సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లాపూర్‌మెట్ ఇనాంగూడ వద్ద కర్రల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. లారీ పల్టీ కొట్టిన కారణంగా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కర్రలు మొత్తంగా రోడ్డుపై పడిపోయాయి.
ఈ కారణంగా హైవేపై సుమారు ఆరు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇనాంగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.


