిటీ పరిసరాల్లోని రోడ్లు చాలా అధ్వాన్నంగా, గుంతలతో నిండి ఉన్నాయని, అందువల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తక్షణం రోడ్లను బాగు చేయాలని కోరారు. హెబ్బగోడి, ఎలక్ట్రానిక్ సిటీ ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
తిరుగు ప్రయాణంలో విషాదం.. అన్నదమ్ముల పిల్లలు మృత్యు ఒడికి!
హైదరాబాద్, మోతీనగర్: మూడు కుటుంబాలు కలిసి దైవ దర్శనం చేసుకున్నాయి. తిరుగు పయనంలో నగరానికి బయలుదేరాయి. ఈ క్రమంలో వీరు వస్తున్న వాహనం అదుపుతప్పడంతో ఇద్దరు బాలురు మృతి చెందిన విషాదకర ఘటన షోలాపూర్‌లో చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి.. కూకట్పల్లి పరిధి గాయత్రీనగర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్‌లోని మూడు కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని తుల్జా భవానీ మాత దర్శనానికి వెళ్లి ఇదేరోజు తిరిగి నగరానికి వస్తుండగా.. షోలాపూర్ ఉమగ్రా వద్ద ఉదయం 10.30 గంటలకు వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఉజ్వల్ చౌదరి (12), దివేష్ చౌదరి (11) మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా, ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇంటర్ విద్యార్థిని డింపుల్ (17) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.మూలమలుపు కారణంగా వాహనాలు సరిగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు ఉజ్వల్, దివేష్ వరుసకు అన్నదమ్ములు. 6వ తరగతి చదువుతున్నారు. ఉజ్వల్ చౌదరి తండ్రి గణేష్, తల్లి రేఖ. దివేష్ చౌదరి తండ్రి చోగారాం, తల్లి చంపాదేవి. వీరు ఇరువురు కూడా వరుసకు అన్నదమ్ములే. వీరంతా బంగారం వ్యాపారం చేస్తుంటారు. మృతులకు గురువారం వి.రామారావు నగర్‌లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. బాధిత కుటుంబ సభ్యులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు పరామర్శించారు. -
పది నిమిషాల్లో చేరుకోవాలి!
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల బాధితులకు సత్వర చికిత్స అందించే లక్ష్యంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పది నిమిషాల్లోపు ప్రమాద స్థలానికి చేరుకోవాలని, లేదంటే రూ.పదివేల జరిమానా విధిస్తామని అంబులెన్సు సరీ్వసులను హెచ్చరించింది. ఈ నిబంధన ప్రమాద స్థలికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని అంబులెన్సులకు వర్తిస్తుందని తెలిపింది. అంతేకాకుండా... అంబులెన్సులు టికెట్‌ను అంగీకరించిన గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రులకు తీసుకు రావాలని స్పష్టం చేసింది. ఈ గడువును ఉల్లంఘించినా ఒక్కో ఘటనకు రూ.పదివేల జరిమానా తప్పదని తెలిపింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రమాద స్థలం పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే దూరాన్ని బట్టి చేరుకోవాల్సిన సమయాన్ని పెంచుతామని జీపీఎస్ డేటా/ఐఎంఎస్ కేర్ డ్యాష్‌బోర్డ్ ద్వారా ధ్రువీకరిస్తామని ఎన్హెచ్ఏఐ వివరించింది. ఎన్హెచ్ఏఐ పరిధిలో సుమారు 50,000 కిలోమీటర్ల రహదారులను కవర్ చేస్తూ దాదాపు 3,000 అంబులెన్స్‌లు, 1,000 పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు టికెట్ తిరస్కరించినా రూ.10 వేల జరిమానా విధిస్తామని తెలిపింది. ఎన్హెచ్ఏఐతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం అంబులెన్సులు అన్ని పరికరాలు, మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపింది. లేకపోతే రూ.10 వేల జరిమానా విధిస్తామని పేర్కొంది. -
తీర్థయాత్రలో విషాదం
ఆర్మూర్ టౌన్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. పోలీ సులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించడానికి రెండు టూరిస్ట్ బస్సులలో బయలు దేరారు. ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో జాతీయ రహ దారిపై ఓ బస్సు టైర్ పంక్చర్ కావడంతో దానిని డివైడర్ పక్కనే నిలిపివేశారు. ఆ బస్సు నలుపు రంగులో ఉండటంతో వెనకనుంచి వచ్చే వాహనాలకు కనిపించదన్న ఉద్దేశంతో రెండో బస్సును దాని వెనకాలే నిలిపారు.కొందరు టూరిస్ట్‌లు కిందికి దిగి డివైడర్‌పై కూర్చున్నారు. ఇదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ.. ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు ముందుకు కదిలి డివైడర్ ప్రాంతంలో కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుజాత (54), మాధవి (47) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
కళ్లు చెదిరే వేగం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని పవన్గావ్–భరత్వాడా వి-పాయింట్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.సీసీటీవీ ఫుటేజ్‌లో కారు అత్యంత వేగంగా దూసుకొస్తూ ఎలాంటి బ్రేకులు వేయకుండానే ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కలమ్నా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతినాగ్పూర్లోని భరత్వాడా చౌక్ వద్ద అతివేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారుదీంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన మరో యువకుడు pic.twitter.com/k2Q3moSozR— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026 -
సాహస రైడ్ సరదా తీరకముందే..
బైక్ రైడ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితోనే తరచూ సాహస యాత్రలు చేసే ఆమె.. మరో ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరింది. కానీ ఆ సాహస యాత్ర కాస్తా విషాదాంతంగా మారింది. ఎదురుగా వచ్చిన భారీ ట్రక్కు ఆమె బైక్‌ను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బైకింగ్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ముంబైకి చెందిన 24 ఏళ్ల యువ బైకర్ రిద్ధి థక్కర్(Riddhi Thakkar) ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బైక్ ప్రయాణాలంటే ఎంతో ఆసక్తి ఉన్న రిద్ధి.. వాటిని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలోనూ పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే.. బస్తర్ టూర్‌కు వెళ్లిన మహిళా బైకర్ల బృందంలో ఉన్న ఆమె అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీంతో.. బైకింగ్ కమ్యూనిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఢీ కొట్టి.. ఆపై ఈడ్చుకెళ్లి..ముంబై కందివలీ వెస్ట్‌కు చెందిన రిద్ధి థక్కర్.. దాదాపు 23 మంది మహిళా బైకర్ల బృందంతో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. రాయ్‌పూర్ నుంచి కాంకేర్ వైపు వెళ్తుండగా ధమ్తరి జిల్లా మార్కటోలా ఘాట్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బైకర్ల బృందంలోని పలువురు ముందుకు వెళ్లిపోగా, రిద్ధి మరికొందరు వెనుక వస్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన భారీ ట్రైలర్ ఆమె బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రిద్ధి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణంప్రమాదాన్ని గమనించిన తోటి బైకర్లు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసర సేవలకు సమాచారం అందించి రిద్ధిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ధమ్తరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.పరారీలో డ్రైవర్.. కొనసాగుతున్న దర్యాప్తుప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ వాహనం, డ్రైవర్‌ను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. రిద్ధి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ధమ్తరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెతో కలిసి ప్రయాణించిన ఇతర బైకర్ల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ధమ్తరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
విశాఖపట్నం: భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ఐటీ కళాశాలలో బీటెక్ చదువుతున్న ఆర్.గౌతమ్ (22), పోతురాజు రవికిరణ్ (21) భీమిలిలోని ఒక హోటల్లో ఇంటర్న్íÙప్ కోసం వచ్చారు. మంగళవారం సాయంత్రం వీరు బైక్‌పై జేవీ అగ్రహారం నుంచి తాళ్లవలస వైపు వెళ్తుండగా, భీమిలి–క్రాస్‌రోడ్డు రహదారి దాటుతున్న సమయంలో విశాఖ నుంచి భీమిలి వైపు వస్తున్న ‘999’ నంబర్ గల ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా, రవికిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే విశాఖలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. గౌతమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గౌతమ్ స్వస్థలం పెందుర్తి కాగా, గాయపడిన రవికిరణ్ విజయనగరం జిల్లా తెర్లాం మండలం గంగన్నపాడుకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
-
జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 30 మంది ప్రయాణికులు..
సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో, హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల ప్రకారం.. పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేపై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండటంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్న గాయపడిన వారిని ఆసుపత్రి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
రెండు రోడ్డు ప్రమాదాలు.. 8మందిమృతి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి /జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లా పరిధిలో 65వ జాతీయరహదారిపై మంగళవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. కర్ణాటక సరిహద్దుల్లోని జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ఆటోను వెనుక నుంచి ట్యాంకర్ బలంగా ఢీ కొట్టడంతో నలుగురు మహిళా కూలీలు రేఖ, శ్రీదేవి, కవిత, రేష్మ, ఆటో డ్రైవర్ దేవదాస్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ భార్య, కూలీ నిఖిత మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. గాయాలపాలైన ఏడుగురిని బీదర్, సంగారెడ్డి ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా కర్ణాటకలోని రాజ్పూర్ గ్రామానికి చెందిన వారు. వీరంతా పనుల కోసం జహీరాబాద్ ప్రాంతానికి వచ్చి.. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఆటో జహీరాబాద్ వైపు నుంచి కర్ణాటకలోని తమ సొంతూరు రాజ్పూర్ వైపు వెళ్తుండగా ఓ లారీ యూ టర్న్ తీసుకుంటోంది. ఆ లారీని తప్పించబోయిన డ్రైవర్ ఆటోను పక్కకు తీయడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్యాంకర్ ఢీకొని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వెనుక వైపు నుంచి వస్తున్న వాహనాన్ని గమనించకుండా పక్కకు తిప్పడంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి ఎస్పీ పరితోశ్ పంకజ్ పరిశీలించారు. డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి పడిన కారు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం వెంకటాపూర్ చౌరస్తా వద్ద ఇదే హైవేపై జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్‌కు వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరి రోడ్డుకు అవతలి వైపు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉద్యోగి మల్లన్న, శంకర్ మృతి చెందారు. వీరు సదాశివపేటకు చెందిన వారుగా భావిస్తున్నారు. సీఎం దిగ్భ్రాంతి: సత్వార్ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
సంగారెడ్డి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. 7గురి మృతి
మొగడంపల్లి: సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ సత్వర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి 65పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొని ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులది కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరా గ్రామంగా పోలీసులు గుర్తించారు. ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణిస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రగాయాలపాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అదే జిల్లాలో మరో రోడ్డు ప్రమాదంసంగారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మూడు కార్లు ఢీ కొన్నఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కోహిర్ మండలం కవేలిలో ఈ ప్రమాదం జరిగింది. దాంతో సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందినట్లయ్యింది. -
బయటికి రావాలంటే రూ.84 లక్షల బ్లడ్‌మనీ చెల్లించాల్సిందే..
నిజామాబాద్: పొట్టకూటి కోసం వలస వెళ్లిన యువకుడు సౌదీ అరేబియా దేశంలోని రియాద్ జైలులో మగ్గుతున్నాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దివ్యాంగురాలైన భార్య చంటి బిడ్డను పట్టుకుని భర్త రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. తమ బిడ్డ తిరిగి రావాలని ఆ యువకుడి తల్లిదండ్రులు దేవుళ్లను వేడుకుంటున్నారు. కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననే ఆశతో వలస వెళ్లిన యువకుడు శ్రావణ్‌కుమార్ కుటుంబ పరిస్థితి ఇది. సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రామయ్య, రాజమణి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్ (32). జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతల్‌పేటకు చెందిన దివ్యాంగురాలు మమతను 2022లో శ్రావణ్ పెళ్లి చేసుకున్నాడు. 2023 నవంబర్‌లో ఉపాధి కోసం సౌదీ అరేబియా దేశం రియాద్‌కు వెళ్లిన శ్రావణ్ అక్కడి ఓ ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ కంపెనీలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిలో చేరాడు. మంచి ఉద్యోగం రావడంతో తన కలలు సాకరమవుతాయని సంబురపడిన శ్రావణ్‌పై కోలుకోలేని దెబ్బపడింది. 2024 మే 6వ తేదీన శ్రావణ్ నడుపుతున్న అంబులెన్స వాహనం రోడ్డు ప్రమాదానికి గురికాగా.. ఈ ప్రమాదంలో స్థానికులైన భార్యాభర్తలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడి పోలీసులు శ్రావణ్‌ను అరెస్టు చేసి జైలు తరలించారు. కొన్ని నెలల్లోనే అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రోడ్డు ప్రమాద ఘటనకు శ్రావణ్‌కుమార్‌ను నేరస్థుడిగా నిర్ధారించింది. రూ.3.30 లక్షల సౌదీ రియాళ్లు (బ్లడ్ మనీ – రక్తపరిహారం) బాధితకుటుంబానికి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. మన దేశ కరెన్సీలో ఆ మొత్తం సుమారు రూ.84 లక్షలు. బాధిత కుటుంబాల అంగీకారం మేరకు పరిహారం చెల్లిస్తే శ్రావణ్‌కుమార్‌కు జైలు నుంచి విముక్తి పొందే అవకాశం కలుగుతుంది. పరిహారం చెల్లించకపోతే జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి ఉండదు. అంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించే ఆర్థిక స్థోమత లేక శ్రావణ్‌కుమార్ కుటుంబీకులు నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ్‌కుమార్ పై అక్కడి దేశం ట్రావెలింగ్ బ్యాన్ ఆంక్షలు పెట్టింది. గడపగడపకు వెళ్తున్న మమత తన భర్తను జైలు నుంచి విడిపించాలని దివ్యాంగురాలైన మమత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులను వేడుకుంటోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తోపాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాకు చెందిన ఎంపీకి, పలువురు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు అందజేసింది. ఈ ఏడాది మే 29న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో తమ పరిస్థితిని వివరించింది. తన భర్తను తీసుకురావాలని వేడుకుంది. ప్రభుత్వం ఆదుకోవాలి మాది నిరుపేద కుటుంబం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నా కొడుకు రెండేళ్ల నుంచి సౌదీ అరేబియా జైలులో ఉన్నాడు. రెక్కల కష్టంపై బతుకుతున్నాం. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి. – కుమ్మరి రామయ్య, శ్రావణ్‌కుమార్ తండ్రి మమ్మల్ని ఆదుకోండి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మానవతావాదులు స్పందిస్తేనే మా కుటుంబం ఈ గండం నుంచి గట్టెక్కుతుంది. నేనే దివ్యాంగురాలిని చంటి బిడ్డను పట్టుకుని తిరుగుతున్నా. మా అత్తామామలు తల్లడిల్లుతున్నారు. సౌదీ అరేబియా కోర్టు చెప్పిన జరిమానా చెల్లించే స్థోమత మాకు లేదు. – మమత, శ్రావణ్‌కుమార్ భార్య -
హెల్మెట్ లేకపోవడం వల్లే 54 వేల మందికి పైగా మృతి.. గడ్కరీ షాకింగ్ నిజాలు!
