Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Government New Conspiracy:  Andhra Pradesh1
బాబు ప్రభుత్వ ‘చావు’ తెలివి

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ కుట్రలకు మరింతగా బరితెగిస్తోంది. ఎంతగా అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సహజ మరణాలు, వృద్ధాప్య, అనారోగ్య­సమస్యలతో మర­ణా­లనూ వక్రీకరిస్తూ అక్రమ కేసుల నమోదుకు తెగబడుతోంది. 2022, మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 16 మంది మరణించారు. కోవిడ్‌ అనంతర అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో వారు మరణించారు.వీటిపై అప్ప­ట్లోనే ఎల్లో మీడియా సహకారంతో అప్పటి ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేసింది. కల్తీసారా తాగి మరణించారని దుష్ప్రచారం చేసింది. అప్పట్లోనే విచారణ చేపట్టిన అధికారులు ఆ 16 మంది అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే మరణించారని నిర్ధారించారు. కాగా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ మరణాలపై విచారణ పేరుతో కొత్త కుట్రకు తెరతీయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ వత్తాసు⇒ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటుమరో అక్రమ కేసుకు తెరతీయాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా వత్తాసు పలికారు. మూడేళ్ల క్రితం నాటి సహజ మరణాలపై తాజాగా ఆయన సందేహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. ఆ మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపారు. కల్తీ సారా వల్లే ఆ మరణాలు సంభవించాయని ఎఫ్‌ఎస్‌ఎల్‌ వెల్లడించిందని కూడా ఆయన ఏకపక్షంగా ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. విచారణతో నిమిత్తం లేకుండా ఏకంగా డీజీపీనే ఏకపక్షంగా కల్తీ సారా అని చెప్పేయడం విడ్డూరంగా ఉంది.అంటే రాబోయే నివేదిక ఎలా రూపొందించాలన్నది కూడా ఆయన పోలీసు అధికారులకు పరోక్షంగా స్పష్టం చేశారు. ఇక తాము అనుకున్నట్టుగా డీజీపీ ద్వారా నివేదిక రాగానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ మరణాలపై దర్యాప్తునకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కేపీఎస్‌ కిశోర్, ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కేవీఎన్‌ ప్రభుకు­మార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి కె.ఉమామహేశ్వ­రరావుతో టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2022లో జంగారెడ్డిగూడెంలో 16మంది మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, అప్పటి అధికారులు చేపట్టిన విచారణలో లోపాలు ఉంటే గుర్తించాలని, తదుపరి తీసుకోవాల్సిన న్యాయ, పరిపాలన, సాంకేతికపరమైన చర్యల­ను సూచించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే 16 మంది మృతి⇒ ఆనాడే అధికారుల దర్యాప్తులో వెల్లడిజంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో 16మంది మృతిపై అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే దర్యాప్తునకు ఆదేశించింది. అప్పటి పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేశారు. ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డీఎంహెచ్‌వో బి. రవి నేతృత్వంలో రెవెన్యూ, వైద్య అధికారులు మరణించిన 16 మంది నివాసాలకు వెళ్లి విచారణ చేశారు. మృతుల బంధువుల వాంగ్మూలాలను నమోదు చేశారు.వారి కుటుంబ పరిస్థితులను అధ్యయనం చేశారు. వైద్య నివేదికలు పరిశీలించారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నిర్ధారించారు. వారిలో ముగ్గురికి మాత్రమే మద్యం వ్యసనం ఉందని కూడా తేల్చారు. వారు కూడా జంగారెడ్డిగూడెంలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వారి మరణానికీ కేవలం మద్యంపానం ఒక్కటే కారణం కాదు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం ఆ 16 మంది మృతికి కారణాలు ఇవీ...నాటి ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ విచారణలోనూ అదే వెల్లడిఆయనే ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మరణాలపై పోలీసు విచారణ కూడా నిర్వహించింది. అప్పటి ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఆ విచారణ నిర్వహించారు. ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. అప్పటి డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ హైమావతి, ఆర్డీవో ప్రసన్న లక్ష్మి, డీఎంహెచ్‌వో బి.రవి, డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళీకృష్ణ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస చౌదరి, సూపరింటెండెంట్‌ బి.అరుణ కుమారి, డీఎస్పీ కేవీ సత్యనారాయణ తదితరులతో సమీక్షించారు.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నివేదించారు. అప్పుడు దర్యాప్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు కూడా. కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి అక్రమ కేసు నమోదుకు సిద్ధపడుతుండటం కేవలం రాజకీయ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది.

Tourist Bus Collides With Lorry In Vikarabad District2
వికారాబాద్‌: లారీని ఢీకొన్న పెళ్లి బస్సు.. నలుగురి మృతి

సాక్షి, వికారాబాద్‌ జిల్లా: పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని బీజాపూర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చందనవెళ్లి గ్రామానికి చెందిన పలువురు టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Investigation Speedup In Terror Conspiracy Case3
యూట్యూబ్‌లో చూసి.. అమెజాన్‌లో ఆర్డర్‌ చేసి..

