దోనెపూడి: బాపట్ల జిల్లాలోని దోనెపూడి దగ్గరు చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కొబ్బిరి కాయలతో వెళుతున్న ఓ ఆటో పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆటో ఐదుగురు ప్రయాణికులు ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకంది. అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమం ఉన్నట్ల సమాచారం. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్ని చాటగడ్డ కాంతారావు, పెసర్లంక శ్రీనివాస్, షేక్ ఇస్మాయిల్‌గా గుర్తించారు.
ఇదిలా ఉంచితే, ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 12వ తేదీ) తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు గోరింట గట్టులోకి పడిపోవడంతో కనీసం 9 మంది మృతి చెందగా, 23 మంది వరకూ గాయపడ్డారు.
చింతూరు మండలంలోని తులసిపకల ఘాట్ రోడ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 37మంది ప్రయాణికులతో బస్సు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తన్నారు.ఈ ప్రమాదం తర్వాత పోలీసులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఘాట్ రోడ్లపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. పొగమంచు ఎక్కువగా ఉండటంతో క్లియరెన్స్ మందగించి ప్రమాదం జరిగిందని అంచనాకు వచ్చిన పోలీసు అధికారులు.. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు
60 కంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడపడంతో డ్రైవర్ల నియంత్రణ కోల్పోతున్నారు.
మద్యం తీసుకోవడం, మత్తు పదార్థాలు తీసుకున్ని డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదాలకు కారణంగా మారుతుంది.
డ్రైవింగ్ చేస్తున్నప్పడు ఫోన్‌లో మాట్లాడటం, మెసేజ్ టైప్ చేయడం వాహనం మీద నియంత్రణ కోల్పోవడం ఒక కారణం.
నిబంధనలు పాటించకుండా వ్రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం మరో కారణం.
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి సిగ్నల్ జంప్ చేయడం వంటివి కూడా ప్రమాదాలకు కారణం.
హెల్మెట్, సీట్‌బెల్ట్ వంటి సేఫ్లీ పరికరాలు వాడకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
వాహనాలు బ్రేక్ ఫెయిల్, టైర్ బ్లాస్ట్ వంటి సమస్యలు.
భారీ వర్షాలు కానీ, పొగమంచు ఉన్నప్పుడు కానీ సరైన లైటింగ్ లేకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఒక కారణం.