న్యూఢిల్లీ: మన దేశంలో రోడ్డు ప్రమాదాల తీవ్రతపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో యుద్ధాలు, వ్యాధుల కంటే రోడ్డు ప్రమాదాలే ఎక్కువ ప్రాణాలను బలితీసుకుంటున్నాయని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. దేశంలో ప్రతి ఏడాది దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో 66 శాతం మంది యువతే ఉండటం అత్యంత బాధాకరం. గతేడాది హెల్మెట్ ధరించకపోవడం వల్లే 54,132 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో 45 శాతం ద్విచక్ర వాహనదారులవే. ‘ప్రతి గంటకు మన రోడ్లపై 20 మంది చనిపోతున్నారు. ఇంతటి స్థాయిలో మరణాలు యుద్ధాల్లో, వ్యాధుల్లో కూడా కనిపించవు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.బ్లాక్ స్పాట్ల తొలగింపునకు రూ.40 వేల కోట్లుప్రమాదాలకు కారణమవుతున్న ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్ స్పాట్లు) తొలగించేందుకు కేంద్రం రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. భారత్ ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ కలిగిన దేశంగా ఎదిగింది. అదే సమయంలో ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశంగా ఉండటం విచారకరం. మానవ ప్రవర్తనే అతిపెద్ద సమస్యరోడ్డు ప్రమాదాల నియంత్రణలో మౌలిక వసతులు, చట్టాల అమలుతో పాటు ప్రజల ప్రవర్తనలో మార్పు కూడా అవసరం. మానవ ప్రవర్తనే మన అతిపెద్ద బలహీనత అన్న ఆయన రోడ్డు భద్రతపై చిన్న వయసు నుంచే అవగాహన కల్పించేందుకు 10, 12 తరగతుల విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ జీడీపీలో ప్రతి ఏడాది దాదాపు 3 శాతం నష్టం వాటిల్లుతోంది. రోడ్డు భద్రత ప్రభుత్వానిదే బాధ్యత కాదు. ప్రజలు, సంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం ద్వారా వేలాది ప్రాణాలను కాపాడవచ్చని గడ్కరీ పిలుపునిచ్చారు. -
హైదరాబాద్ రోడ్ యాక్సిడెంట్ లో జవాన్ మృతి
-
నర్సాపూర్ అర్బన్ పార్క్‌కు వెళ్లి వస్తుండగా.. విషాదం!
హైదరాబాద్: మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి దుర్మరణం చెందారని నర్సాపూర్ ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన షేక్ హసిన్ మెహతా(19) బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.స్నేహితులు వెంకటగిరీష్, చంద్ర, దేవ సునందన్ సాయితో కలిసి మియాపూర్ నుంచి ఆదివారం ఉదయం నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్క్ సందర్శనకు బైక్‌లపై వచ్చారు. అనంతరం తిరుగుప్రయాణంలో కొండాపూర్ సమీపంలోని టర్నింగ్ వద్ద బైక్ అతివేగంగా రెయిలింగ్‌ను ఢీకొట్టగా హసిన్ మెహతాకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె దుర్మరణం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్‌బేగం కుమార్తె అఫీఫా(24) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. అఫీఫా తాడేపల్లిలో జిమ్‌కు వెళుతుంటారు. జిమ్ యజమాని రుతి్వక్, రోజూ జిమ్‌కు వచ్చే వంశీ, సుదీర్, అవినాష్ లు ఆమెకు స్నేహితులయ్యారు. వీరు ఆదివారం చీరాల బీచ్‌కి వెళ్లేందుకు విజయవాడ నుంచి కారులో బయలుదేరారు. ఏటుకూరు బైపాస్ వద్ద హైవేలో వెళుతుండగా ముందువెళుతున్న ప్రభుత్వ పౌరసరఫరాలశాఖ రేషన్ తరలించే లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు అదుపు తప్పి లారీని, డివైడర్‌ను ఢీకొంది. కారు డ్రైవ్ చేసు్తన్న అవినాష్, సుధీర్, వంశీ, రుత్విక్‌లు గాయపడ్డారు. కారు వెనుక సీట్లో కూర్చున్న అఫీఫా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, గాయపడినవారిని హైవేలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసి ఆస్పత్రికి చేరుకున్న డీసీపీ షిరీన్.. తన కుమార్తె మరణించిందన్న విషయం తెలిసి స్పృహ కోల్పోయారు. ఆమెకు వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అఫీఫా మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నల్లపాడు సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత బాధాకరం: మాజీ సీఎం జగన్ సాక్షి, అమరావతి: విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫీఫా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుమార్తెను కోల్పోయిన షిరీన్ బేగం, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,అనంతపురం: హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పామిడి మండలం పొగరూరు పరిధిలో వేగంగా ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి, హైవేపై ఉన్న ఒక కల్వర్టు పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నలిగిపోవడంతో, బస్సు, ఐషర్ వాహనాల డ్రైవర్లు క్యాబిన్లలోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించి, వాహనాల భాగాలను కట్ చేసి ఇద్దరు డ్రైవర్లను సురక్షితంగా వెలుపలికి తీశారు. గాయపడిన డ్రైవర్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి, 11 మందికి గాయాలు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చంబా జిల్లాలోని తిస్సా-బైరాగఢ్ మార్గంలో శనివారం ఉదయం ఓ ప్రైవేట్ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. బస్సు సుమారు 100 అడుగుల లోతైన లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు.వివరాల మేరకు.. బైరాగఢ్-తిస్సా ప్రాంతంలోని చలుంజ్ మోడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు రహదారి నుంచి అదుపుతప్పి లోయలో పడటంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లోయలో చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తాజా సమాచారం. మరో 11 మంది గాయపడగా.. వారిలో కొందరి పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం కొండలు, లోయలతో కూడిన క్లిష్టమైన భూభాగం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. బస్సు అదుపుతప్పడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం, రహదారి పరిస్థితులు, కొండ ప్రాంతంలోని ప్రమాదకర మలుపులు వంటి అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముందు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దానిపైనా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. Tragic bus accident in Tissa, Chamba.A private bus travelling from Bairagarh to Chamba fell off the road near Chaluj Mor this morning. 7 people have died and 11 are injured. A total of 18 passengers were reportedly on board.Rescue operations are underway. pic.twitter.com/omtd94ugif— Naughty Himachal (𑚝𑚵𑚔𑚯 𑚩𑚮𑚢𑚭𑚏𑚥) (@NaughtyHimachal) August 8, 2026 చంబా జిల్లాలో కొండ ప్రాంత రహదారులపై వరుస ప్రమాదాల నేపథ్యంలో తాజా ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రహదారులపై కొండచరియలు విరిగిపడటం, రాళ్లు జారిపడే ప్రమాదం కూడా ఉందని వాతావరణ హెచ్చరికలు ఉన్నాయి. దీంతో కొండ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా ప్రమాదంపై మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ వెల్లడయ్యే అవకాశం ఉంది. -
అసాద్ నుంచి ఆబాన్ వరకు.. మృత్యుపాశంలో అతీక్ కుటుంబం!
లక్నో: మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో గత మూడేళ్లుగా వరుస విషాదాలు అలుముకున్నాయి. ఉమేష్ పాల్ హత్య కేసుతో మొదలైన పోలీసుల ఏరివేత చర్యలు, ఆ తర్వాత అతీక్, ఆయన తమ్ముడు అష్రఫ్‌ల హత్యలు, తాజాగా మరో కుమారుడు ఆబాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నమైంది. గత మూడేళ్ల కాలంలో జరిగిన ఈ పరిణామాలు ఇలా ఉన్నాయి.ఉమేష్ పాల్ హత్య(ఫిబ్రవరి 24, 2023)ప్రయాగ్‌రాజ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాజీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసు ప్రధాన సాక్షి ఉమేష్ పాల్, ఆయన ఇద్దరు భద్రతా సిబ్బందిని కొందరు దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపారు. ఈ హత్య కేసులో అతీక్ అహ్మద్, అతని ముఠాపై ప్రధాన ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) నిందితులపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించాయి.వరుస ఎన్కౌంటర్లు (ఫిబ్రవరి - ఏప్రిల్ 2023)ఫిబ్రవరి 27, 2023: ఉమేష్ పాల్ హత్య జరిగిన మూడు రోజులకు నిందితుడు అర్బాజ్‌ను పోలీసులు నెహ్రూ పార్క్ సమీపంలో చుట్టుముట్టారు. పోలీసులపై జరిపిన కాల్పులకు ప్రతిగా జరిగిన ఎదురుకాల్పుల్లో అతను హతమయ్యాడు. ఉమేష్ హత్యలో ఉపయోగించిన కారును అతనే నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు.మార్చి 6, 2023: ఈ కేసులో మరో నిందితుడైన విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. ఉమేష్‌పై తొలి కాల్పులు జరిపింది ఇతనే అని పోలీసులు తెలిపారు.ఏప్రిల్ 13, 2023: దాదాపు 50 రోజులు పరారీలో ఉన్న అతీక్ మూడో కుమారుడు అసాద్ అహ్మద్, అతని సహచరుడు గులామ్‌ను ఝాన్సీలో యూపీ ఎస్టీఎఫ్ మట్టుబెట్టింది. అసాద్‌పై 5 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఏప్రిల్ 15, 2023: అసాద్ అంత్యక్రియలు ముగిసిన రెండు రోజుల తర్వాత, ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా, మీడియా ముఖంగా జర్నలిస్టుల వేషంలో వచ్చిన ముగ్గురు దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతీక్, అష్రఫ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య చేసిన లవ్లేష్ తివారీ, అరుణ్ మౌర్య, సన్నీ సింగ్‌లను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.తాజాగా రోడ్డు ప్రమాదంలో ఆబాన్ మృతిఅతీక్ కుటుంబంపై మృత్యు నీడ ఇంకా వీడలేదు. తాజాగా అతీక్ కుమారుడు ఆబాన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. జైలులో ఉన్న తన అన్న అలీ అహ్మద్‌ను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. 2023లో మైనర్లుగా ఉన్న ఆబాన్, ఎహజమ్లను బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచగా, ఆ తర్వాత అక్టోబర్ 2023లో వారు విడుదలయ్యారు.ప్రస్తుతం అతీక్ కుటుంబంలో.. షైస్తా పర్వీన్ (భార్య): ఉమేష్ పాల్ హత్య కేసులో పరారీలో ఉన్నారు.ఉమర్ అహ్మద్ (పెద్ద కుమారుడు): లక్నో జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.అలీ అహ్మద్ (రెండో కుమారుడు): నైని సెంట్రల్ జైలులో ఉన్నాడు.ಅసాద్ అహ్మద్ (మూడో కుమారుడు): ఏప్రిల్ 2023లో పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు.ఆబాన్ (నాల్గో కుమారుడు): తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.ఎహజమ్ (చిన్న కుమారుడు): అక్టోబర్ 2023లో విడుదలైన తర్వాత తన మేనత్త సంరక్షణలో ఉంటున్నాడు. కాగా గత మూడేళ్లలో జరిగిన వరుస పరిణామాలు, పోలీసుల చర్యలు, హత్యలు, ప్రమాదాల కారణంగా అతీక్ అహ్మద్ సామ్రాజ్యం, అతని కుటుంబం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది.ఇది కూడా చదవండి: శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు.. -
భద్రాచలం ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన లారీ
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే, హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో పతంగి టోల్గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.టోల్గేట్ వద్ద ఆగి ఉన్న ఎమ్మెల్యే వెంకట్రావు కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్రావు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం సంభవించడంతో ఎమ్మెల్యే కొంత అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘నన్ను కాపాడండి..’.. రక్తపు మడుగులో అతీక్ కొడుకు చివరి క్షణాలు
లక్నో: నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) ప్రాంతాన్ని తన నేరసామ్రాజ్యంతో గజగజలాడించిన మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అతీక్ అహ్మద్‌కు ఉన్న ఐదుగురు కుమారులలో అందరికంటే చిన్నవాడైన అబాన్ అహ్మద్ గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉదంతంలో అత్యంత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, కారులో చిక్కుకున్న అబాన్ అహ్మద్ తన చివరి క్షణాల్లో ‘నన్ను కాపాడండి’ అంటూ ఆర్తనాదాలు చేశాడని ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి దీపక్ యాదవ్ వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షి దీపక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో అబాన్ అహ్మద్ ప్రయాణిస్తున్న హ్యుందాయ్ క్రెటా కారు అత్యంత వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా జాతీయ రహదారిపైకి ఒక దూడ అడ్డుగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో కారు డ్రైవర్ అకస్మాత్తుగా స్టీరింగ్‌ను తిప్పగా, అదే సమయంలో ఎదురుగా ఒక మోటార్ సైకిల్ కూడా వచ్చింది. అంతటి వేగంలో కారును కంట్రోల్ చేయలేక, ఆ బైకును తప్పించే క్రమంలో కారు రోడ్డు డివైడర్‌ను అత్యంత బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతతో డివైడర్‌ను ఢీకొట్టిన కారు గాల్లోకి లేచి రోడ్డుపై పల్టీలు కొడుతూ కిందపడింది. ప్రమాదం జరగడం చూడగానే నేను కారులో ఉన్న ప్రయాణికులను రక్షించేందుకు పరుగున వెళ్లాను. కారు డోర్లు తెరిచేందుకు ప్రయత్నించినా అవి పూర్తిగా లాక్ అయిపోయాయి. సాధ్యం కాకపోవడంతో వెంటనే సమీపంలో ఉన్న ఒక ఇనుప రాడ్డును తెచ్చి కారు డోర్లను బద్దలు కొట్టాను. అనంతరం పోలీసులకు సమాచారం అందించాను. డోర్లు తెరిచేసరికి కారు ముందు ప్యాసింజర్ సీట్లో రక్తపు మడుగులో పడి ఉన్న అబాన్ అహ్మద్ తీవ్ర నొప్పితో విలవిలలాడుతూ.. 'నన్ను కాపాడండి' అని వేడుకుని, ఆ వెంటనే స్పృహ కోల్పోయాడు అని దీపక్ యాదవ్ వివరించాడు. గాయపడిన ముగ్గురిని పూంచ్ పోలీసులు వెంటనే మోంథ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు.రోడ్డు ప్రమాదంపై ఝాన్సీ ఎస్ఎస్పీ బీబీజీటీఎస్ మూర్తి మాట్లాడుతూ..ప్రమాదం జరిగే సమయంలో అబాన్ కారు గంటకు 120 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాకుండా, ఆ సమయంలో కురిసిన తేలికపాటి వర్షం కారణంగా హైవే రోడ్డు తడిగా మారిందని, మితిమీరిన వేగం వల్లే బ్రేకులు వేసినా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, కారులో ఉండి ప్రాణాలతో బయటపడిన ఉమర్ అహ్మద్ అనే మరో యువకుడు మాత్రం.. రోడ్డుపై ఉన్న ఒక ఇటుకను కారు బలంగా ఢీకొట్టడం వల్లే వాహనం నియంత్రణ కోల్పోయిందని పోలీసులకు తెలిపాడు. -
కారు ప్రమాదంలో అక్కాచెల్లెలు మృతి..!
