
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఉన్న షాషీ జామా మసీదు సర్వేలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షాహీ జామా మసీదు సర్వే నిర్వహించాలన్న 2024 నవంబర్‌లో ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.
షాహీ జామా మసీదు సర్వే నిర్వహించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలని కోరుతూ ముస్లీం సంస్థ ప్రతినిధులు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం (మే19) అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులు నిలిపివేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసింది. సర్వే కొనసాగుతుందని స్పష్టం చేసింది.