సాక్షి, హైదరాబాద్‌: విజయనగరం ఉగ్రకుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహా్మన్, హైదరాబాద్‌ బోయిగూడకు చెందిన సయ్యద్‌ సమీర్‌ భారీ విధ్వంసానికి ప్లాన్‌ చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, మహా రాష్ట్ర యువకులు సైతం వీరి గ్యాంగ్‌లో ఉన్నట్టు తెలిసింది. వీరంతా ఇటీవలే హైదరాబాద్‌లో సమావేశమై బాంబుపేలుళ్ల కుట్రలకు సంబంధించి పలు అంశాలు పంచుకున్న ట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌లో భాగంగా సిరాజ్, సమీర్‌లను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయనగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రలింకుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు సైతం రంగంలోకి దిగారు. సోమవారం విజయనగరం వెళ్లి స్థానిక పోలీసులు, ఇరు రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించారు. సౌదీ హ్యాండ్లర్‌ నుంచి వచి్చన ఆదేశాల మేరకు భారీ పేలుళ్ల కుట్రకు తెరతీసినట్టు కీలక ఆధారాలు ఉండటంతో ఎన్‌ఐఏ ప్రత్యేకంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూపు ఈ కుట్రలో సిరాజ్, సమీర్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు కలిపి మొత్తం ఆరుగురు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా ఇన్‌స్టా్రగామ్‌లో ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసుకోగా.. సౌదీ హ్యాండ్లర్‌ అన్ని కీలక విషయాలను వీరి గ్రూప్‌ కు పంపుతున్నాడు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్‌లో సమీర్‌ సహాయంతో ఒక రహస్య ప్రాంతంలో 3 రోజులపాటు గడిపినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందు లో ప్రధానంగా బాంబుల తయారీ, అందుకు అవసరమైన వస్తువుల కొనుగోలు, డమ్మీ బ్లాస్టులు చేయడం, ఆ తర్వాత ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిని కలవాలి, తదుపరి కార్యాచరణ వంటి అనేక విషయాలు చర్చించుకున్నారు. సమీర్, సిరాజ్‌కు బాంబుల తయారీ పదార్థాల కొనుగోలు, తయారీ బాధ్యతను హ్యాండ్లర్‌ అప్పగించాడు. యూట్యూబ్‌లో వీరిద్దరూ బాంబుల తయారీ విధానం చూసినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని, విజయనగరానికి చెందిన సిరాజ్‌కు ఆ బాధ్యత అప్పగించారు. టిఫిన్‌ బాక్స్‌ బాంబులు తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు అవసరమైన టిఫిన్‌ బాక్సులు, వైర్లు, రిమోట్‌ సెల్స్‌ అమెజాన్‌లో ఆర్డర్‌ చేసినట్లు తేలింది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు రిహార్సల్స్‌ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తరువాత వరుస పేలుళ్లకు కుట్ర చేసినట్టు గుర్తించారు. సమీర్‌ గురించి ఆరా.. సికింద్రాబాద్‌లో లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న సమీ ర్‌.. బోయిగూడ రైల్‌ కళారంగ్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఉంటూ ఇన్‌స్టా్రగామ్‌ గ్రూప్‌ ద్వారా ఇతర నిందితులకు, సౌదీలోని హ్యాండ్లర్‌కు టచ్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్‌ కేంద్రంగా మిగిలిన ఆరుగురు సభ్యులకు షెల్టర్‌ ఇవ్వడం.. బాంబుల తయారీలో సిరాజ్‌కు సహకారం అందించడంలో కీలకంగా ఉంటున్నాడు. సమీర్‌ ఇంకా ఎవరెవరితో సన్నిహితంగా ఉండేవాడు.. సమీర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న వారు ఎవరు అన్న విషయాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్‌ ఆరా తీస్తోంది.