తిరుపతి జిల్లా: స్వగ్రామానికి వెళుతుండగా మంగళవారం చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో అక్కాచెల్లెలు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం జగవాండ్లపల్లె పంచాయితీ బోడిరెడ్డి గారిపల్లెకు చెందిన అనిల్ కుమార్ బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య మానస(35) మరదలు గౌతమి(32)తో కలిసి కారులో స్వగ్రామం బయలుదేరారు. బెంగళూరు కార్నర్‌లోని బట్టరహళ్లి వద్ద పరంధామరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ అడగడంతో కారులో ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో వి.కోట మండలం రామాపురం వద్ద హంద్రీ–నీవా కాలువ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అనిల్ కుమార్ మరదలు గౌతమి(32) కారులో నుంచి బయట పడి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మానసను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. అనిల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. లిప్ట్ అడిగి ప్రయాణిస్తున్న పరంధామరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి క్షేమంగా బయటపడినట్టు సీఐ సోమశేఖర్‌రెడ్డి, ఎస్ఐ షేక్షావలీ తెలిపారు. అక్కాచెల్లెలు మృతదేహాలను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో అతీక్ అహ్మద్ కుమారుడు మృతి
ఝాన్సీ(ఉత్తరప్రదేశ్): గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఝాన్సీ జైలులో ఉన్న తన అన్నయ్య అలీ అహ్మద్‌ను కలిసేందుకు కారులో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అబాన్ అహ్మద్ ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వెళ్తుండగా అకస్మాత్తుగా అదుపుతప్పింది. రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినింది. తీవ్ర గాయాలపాలైన అబాన్ అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.ఉమేష్ పాల్ హత్య కేసులో అశ్రద్తో పాటు అతీక్ అహ్మద్ పోలీసు కస్టడీలో ఉన్న సమయంలోనే 2023 ఏప్రిల్‌లో హత్యకు గురయ్యారు. అంతకుముందు అతీక్ కుమారుడు అసద్ పోలీసు ఎన్కౌంటర్లో మరణించారు. ఈ ఘటనలు జరిగి మూడేళ్లు దాటిన తర్వాత, ఇప్పుడు అతీక్ చిన్న కుమారుడు అబాన్ రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా అతీక్ మరో కుమారుడు అలీ అహ్మద్ పలు క్రిమినల్ కేసుల్లో ప్రస్తుతం ఝాన్సీ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఆయనను చూసేందుకు వెళ్తున్న సమయంలోనే అబాన్ రోడ్డు ప్రమాదానికి గురికావడం గమనార్హం.ఇది కూడా చదవండి: ‘రక్త సంబంధం’.. ఇది సీరియల్ కాదు.. సినిమా కానే కాదు! -
ఒంటరిగా ఉన్నా యువతితో డెలివరీ బాయ్ వికృత చేష్టలు!
యశవంతపుర: బెంగళూరులో మద్యం మత్తులో డెలివరీ బాయ్ యువతి ఇంట్లో రచ్చ చేశాడు. బాధిత యువతి అనేరి ఠక్కర్ ఇన్‌స్టాలో వివరించింది. ఆమె ఒక్కరే ఉండగా డెలివరీ బాయ్ వచ్చాడు. ఆమెతో అతి ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాడు, మొబైల్లో చార్జింగ్ పెట్టుకుంటానని, ఇక్కడే ఉండి సిగరెట్ తాగుతానని ఆమెను ఒత్తిడి చేశాడు. ఇంట్లోకి చొరబడడానికి యత్రించాడని యువతి వాపోయింది. చివరకు ఎలాగో అతన్ని వెనక్కి పంపించినట్లు, అతడు పనిచేసే కంపెనీకి ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తామని చెప్పారని పేర్కొంది. View this post on Instagram A post shared by Aneri Thakkar | Growth Mindset | People skills | Relationships (@anerithakkar_) -
టీచర్ ప్రాణం తీసిన మైనర్ డ్రైవింగ్
గౌలిపురా: నడుచుకుంటూ వెళ్తున్న టీచర్‌ను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. భవానీనగర్ ఇన్స్పెక్టర్ ఎ.కరుణాకర్ తెలిపిన మేరకు...న్యూ నల్లకుంట తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన స్వరూపరాణి (50) మొఘల్‌పురాలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్‌గా పనిచేస్తోంది. రోజూ ఎంఎంటీఎస్‌లో కాచిగూడ నుంచి యాకుత్‌పురా వచ్చి..అక్కడినుంచి నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తుంది. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది.అంతటితో ఆగకుండా కారు ఆటో, స్కూటీ, ఇతర వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. స్వరూపరాణిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వరూపరాణి భర్త బాల్‌రాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కారును ఓ మైనర్ బాలుడు (17) నడుపుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో బాలుడితోపాటు కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. -
హైదరాబాద్‌కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్‌లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు. -
లారీని ఢీకొట్టిన కారు.. యువకుడు సజీవ దహనం
మహబూబ్‌నగర్: కర్నూల్ జిల్లా గుత్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరికల్ మండలానికి చెందిన ఓ యువకుడు సజీవంగా దహనమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని బూడెగానితండాకు చెందిన రవినాయక్ (35)తో పాటు గాజులయ్యతండాకు చెందిన దేఘావత్ జాడోనాయక్, రవినాయక్ కలిసి బుధవారం రాత్రి కారులో కర్నూల్ జిల్లా గుత్తికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున గుత్తి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనక నుంచి వీరి కారు ఢీకొట్టింది. కారులో డీజిల్ డబ్బాలు ఉండటంతో మంటల చెలరేగాయి. గాజులయ్యతండాకు చెందిన జాడోనాయక్, రవినాయక్ కారులో నుంచి బయటకు దూకేయగా.. డ్రైవింగ్ చేస్తున్న బూడెగానితండాకు చెందిన రవినాయక్ అందులో ఇరుక్కుపోయాడు. కారుకు మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారుతో పాటే సజీవంగా దహనమయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
టార్గెట్ సీదిరి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నేరపూరిత హత్య..నేర పూరిత కుట్ర.. తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం.. సాక్ష్యాలను మాయం చేయడం..నేరస్తుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం.. అబద్ధమని తెలిసినా సమాచారాన్ని అధికారులకు ఇవ్వడం.. నేరానికి ప్రేరేపించడం..’ఇవీ రోడ్డు ప్రమాదం కేసులో సంబంధం లేని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై మోపిన అభియోగాలు. అసలు యాక్సిడెంట్ సమయంలో అప్పలరాజు అక్కడ లేరు. ప్రమాదం జరిగిందని తెలుసుకుని వెళ్లిన అప్పలరాజే పోలీసులకు సమాచారం అందించారు. అలాంటప్పుడు అప్పలరాజుపై అభియోగాలు మోపడం రాజకీయ కుట్ర కాకపోతే ఏమనాలి.. కక్ష సాధింపులో భాగమని అనడానికి ఇంకేం చెప్పాలి.. రోడ్డు ప్రమాదంలో దానయ్య చనిపోవడానికి కారణం సిద్ధార్ద్ త్యాడి కాదని, సీదిరి తనయుడు ఆరవ్ వర్మ కారకుడని పోలీసులు అప్పలరాజుకు చెప్పివుంటే, ఆ తర్వాత కూడా కొడుకును తప్పించడానికి త్యాడిని ఇరికించి ఉంటే కచ్చితంగా నేరమవుతుంది. లేదూ దానయ్య మరణాన్ని దాచేసి అసలు అటువంటిది జరగలేదని బుకాయిస్తే అది ఇంకా పెద్ద నేరమవుతుంది. కానీ, సీదిరి కుమారుడు ఆరవ్ ఫోన్ నుంచే సంఘటన స్థలం నుంచి 108కు ఫోన్ వెళ్లింది. ఇక సీసీ టీవీలు ప్రైవేటు వ్యక్తులవే అయినా అందులో ఫుటేజ్ ఏమాత్రం పోలేదు. అలాంటప్పుడు ఇందులో హత్య కోణం ఎక్కడుందో పోలీసులు..వారిని ప్రేరేపించిన పాలకులే చెప్పాలి. ఇన్ని సెక్షన్లా? సీదిరి అక్రమ అరెస్టు కేసులో నమోదైన సెక్షన్లు చూసిన వారెవరైనా రోడ్డు ప్రమాదం కేసులో ఇన్ని సెక్షన్లు పెట్టొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. న్యాయ కోవిదులు కూడా పోలీసుల తీరును ఆక్షేపిస్తున్నారు. యు/ఎస్ 105 ఆర్/డబ్లూ 61(2) అఫ్ బీఎన్ఎస్, 231,238,240, 242,249 ఆర్/డబ్ల్యూ 49బిఎన్ఎస్ సెక్షన్లను సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీసులు బనాయించారంటే దానివెనక ఎంత రాజకీయం నడించిందో ఇట్టే అర్ధమవుతుంది. పాలకులు కావల్సినట్టు పోలీసులు వ్యవహరించారని స్పష్టమవుతుందంటూ ఆరోపణలు ఉన్నాయి. 41 నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాల్సిన ఘటన కేసులో తొలుత కుమారుడిని, ఆ తర్వాత తండ్రిని అరెస్టు చేశారంటే ఎంత క«థ నడిచిందో అర్ధమవుతోంది. చంద్రబాబు అండ్‌కో పగ.. వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది. సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది. పెదబాబు, చినబాబు డైరెక్షన్లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు. -
స్పోర్ట్స్ బైక్‌తో ఢీకొట్టి.. 100 మీటర్లు ఈడ్చుకెళ్లి..
