సాక్షి,హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున (జనవరి 20) కంటైనర్, కారు ఢీకొని నలుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
మృతులు పటేల్ (42),రాజన్న (60),బాబన్న(70)కారు డ్రైవర్ మరణించినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