Baloch rebels release video of Jaffar Express hijack4
పాక్‌ చెప్పిందంతా అబద్ధం

ఇస్లామాబాద్‌: రెండు నెలల క్రితం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును హైజాక్‌ చేసిన ఉదంతంలో ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చెప్పినదంతా అబద్ధమని బలూచిస్తాన్‌ వేర్పాటువాదుల గ్రూప్‌ అయిన బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ) సోమవారం ప్రకటించింది. రైలు హైజాక్‌ ఘటనలో తమదే పైచేయి అని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో సవివరంగా ఒక వీడియోను రూపొందించి తాజాగా విడుదలచేసింది. పాకిస్తాన్‌లో విస్తీర్ణంపరంగా అతిపెద్ద ప్రావిన్స్‌ అయినప్పటికీ అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచిపోయిన బలూచిస్తాన్‌ ప్రజలు ఏకమై తమ ప్రాంత స్వయంప్రతిపత్తే లక్ష్యంగా ఉద్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యమంలో భాగంగా మార్చి 11వ తేదీన పెషావర్‌కు వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును వందలాది మంది బలూచ్‌ సాయుధులు రైలు పట్టాలను పేల్చేశాక హైజాక్‌ చేయడం తెల్సిందే. అయితే ఈ ఘటనలో బలూచ్‌ మిలిటెంట్లను హతమార్చి వందల మంది ప్రయాణికులను కాపాడామని పాకిస్తాన్‌ ప్రభుత్వం, సైన్యం ప్రకటించాయి. అయితే అదంతా అబద్ధమంటూ 36 నిమిషాల వీడియోను బలూచ్‌ ఆర్మీ మీడియా విభాగం హక్కాల్‌ ఒక వీడియోను బయటపెట్టింది. అందులో దాడికి ముందే సుశిక్షితులైన వందలాది మంది బీఎల్‌ఏ ఫైటర్లు షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం, రైలును హైజాక్‌ చేశాక ఏ బోగీ జనాలను ఎటువైపు తీసుకెళ్లాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? వంటి వాటితోపాటు బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్తగా రైలు నుంచి దూరంగా తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. బందీలను చిత్రహింసలకు గురిచేసి కొందరిని చంపేశామన్న పాక్‌ సైన్యం వాదనల్లో నిజంలేదని బీఎల్‌ఏ ఈ వీడియోతో నిరూపించింది. బందీల్లో 200 మంది పాక్‌ పోలీసులు, అధికారులు ఉన్నారు. వాళ్లను రెండు రోజులపాటు బంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులను హింసించారన్న వాదనలో వాస్తవం లేదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు దాడి చేయడానికి గల కారణాలు, ఆవశ్యకతను బీఎల్‌ఏ సీనియర్‌ నేత ఒకరు ఈ వీడియో మొదట్లోనే స్పష్టంచేశారు. ‘‘మా పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యమం కీలకదశకు చేరుకుంటోంది. ఈ దశలో సంక్షిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చంది. మా యువ ఫైటర్లు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలుచేయాల్సి వచి్చంది. ఇలాంటి నిర్ణయాలుకాకుండా మరే ప్రత్యామ్నాయాలు లేవని మా వాళ్లకూ అర్థమైంది. తుపాకీని నిలువరించాలంటే తుపాకీని పట్టుకోవాల్సిందే. తుపాకీ పేలుడు శబ్దం కూడా కొంత దూరం వరకే వినిపిస్తుంది. తన తండ్రి కోసం తనయుడు ప్రాణత్యానికైనా సిద్ధమయితే అదే కొడుకు కోసం తండ్రి కూడా ఎంతకైనా తెగిస్తాడు’’అని ఆయన చెప్పాడు. హైజాక్‌ ప్రణాళిక రచన, అమలు, ముందుండి నడిపించి ఫిదాయీ ఫైటర్‌ యూనిట్‌ మజీద్‌ బ్రిగేడ్‌ వివరాలు, ఫొటోలు, సభ్యుల స్పందనలను వీడియోకు జతచేశారు. పాక్‌ సైన్యం ప్రతిదాడిచేసినా అత్యల్ప స్థాయిలో తమ వైపు ప్రాణనష్టం జరిగిందంటూ వీరమరణం పొందిన వాళ్లకు నివాళులు అరి్పంచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 30 గంటలపాటు సైనిక ఆపరేషన్‌ తర్వాత 33 మంది రెబల్స్‌ను మట్టుబెట్టామని పాక్‌ సైన్యం ఆనాడు ప్రకటించింది. బందీలను విడిపించే క్రమంలో 23 మంది జవాన్లు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు చనిపోయారని తెలిపింది. అయితే తాము మాత్రం బందీలుగా ఉన్న 214 మంది పాకిస్తాన్‌ పోలీసులందరినీ చంపేశామని రెబల్స్‌ ప్రకటించారు.

Muhammad Waseem Slams Blasting Fifty, UAE Stun Bangladesh In Second T205
రికార్డు విజయం.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన యూఏఈ