ముంబై: గురు పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైన ఓ మహిళను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. స్పోర్ట్స్ బైక్‌తో ఆమెను ఢీకొట్టిన యువకుడు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన సోమవారం రాత్రి ముంబైలోని మహిమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. మహిమ్ కాజ్‌వేకు చెందిన మంగళ అశోక్ టాండెల్ (46) సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గురు పౌర్ణమి సందర్భంగా సోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట్లో ఉన్న శ్రీ స్వామి సమర్థ మఠం దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రయాణానికి సంబంధించిన సామాన్లు సర్దుకుని, బంధువులు సిద్ధమయ్యారా అని తెలుసుకోవడానికి ఆమె లేడీ జంషెడ్జీ రోడ్డును దాటుతుండగా ప్రమాదం జరిగింది.బాంద్రా వైపు అత్యంత వేగంగా వెళ్తున్న ఓ స్పోర్ట్స్ బైక్ ఆమెను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో మంగళను బైక్ దాదాపు 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అనంతరం ఆమెను వెంటనే రాహేజా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగి కాగా, వారికి సలోనీ (22), సానియా (20) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులు తెలిపారు.ఇదే ప్రమాదంలో బైక్ నడుపుతున్న ధ్రువ్ గురవ్ (21) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మహిమ్ ఫిషర్మెన్ కాలనీకి చెందిన అతడిని భాభా ఆస్పత్రికి తరలించగా, చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.పోలీసుల సమాచారం ప్రకారం, ధ్రువ్ తన తల్లిని బాంద్రా నుంచి ఇంటికి తీసుకురావడానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతని తల్లిదండ్రులు గతంలో వివిధ ఆర్కెస్ట్రా బృందాలతో గాయకులుగా పనిచేసేవారని, ప్రస్తుతం వివిధ కార్యక్రమాల్లో పాటలు పాడుతూ జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు.ధ్రువ్, అతని అన్న ఇద్దరికీ స్పోర్ట్స్ బైక్‌లపై ప్రత్యేక ఆసక్తి ఉండేదని, వారి కుటుంబం వద్ద ఒకటి కంటే ఎక్కువ స్పోర్ట్స్ బైక్‌లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ధ్రువ్ గతంలో కూడా ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు.ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణం కావడం), సెక్షన్ 281 (బహిరంగ రహదారిపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం)తో పాటు మోటారు వాహనాల చట్టంలోని ఇతర నిబంధనల కింద మృతుడైన ధ్రువ్ గురవ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఔటర్‌పై ఆగిఉన్న లారీని ఢీకొన్న స్విఫ్ట్
హైదరాబాద్: ఓఆర్ఆర్పై ఆగిఉన్న సిమెంట్ లారీని ఢీకొట్టడంతో స్విఫ్ట్ కారులోని యువకుడితో పాటు ఓ యువతి దుర్మరణం చెందిన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా బొమ్మలరామారం మరియాల గ్రామానికి చెందిన కత్రావత్ సురేందర్ (19), ప్రణతి రెడ్డి (19) ఎల్బీనగర్ అనుష్కపూర్లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సురేందర్ స్విఫ్ట్ కారు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం బొమ్మలరామారం నుంచి కారులో బయలుదేరాడు. మంగళవారం ఉదయం కళాశాల హాస్టల్ వద్ద స్నేహితురాలు ప్రణతి రెడ్డిని పికప్ చేసుకున్నాడు. సాయంత్రం 5.45 గంటల సమయంలో వట్టినాగులపల్లి నియోపొలిస్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న సిమెంట్ లారీని కారు అతివేగంతో ఢీకొంది. లారీలోకి కారు చొచ్చుకుపోయి ముందు భాగం నుజ్జునుజ్జయింది. సురేందర్, ప్రణతి అక్కడికక్కడే మృతి చెందారు. లారీలో ఇరుక్కు పోయిన కారును క్రేన్ సహాయంతో తీసి మృతదేహాలను వెలికి తీశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడ్డుపై లారీ నిలిపాడని, ప్రమాదం జరగగానే పారిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్‌లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
నేను వితంతువుని కాదు సర్!
నా పేరు వెంకటరామరాజు. మాది రైల్వే కోడూరు. రోడ్డు ప్రమాదంలో దివ్యాంగుడిగా మారాను. 69 శాతం వికలత్వం ఉండడంతో నాకు పింఛన్ మంజూరు చేయాలని కోరడంతో పింఛన్ మంజూరు చేశారు. అయితే దివ్యాంగుడుగా ఉన్నప్పటికీ వితంతువు పింఛన్ మంజూరు చేశారు. ఆ విషయం ముందు నాకు తెలియదు. ఆ తర్వాత తెలవడంతో వితంతువు పింఛన్ రూ.4 వేలు.. దివ్యాంగుడి పింఛన్‌గా మార్పు చేయాలని క్షేత్ర స్థాయి అధికారుల నుంచి మండల, డివిజన్ చివరికి కలెక్టరేట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అర్జీలిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – తిరుపతి అర్బన్ -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెల్లూరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.రోడ్డు ప్రమాద మృతులను విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేటకు చెందిన రాంబాబు (50), నారాయణరావు (50), మోహన్‌నాయుడు (8)గా గుర్తించారు. ప్రమాదంలో మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
చాయ్ కోసం వెళ్తూ అనంతలోకాలకు!
సాక్షి, హైదరాబాద్/మూసాపేట: ఆదివారం కావడంతో ఆటవిడుపు కోసం క్రికెట్ ఆడేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఇద్దరు మైనర్లను మృత్యువు కబళించింది. ఈ ఉదంతంతో మరో బాలుడు గాయపడ్డాడు. యూసుఫ్‌గూడలోని బ్రహ్మశంకర్ నగర్‌కు చెందిన బేగరి మహేశ్, మన్నే లక్ష్మీతేజ, పులి కిరణ్‌కుమార్ స్నేహితులు. 17 ఏళ్ల వయసున్న ముగ్గురూ అమీర్‌పేట్‌లోని వేర్వేరు కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సెలవు రోజుల్లో వీళ్లు యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద క్రికెట్ ఆడుతుంటారు.ఆదివారం కూడా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన ఇంటి నుంచి బయటకు వచ్చిన మహేశ్ మిగిలిన ఇద్దరినీ కలిశాడు. ముగ్గురూ కలిసి కిరణ్‌కుమార్‌కు చెందిన ద్విచక్ర వాహనంపై కృష్ణకాంత్ పార్క్‌కు బయలుదేరారు. అయితే ఆట ప్రారంభించడానికి ముందు తరచూ వెళ్లినట్లే కూకట్‌పల్లిలోని మహాలక్ష్మి కేఫ్‌కు వెళ్లి చాయ్ తాగాలని భావించారు. కిరణ్ వాహనం నడుపుతుండగా వెనుక మహేశ్, లక్ష్మీతేజ కూర్చున్నారు. 4:55 గంటల సమయంలో కూకట్‌పల్లిలోని మెట్రో పిల్లర్ నం.796 వద్ద వెనుక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్ వీరి వాహనాన్ని గుద్దింది.దీంతో మహేశ్, లక్ష్మీతేజ ఎగిరి ఎడమవైపునకు పడిపోయారు. వాహనం నడుపుతున్న కిరణ్ కుడివైపు పడ్డాడు. మహేశ్, లక్ష్మీ తేజలపై టిప్పర్ టైరు ఎక్కడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. గాయాల పాలైన కిరణ్ మహేశ్ తండ్రి సంగప్పకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఈ ప్రమాదంపై సమాచారం అందుకుని ఘటనాస్థలికి వచ్చిన కూకట్పల్లి పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి, కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి
రామాయంపేట, హవేళి ఘణపూర్ (మెదక్)/హైదరాబాద్: మెదక్ జిల్లా రామాయంపేట అటవీ రేంజ్ పరిధిలోని హవేళి ఘణపూర్ మండలం గంగాపూర్వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న జిల్లా అటవీ అధికారి జోజి, మెదక్, రామాయంపేట రేంజ్ అధికారులు విద్యాసాగర్, రమేశ్, ఇతర అధికారులు సంఘటనాస్థలిని సందర్శించారు. చిరుతను ఢీకొన్న వాహనం ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు డీఎఫ్‌వో తెలిపారు.కాగా, రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందడంపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. చిరుత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి శాస్త్రీయ ఆధారాలతో పూర్తి స్థాయిలో నివేదిక సమరి్పంచాలని మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతాల పరిధిలో ఉన్న కేంద్ర, రాష్ట్ర రహదారులపై వన్యప్రాణుల సంచరించే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు వైల్డ్‌లైఫ్ క్రాసింగుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ ప్రాంత పరిధిలో వాహన చోదకులు నిరీ్ణత వేగంతో వెళ్లాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. -
గంటకు 21 మంది మృతి.. రోడ్డు భద్రతపై ఆందోళన!
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, వేలాది మంది గాయాలతో జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మరోసారి గుర్తు చేస్తున్నాయి.కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025లో దేశవ్యాప్తంగా 5,13,563 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అంటే.. సగటున ప్రతి గంటకు 59 ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాల్లో 1,83,382 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి గంటకు 21 మంది, రోజుకు సగటున 502 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.రాష్ట్రాల వారీగా చూస్తే.. తమిళనాడులో అత్యధికంగా 71,387 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్యలో మాత్రం ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ ఒక్క ఏడాదిలోనే 27,550 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. దీన్నిబట్టి చూస్తే.. రోడ్డు భద్రత విషయంలో వాహనదారులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది.ఇక గత కొన్నేళ్లతో పోలిస్తే.. పరిస్థితి మరింత దిగజారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023లో దేశంలో 4.8 లక్షలకు పైగా ప్రమాదాలు నమోదవగా, 2024లో ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇప్పుడు 2025లో ఐదు లక్షలకు పైగా ప్రమాదాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం '4E' (Education, Engineering, Enforcement, Emergency Care) వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం, రహదారులు.. వాహనాల నాణ్యతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.అయితే.. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించాలంటే ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా చాలా అవసరం. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం, హెల్మెట్ లేదా సీటుబెల్ట్ ధరించకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి నిర్లక్ష్యాలే చాలా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. -
పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి దుర్మరణం
హైదరాబాద్: త్వరలో పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వివాహం నిశ్చయమై జీవితాంతం కలిసి ఉండాల్సిన కాబోయే దంపతులు దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. హైదరాబాద్‌లోని శాస్త్రీపురం ప్రాంతానికి చెందిన సానియాబేగం (20), ఫలక్‌నుమాకు చెందిన మునీర్ (24)కు ఇటీవల వివాహం నిశ్చయమై, ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. ఈ క్రమంలో మొక్కు చెల్లించుకునేందుకు కాబోయే దంపతులిద్దరూ శనివారం ఇళ్లలో చెప్పి బైక్‌పై జేపీదర్గాకు వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా తిమ్మాపూర్ సమీపంలోని హెచ్ఐఎల్ పరిశ్రమ వద్ద వెనుక నుంచి అతివేగంగా వచి్చన ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సానియాబేగం తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మునీర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఖైరాఉనీ్మసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
సైదాబాద్ (హైదరాబాద్): అమెరికాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ఐఎస్‌సదన్ డివిజన్ వాణీనగర్‌లో నివసించే వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ అధికారి షేక్ అబ్దుల్ సయీద్ కుమారుడు షేక్ అబ్దుల్ నవీద్ (48) ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడి మెక్ ఫార్మా కంపెనీలో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య నజియా సల్మా (45), కుమార్తె నేహా నహీన్ షేక్ (19), కుమారుడు హఫీజ్ ఉమర్ షేక్ (14), మరో కుమార్తె ఖతీజా షేక్ (8) ఉన్నారు. కాగా నవీద్ కుటుంబంతో కలిసి కారులో తాను నివసిస్తున్న ప్రాంతం నుంచి కారులో నవేడా అనే ప్రాంతానికి విహార యాత్ర (ఫ్యామిలీ టూర్)కు బయలుదేరారు. అయితే భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నజియా సల్మా, నేహా నహీన్ షేక్, హఫీజ్ ఉమర్ షేక్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలకు గురైన షేక్ అబ్దుల్ నవీద్, ఖతీజా షేక్‌లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాణీనగర్‌లో విషాద ఛాయలు యాకుత్‌పురా నియోజకవర్గం ఐఎస్‌సదన్ డివిజన్ వాణీనగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం పాలవడంతో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్లు వాణీనగర్‌కు చేరుకుని నవీద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే తనకు, తన భార్య నజీమున్నీసా, సోదరుడు షేక్ అబ్దుల్ జావీద్‌లకు అమెరికా వీసాలు ఇప్పించాలని నవీద్ తండ్రి షేక్ అబ్దుల్ సయీద్ అభ్యరి్థంచారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
సాక్షి,హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిన ఈ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం.కాలిఫోర్నియాలోని ఓ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు హైదరాబాద్ వాసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని స్థానిక అత్యవసర సేవల సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగం కారణమా? లేక మరో వాహనం ఢీకొట్టిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న కాలిఫోర్నియా పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. -
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
సంగారెడ్డి: జిల్లాలోని కల్హేర్ మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని బచేపల్లి గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ప్రయానిస్తున్న స్కార్పియో కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయింది. ప్రమాదావశాత్తు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో కారులో ఉన్నటువంటి భార్యభర్తలతో పాటు 4ఏళ్ల కూతురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు నాందేడ్ వాసులుగా తెలుస్తోంది. -
పలాసలో రోత రాజకీయాలు
ఈ ఫొటోలో ప్రధానంగా కనిపిస్తున్న వారిలో పలాస నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, పలాస, కాశీబుగ్గ పట్టణ ప్రధాన కార్యదర్శి సప్ప నవీన్ తదితరులు ఉన్నారు. పలాసలోని రామకృష్ణాపురం నుంచి కాశీబుగ్గ వస్తుండగా జరిగిన బైక్ యాక్సిడెంట్లో చనిపోయిన దుబ్బ దానయ్య కుటుంబానికి న్యాయం చేయాలని, దానికి కారకులుగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని ఇటీవల చేసిన నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించింది వీరే. ఇక్కడ విశేషమేమింటే అంతకుముందు ఆ యాక్సిడెంట్‌కు సంబంధించి వీరితో పాటు అంబటి కృష్ణమూర్తి, శంకర్ తదితరులు రాజీ చేసి, బాధిత కుటుంబానికి పరిహారం అందించేలా ఒప్పందం చేశారు. తర్వాత వారిపై ఎవరి ఒత్తిళ్లు వచ్చాయో తెలియదు గాని మాట మార్చి ఏకంగా నిరసనకు దిగారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పలాసలో రాజకీయం వింత దోవన వెళుతోంది. రోడ్డు ప్రమాదాలను రాజకీయ ఎదుగుదలకు, వైరి పక్షాన్ని అణగదొక్కేందుకు వాడుకుంటున్న వైఖరి జనాలకు విస్తు గొలుపుతోంది. రామకృష్ణాపురం నుంచి కాశీబుగ్గకు వచ్చే క్రమంలో జరిగిన బైక్ యాక్సిడెంట్‌కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు, తిరుగుతున్న మలుపులు అధికా ర పక్ష నాయకులు విపక్షంపై ఏ మేరకు కక్ష పెంచుకున్నారో జనాలకు వివరిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా రాజీ జరిగే కేసులేమైనా ఉన్నాయంటే అవి రోడ్డు ప్రమాద కేసులే. ఇప్పుడు వాటిపైనా రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఉన్న విషయం తెలుసుకు ని.. దాన్ని కక్ష సాధింపునకు వాడుకోవాలని గట్టిగా అనుకున్నారు. ఇంకేముంది పెదబాబు, చినబాబు దగ్గరి నుంచి ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యే వరకు తెగ హడావుడి చేశారు. ప్రెస్మీట్లు, సోషల్ మీడియా పోస్టింగులతో హోరెత్తించారు. రోడ్డు ప్రమాదంలో బాధితులుగా మిగిలిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి సాయం చేయడాన్ని ఎవరూ తప్పు పట్టలేదు. అన్ని పారీ్టల వారూ స్వాగతించారు. కానీ అదే సహృదయతను ఇతర ప్రమాద బాధితులకు చూపకపోవడం, పైగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ‘అన్ని రోడ్డు ప్రమాద బాధితులకు ఎందుకు పరిహారం ఇస్తాం.. అక్కడ నిరుపేద కుటుంబం కావ డం వల్ల ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెద్దలతో మాట్లాడి పరిహారం ప్రకటించారు’ అని ఓ వీడియోలో మాట్లాడుతూ స్పందించడం రాజకీయ కోణాన్ని చెప్పకనే చెప్పింది. వీళ్లెందుకు కనిపించలేదు..? ఇదే పలాస నియోజకవర్గంలో ఈ నెల 12వ తేదీన టీడీపీ నాయకుడు, మందస పట్టణ టీడీపీ అధ్యక్షుడు గార కృష్ణారావు ఆటో యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు వెంకటరమణను ఢీకొట్టగా.. వెంకటరమణ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమ యంలో డ్రైవింగ్ చేస్తున్నది గార కృష్ణారావా? సునీలా? అన్నదానిపై అనుమానాలున్నా.. పోలీసులు మాత్రమే రకరకాల విచారణలు చేసి సునీలే డ్రైవింగ్ చేసినట్టు నిర్ధారించేశారు. ఇక్కడ చనిపోయిన వారిదీ నిరుపేద కుటుంబమే. చనిపోయిన వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య గుండెజబ్బుతో బాధ పడుతున్నారు. కానీ వీరిని పరామర్శించడం, సాయం చేయడం తమ పనే కాదన్నట్టు అధికార పక్ష పెద్దలు వ్యవహరించారు. కేవలం సీదిరి టార్గెట్‌గా చేసుకున్నారు కాబట్టే.. రామకృష్ణాపురం రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై సొంత పార్టీ నేతలే పాలకుల వైఖరిని తప్పు పడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఫేస్బుక్లో టీడీపీ నేత చేసిన పోస్టింగ్, దానికి స్పందిస్తూ మరో టీడీపీ నాయకుడు చేసిన కామెంట్లు ఇవి. సెటిల్మెంట్ చేసింది కూడా మన నాయకుడే కదా పది లక్షలు.. రెండు లక్షలు అతనికి అని పులారి దుర్యోధన్ కామెంట్ చేయగా తర్వాత ఒక ఇన్చార్జి మినిస్టర్ వచ్చి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాక ప్రజ లు అసహ్యించుకుంటున్నారు అని తలగాన నరసింహా స్పందించిన పోస్టు సారాంశమిది. ఫేస్‌బుక్‌లోనే తలగాన నరసింహ చేసిన పోస్టింగ్ ఇది. ‘నిన్న మా పార్టీ హుటాహుటిన స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చెయ్యడం చాలా గొప్ప విషయం. ఒకింత ఆశ్చర్యం కూడా. అయితే నాకు ఒకతను నిన్న ఒక విషయం అడిగాడు. ఏ యాక్సిడెంట్ జరిగినా మన పార్టీ(తెలుగుదేశం) 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తుందా లేక మినిస్టర్, ఎమ్మెల్యే కొడుకులు చేసిన యాక్సిడెంట్‌కి మాత్రమే ఇది వర్తిస్తుందా అని అడిగితే.. అతనితో అది నా స్థాయి కాదు. మా సీనియర్ నాయకులని అడిగి చెబుతా అన్నాను దయచేసి ప్రజలకు క్లారిటీ ఇవ్వండి’ అంటూ చేసిన పోస్టు చేశారు. -
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
15 రోజుల క్రితమే పెళ్లి.. నవ వధువు దుర్మరణం
కర్ణాటక: 15 రోజుల క్రితమే ఎన్నో ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన ఓ నవ వధువును రోడ్డు ప్రమాదం కబళించింది. నూరేళ్ల పంట మూణ్నాళ్ల ముచ్చట అయ్యింది. మృతురాలు మైసూరు తాలూకా మాకనహుండికి చెందిన మేఘన (20). వివరాలు.. మేఘనకు రెండు వారాల క్రితం బిదరగూడువాసి పునీత్‌తో పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. భార్యభర్తలిద్దరూ శుక్రవారం బంధువులను కలవాలని బైక్‌లో మైసూరుకు వచ్చారు. సాయంత్రం ఆర్టీ నగర వద్ద అతివేగంగా ఇంటికి వెళుతున్న వారి బైక్ స్కిడ్ అయి పడిపోయారు. మేఘనకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలిలోనే మరణించింది. భర్త పునీత్‌కు తల, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అతనిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనాస్థలినికి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మేఘన హెల్మెట్ ధరించలేదని, ధరించి ఉంటే చనిపోయి ఉండేది కాదని అన్నారు. ఈ విషాదంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి,విశాఖ: అనకాపల్లి - ఆనందపురం జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఆదివారం తెల్లవారు జామున జాతీయ రహదారిలో గండిగుండం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. బాధితులు టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నాలుగు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
హైదరాబాద్: రహదారులు రుధిర ధారలుగా మారాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గ్రేటర్ పరిధిలో గురువారం అర్ధరాత్రి, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు పాఠశాల విద్యార్థి, మరొకరు ఇంటర్మీడియట్ విద్యార్థి, ఓ మహిళ ఉన్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..మేడ్చల్‌లో బైక్‌ను ఢీకొట్టడంతో.. నగర శివారు ఐడీపీఎల్ దిల్‌కుష్‌నగర్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సొహైల్ (18), కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సుమిత్ గైక్వాడ్ (17) గురువారం అర్ధరాత్రి మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఓఆర్ఆర్ అండర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సొహైల్, సుమిత్ గైక్వాడ్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.కీసర ఓఆర్ఆర్పై..మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన రషీద్ (40) మటన్ షాప్ యజమాని. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాములు (60), గౌస్ కలిసి బొలేరో వాహనంలో గొర్రెల లోడ్‌తో నగర శివారు చెంగిచర్లలోని మండీకి వెళ్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర రావడంతో కీసర ఓఆర్ఆర్పై రాంపల్లి దాయర వద్ద బొలేరో వాహనాన్ని ఎడమ వైపు ఆపి నిద్రించారు. గుర్తు తెలియని వాహనం వెనక నుంచి వచ్చి బొలేరో వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. వాహనంలో నిద్రిస్తున్న రషీద్, రాములు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. గౌస్‌కు కాలు విరిగింది. వాహనంలోని కొన్ని గొర్రెలు సైతం మృతిచెందాయి. మృతుడు రషీద్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. రాములుకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ ఆంజనేయులు చెప్పారు. మెట్రో పిల్లర్‌ను బైక్ ఢీ..జగిత్యాల జిల్లా బీజ్పూర్ మండలం నర్సింహుల పల్లె గ్రామానికి చెందిన చెర్పూరి అఖిలేష్ యాదవ్ (24) నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ఆస్పత్రిలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన మహమ్మద్ యూనిస్ (26) ప్రైవేట్ ఉద్యోగ చేస్తూ ఇక్కడి హాస్టల్లో ఉంటున్నాడు.వీరిద్దరూ కలిసి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్‌పై జేఎన్టీయూ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లి భాగ్యనగర్ బస్టాప్ వద్ద వీరి బైక్ అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో అఖిలేష్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న మహమమ్మద్ యూనిస్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అఖిలేష్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అమెరికాలో ఏపీ యువతి మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్నగా గుర్తించారు. ఆమె ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి చేసిన ప్రసన్న ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు.న్యూజెర్సీలో ప్రసన్న తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితులకు గాయాలు కాగా, ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. సాయం అందించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
కారు అదుపు తప్పి బోల్తా.. వైద్య విద్యార్థిని మృతి
హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైద్య విద్యార్థిని మృతి చెందినట్లు శంషాబాద్ ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌లోని అమ్స్రీ సెంట్రల్ కోర్టు నివాసి అద్దంకి అమూల్య(21) ఎంఎన్ఆర్ కళాశాలలో డెంటల్ విద్య అభ్యసిస్తోంది. ఈ నెల 13న అర్ధరాత్రి దాటిన తర్వాత స్నేహితుడు సిద్ధార్థ్‌తో కలిసి శంషాబాద్ చూడటానికి కారులో వచి్చంది. మంగళవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ బయలుదేరారు. వీరు దారి తప్పి ఔటర్‌పైకి వచ్చి పెద్ద అంబర్పేట్ వైపు వెళ్తూ పెద్దగోల్కొండ టోల్గేట్ దాటగానే ప్రమాదానికి గురయ్యారు. అతివేగంగా వెళ్తున్న వీరి కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపునకు వెళ్లి బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న అమూల్య కారులోంచి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన సిద్ధార్థ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెట్రోలింగ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధికై నగరానికి వచ్చి.. నిండు ప్రాణాలు కోల్పోయి
ఉపాధి కోసం.. పని వెదుక్కుంటూ.. కూతురుని చూసేందుకు.. నగరానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరుచోట్ల జరిగిన ఈ దుర్ఘటనల్లో ఏపీలోని ప్రకాశం జిల్లా వారు ఇద్దరు యువకులు, రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాకు మహిళ మృతి చెందారు. నిజాంపేట్: ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాచుపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఏపీలోని ప్రకాశం జిల్లా పల్లమల్లి గ్రామానికి చెందిన ఎల్రక్టీíÙయన్ శివసాయి పవన్ (25) బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఉంటున్నాడు. స్నేహితుడు ఉమాప్రసాద్ (23)తో కలిసి ఆదివారం అర్ధరాత్రి బైక్‌పై బాచుపల్లి నుంచి ప్రగతి నగర్ వైపు బయలుదేరారు. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివసాయి పవన్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఉమాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..హయత్‌నగర్: ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. హయత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆదినారాయణ (35) హయత్‌నగర్‌లోని సూర్యనగర్‌లో నివాసముంటూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం ఆటోనగర్ నుంచి ఇంటికి వెళ్తుండగా, హయత్‌నగర్‌లో వెనుక నుంచి వేగంగా వచి్చన ఆర్టీసీ బస్సు ఆదినారాయణ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన తల బస్సు చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
రహదారి భద్రతపై నిర్లక్ష్యమా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రహదారి భద్రతకు సంబంధించి తాము గతంలో ఇచ్చిన మార్గదర్శకాలు, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలని పేర్కొంది. ఇందుకు నాలుగు వారాల గడువును నిర్దేశించింది. రహదారిపై భద్రతపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వాజ్యాలపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తాము స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంకా నివేదికలు సమర్పించకపోవడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రశ్నించింది. పౌరుల ప్రాణాలతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన, ప్రాధాన్యత కలిగిన ఇలాంటి అంశాల్లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని తప్పుబట్టింది. నిబంధనల అమలుపై స్టేటస్ లేదా కంప్లయన్స్ రిపోర్టులను తమ ముందు ఉంచాలని తేల్చిచెప్పింది. మోటారు వాహనాల(సవరణ) చట్టంలోని నిబంధనల అమలు, రహదారులపై భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సమగ్ర అఫిడవిట్లు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటివరకు కంప్లయన్స్ నివేదికలు సమర్పించని రాష్ట్రాలకు ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. రాబోయే నాలుగు వారాల్లోగా నివేదికలు సమర్పించని పక్షంలో సంబంధిత రాష్ట్రాల అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రహదారి భద్రత కోసం ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ చేసిన కీలక సిఫార్సులను అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. -
తమిళనాడులో రెండు బస్సులు ఢీ.. ఆరుగురి మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికిపైగా స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంపై తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన ఆరుగురి కుటుంబాలకు రూ.3లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఏడుగురికి రూ.లక్ష చొప్పున గాయపడిన మరో 15 మందికి రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
లేడీ డాక్టర్ కారు బీభత్సం
ఒంగోలు టౌన్ : లేడీ డాక్టర్ కారు అదుపు తప్పడంతో ఓ కానిస్టేబుల్ ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలో రెండ్రోజులుగా గైనకాలజిస్టుల రాష్ట్రస్థాయి వార్షిక సదస్సు జరుగుతోంది. పాండిచ్చేరిలో పీజీ చేస్తున్న నగరానికి చెందిన డాక్టర్ మేఘ ఈ సదస్సులో పాల్గొనడానికి ఒంగోలు వచ్చారు. ముంగమూరు సెంటర్లో స్నేహితులతో కలిసి కాఫీ తాగి ఆ తర్వాత బయల్దేరారు. కారు నగరంలోని పాత ఎన్‌హెచ్–5 పద్మ టవర్స్ వద్దకు రాగానే అదుపుతప్పింది. తొలుత మున్సిపల్ చెత్త బండిని ఢీకొట్టింది.దాని డ్రైవర్ వసంతరావుకు గాయాలయ్యాయి. అప్పటికీ మేఘ వాహనాన్ని నియంత్రించలేకపోవడంతో కారు సైకిల్ మీద వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ సురభి మరియదాసు (32)ను వెనక నుంచి ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన మరియదాసు ఒంగోలు జిల్లా సాయుధ రిజర్వ్ (డీఏఆర్)లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. రోల్‌కాల్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదంలో మరణించాడు. అతడికి భార్య భారతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.అయినా ఆగని కారు అయితే, ఈ ప్రమాదం తరువాత కూడా కారు ఆగలేదు. మోటారు బైకుపై చర్చికి వెళ్తున్న కొప్పేలు రామ్మోహన్‌రావును కూడా ఢీకొట్టింది. కానిస్టేబుల్ దాసు భార్య సురభి భారతి ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు మేఘపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు. కారులో మరో ఇద్దరు లేడీ డాక్టర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఇదే తరహాలో వేగంగా వస్తున్న కారు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. -
హైదరాబాద్ ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈరోజు తెల్లవారుజామున ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదు. ఫిలింనగర్ సైట్ 2 రోడ్ నంబర్ 5 లో ఉదయం 4 గంటల సమయంలో ఫెరారీ స్పోర్ట్స్ కార్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్నటువంటి హిల్ వ్యూ అపార్ట్మెంట్ గేటు బద్దలు కొట్టి లోనికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. ప్రమాదం జరిగిన వెంటనే యువకులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, మద్యం మత్తులో ఉన్న యువకులు ఓవర్ స్పీడ్ కారణంగా కారు అదుపుతప్పడంతో ప్రమాదానికి గురైందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫెరారీ స్పోర్ట్స్ కారును క్రేన్ సహాయంతో టోయింగ్ వెహికల్ లో ఫిలింనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, ఈ ప్రమాదం మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా? లేదంటే నెగ్లిజెన్సీ రాష్ డ్రైవింగ్ కారణమా? ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ టైరు కింద నలిగి..