క్రికెట్‌ పసికూన యూఏఈ రికార్డు విజయం సాధించింది. తమ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్‌పై విజయం నమోదు చేసింది (టీ20ల్లో). మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (మే 19) జరిగిన రెండో టీ20లో ఇది జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం బరిలోకి దిగిన యూఏఈ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో యూఏఈ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్‌ కోసం​ యూఏఈలో (షార్జా) పర్యటిస్తున్న బంగ్లాదేశ్‌.. తొలి మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 మే 21న (షార్జాలో) జరుగనుంది.రాణించిన బంగ్లా బ్యాటర్లుటాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. టాపార్డర్‌ బ్యాటర్లు తంజిద్‌ హసన్‌ (59), లిటన్‌ దాస్‌ (40), నజ్ముల్‌ హసన్‌ షాంటో (27), తౌహిద్‌ హృదోయ్‌ (45), జాకిర్‌ అలీ (6 బంతుల్లో 18) రాణించడంతో భారీ స్కోర్‌ చేసింది. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా 3, సాఘిర​్‌ ఖాన్‌ 2 వికెట్లు తీశారు.యూఏఈని గెలిపించిన కెప్టెన్‌అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈని కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం (42 బంతుల్లో 82) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి గెలిపించాడు. వసీం ఔటయ్యే సరికి యూఏఈ లక్ష్యానికి ఇంకా దూరంలో ఉన్నా.. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు తలో సిక్సరో, బౌండరీనో బాది జట్టు గెలుపుకు దోహదపడ్డారు. ఆఖర్లో ధృవ్‌ పరాషార్‌ (11), హైదర్‌ అలీ (15 నాటౌట్‌) జాగ్రత్తగా ఆడి యూఏఈకి రికార్డు విజయాన్నందించారు. యూఏఈ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్‌, నహిద్‌ రాణా, రిషద్‌ హొసేన్‌ తలో రెండు వికెట్లు తీయగా.. తన్వీర్‌ ఇస్లాం, తంజిమ్‌ హసన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

Rasi Phalalu: Daily Horoscope On 20-05-2025 In Telugu6
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.అష్టమి రా.12.22 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ధనిష్ఠ ప.3.36 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా10.35 నుండి 12.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.49 నుండి 11.33 వరకు, అమృత ఘడియలు: లేవు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.21. మేషం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. నూతన వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు. వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తి వివాదాలు తీరతాయి. అందర్నీ ఆకట్టుకుంటారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.మిథునం: రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. కొన్ని ఒప్పందాలలో అవాంతరాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడనక సాగుతాయి.కర్కాటకం: బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఎంత కష్టించినా ఫలితం శూన్యం. విద్యార్థులకు నిరాశ. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.సింహం: గత సంఘటనలు నెమరువేసుకుంటారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు మరింత సానుకూలం.కన్య: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల: అంచనాలు తప్పుతాయి. పనులు ముందుకు సాగవు. ఆస్తివివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాపరుస్తుంది. సోదరులు, మిత్రులతో విభేదాలు వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.వృశ్చికం: రుణబాధలు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో అకారణంగా తగాదాలు. శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. రుణాలు తీరుస్తారు. ప్రయాణాలు సాపీగా సాగుతాయి.కొత్త పనులు చేపడతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.మకరం: వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. కుటుంబంలో సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కుంభం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు అంతంతగానే ఉంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. ఆరోగ్యం సహకరించదు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.మీనం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. కొత్త రుణయత్నాలు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

 TDP MLA Kolikapudi Srinivasa Rao Overaction at Tiruvuru Municipal Election Center7
ప్రజాస్వామ్యానికి.. టీడీపీ పాతర