హైదరాబాద్, గచ్చిబౌలి: వేగంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఓ యువతి మృతి చెందగా మరో యువతి గాయపడింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన మల్లం భవాని(23) ఇందిరానగర్ పీజీ హాస్టల్లో ఉంటూ టెలికాంనగర్‌లోని గోకలర్స్‌లో సేల్స్ గర్ల్‌గా పని చేస్తోంది.మరో సేల్స్ గర్ల్ ఎస్.సుహాసిని(30) అంజయ్యనగర్‌లోని లక్ష్మీ హాస్టల్లో నివాసం ఉంటోంది. గురువారం రాత్రి 11.20 గంటల సమయంలో సుహాసిని, భవాని కలిసి భోజనానికి వెళ్లారు. ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి ఫ్లై ఓవర్ సమీపంలో వెనక నుంచి వాటర్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. వెనక కూర్చున్న భవాని టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. సుహాసిని తీవ్రంగా గాయపడింది. -
శంషాబాద్ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, శంషాబాద్: హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ బొలెరో వాహనం బస్టాండ్‌లో వేచి ఉన్న మహిళలపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.సతమరాయి సమీపంలో ఈ వేకువజామున ఈ ఘోరం జరిగింది. ఉదయం సమయంలో రోడ్డుపై వెళ్తున్న బొలెరో.. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. వేగంగా వచ్చిన వాహనం నేరుగా రోడ్డు పక్కన ఉన్న బస్టాండ్‌లోకి దూసుకెళ్లింది. అక్కడ బస్సు కోసం వేచి ఉన్న మహిళలను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో శంషాబాద్–సతమరాయి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై ప్రమాదానికి గురైన వాహనం, సహాయక చర్యల కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికాలో రోడ్డుప్రమాదం..
మూలపాడు (ఇబ్రహీంపట్నం): అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడుకు చెందిన అట్లూరి ప్రసన్నలక్ష్మి (30) దుర్మరణం పాలైంది. మూలపాడుకు చెందిన రైతు అట్లూరి వసంతరావు, మల్లేశ్వరి దంపతులకు కుమార్తె ప్రసన్నలక్ష్మి, ఒక కుమారుడు ఉన్నారు. ప్రసన్నలక్ష్మిని అమెరికాలో ఎంఎస్ చదివించారు. అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. న్యూజెర్సీలో ఉంటున్న ఆమె జాబ్ కాల్‌లెటర్‌కు పూజ చేయించేందుకు కారులో స్నేహితులతో కలిసి బయలుదేరింది.న్యూయార్క్ ప్రాంతంలో రోడ్డుపై సిగ్నల్స్ వద్ద ప్రసన్నలక్ష్మి ప్రయాణిస్తున్న కారును మరోకారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృత్యువాతపడింది. ప్రసన్నలక్ష్మి దుర్మరణం వార్త తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో యువతి కూడా మరణించినట్లు తెలిసింది. కారులోని మరో ఇద్దరు గాయపడగా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. -
మరణాన్ని జయించిన మానవత్వం
గంభీరావుపేట(సిరిసిల్ల): బుడిబుడి నడకలను చూసి సంబురపడ్డ తల్లిదండ్రుల ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. అంబులెన్స్ రూపంలో వచ్చిన మృత్యువు బాలుడిని ఢీకొట్టగా బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. ఇంత విషాదంలోనూ ఆ కుటుంబ సభ్యులు బాలుడి అవయవాలను దానం చేసి మరో ఆరుగురికి పునర్జన్మను ప్రసాదించారు. బాలుడు తను వెళ్లిపోతూ ఆరుగురి రూపంలో ఈ లోకంలోనే ఉండిపోయాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బొంబాయి పాపారావు కూతురు సౌమ్య, అల్లుడు రఘు ఉద్యోగరీత్య తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా రాధాపురంలో ఉంటున్నారు. వీరి రెండో కుమారుడు యశ్వన్(7) గత నెల 29న సైకిల్ తొక్కుకుంటూ ఉండగా అతివేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయాలై బ్రెయిన్‌డెడ్ అయ్యింది. ఎంత ప్రయత్నించినా బాలుడిని కాపాడుకోలేకపోయారు. ఇంత విషాదంలో యశ్వన్ తల్లిదండ్రులు, తాత పాపారావు బాలుడి అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు కిడ్నీలు, కాలేయం, గుండె కవాటం, రెండు కంటి పాపలను ఇతరులకు మార్పిడి చేశారు. ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన యశ్వన్ తన మరణానంతరం చిరంజీవిగా నిలిచిపోయాడు. చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని విడిచిపోయిన యశ్వన్ భౌతికంగా లేకపోయినా అతని గుండెచప్పుడు, చూపు, జీవం మరో ఆరుగురిలో కొనసాగుతోంది. -
సోదరి నిశ్చితార్థానికి వెళ్లొస్తూ..
హైదరాబాద్, శంషాబాద్: ఔటర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందగా వదినకు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన మేరకు.. కాకినాడ రామచంద్రాపురం మండలం యెరుపల్లికి చెందిన చల్లా రాఘవేంద్ర ప్రసాద్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కిస్మత్పూర్లో నివాసముంటున్నాడు.వరుసకు సోదరుడైన చల్లా మనోహర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. రాఘవేంద్రప్రసాద్ సోదరి నిశ్చితార్థం కోసం వారి స్వగ్రామం యెరుపల్లికి ఈ నెల 4న ప్రసాద్, అతని భార్య భవాని (31), కొడుకు కార్తికేయ (2)తో పాటు మనోహర్ వెళ్లాడు. శుభకార్యం తర్వాత వీరంతా ఈ నెల 5న సాయంత్రం హైదరాబాద్ బయలుదేరారు.వెనక నుంచి లారీని ఢీకొట్టి.. కారును రాఘవేంద్రప్రసాద్ నడుపుతుండగా.. పక్క సీట్లో మనోహర్, వెనక సీట్లో భవాని, కార్తికేయ కూర్చున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరు ఔటర్‌పై పెద్దగోల్కొండ శివారులోకి రాగానే.. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. రాఘవేంద్ర గమనించకపోవడంతో కారు అదుపుతప్పి వెనక నుంచి ఢీకొట్టింది.లారీని కారు ఎడమవైపు భాగం బలంగా ఢీకొనడంతో మనోహర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు వెనక సీట్లో కూర్చున్న భవానికి తీవ్ర గాయాలవడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగానికి..