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: గ్రేటర్‌ విశాఖ డిప్యూటీ మేయర్‌ సహా వివిధ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, 20 పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ పదవుల కోసం సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ.. అక్రమాల జాతర నడిపించారు. తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్‌ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి మంగళవారానికి వాయిదా వేశారు. నరసరావుపేట, కారంపూడిలో దొడ్డిదారిన.. నరసరావుపేట మండల పరిషత్‌ ఉపాధ్యక్ష పదవి కోసం ఇప్పటికే రెండుసార్లు ఎన్నిక నిర్వహించగా కోరం లేక వాయిదా పడింది. మూడోసారి సోమవారం ఎన్నిక నిర్వహించారు. కనీసం నామినేషన్‌ వేయడానికి టీడీపీ తరఫున ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులకు నిరసనగా ప్రత్యేక సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది.మూడోసారి నిర్వహిస్తున్న ఎన్నిక సమావేశం కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి ప్రత్యేక అధికారాన్ని వినియోగించి.. సమావేశానికి ఎన్నికైన ముగ్గురు ఎంపీటీసీల్లో కొత్తపాలెం ఎంపీటీసీ వంపుగుడి సువార్తమ్మ మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనట్టు ప్రకటించారు. కాగా.. కారంపూడి మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలిగా టీడీపీ బలపరిచిన గాడిపర్తి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఇక్కడ 14 మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుని దాడులు చేశారు. భయానక వాతావరణం సృష్టించి టీడీపీ ఈ పదవిని తన ఖాతాలో వేసుకుంది. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడి.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల రాజకీయం చేసింది. పదవులు, డబ్బు ఎరగా వేసి.. వినని వారిని కేసులతో భయపెట్టి తమ వైపు ఓటు వేయించుకుంది. గాండ్లపెంట మండలంలో టీడీపీకి కేవలం ఒక్క ఎంపీటీసీ మాత్రమే ఉండగా.. డబ్బులు ఎరవేసి ముగ్గురు ఎంపీటీసీలను తనవైపు తిప్పుకుంది. పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఎంపీపీ పదవి కట్టబెట్టింది. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళా అభ్యర్థి లేకపోవడంతో మరోసారి వాయిదా పడింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ కూటమి కుట్రలకు బలైంది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్యే బేబీ నాయన ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి టీడీపీ వైపు తిప్పుకున్నారు. సోమవారం జరిగిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో రాంబార్కి శరత్‌ ఎన్నికయ్యారు. గ్రేటర్‌ విశాఖలో జనసేనకు ఝలక్‌ గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో జనసేన పారీ్టకి టీడీపీ కార్పొరేటర్లు ఝలక్‌ ఇచ్చారు. ఈ పదవి జనసేనకు ప్రకటించడంతో పలువురు టీడీపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకాకుండా షాకిచ్చారు. గత నెల 28న నిర్వహించిన మేయర్‌ ఎన్నికకు 74 మంది సభ్యులు హాజరుకాగా.. సోమవారం నిర్వహించిన డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు కేవలం 54 మంది మాత్రమే హాజరయ్యా­రు. ఎన్నిక ప్రత్యేక సమావేశానికి 56 మంది సభ్యులు హాజరుకావాలి. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి మయూర్‌ అశోక్‌ ఎన్నిక ప్రత్యేక సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. యలమంచిలి ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కైవసం రెండు నెలలపాటు అధికార పార్టీ అక్రమ కేసులు, తీవ్రస్థాయి బెదిరింపులు, మానసిక వేధింపుల్ని తట్టుకుని వైఎస్సార్‌సీపీలోనే కొనసాగిన ఎంపీటీసీ ఇనుకొండ ధనలక్ష్మి పశి్చమ గోదావరి జిల్లా యలమంచిలి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీకి బలం లేకపోయినప్పటికీ అత్తిలి ఎంపీపీ స్థానాన్ని, కైకలూరు వైస్‌ ఎంపీపీ స్థానాన్ని బెదిరింపులతో దక్కించుకుంది. అత్తిలిలో టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చిల్లర రాజకీయాలకు తెగబడ్డారు. ఆపార్టీ తీవ్రస్థాయి బెదిరింపులతో కొందరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీలో చేర్చుకుని అత్తిలి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ జయకేతనం ప్రకాశం జిల్లా మార్కాపురం, త్రిపురాంతకం మండల ఉపాధ్యక్షుల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మార్కాపురం వైస్‌ ఎంపీపీ–2గా కుందురు మల్లారెడ్డి, త్రిపురాంతకం వైస్‌ ఎంపీపీగా పాటిబండ్ల కృష్ణ ఎన్నిక­య్యారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిషత్‌ ఉపా­ధ్యక్షుడిగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఎనుముల సోమ­శేఖర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె రెండో వైస్‌ ఎంపీపీగా చెర్లోపల్లె వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అనసూయమ్మ ఎన్నికయ్యారు.

Upcoming IPOs: Six new public issues scheduled this month8
మళ్లీ ఐపీఓల సందడి!

న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా కళతప్పిన ప్రైమరీ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి మొదలైంది. 2025లో అడపాదడపా వస్తున్న పబ్లిక్‌ ఇష్యూలు ఇకపై జోరందుకోనున్నాయి. ఈ నెలాఖరులోగా ఆరు కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌ తలుపుతట్టనున్నాయి. మొత్తం మీద వచ్చే పది రోజుల్లో రూ.11,669 కోట్లు సమీకరించేందుకు రంగం సిద్ధమైంది. టెక్స్‌టైల్‌ కంపెనీ బొరానా వీవ్స్‌ నేడు (20న) ప్రారంభమై 22న ముగుస్తుంది. ఇక పుణేకు చెందిన ఆటోమొబైల్‌ విడిభాగాల తయారీ సంస్థ బెల్‌రైజ్‌ ఇండస్ట్రీస్‌ ఇష్యూ 21న ఆరంభమై 23న క్లోజవుతుంది. మిగిలిన నాలుగు కంపెనీలు వచ్చే వారంలో పబ్లిక్‌ ఆఫర్‌ చేపట్టనున్నాయి. లీలా ప్యాలెస్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌కు చెందిన స్లోస్‌ బెంగళూరు లిమిటెడ్, ఏజిస్‌ వోప్యాక్‌ టెరి్మనల్స్, అరిస్‌ఇన్‌ఫ్రా సొల్యూషన్స్, స్కోడా ట్యూబ్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారంలోనే ఈ నాలుగూ ప్రైస్‌ బ్యాండ్‌లను ప్రకటించనున్నాయి. ధరల శ్రేణి ఇలా... బొరానా వీవ్స్‌ రూ.144 కోట్ల సమీకరణ కోసం చేపడుతున్న పబ్లిక్‌ ఇష్యూకి రూ. 205–216 ధరల శ్రేణి (ప్రైస్‌ బ్యాండ్‌) ప్రకటించింది. బెల్‌రైజ్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఇష్యూ ద్వారా రూ.2,150 కోట్లు సమీకరిస్తోంది. దీనికి ధరల శ్రేణి రూ. 85–90గా నిర్ణయించింది. స్లోస్‌ బెంగళూరు రూ.3,000 కోట్ల తాజా ఈక్విటీతో పాటు ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.2,000 కోట్ల ప్రమోటర్‌ షేర్లను కూడా విక్రయించనుంది. ఏజిస్‌ లాజిస్టిక్స్‌ అనుబంధ సంస్థ ఏజిస్‌ వోప్యాక్‌ టెర్మినల్స్‌ తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.3,500 కోట్లు సమీకరించనుంది. ఇక నిర్మాణ రంగ మెటీరియల్‌ సరఫరాదారు ఆరిస్‌ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ రూ.600 కోట్లు, స్కోడా ట్యూబ్స్‌ రూ.275 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.ఇప్పటిదాకా 10...: ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ట్రంప్‌ టారిఫ్‌ వార్‌ దెబ్బకు ఈ ఏడాది మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో మన సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్టం నుంచి దాదాపు 17 శాతం మేర దిద్దుబాటుకు గురయ్యాయి. ఈ ప్రభావంతో కంపెనీలు ఐపీఓలకు ముఖం చాటేశాయి. 2024లో రికార్డు స్థాయిలో 91 పబ్లిక్‌ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1,6 లక్షల కోట్లు సమీకరించగలిగాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు కూడా పొలోమంటూ వచి్చన ఇష్యూకల్లా సబ్‌స్క్రయిబ్‌ చేయడంతో ప్రైమరీ మార్కెట్‌ కళకళలాడింది. అయితే, 2025లో ఇప్పటిదాకా కేవలం 10 కంపెనీలు మాత్రమే ఐపీఓలకు వచ్చాయి. కాగా, టారిఫ్‌ యుద్ధానికి ట్రంప్‌ 90 రోజుల విరామం ప్రకటించడం.. ట్రేడ్‌ డీల్స్‌పై జోరుగా చర్చలు జరుగుతుండటంతో మార్కెట్లు మళ్లీ తాజా కనిష్టాల నుంచి బాగానే బౌన్స్‌ అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్టానికి మరో 4 శాతం దూరంలోనే ఉన్నాయి. సెకండరీ మార్కెట్‌ దన్నుతో ఐపీఓలకు కంపెనీలు మళ్లీ ముందుకొస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, సెబీ నుంచి దాదాపు 57 కంపెనీలకు ఐపీఓల కోసం దాదాపు లైన్‌ క్లియర్‌ కాగా.. మరో 74 కంపెనీల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని యాక్సిస్‌ క్యాపిటల్‌ వెల్లడించింది. ఇందులో సోలార్‌/పునరుత్పాదక ఇంధనం నుంచి కో–వర్కింగ్‌ స్పేస్, ఫార్మా, హెల్త్‌కేర్, తయారీ, కెమికల్స్, రియల్టీ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఇష్యూగా నిలిచిన ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ కంపెనీ ఏథర్‌ ఎనర్జీ దాదాపు రూ.3,000 కోట్లు సమీకరించడం విదితమే. అయితే, పేలవంగా లిస్టయ్యి.. ఇప్పటికీ ఇష్యూ ధర (రూ.321) కంటే దిగువనే ఉండటం గమనార్హం.కోల్‌ ఇండియా సబ్సిడరీలు కూడా..ప్రభుత్వరంగ బొగ్గు దిగ్గజం కోల్‌ ఇండియాకు చెందిన రెండు అనుబంధ సంస్థలు.. భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ (బీసీసీఎల్‌), సెంట్రల్‌ మైన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంపీడీఐ) ఐపీఓకు సన్నద్ధమవుతున్నాయి. ఈ రెండూ త్వరలోనే సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేయనున్నట్లు కోల్‌ ఇండియా డైరెక్టర్‌ దేబశిష్‌ నందా వెల్లడించారు. బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లను నియమించుకున్నామని, మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఇష్యూ ఉంటుందని చెప్పారు. కోల్‌ ఇండియాకు 7 సబ్సిడరీలు ఉండగా. దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80% వాటా దీని చేతిలోనే ఉంది.

Foreign Secretary Briefs Parliamentary Panel On India-Pak Tensions9
ట్రంప్‌నెందుకు నిలువరించలేదు? 