చిట్యాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మధురానగర్(యూసుఫ్‌గూడ)లో నివాసముంటున్న మలిరెడ్డి వీర వెంకట నాగ వరప్రసాద్‌బాబు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి స్వస్థలం ఏపీలోని కాకినాడ కాగా.. ఉద్యోగ రీత్యా కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. వరప్రసాద్‌బాబు, అతడి భార్య విజయలక్ష్మి(40), కుమార్తె శ్రియ(17), కుమారుడు ప్రభవ్(12)తోపాటు వారికి తెలిసిన వ్యక్తి అయిన హైదరాబాద్‌లోని గుండ్లపోచంపల్లిలో నివాసముంటున్న సినీ ఎడిటర్ కట్టా శ్రీకర్ ప్రసాద్(62)తో కలిసి తమ కూతు రుకు మెరుగైన వైద్యచికిత్స కోసం శనివారం ఉదయం చెన్నై వెళ్లారు. తిరిగి శనివారం రాత్రి చెన్నై నుంచి కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. మార్గమధ్యలో ఆదివారం తెల్లవారుజామున చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ హైవేపై గల యూటర్న్ వద్దకు రాగానే అతివేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న విజయలక్ష్మి, శ్రియ, ప్రభవ్‌తో పాటు ముందు కూర్చున్న కట్టా శ్రీకర్ ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవింగ్ చేస్తున్న వరప్రసాద్‌బాబుకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం తెలుసుకున్న చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్, తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వరప్రసాద్‌బాబును చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
పురోహితుడి ప్రాణం తీసిన కొబ్బరి బొండం
వివాహ వేడుక ముగించుకుని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కారులో బయలుదేరిన పురోహితుడు దువ్వూరి హరిప్రసాద్ (52) విజయవాడ సమీపంలోని గొల్లపూడి క్రాస్‌రోడ్డు వద్ద కారు అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో వెనుక సీటులో ఉన్న కొబ్బరిబోండం ఎగిరి వచ్చి బ్రేక్, క్లచ్ మధ్య ఇరుక్కోవడంతో కారు నియంత్రణ కోల్పోయి ముందున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.కృష్ణాజిల్లా: వెస్ట్ బైపాస్‌పై జక్కంపూడి షాబాద్‌ల మధ్య శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఆయా కుటుంబాల్లో పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కబళించింది. అందులో ఒకరు తన కుమారుడి పెళ్లి వేడుక చేసి తిరిగి కారులో ఇంటికి వస్తుండగా.. మరొకరు బైక్‌పై తన కొడుకుతో ప్రయాణిస్తున్నారు. వివరాలు ఇవి.. రాజమండ్రి సీతంపేటకు చెందిన దువ్వూరి హరిప్రసాద్(52) పురోహితుడిగా చేస్తుంటాడు. హరిప్రసాద్ చిన్న కుమారుడి వివాహం ఉండటంతో కుటుంబం మొత్తం హైదరాబాద్ వెళ్లింది. పెళ్లి ముగించుకుని తర్వాత మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి పెళ్లి కొడుకు, పెళ్లికూతురుతో పాటు మిగిలిన వారందరూ ఒక కారులో, హరిప్రసాద్ తన బంధువుతో పాటు పెళ్లి సామగ్రి తీసుకుని మరో కారులో బయలుదేరారు. తన బంధువును గొల్లపూడి వద్ద దింపిన హరిప్రసాద్.. కారును వెస్ట్ బైపాస్ వైపు మళ్లించాడు. మొదట బైక్.. ఆపై కంటైనర్‌ను ఢీకొట్టి.. జక్కంపూడి, షాబాద్‌ల మధ్య అండర్ పాస్ వద్దకు వచ్చే సరికి ఎదురు వెళ్తున్న బైక్‌ను హరిప్రసార్ కారు ఢీ కొట్టింది. ఆపై రోడ్డుకు పక్కనే నిలిపి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ కారు నడుపుతున్న హరిప్రసాద్ అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న పాయకాపురానికి చెందిన సూరిబోయిన హరికృష్ణ స్వల్పంగా, అతని తండ్రి గురవయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న కొద్దిసేపటికే గురవయ్య మృతి చెందాడు. గురవయ్య బోయమడుగులకు వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురవయ్య కొంత కాలం కిందట గుండె ఆపరేషన్ చేయించుకోగా, మందుల కోసం గుంటూరు వెళ్లి తిరిగి పాయకాపురానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు పెద్దలు చనిపోవడంతో ఆసుపత్రి ప్రాంగణం రోదనలతో విషాధ చాయలు అలముకున్నాయి. -
కంభం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కంభం పట్టణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సహా నలుగురు మృతి చెందడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పెళ్లి వేడుకకు హాజరై ఆలయానికి వెళ్లిన వారు ఈ విధంగా ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. వివాహ వేడుకల ఆనందం నిండిన కుటుంబంలో ఇలాంటి పెను విషాదం నెలకొనడం హృదయ విదారకమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తీవ్రంగా గాయపడినవారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించాలని, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.కాగా, మార్కాపురం జిల్లా కంభం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో కూడిన ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విషాదం నింపింది. మృతి చెందిన వారిలో అలకనంద (19), అంకాలు (20), నగేశ్ (17) , నాగేశ్వరి (2) గిద్దలూరు నల్లబండ బజారు వాసులుగా గుర్తించారు. కాగా పెళ్లి కూతురు వీరక్కకు తీవ్ర గాయాలయ్యాయి. -
బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం
క్వెట్టా/ఇస్లామాబాద్: పాకిస్థాన్ దక్షిణ పశ్చిమ రాష్ట్రం బలూచిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.శుక్రవారం ఉదయం క్వెట్టా నుంచి దేశ రాజధాని ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న ఈ బస్సు షెరాని–జోబ్ హైవేపై దనసర్ ప్రాంతంలో అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత లేదు. రెస్క్యూ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.Very sad news 😢💔At least 40 killed, 8 injured as passenger bus falls into ravine near Balochistan-KP border.#Balochistan #Accident pic.twitter.com/N222P3v64y— Balochistan Ko Bachao (BKB) (@balochistankb) July 3, 2026బస్సు ఒవర్‌లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మార్గమధ్యంలో మరో బస్సు చెడిపోవడంతో అక్కడి ప్రయాణికులను కూడా ఈ బస్సులోకి ఎక్కించారని వెల్లడించారు. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరగడం.. బస్సు అదుపు తప్పి ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. షెరాని డిప్యూటీ కమిషనర్ హజ్రత్ వాలి కకర్ మాట్లాడుతూ, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నామని, మృతదేహాలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (MERC) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 40 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ఎనిమిది మందిని వెంటనే జోబ్ ట్రామా సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నీటి ప్రవాహంలో కాకుండా బండ రాళ్ల మీద బస్సు పడడంతో.. ప్రమాద తీవ్రత ఎక్కువగా నమోదైందని చెబుతున్నారు. ప్రమాద స్థలంలో ఆరు అంబులెన్సులు, 12 మంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పది లైట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సహాయక చర్యల్లో వచ్చి చేరాయి. స్థానిక అధికారులతో పాటు సమీప ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంత రెస్క్యూ బృందాలు కూడా ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. -
కంభం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
మార్కాపురం జిల్లా కంభం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో కూడిన ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విషాదం నింపింది. మృతి చెందిన వారిలో అలకనంద (19), అంకాలు (20), నగేశ్ (17) , నాగేశ్వరి (2) గిద్దలూరు నల్లబండ బజారు వాసులుగా గుర్తించారు. కాగా పెళ్లి కూతురు వీరక్కకు తీవ్ర గాయాలయ్యాయి. -
నాకు చిన్న పిల్లలున్నారయ్యా... ఎవరైనా కాపాడండి...
గుంటూరు జిల్లా: ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. పెను ప్రమాదానికి దారి తీసింది. ఏకంగా మూడు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. నుజ్జునుజ్జయిన లారీ క్యాబిన్లలో ఇరుక్కుపోయి బయటకు రాలేక వారు పెట్టిన హాహాకారాలు, మీదకొస్తున్న అగ్ని కీలల నుంచి కాపాడమని చేసిన ఆర్తనాదాలు చూపరులను కలచివేశాయి. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ముగ్గురిని అక్కడికక్కడే సజీవ దహనం చేసింది. ఏ మృతదేహం ఎవరిదో కూడా గుర్తుపట్టలేని స్థితిలో పూర్తిగా కాలిపోయిన విషాద ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బోయపాలెం హైవేపై చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు... నంద్యాల జిల్లా బేతంచర్ల నుంచి నాపరాయి లోడుతో మచిలీపట్నం వైపు ఓ లారీ వెళుతోంది. మరోవైపు బుధవారం వేకువజామున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బోయపాలెం 16వ నంబరు జాతీయ రహదారిపై డీజిల్ అయిపోయి మధ్య లైనులో కోళ్ల దాణా లోడు లారీ అడ్డంగా నిలిచిపోయింది. దీనిని తప్పించబోయి.. అదుపు తప్పిన మొదటి లారీ అక్కడి డివైడర్‌ను ఢీకొట్టి, అవతల రోడ్డులోకి దూసుకెళ్లింది.అదే సమయంలో భద్రాచలం నుంచి బెంగళూరుకు పేపర్ బండిల్స్ లోడుతో వెళ్తున్న లారీని నాపరాయి లోడు లారీ ఎదురు నుంచి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నాపరాయి లోడు లారీ నడుపుతున్న నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచర్ల గ్రామానికి చెందిన మేకల రవికుమార్ (36), అదే గ్రామానికి చెందిన డ్రైవరు రమేశ్ (35)తోపాటు పేపర్ లోడ్‌లారీ నడుపుతున్న కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శెట్టిగన్‌పల్లి గ్రామానికి చెందిన ధర్మపతి (26) మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఏ మృతదేహం ఎవరిదో కూడా కనుక్కోలేని విధంగా పూర్తిగా ఆహుతయ్యాయి. చిన్న పిల్లలున్నారయ్యా.. ప్రమాదంలో నాపరాయి లోడు లారీ నడుతుపుతున్న డ్రైవర్ మేకల రవికుమార్ పెట్టిన ఆర్తనాదాలు గుండెలను పిండేశాయి. ‘నాకు ఇంటి దగ్గర చిన్న పిల్లలున్నారయ్యా, ఎవరైనా కాపాడండి’ అంటూ పెద్దగా కేకలు వేశాడు. గమనించిన స్థానికులు కొందరు క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఆయన్ను డోర్లు తీసి బయటకు లాగేందుకు తీవ్రప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ లోతుగా ఇరుక్కుపోవడంతో సాధ్యపడలేదు. ఇంతలో మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే రవికుమార్ అగ్నికి ఆహుతయ్యాడు. ఆయన ఆఖరి మాటలు అందరి హృదయాలను కలిచివేశాయి. రవికుమార్‌కు భార్య, ఒకటో తరగతి చదువుతున్న అని్వక, ఐదో తరగతి చదువుతున్న మనోజ్‌లు ఉన్నారు. శాశ్వత నిద్రలోనికి.. ఇదే లారీలో డ్రైవరుగా ఉన్న రమేశ్ ప్రమాదం జరిగిన సమయంలో క్యాబిన్లో ఉన్న బెడ్‌పై గాఢ నిద్రలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎదురుగా లారీని బలంగా ఢీకొట్టడంతో నిద్రిస్తున్న రమేశ్ బెడ్‌పై నుంచి ముందుకొచ్చి లారీ లోపల ముందు భాగంలో బోర్లా పడి ఇరుక్కుపోయాడు. మంటల్లో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటూ తుదిశ్వాస విడిచాడు. పేపర్ లోడు లారీ నడుపుతున్న ధర్మపతి నుజ్జునుజ్జుయిన క్యాబిన్లో చిక్కుకుపోయాడు. మంటలు క్షణాల వ్యవధిలోనే వ్యాపించడంతో బయట పడలేకపోయాడు. మృతదేహం అగ్ని కీలల్లో చిక్కుకుని 70 శాతం వరకు కాలిపోయింది. మిగిలిన ఇద్దరి మృతదేహాల ఆనవాళ్లు బయటకు కనిపిస్తున్నప్పటికీ ధర్మపతి మృతదేహం ఎక్కడుందో కూడా గుర్తుపట్టడం కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రమాదం గుంటూరు–పల్నాడు జిల్లాల సరిహద్దులో జరగడంతో పరిధి ఎవరిదనే అంశంపై కొంత సేపు మీమాంస చోటుచేసుకుంది. అనంతరం రెవెన్యూ అధికారులు సరిహద్దు నిర్ధారించడంతో ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీబీల సాయంతో సుమారు ఎనిమిది గంటలు శ్రమించి లారీ శకలాలను పక్కకు తీయించారు. సాయంత్రం మూడు గంటల సమయానికి ఒకవైపు హైవే ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
జైపూర్: విలాసవంత స్లీపర్ కోచ్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బతుకులు తెల్లవారుజామున తెల్లారిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ నుంచి బయల్దేరిన బస్సు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి వెళ్తూ మార్గమధ్యంలో రాజస్తాన్ గుండా ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురై బుగ్గిపాలైంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తలకు తీవ్రమైన గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. 24 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.రాజస్తాన్‌లోని దౌసా జిల్లాలోని కోల్వా పోలీస్‌స్టేషన్ పరిధిలో ధనావ్డా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రయాణికులున్న ఒక ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు దాటి పక్కకు వెళ్లి మంటల్లో చిక్కుకున్నాయి. ‘‘వేగంగా ఢీకొనడంతో బస్సులోంచి నా భార్య ఎగిరిపడి ట్రక్కు, బస్సు మధ్యలో ఇరుక్కుని నా కళ్లముందు మంటల్లో కాలిపోయింది’’అని ఒకతను ఏడుస్తూ చెప్పారు. ‘‘మేం జమ్మూకశీ్మర్‌లో వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుని తిరిగొస్తున్నాం. ముందున్న ట్రక్కును బస్సు వేగంగా ఢీకొనడంతో మంటలొచ్చాయి. నా భర్త జాడ తెలీడంలేదు’’అని ఒకావిడ కన్నీటిపర్యంతమయ్యారు. -
రమ్యను మర్చిపోయారా?.. పదేళ్లైనా న్యాయం దక్కలేదు!