న్యూఢిల్లీ: భారత్, పాక్‌ పరస్పర సైనిక చర్యలు, తర్వాత నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, తదనంతర పరిణామాలు, పూర్వాపరాలపై విదేశీ వ్యవహారాల స్థాయీ సంఘంలో సోమవారం జరిగిన చర్చ చివరకు విపక్ష, అధికార పక్షాల వాదనలతో వాడీవేడిగా ముగిసింది. కేంద్రం తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ హాజరై సమగ్ర వివరాలను వెల్లడించగా విపక్ష కూటమి సభ్యులు ట్రంప్‌ జోక్యంపై ప్రధానంగా ప్రస్తావించి కేంద్ర నిర్లక్ష్య వైఖరిని తూర్పారబట్టారు. తన కారణంగానే కాల్పులు ఆగిపోయాయని, కాల్పుల విరమణ ఒప్పందం తెరమీదకొచి్చందని ట్రంప్‌ దాదాపు ఏడు సార్లు సొంత డబ్బా కొట్టుకున్నా ప్రధాని మోదీ ఎందుకు ఆయనను నిలువరించలేదని విపక్ష సభ్యులు నిలదీశారు. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వం వహించాలని అమెరికాను కోరలేదని ప్రభుత్వ వైఖరిని మిస్రీ స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడే ఉద్దేశపూర్వకంగా సొంతంగా కలుగజేసుకునేందుకు ప్రయతి్నంచారని, జోక్యంపై ట్రంప్‌ కనీసం భారత్‌ నుంచి అనుమతి కూడా తీసుకోలేదని మిస్రీ చెప్పారు. ట్రంప్‌ ప్రకటనలను విపక్ష సభ్యులు ప్రస్తావించడం, మోదీ ప్రభుత్వానికి ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదని మిస్రీ వాదించడంతో కొద్దిసేపు సమావేశంలో వాడీవేడి చర్చ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రికార్డ్‌ స్థాయిలో 24 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశం ఏకంగా మూడు గంటలపాటు సాగింది. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున అభిõÙక్‌ బెనర్జీ, కాంగ్రెస్‌ తరఫున రాజీవ్‌ శుక్లా, దీపేందర్‌ హూడా, ఎంఐఎం తరఫున అసదుద్దీన్‌ ఒవైసీ, బీజేపీ తరఫున అపరాజితా సారంగి, అరుణ్‌ గోవిల్‌లు పాల్గొన్నారు. ‘‘ కాల్పుల విరమణలో అమెరికా మధ్యవర్తిత్వం చేయలేదు. మధ్యవర్తిగా ఉండాలని కోరలేదు. కాల్పుల విరమణ కేవలం ద్వైపాక్షికమే. తొలుత ఉద్రిక్త పరిస్థితులున్నా తర్వాత సద్దుమణిగాయి. అవి దాదాపు అణుయుద్ధానికి దారి తీశాయన్న వాదనల్లో ఎలాంటి నిజంలేదు’’ అని మిస్రీ చెప్పారుఆయనే కావాలనే దూరారు ‘‘తాను మధ్యవర్తిత్వం చేయడం వల్లే అణుయుద్ధ మేఘాలు విడిపోయాయని, జమ్మూకశ్మీర్‌ సమస్యలను పరిష్కరిస్తానని పదేపదే ట్రంప్‌ చెబుతున్నా మోదీ సర్కార్‌ ఎందుకు ఆయనను నిలువరిస్తూ ప్రకటనలు చేయలేదు?’’ అని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ‘‘ఇంత జరుగుతున్నా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) నుంచి పాక్‌ నిధునెలా సంపాదించింది?. భారత్‌ ఎందుకు నిధులను అడ్డుకోలేకపోయింది. ఆర్మీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతుంటే ప్రభుత్వం ఎందుకు వెంటనే స్పందించలేకపోయింది?’’ అని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. వీటికి మిస్రీ సమాధానమిచ్చారు. ‘‘జోక్యం మాటున ట్రంపే స్వయంగా భారత్, పాక్‌ మధ్యలో దూరిపోయారు. ట్రంప్‌ జోక్యం విషయంలో భారత ప్రమేయం లేదు. ఉద్దేశపూర్వకంగా జమ్మూకశ్మీర్‌ అంశాన్ని ఆయన ప్రస్తావించారు’’ అని మిస్రీ స్పష్టంచేశారు. చైనా తయారీ సైనిక ఉపకరణాలను పాకిస్తాన్‌ వినియోగించిందన్న విపక్షాల వాదనలను మిస్రీ తోసిపుచ్చారు. ‘‘వాళ్లు ఏ దేశానికి చెందిన ఆయుధాలు వాడారనేది ఇక్కడ ప్రధానం కాదు. మనం వాళ్లను ఎంత బలంగా దెబ్బకొట్టామనేదే ముఖ్యం’’ అని మిస్రీ అన్నారు. పరస్పర సైనిక చర్యల్లో మనం ఎన్ని యుద్ధవిమానాలను కోల్పోయామన్న విపక్షాల ప్రశ్నకు మిస్రీ సమాధానం ఇవ్వలేదు. ఇది జాతీయ భద్రతతో ముడిపడిన అంశమైనందున వివరాలు వెల్లడించట్లేదని పేర్కొన్నారు. మీపై దాడి చేయబోతున్నామని పాకిస్తాన్‌కు ముందే భారత్‌ అధికారికంగా తెలియజేసిందన్న వార్తలను మిస్రీ తోసిపుచ్చారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా కేవలం ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, ఆర్మీ బేస్‌లు, జనావాసాలపై దాడులు చేయలేదని మాత్రమే, దాడుల తర్వాత పాక్‌కు తెలిపామని మిస్రీ స్పష్టంచేశారు. ఈ విషయంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చేసిన ప్రకటనను కొందరు వక్రీకరించారని మిస్రీ తెలిపారు. తుర్కియే మొదట్నుంచీ భారత్‌కు దూరంగానే ఉంటోందని గుర్తుచేశారు. అయితే దాడులను భారత్‌ ఆపేశాక ఆగ్రహంతో సామాజిక మాధ్యమాల్లో మిస్రీపై జరుగుతున్న ట్రోలింగ్‌ను స్థాయీ సంఘం సభ్యులంతా ఏకగ్రీవంగా ఖండించడం విశేషం.