"ఆ రోజు మా జీవితాలను చీకటిలోకి నెట్టేసింది... కానీ పదేళ్లు గడిచినా న్యాయం మాత్రం దక్కలేదు.".. ఓ కుటుంబం ఆవేదన. 2016 జూలై 1... తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటన జరిగిన రోజు. మద్యం మత్తులో వేగంగా దూసుకొచ్చిన కారు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 10 ఏళ్ల చిన్నారి రమ్య, ఆమె బాబాయి, తాత.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ప్రమాదంలో చనిపోయిన వారి జ్ఞాపకాలు మాత్రమే కాదు.. న్యాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తున్న బాధ కూడా ఇప్పటికీ అలాగే ఉంది.2016 జూలై 1న బంజారాహిల్స్ ప్రాంతంలో మద్యం మత్తులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న వాహనంపై పడింది. ఆ ప్రమాదంలో నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల చిన్నారి రమ్య తీవ్రంగా గాయపడింది. ఆమె బాబాయి రాజేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. రమ్య కొద్ది రోజుల తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. గాయాల కారణంగా ఆమె తాత మధుసూదనాచారి కూడా కన్నుమూశారు. ఒకే ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అప్పట్లో దేశవ్యాప్త చర్చఈ కేసులో నిందితులంతా 20 ఏళ్ల లోపే కావడం.. అదీ ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం గమనార్హం. రమ్య కేసు తర్వాత హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై విస్తృత చర్చ జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పబ్‌ల నియంత్రణను మరింత కఠినతరం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. తాగి వాహనాలు నడపకండంటూ తెలుగు రాష్ట్రాల్లో ఫ్లకార్డులతో జనాలు రోడ్డెక్కి నిరసనలు చేశారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినప్పటికీ.. ఇలాంటి ప్రమాదాలు పూర్తిగా ఆగలేదు.పదేళ్లలో ఒక్కసారే విచారణ?ఈ కేసులో న్యాయం కోసం పదేళ్లుగా పోరాడుతున్నామని బాధిత కుటుంబం చెబుతోంది. కానీ ఈ పదేళ్లలో కోర్టులో కేవలం ఒక్కసారి మాత్రమే విచారణ జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు విచారణ ముందుకు సాగకపోవడం, తరచూ వాయిదాలు పడుతుండటంతో న్యాయం ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.విదేశాల్లో నిందితుడు.. అదో మిస్టరీ!ఈ కేసులో శ్రవిల్, విష్ణు వినీత్‌లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వెంట మరో నలుగురు కుర్రాళ్లు ఉన్నప్పటికీ.. వాళ్ల గురించి స్పష్టత లేదు. అయితే కేసు తర్వాత విష్ణు వినీత్ విదేశాలకు పారిపోయాడని.. అతన్ని తిరిగి భారత్‌కు తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టినట్లు పలుమార్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన ఫలితం కనిపించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. నిందితుడిని భారత్‌కు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాలన్న తమ డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.'ప్రతీకారం కాదు.. న్యాయం కావాలి'పదేళ్లు గడిచినా రమ్య జ్ఞాపకాలు ప్రతి రోజూ వెంటాడుతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు ఎవరిపైనా ప్రతీకారం అవసరం లేదని.. కానీ చట్టం తన పని చేసి బాధ్యులకు శిక్ష పడాలని మాత్రమే కోరుకుంటున్నామని అంటున్నారు. కేసు విచారణను వేగవంతం చేసి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను వారు కోరుతున్నారు. -
పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు సజీవదహనం
-
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై హరిద్వార్ నుంచి ఇండోర్‌కు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ స్లీపర్ బస్సు.. ముందు వెళ్తున్న ఓ భారీ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌసా జిల్లా కొల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రెస్ట్ ఏరియా సమీపంలో తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హరిద్వార్ నుంచి ఇండోర్‌కు సుమారు 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ముందున్న ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బస్సు లోయలోకి పడిపోగా, వెనుక భాగంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం మొత్తం వ్యాపించాయి.ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఢీకొట్టడంతో అప్పర్ బెర్త్‌లపై ఉన్న ప్రయాణికులు కిందపడిపోయారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు మరింత వ్యాపించేలోపే కొందరు ప్రయాణికులు బస్సు కిటికీల అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే మంటల్లో చిక్కుకున్న ఏడుగురు బయటకు రాలేక సజీవదహనమయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను బయటకు తీసి దౌసా జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలించారు.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ట్రక్కును ఢీకొట్టిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా? లేక డ్రైవర్ నిద్రమత్తు లేదా మరో సాంకేతిక లోపం కారణమా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. Dausa, Rajasthan: A road accident took place in Dausa after a tourist bus carrying around 37 pilgrims from Haridwar to Indore collided with a truck on the Delhi–Mumbai Expressway in the early hours today. Following the collision, both vehicles caught fire. The passengers managed… pic.twitter.com/wp5zGGi96W— IANS (@ians_india) July 1, 2026 -
విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని బీబీ గూడెం వద్ద విజయవాడ పశ్చిమ బైపాస్‌పై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల కుమారుడు సహా తల్లి, మరో వ్యక్తి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పెంచికలపర్రు గ్రామానికి చెందిన జయమంగళ వెంకటవిజయ్కుమార్, వెంకటరాజు సోదరులు పొక్లెయిన్లు నడుపుతుంటారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి తల్లి రమాదేవి చూసేందుకు కుటుంబ సభ్యులతో కారులో వచ్చారు.వెంకరాజు భార్య, పిల్లలు ఆస్పత్రి వద్ద ఆగిపోగా, మిగిలిన వారు కైకలూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారి పశ్చిమ బైపాస్‌పై బీబీ గూడెం సమీపంలోకి రాగనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ముందు టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు వెళ్తున్న ట్యాంకర్ లారీతో పాటు వీరి కారును ఢీకొట్టి కొంత దూరం పాటు ఈడ్చుకువెళ్లింది.ఈ ప్రమాదంలో కంటైనర్, ట్యాంకర్ మధ్య కారు ఇరుక్కుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో వెనుక సీటులో కూర్చోన్న వెంకటవిజయ్కుమార్ భార్య బాలవెంకటనాగదుర్గ (28), కుమారుడు కారుణ్య నాగసాయి(4) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలోనే ట్యాంకర్ లారీ ఢీకొని స్కూటీపై వెళ్తున్న విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన హోటల్ కార్మికుడు దాసరి వెంకటేశ్వరరావు (49)కు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు.కారు నడుపుతున్న వెంకటరాజు, ముందు సీట్లో కూర్చున్న వెంకటవిజయ్కుమార్ గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంకటేశ్వరరావుతో పాటు కారులో ఇరుక్కుపోయిన తల్లి, కుమారుడి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో పశ్చిమ బైపాస్‌పై గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు, హైవే సిబ్బంది పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
ప్రయాణం మధ్యలో RTC బస్సు బోల్తా.. అసలు ఏం జరిగింది?
-
ఒక్క క్షణం.. ఒక మలుపు.. నలుగురి ప్రాణాలు బలి
-
వనపర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి పైగా గాయాలు
సాక్షి, మహబూబ్‌నగర్: హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారి 44 పై బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. కర్నూల్ నుంచి వనపర్తి జిల్లా వైపుగా వస్తున్న బస్సు రంగాపూర్ వద్ద ప్రమాదావశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108 లో దగ్గరలో గల ఆసుపత్రికి తరలించారు.అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
రోడ్డు ప్రమాదం: తల్లిదండ్రుల కళ్లెదుటే తెగిపడిన తల
మంచిర్యాల జిల్లా: సెలవు రోజు కావడం.. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో మంచిర్యాలకు చెందిన దంపతులు, ఒక్కగానొక్క కొడుకుతోపాటు నానమ్మను తీసుకుని వెళ్లారు. శుభకార్యం అనంతరం సాయంత్రం తిరిగి ఇంటికి బయల్దేరారు. రోడ్డుపక్కన ఆగిఉన్న లారీ రూపంలో మృత్యువు కాపు కాచింది. కారు వెనుకనుంచి లారీని ఢీకొట్టడంతో కొడుకు తల మొండెం వేరయ్యాయి. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. జైపూర్ ఎస్సై భూమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్షెట్టిపేటకు చెందిన పద్మ–కృష్ణమోహన్ దంపతులు. వీరికి ఇంటర్ పూర్తిచేసిన వెంకటసాయి సుశీల్(18) కొడుకు ఉన్నాడు. పద్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ప్రస్తుతం మంచిర్యాలలో నివాసం ఉంటున్నారు. ఆదివారం వారి దగ్గరి బంధువులు పెద్దపల్లిలో శుభకార్యం ఏర్పాటు చేశారు. పద్మ,–కృష్ణమోహన్ దంపతులతోపాటు కుమారుడు వెంకటసాయి సుశీల్, కృష్ణమోహన్ తల్లి ఉదయలక్ష్మితో కలిసి సొంత కారులో ఉదయం వెళ్లారు. శుభకార్యం అనంతరం అందరూ తిరిగి మంచిర్యాలకు బయల్దేరారు. ఇందారం క్రాస్ దాటి ఎన్‌హెచ్ 63పైకి చేరుకున్నాక, రోడ్డుపక్కన ఓ లారీ నిలిపి ఉంది. కారు నడుపుతున్న కృష్ణమోహన్ వేగంగా వెళ్లి లారీని వెనుకనుంచి ఢీకొట్టాడు. కారు వేగం ఎక్కువగా ఉండడంతో ప్రమాదం ధాటికి కారులో ఎడమవైపు కూర్చున్న వెంకటసాయి సుశీల్ తల, మొండెం వేరయ్యాయి. వెనుక సీటులో ఎడమవైపు కూర్చున్న ఉదయలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణమోహన్, పద్మ స్వల్పంగా గాయపడ్డారు. అప్పటి వరకు తల్లిదండ్రులతో సరదాగా కబుర్లు చెబుతూ వచి్చన ఒక్కగానొక్క కొడుకు సుశీల్ రెప్పపాటులో విగతజీవిగా మారాడు. భయంకరమైన ఆ దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. కారులో వెంకటసాయి సుశీల్ మృతదేహం ఇరుక్కుపోవడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. సుమారు అరగంటపాటు శ్రమించి వెలికి తీశారు. గాయపడిన ఉదయలక్ష్మి, పద్మ, కృష్ణమోహన్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని జైపూర్ సీఐ నవీన్‌కుమార్ సందర్శించారు. పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భూమేశ్ తెలిపారు. -
ఈ సమయంలో డ్రైవింగ్ ప్రమాదం!
భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని జూనో జనరల్ ఇన్సూరెన్స్ వారి 'ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (IRSR) 2026' దేశంలోని డ్రైవింగ్ అలవాట్లపై కీలకమైన విషయాలను వెల్లడించింది.జూనో స్మార్ట్‌డ్రైవ్ యాప్ ద్వారా సేకరించిన మొత్తం సమాచారం.. 17 రాష్ట్రాల్లో 45 లక్షల ప్రయాణాలు, 5.5 కోట్ల కిలోమీటర్ల డ్రైవింగ్ డేటా ఆధారంగా రూపొందించారు.ఈ నివేదిక ప్రకారం.. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య వాహనం నడపడం రోజులో అత్యంత ప్రమాదకరమైన సమయం. ఎందుకంటే రాత్రి 8 గంటల తర్వాత డ్రైవింగ్ నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. అయితే.. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య డ్రైవింగ్ చేయడం అత్యంత సురక్షితమైన సమయంగా గుర్తించారు.ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వయస్సు లేదా లింగం కాదు, డ్రైవింగ్ ప్రవర్తనే. భారతదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 80 శాతానికి పైగా ప్రమాదాలు డ్రైవింగ్ అలవాట్ల వల్లే సంభవిస్తున్నాయని నివేదిక పేర్కొంది.మహిళలు పురుషుల కంటే తక్కువ నైపుణ్యంతో డ్రైవ్ చేస్తారనే అభిప్రాయాన్ని ఈ నివేదిక పూర్తిగా ఖండించింది. మహిళల సగటు డ్రైవింగ్ స్కోర్ 92.86 కాగా, పురుషుల స్కోర్ 92.43గా నమోదైంది. అంటే.. ఇద్దరి మధ్య భద్రత పరంగా పెద్దగా తేడా లేదని ఈ అధ్యయనం వెల్లడించింది.భారతీయ డ్రైవర్లలో ప్రధాన బలహీనతలు ఆకస్మికంగా బ్రేక్ వేయడం, హఠాత్తుగా వేగం పెంచడం అని నివేదిక తెలిపింది. ఈ అంశాల్లో డ్రైవర్లు తక్కువ స్కోర్లు సాధించారు. అయితే వర్షాకాలం లేదా చలికాలం వంటి వాతావరణ మార్పులు డ్రైవింగ్ స్కోర్లపై పెద్దగా ప్రభావం చూపలేదని కూడా అధ్యయనం పేర్కొంది.భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు మరణాల్లో దాదాపు 11 శాతం. ఈ ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ నష్టం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాల కారణంగా భారత జీడీపీలో 3 నుంచి 5 శాతం వరకు నష్టం వాటిల్లుతోంది.రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా నష్టపోతున్నవారు ద్విచక్ర వాహనదారులు, పాదచారులు. మొత్తం మరణాల్లో 44 శాతం ద్విచక్ర వాహనదారులు, 19 శాతం పాదచారులు ఉన్నారు.భారతదేశంలో 2030 నాటికి రోడ్డు ప్రమాదాల మరణాలను 50 శాతం తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రహదారుల నిర్మాణం మాత్రమే సరిపోదని, డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి సాంకేతికత ఆధారిత పరిష్కారాలు అవసరమని జునో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ షనాయ్ ఘోష్ అభిప్రాయపడ్డారు. -
అప్పుడు అన్న... ఇప్పుడు తమ్ముడు.. అదే ప్రమాదం!
నిజామాబాద్ భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన కాసాల రమేశ్ గౌడ్ (50) గ్రామంలో ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం మెదక్ జిల్లా రామాయంపేటకు వెళ్లి అక్కడ పనులు ముగించుకొని తిరిగి బస్వాపూర్ వచ్చేందుకు ఆటో ఎక్కాడు.బస్వాపూర్ శివారులోని జాతీయ రహదారిపై వస్తుండగా ముందు వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపటంతో వెనుక వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రమేశ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ప్రయాణికులు లక్ష్మి, శ్వేతలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతుడికి భార్య స్వప్న, కుమారుడు ధనుష్, కుమార్తె విదూష ఉన్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు. ప్రమాదం జరిగిన వెంటే లారీ డ్రైవర్ పరారయ్యాడని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.15 ఏళ్ల క్రితం అన్న..గురువారం మృతి చెందిన రమేశ్ గౌడ్ అన్న కూడా గతంలో ఆటో ప్రమాదంలోనే మృతి చెందారు. దాదాపు 15 ఏళ్ల క్రితం బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసాల శ్రీనివాస్ గౌడ్, పొందుర్తి శివారులోని జాతీయ రహదారిపై జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందాడు. ప్రస్తుతం ఆయన సోదరుడు రమేశ్ గౌడ్ కూడా ఆటో ప్రమాదంలో మృతి చెందడం గ్రామస్తులు, బంధువులను తీవ్రంగా కలిచివేసింది. -
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏఎంబీ(AMB) ఫ్లైఓవర్‌పై జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రాంగ్ రూట్లో వస్తున్న స్కూటీని ఎదురుగా వచ్చిన బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వాళ్లను శ్రీకాంత్, విఠల్ పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బుల్లెట్ బైక్ రైడర్ వినోద్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.స్థానికుల ప్రకారం.. ఈ ఫ్లైఓవర్‌పై తరచూ వాహనాలు రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నాయి. పోలీసుల పర్యవేక్షణ, కఠిన చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. సరైన నియంత్రణ ఉంటే ఈ ప్రాణనష్టం తప్పించుకోవచ్చని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