Manchu Manoj about Bhairavam movie10
ఇక నాకు ఇది కొత్త జన్మ: మంచు మనోజ్‌

‘‘నాకు నా హార్డ్‌వర్క్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఈ బర్త్‌ డే (మే 20) నుంచి నాకు ఇది కొత్త జన్మ. నా బర్త్‌ డే స్టార్ట్‌ కాక ముందే నేను ఏదైతే స్టేజ్‌ (సినిమా వేదిక) మిస్సవుతున్నానో ఆ స్టేజ్‌కు తీసుకువచ్చాడు దేవుడు. అంతకంటే పెద్ద బర్త్‌ డే గిఫ్ట్‌ ఏదీ ఉండదు’’ అని మంచు మనోజ్‌ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. జయంతిలాల్‌ గడా సమర్పణలో విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. అలాగే నేడు (మంగళవారం) మంచు మనోజ్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో మనోజ్‌ పంచుకున్న విశేషాలు.⇒ ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో తమ్ముడు శ్రీనివాస్‌ (బెల్లంకొండ సాయి) నన్ను కలవడం, ‘గరుడన్ ’ సినిమా తెలుగు రీమేక్‌ ‘భైరవం’ గురించి దర్శకుడు విజయ్‌తో మాట్లాడమని చెప్పడం, కథ నచ్చి, నేనీ సినిమాకు ఓకే చెప్పడం చకా చకా జరిగిపోయాయి. ∙ఈ చిత్రంలో నేను గజపతి వర్మ అనే క్యారెక్టర్‌ చేశాను. ‘భైరవం’ని డైరెక్టర్‌ విజయ్‌ బాగా తీశాడు. యాక్టర్స్‌గా నాకు, శ్రీనివాస్, నారా రోహిత్‌గారికి కొంత స్క్రీన్ గ్యాప్‌ వచ్చింది. అయినా మాతో రాధామోహన్ గారు మంచి మూవీ నిర్మించారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం ఉంది.⇒ నా జీవితంలో నాకు మా నాన్నే హీరో (ప్రముఖ నటుడు–నిర్మాత మోహన్ బాబు). నాన్నగారు కష్టపడి, పోరాడి ఇంత గొప్ప స్థాయికి వచ్చింది మనందరం చూశాం. ఆయన్ను చూస్తూ పెరిగాను. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. నమ్మినవాళ్లను బాగా చూసుకోవడం, వాళ్లతోనే ఉండటం, పదిమందికి హెల్ప్‌ చేయడం, స్కూల్‌ని బిల్డ్‌ చేయడం... ఇలా నాన్నగారు చాలా చేశారు. ఇక దాన్నుంచి (ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి కావొచ్చు) నేను బయటకు రాలేకపోతున్నాను. విష్ణు అన్న నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అయితే ఏ సిట్యువేషన్ లోనైనా మాట్లాడి, ఆ పరిస్థితులను ఎలా సెట్‌ చేయవచ్చో విష్ణు అన్న దగ్గర్నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే సమస్యలను పరిష్కరించడానికి మాట్లాడాలంటే నేను సిద్ధంగా ఉన్నాను.⇒ నేను తిరుపతిలో చదువుకున్నాను. తను (భార్య మౌనిక) ఆళ్లగడ్డలో చదువుకున్నారు. ఈ సిటీ జీవితమే కాకుండా మాకు పల్లె జీవితం కూడా ఉంది. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, ఆదరణ మాపై ఉన్నాయి. మా పిల్లలకు ఏదైనా ఇవ్వగలను అంటే అది ఇదే.⇒ నేను సమస్యల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేశారు. కానీ నా ఇబ్బందుల్లో వారిని ఇన్ వాల్వ్‌ చేయాలనుకోలేదు. నా భార్య మౌనిక సపోర్ట్‌ సరిపోయింది. మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు గమ్మునుండిపోతే, తప్పు చేసిన వ్యక్తులుగా మిగిలిపోతాం. భవిష్యత్‌లో మా పిల్లలు ‘నువ్వు చేయనప్పుడు ఎందుకు గమ్మునున్నావ్‌’ అంటే, ఓ బ్యాడ్‌ ఎగ్జాంపుల్‌గా ఉండకూడదనిపించింది. తప్పు చేయనప్పుడు ఎక్కడైనా మాట్లాడగలను.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement